breaking news
Nirmala Sitharaman
-
దేశాన్ని అమ్మింది కాంగ్రెసే
న్యూఢిల్లీ: వాణిజ్య ఒప్పందం పేరిట దేశాన్ని మోదీ సర్కారు అమెరికాకు అమ్మేసిందన్న విపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ‘‘దేశ ప్రయోజనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వంటి అంతర్జాతీయ సంస్థలకు తాకట్టు పెట్టింది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే. పేదలు, రైతుల ప్రయోజనాలను వాటికి అమ్మేసింది. ఏకంగా దేశాన్నే అమ్మేసింది’’అంటూ దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉండగా షెర్మెల్ షేక్ చర్చల సందర్భంగా దేశాన్ని దాయాది పాకిస్తాన్‌కు తనఖా పెట్టిన, ఏకంగా మన సార్వ¿ౌమత్వం విషయంలో రాజీ పడ్డ చరిత్ర కూడా కాంగ్రెస్‌దేనని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ 2026–27పై లోక్‌సభలో జరిగిన చర్చకు నిర్మల బుధవారం సాయంత్రం బదులిచ్చారు. మన దేశాన్ని అమ్మగల, కొనగల వాడెవరూ పుట్టలేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఆమె పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి పని ఎప్పటికీ చేయబోరని స్పష్టం చేశారు. ఇంధన, ఆర్థిక, ఆహార, డేటా భద్రత తదితరాలపై రాహుల్ లేవనెత్తిన ఆందోళనలను కొట్టిపారేశారు. ఆ విషయాల్లో అవసరమైన అన్ని చర్యలూ కేంద్రం తీసుకుందని, బడ్జెట్లో వాటికి చాలినన్ని నిధులు కేటాయించిందని చెప్పారు. సంబంధిత గణాంకాలను సభకు చదివి వినిపించారు. రాహుల్ అసలు బడ్జెట్‌నే చదవకుండా నిరాధార ఆరోపణలకు దిగారని మండిపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని రూ.53.47 లక్షల కోట్లుగా అంచనా వేసినట్టు నిర్మల సభకు తెలిపారు. ‘‘మా ప్రభుత్వం కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.3 శాతానికి పరిమితం కావచ్చు’’అని అంచనా వేశారు. దేశంలో ఎరువుల కొరత ఉందన్న వార్తలను కొట్టిపారేశారు. వాటి దిగుమతికి బడ్జెట్లో ఏకంగా రూ.1.71 లక్షల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. బెంగాల్లో బాంబుల రాజ్యం! కేంద్ర బడ్జెట్లో పశి్చమబెంగాల్‌కు కేటాయింపులే లేవన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను నిర్మల తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ ఏలుబడిలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా మంటగలిశాయంటూ మమతా బెనర్జీ సర్కారు పనితీరును దుయ్యబట్టారు. బెంగాల్లో ఎక్కడ చూసినా బాంబుల సంస్కృతే రాజ్యమేలుతోందని ఆరోపించారు. ‘బెంగాల్లో బాంబులే మాట్లాడతాయి, చట్టాలు కాదు’అంటూ పలు ఉదంతాలను ఉటంకించారు. దాంతో విపక్ష సభ్యులు పెద్దపెట్టున నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పాలు, స్టేషనరీ, విద్యపై జీఎస్టీ వసూలు చేస్తున్నారన్న తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు అభిõÙక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నిర్మల తీవ్రంగా ఖండించారు. ‘‘వాస్తవాలను ఆయన ఉద్దేశపూర్వకంగా పూర్తిగా వక్రీకరించారు. పెన్సిళ్లు, షార్పనర్లపైనా జీఎస్టీ వేశామట! మరీ ఈ స్థాయిలో అబద్ధాలా? 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టిన నాటి నుంచీ పాలపై ఎన్నడూ జీఎస్టీ విధించలేదు. చావుపైనా జీఎస్టీ వేశారని పచ్చి అబద్ధాలు చెప్పారు. అంతిమక్రియలపై కూడా ఎప్పుడూ జీఎస్టీ లేదు. వింటున్న సభ్యులకు తెలివి లేదని అభిõÙక్ భావిస్తున్నారా?’’అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. బహుశా పశ్చిమబెంగాల్లో నడుస్తున్న సిండికేట్ మరణాలపైనా పన్నులు వసూలు చేస్తోందేమో అంటూ అధికార తృణమూల్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అన్యాయానికి గురయ్యామంటూ సానుభూతి కార్డు వాడటం, ప్రతిదానికీ సుప్రీంకోర్టు దగ్గరికి పరుగెత్తడం, చివరికి కోర్టుతో చీవాట్లు తినడం తృణమూల్‌కు అలవాటుగా మారిందన్నారు. -
ఎంఎస్ఎంఈలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు
న్యూఢిల్లీ: భారత్–అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈలు)కు అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్ వ్యవస్థల్లో అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. వ్యాపారాలు, కస్టమర్లపై వ్యయాల భారం గణనీయంగా తగ్గుతుందన్నారు. ట్రేడ్ డీల్‌తో పశుపోషణ, మసాల, ప్రధాన ఆహార ఉత్పత్తులకు పూర్తి రక్షణ కలి్పంచడంతో భారతీయ రైతుల ఆదాయాలు పెరుగుతాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సాంకేతిక సహకారం ద్వారా కృత్రిమ మేధ (ఏఐ), డేటా, డిజిటల్ సేవల కేంద్రంగా భారత్ స్థానం మరింత సుస్థిరం అవుతుందని సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
‘ఏంటి మేడమ్ ఇది.. పసిడి పన్ను న్యాయమేనా?’
దేశ ప్రజలను భౌతిక బంగారం నుంచి పేపర్ గోల్డ్ వైపు మళ్లించేందుకు ఒకప్పుడు ఫ్లాగ్షిప్ పథకంగా నిలిచిన సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇప్పుడు ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన కొత్త పన్ను మార్పుల నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. సంవత్సరాల తరబడి పన్ను-సమర్థ పెట్టుబడిగా ప్రచారం చేసిన ఈ బాండ్లపై ఇప్పుడు ప్రభుత్వ విధాన స్థిరత్వమే ప్రశ్నార్థకంగా మారిందని విమర్శకులు అంటున్నారు.ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల అసంతృప్తికి స్వరం ఇచ్చారు చార్టర్డ్ అకౌంటెంట్ కరణ్ భాల్. ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. “వావ్! ఇప్పుడు PPF, EPF ఉపసంహరణల్లో కూడా ప్రభుత్వానికి వాటా కావాలా? NPS లాభాలపై కూడా పన్నా? ‘నువ్వు డబ్బు సంపాదిస్తే, నాకూ వాటా ఎందుకు వద్దు?’ అనడం ఇది ఏం లాజిక్ మేడమ్? (ఆర్థిక మంత్రి నిర్మిలా సీతారామన్), ఎలాంటి పన్ను సమస్యలు లేకుండా గోల్డ్ బాండ్లు కొనాలని మీ ప్రభుత్వమే చెప్పింది. పెట్టుబడిదారులు లాభపడితే విధానాలనే మార్చేస్తారా?” అంటూ భాల్ మండిపడ్డారు.గోల్డ్ బాండ్ కొత్త ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఇకపై సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను విధానం ఇన్వెస్టర్ దాన్ని ఎప్పుడు, ఎలా కొనుగోలు చేశారు, ఎప్పుడు నిష్క్రమించారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. లాంచ్ సమయంలో చందా పొంది, పూర్తి 8 సంవత్సరాల మెచ్యూరిటీ వరకు ఉన్నవారికి మాత్రమే ఇప్పటికీ మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.అదే సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసినవారికి మూలధన లాభాలపై పన్ను వర్తిస్తుంది. అలాగే, అసలు చందాదారులు ఐదేళ్ల తర్వాత కానీ ఎనిమిదేళ్లకు ముందే కానీ రీడీమ్ చేస్తే వారికి కూడా పన్ను వర్తిస్తుంది.2015లో ప్రారంభమైన సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ఇప్పటివరకు 67 విడతల్లో సుమారు 147 టన్నుల బంగారానికి బాండ్లు జారీ చేసింది. అయితే బంగారం ధరలు పెరగడంతో, 2024 తర్వాత కొత్తగా వీటి జారీని నిలిపేసింది. దీంతో సెకండరీ మార్కెట్లో లావాదేవీలు పెరిగాయి. అవే ఇప్పుడు పన్నుల వలలో చిక్కాయి.మరోవైపు రిస్క్ తీసుకున్నప్పటికీ తమ మొత్తం పోర్ట్‌ఫోలియో XIRRలు (ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్) ఇప్పటికీ ప్రారంభ రెండంకెల్లోనే ఉన్నాయని, ఈటీఎఫ్‌లతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్లకు సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్యలు ఎక్కువ అని సీఏ కరణ్ భాల్ వాదిస్తున్నారు.WOW!The government will deserve its share of your PPF, EPF withdrawals too.It'll deserve its share of your NPS gains too.And what logic is this? "If you are making a killing, why shouldn't I get something?"Madam, your government only told us to go ahead and buy SGBs… pic.twitter.com/8KYhZ2Kxx9— Kanan Bahl (@BahlKanan) February 4, 2026 -
ఎన్నారైలకు గుడ్‌న్యూస్.. అంత బంగారంపై నోట్యాక్స్
భారత ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఎన్నారైలకు బంగారంపై కలిపించిన వెసులుబాటు పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎన్నార్లైలకు విధించిన బంగారం పరిమితి నిబంధనలను మారుస్తున్నట్లు తెలిపింది.ఇదివరకూ ప్రవాస భారతీయులు భారత్ వచ్చే సమయంలో వారి వెంట ఉన్న బంగారు ఆభరణాలకు విలువ ఆధారంగా సుంకం ఉండేది. మహిళలకు రూ. లక్షలోపు, పురుషులకు రూ. 50 వేల లోపు విలువ ఉన్న పసిడికి ఎటువంటి సుంకం ఉండేది కాదు. ఆ పైన విలువ ఉన్న వాటికి మత్రమే సుంకం చెల్లించే విధంగా నియమాలు ఉండేవి.అయితే ప్రస్తుత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం పరిమితిపై వెసులుబాటును మార్చుతున్నట్లు ప్రకటించింది. ప్రవాస భారతీయులు స్వదేశానికి వచ్చే సమయంలో మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాముల బంగారాన్ని ఎటువంటి సుంకం లేకుండా తీసుకరావచ్చని పేర్కొంది. ఆ పైన ఉన్న వాటికి మాత్రమే పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదివరకూ ఉన్న ద్రవ్య విలువ ఆధారంగా రూ. లక్షకు కేవలం ఆరు గ్రాములు, రూ. 50 వేలకు మూడు గ్రాముల పరిమితే ఉంటుంది. ప్రస్తుతం అది 20 నుంచి 40 గ్రాములకు చేరుకుంది. భారత ప్రభుత్వం ఆ పరిమితిని గణనీయంగా పెంచడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
టారిఫ్‌ల కోతపై ఆర్థిక మంత్రి ఏమన్నారంటే..
భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించాలన్న అమెరికా నిర్ణయంతో ఎగుమతులకు ఊతం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కొత్తగా మరిన్ని మార్కెట్లు కూడా అందుబాటులోకి రావడంతో ఇకపై మన ఎగుమతులు పుంజుకోగలవని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అమెరికాతో ఒప్పందం వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆమె చెప్పారు.‘మేడిన్ ఇండియా ఉత్పత్తులకు గుడ్ న్యూస్. ఇక వాటిపై టారిఫ్‌లు 18 శాతానికి తగ్గుతాయి‘ అని ఎక్స్‌లో ఆమె పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50 శాతం సుంకాలు విధించడంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఉక్కు, అల్యుమినియం, టెక్స్టైల్స్, ఇంజినీరింగ్, ఇతరత్రా కొన్ని వ్యవసాయోత్పత్తుల ఎక్స్‌పోర్ట్స్ గణనీయంగా తగ్గాయి. తాజాగా వాణిజ్య అవరోధాలను తొలగించి, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కూడా నిలిపివేసి అగ్రరాజ్యం నుంచి క్రూడ్ కొనుగోళ్లు పెంచుకుంటామన్న భారత హామీకి ప్రతిగా టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించేందుకు అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో 15–19 శాతం స్థాయిలో టారిఫ్‌లు ఎదుర్కొంటున్న ఇతర ఆసియా దేశాల సరసన భారత్ కూడా చేరుతుంది. మరోవైపు ఫ్యూచర్స్, ఆప్షన్స్‌పై (ఎఫ్‌అండ్‌వో) సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)ని పెంచాలన్న నిర్ణయం స్పెక్యులేటివ్ ట్రేడింగ్ వల్ల చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవకుండా కాపాడేందుకే తప్ప ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకున్నది కాదని నిర్మలా సీతారామన్ చెప్పారు.సాగు, డెయిరీ ప్రయోజనాలు పదిలం: గోయల్అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే విషయంలో దేశీయంగా కీలకమైన వ్యవసాయం, డెయిరీ రంగాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. పోటీ దేశాల కన్నా అమెరికాతో భారత్‌కి ‘చాలా మంచి‘ డీల్ కుదిరిందని మంత్రి చెప్పారు. వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలతో ఇరు దేశాలు సంయుక్త ప్రకటన జారీ చేస్తాయని పేర్కొన్నారు. కీలక రంగాల ప్రయోజనాలను కాపాడుతూ, ప్రజలకు భారీగా అవకాశాలు కల్పించే విధంగా ఒప్పందం ఉంటుందని చెప్పారు. కార్మిక శక్తి ఎక్కువగా ఉండే టెక్స్టైల్స్, ప్లాస్టిక్స్, దుస్తులు, సేంద్రియ రసాయనాలు, రత్నాభరణాలు తదితర రంగాలకు అవకాశాలు పెరుగుతాయన్నారు.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే.. -
గ్లోబల్ అనిశ్చితి వల్లే గోల్డ్ రష్
న్యూఢిల్లీ: వినియోగాన్ని పెంచుతూ, వృద్ధికి దోహదపడే సాధనంగా పెట్టుబడులను ప్రభుత్వం పరిగణిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఈ ధోరణినే ప్రతిఫలిస్తోందని పేర్కొన్నారు. నిర్దేశిత ద్రవ్య లోటు లక్ష్యాన్ని చూస్తే వృద్ధి సాధనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. 2026–27 బడ్జెట్‌పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి వల్లే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయని, అనేక సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇన్వెస్టర్లకు ఏ కరెన్సీపైనా నమ్మకం లేకపోవడాన్ని, అందుకే పసిడి వైపు మొగ్గుచూపడాన్ని ఇది తెలియజేస్తోందని ఆమె వివరించారు. స్పెక్యులేటివ్ డెరివేటివ్ ట్రేడింగ్ జోలికి వెళ్లకుండా సామాన్యులను నిలువరించేందుకే ఎఫ్‌అండ్‌వోపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)ని పెంచినట్లు వివరించారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అధ్యయనం ప్రకారం 90 శాతం మంది పైగా రిటైల్ ఇన్వెస్టర్లు ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో తీవ్ర నష్టాల పాలవుతున్నారని వెల్లడైన నేపథ్యంలో ఎస్టీటీ పెంపు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. ‘స్పెక్యులేషన్ అత్యధికంగా ఉంటున్న ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌తో తమ పిల్లలు తీవ్రంగా డబ్బు నష్టపోతున్నారని, ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని కోరుతూ చాలా మంది తల్లిదండ్రుల నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎస్టీటీని పెంచడం వల్ల ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ చేయకుండా కొంత నిరోధించేందుకు వీలవుతుంది‘ అని మంత్రి చెప్పారు. ఆర్థిక పరిస్థితిని బట్టి ద్రవ్యలోటు లక్ష్యం ఒక్కో సంవత్సరంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ద్రవ్య లోటు లక్ష్యాలు ఆధారపడి ఉంటాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. గతంలో క్రితం ఆర్థిక సంవత్సరం కన్నా కాస్త తక్కువ ఉండేలా ప్రతి ఏటా ద్రవ్య లోటు లక్ష్యాలు విధించుకునే విధానం ఉండేదని ఆమె తెలిపారు. ఈసారి వృద్ధికి మరింత ప్రాధాన్యమిస్తున్నందున 4.3 శాతం ద్రవ్య లోటు సౌకర్యవంతమైన స్థాయే అనే ప్రభుత్వం భావిస్తోందని మంత్రి వివరించారు. డిజిన్వెస్ట్‌మెంట్, అసెట్ మానిటైజేషన్ యథాప్రకారంగానే కొనసాగుతాయన్నారు. పన్నుయేతర ఆదాయాలను బట్టి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల విక్రయ పరిస్థితి ఆధారపడి ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
అనిశ్చితిలో ఆచితూచి...
ప్రపంచమంతటా అనిశ్చితి అలుముకున్న తరుణంలో పెద్దగా జనాకర్షణల జోలికి పోకుండా, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద పీట వేసే గత సంప్రదాయాలకు భిన్నంగా, ఆచితూచి వేసిన అంచనాలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 2026–27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన ఆమె... స్థిరంగా ముందుకు సాగుతున్న ఆర్థిక వృద్ధిని అదే స్థాయిలో ముందుకు నడిపించేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకూ, తయారీరంగ పరిశ్రమల పెంపునకూ తోడ్పడే ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో కూడా ఏవో అద్భుతాలుంటాయని ఎప్పటిలాగే మధ్యతరగతి, వ్యాపార వర్గాలు ఆశించిన మాట వాస్తవమే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేల విడిచి సాము మంచిది కాదన్న ధోరణినే కనబరిచారు. అవసరమైనచోట్ల వెసులుబాట్లకు కూడా చోటిచ్చారు. 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయటం అందులో ఒకటి. వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసుకునే వస్తువుల కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం మేర తగ్గించటం కూడా మంచి నిర్ణయం. మూలధన వ్యయం ఈసారి రూ. 12.22 లక్షల కోట్ల వరకూ ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. నిరుటి ప్రతిపాదన రూ. 10.96 లక్షల కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువే. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో దీన్ని వ్యయం చేయటానికి సంకల్పించారు. పర్యవసానంగా హైవేలూ, సరుకు రవాణా కారిడార్లూ, ఓడరేవులు, జాతీయ జల రవాణా మార్గాలు, పట్టణప్రాంత ప్రజా రవాణా తదితర రంగాలు బహుముఖంగా విస్తరిస్తాయి. ఇదంతా దక్షిణాది రాష్ట్రాల్లో పరిశ్రమల విస్తరణకూ, ఉద్యోగాల కల్పనకూ ఎంతగానో దోహద పడుతుంది. పెంచిన ఈ మూలధన వ్యయాన్ని రాష్ట్రాలు వడ్డీరహిత రుణాలు పొంది, పెట్టుబడులు పెట్టడానికి వినియోగిస్తామని చెప్పారు. దానికే పరిమితమైతే లక్ష్యసాధనకు ఎంతమాత్రం సరిపోదు. తయారీ రంగంలో ఫార్మా, సెమీ కండక్టర్లు, రసాయనాలు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, భారీ యంత్రాలు, క్రీడా పరికరాలు, రసాయనాలు తదితరాల ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు చేసిన ప్రతిపాదనలు సైతం మెచ్చదగ్గవే. అయితే ప్రస్తుతం అన్ని రంగాలనూ ఏలుతున్న ఏఐ ఆధారిత సాంకేతికత ఇక్కడ కూడా గణనీయంగా ఉంది. అందువల్ల ఈ రంగాలు తీసుకు రాబోయే ఉద్యోగకల్పనపై మరీ ఆశ పెట్టుకోనవసరం లేదు. విచక్షణారహితంగా సుంకాలు విధించే అమెరికా ధోరణి వల్ల ప్రైవేటు మదుపుదారులు ఉత్సాహంగా ముందుకొచ్చే అవకాశాలు తక్కువ.ఈ బడ్జెట్లో మెచ్చదగ్గ ప్రతిపాదన కర్బన ఉద్గారాల నియంత్రణకు దోహదపడే సాంకేతికతలకై వచ్చే అయిదేళ్లలో రూ. 20,000 కోట్ల వ్యయం చేస్తామని చెప్పటం! స్వచ్ఛ ఇంధనానికి తోడ్పడే ఈ ప్రతిపాదనకు మరింత కేటాయిస్తే బాగుండేది. అలాగే కార్బన్ డై ఆక్సైడ్ తొలగింపునకూ, దాన్ని నిల్వ చేసి ఉత్పత్తులకు తోడ్పడటానికీ అవసరమైన పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వటంపై కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మన వృద్ధి రేటు దాదాపు 7 శాతం ఉంది. ద్రవ్యోల్బణం సైతం అదుపులో ఉంది. విదేశీ మారక నిల్వలకు కూడా లోటు లేదు. కానీ దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ పడుతూ లేస్తూ సాగుతున్న క్రమంలో, అంతర్జాతీయంగా అంత సానుకూల వాతా వరణం కనబడని స్థితిలో జాగ్రత్తగా అడుగులేయటం మంచిదే. ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతం మించనీయరాదన్న గత బడ్జెట్ లక్ష్యాన్ని సాధించటంలో విజయం సాధించి నట్టేనని గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత తగ్గించి 4.3 శాతానికి పరిమితం చేస్తామని నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. కానీ అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు మంత్రాన్ని పఠించటం అంత సులభం కాదు. తయారీరంగ పరిశ్రమల విస్తరణ ఉపాధి కల్పనకు తోడ్పడి,ప్రజల్లో కొనుగోలుశక్తిని పెంచుతుంది. ఆ దిశగా ప్రయత్నించటానికి ఈ బడ్జెట్ ప్రతిపాద నలు దోహదపడతాయనే చెప్పాలి. ఎంతో ఆచితూచి, జాగ్రత్తగా అడుగులేసిన ఈ బడ్జెట్ చూడటానికి నిరాశ కలిగించవచ్చుగానీ... ఈ అనిశ్చితిలో దూకుడుగా పోకుండా భయ భక్తులతో మెలగటమే క్షేమదాయకం. -
ఆర్థిక క్రమశిక్షణ
ఇప్పటికే అమలులో ఉన్న నిర్మాణాత్మక సంస్కరణల కొనసాగింపు, మౌలిక సౌకర్యాల కల్పనను వేగవంతం చేయడం, తయారీ రంగాన్ని పటిష్ఠపరచడం, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించడం దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఆర్థిక లోటు 2025–26లో జీడీపీలో 4.4 శాతం కాగా, 2026–27లో 4.3 శాతంగా ప్రతిపాదించడం, కేంద్ర ప్రభుత్వ రుణంలోనూ 2025–26తో పోల్చినప్పుడు (జీడీపీలో 56.1 శాతం), 2026–27లో జీడీపీలో 55 శాతంగా ప్రతిపాదించడం ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా పేర్కొనవచ్చు. ఆర్థిక క్రమశిక్షణపై ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపుల భారం తగ్గి ప్రాధా న్యతా రంగాలకు అధిక వనరులు సమకూరడంతోపాటు ద్రవ్యోల్బణంలో క్షీణత, స్థిర స్థూల ఆర్థిక వాతావరణం లాంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మరోవైపు సంక్షేమంపై వ్యయం తగ్గినట్లయితే వినియోగం, సమష్టి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.కనెక్టివిటీ సానుకూలంఆర్థిక వృద్ధి సాధనలో ప్రధాన అంశమైన మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా ఏడు కొత్త హై–స్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ చర్యతో రోజువారీ ప్రయాణ సౌకర్యాల మెరుగుదల, ప్రాంతాల మధ్య ఆర్థిక సంబంధాల మెరుగుదల, వివిధ ప్రాంతాల మధ్య వస్తు ప్రవాహం, ఉత్పాదకత పెరుగుదల, ప్రయాణ సమయాలలో తగ్గుదల వలన ‘ఆర్థిక హబ్’ల మధ్య కనెక్టివిటీ లాంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కారిడార్ల నిర్మాణం వలన తయారీ రంగం, సేవలు, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 2025–26 బడ్జెట్‌తో పోల్చినప్పుడు 2026–27 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మూలధన వ్యయంలో పెరుగుదలను 11.5 శాతంగా ప్రతిపాదించారు. తద్వారా నిర్మాణ రంగం, సిమెంటు, స్టీల్, యంత్రాలు, సేవలకు సంబంధించి డిమాండ్‌లో పెరుగుదల ఏర్పడవచ్చు. నిర్మాణ రంగంలోని శ్రామికులకు ప్రత్యక్షంగా ఉపాధి పెరగడంతోపాటు, లాజిస్టిక్స్; సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సప్లయ్ గొలు సులో పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఎక్కువవు తాయి. మౌలిక సౌకర్యాలపై ప్రభుత్వ పెట్టుబడు లలో పెరుగుదల వలన ప్రైవేటు సంస్థల వ్యయం, నష్ట భయం తగ్గుతాయి. ఆర్థిక వ్యవస్థ స్వల్ప కాలంలో పురోగమించడం ద్వారా 5 ట్రిలియన్ డాలర్ లక్ష్య సాధనకు వీలవుతుంది. ఈక్విటీ డెరివేటివ్స్ అయిన ఫ్యూచర్స్, ఆప్షన్లపై సెక్యూరిటీల లావాదేవీ పన్నును పెంచడం వలన నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్‌లో క్షీణత ఏర్పడింది. సెక్యూరిటీల లావాదేవీల పన్నును పెంచడంలో ట్రేడింగ్ కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయి. పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంపొందించడం, విదేశీ సంస్థాగత పెట్టుబడు (ఎఫ్ఐఐ)లను ఆకర్షించడంతో పాటు, ఉన్న పెట్టుబడులను నిలుపుకొనే విధంగా చర్యలు తీసుకోవడం, రాబోయే రోజుల్లో కార్పొరేటు రాబడులు మెరుగవు తాయనే విశ్వాసం కల్పించడం లాంటి అంశాలు మార్కెట్ పుంజుకోవడానికి దోహదపడతాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్‌ఛార్జి),ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
Bhatti Vikramarka: బడ్జెట్ ఇలా ఊహించలేదు
-
Union Budget 2026 :జిల్లాకో బాలికల హాస్టల్
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద పారిశ్రామిక, లాజిస్టిక్ కారిడార్లలో ఐదు యూనివర్సిటీ టౌన్‌షిప్‌లు, ప్రతీ జిల్లాలో ఒక బాలికల హాస్టల్, 15 వేల స్కూళ్లు, 500 కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది. దేశంలో విద్యారంగానికి ఈసారి బడ్జెట్లో రూ.1.39 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో ఉన్నత విద్యారంగం వాటా రూ.55,727 కోట్లుగా ఉంది. ఆయా రాష్ట్రాల్లోని పెద్ద పారిశ్రామిక, లాజిస్టిక్ కారిడార్లలో ఏర్పాటుచేసే ఐదు యూనివర్సిటీ టౌన్షిప్లకు కేంద్రం సహకారం అందిస్తుంది. ప్రణాళికబద్ధంగా ఏర్పాటుచేసే ఈ విద్యామండళ్లలో పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పరిశోధన సంస్థలు, స్కిల్ సెంటర్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. బాలికలకు ఇబ్బందుల్లేకుండా...దేశవ్యాప్తంగా 700 జిల్లాలుండగా జిల్లాకొక బాలికల వసతి గృహాన్ని ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. ‘ఉన్నతవిద్యకు సంబంధించిన స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) సంస్థల్లో చదువుతున్న బాలికలు సుదీర్ఘమైన సమయాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని నివారించేందుకు వీజీఎఫ్ (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్)/పెట్టుబడుల సహకారంతో జిల్లాకొ క బాలికల హాస్టల్‌ను నిర్మిస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు. అలాగే, వెటర్నరీ కాలేజీలు, ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీలకు లోన్ లింక్డ్ కేపిటల్ సబ్సిడీ పథకాన్ని ప్రతిపాదించారు. ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఏర్పాటుకు, కంటెంట్ ల్యాబ్స్‌ను ఏర్పాటుచేసేందుకు కేంద్రం సహకారం అందిస్తుందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)ని ఏర్పాటుచేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే విద్యారుణాలకు, వైద్యచికిత్సలో ఉండే లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) మొత్తాలకు టీసీఎస్ (మూలం వద్ద పన్ను సేకరణ)ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎల్ఆర్ఎస్ కింద భారతీయులు ఏడాది (ఏప్రిల్–మార్చి)కి 2.5 లక్షల డాలర్లను పంపేందుకు అనుమతిస్తారు. అయితే, విద్య, వైద్యచికిత్సలో కాకుండా మిగతా రంగాల్లో టీసీఎస్ యథావిధిగా 20 శాతం కొనసాగుతుందని పేర్కొన్నారు. సేవారంగంపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు ‘ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్’కు అనే అత్యున్నత స్థాయీసంఘాన్ని నియమించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. దీన్ని వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే బడ్జెట్‌గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. -
‘క్రీడా’ బడ్జెట్ 2026: కీలక అంశాలు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఈసారి క్రీడలకు కాస్త ప్రాధాన్యం పెరిగింది. గతంతో పోలిస్తే సుమారు రూ.1133 కోట్లకు పైగా నిధుల్ని పెంచారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో క్రీడలు, యువజన సర్వీసులకు రూ. 4479.88 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 3346.54 కోట్లు నిధులివ్వగా తాజా బడ్జెట్లో రూ.1133.34 కోట్ల మేర హెచ్చింపు చేశారు.దేశ వ్యాప్తంగా క్రీడా కేంద్రాల నిర్వహణ, శిబిరాలు ఏర్పాటు చేసే భారత స్పోర్ట్స్ అథారిటీకి రూ. 917.38 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.880 కోట్లు ఇవ్వగా కాస్త పెంచారు. అయితే డోప్ పరీక్షల ల్యాబోరేటరీతో పాటు జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (NADA) నిధుల్లో కోత పెట్టారు. డోపింగ్ టెస్టులకు క్రితం ఏడాది రూ.28.55 కోట్లు ఇస్తే... ప్రస్తుతం రూ.23 కోట్లకు కుదించారు. జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీకి గతంలో రూ. 78.64 కోట్లు విదిల్చిన ఆర్థిక మంత్రి తాజాగా రూ.46.98 కోట్లే కేటాయించారు.ఇక 1998లో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడాభివృద్ధి నిధిని రూ. 3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచారు. అలాగే క్రీడాకారుల ప్రోత్సాహకాలను రూ. 28 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు పెంచారు. జాతీయ క్రీడా సమాఖ్యలకు ఇచ్చే నిధుల్ని రూ. 400 కోట్ల నుంచి 425 కోట్లకు హెచ్చింపు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఖేలో ఇండియా’కు రూ.924.35 కోట్లు కేటాయించారు. గతేడాది రూ. 1000 కోట్లు నిధులివ్వగా... కేవలం రూ.700 కోట్లే వెచ్చించడంతో ఇప్పుడు దానిని తగ్గించారు. -
నిరాశ మిగిల్చిన బడ్జెట్
-
లోక్‌సభ: దేశ భద్రతపై రాహుల్ ఆరోపణలు.. తిప్పికొట్టిన అమిత్ షా
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నాలుగో రోజైన నేడు (సోమవారం) ఉభయ సభలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను కొనసాగిస్తున్నాయి. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ లోక్‌సభలో ఈ చర్చను ప్రారంభించగా, రాజ్యసభలో బీజేపీ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ 2026పై చర్చ సందర్భంగా లోక్‌సభలో పెను దుమారం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణే రాసిన జ్ఞాపకాలలోని కొన్ని ముఖ్యాంశాలను ఉటంకించారు. ఒక మ్యాగజైన్ కథనంలోని ప్రతులను సభలో ప్రదర్శిస్తూ, ప్రభుత్వం దేశ భద్రత విషయంలో అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. తాను ప్రస్తావిస్తున్న అంశాలు విశ్వసనీయమైనవని, దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలు కాబట్టే వాటిని సభ దృష్టికి తీసుకువస్తున్నానని రాహుల్ గాంధీ గట్టిగా సమర్థించుకున్నారు. అమిత్ షా సైతం జోక్యం చేసుకుంటూ ఆ సమాచార విశ్వసనీయతపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ చర్చను వ్యక్తిగత, రాజకీయ విమర్శల వైపు మళ్లిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దాదాపు 95 ఎన్నికల్లో పరాజయం పాలైందని ఆయన ఎద్దేవా చేశారు. ఇన్ని ఓటములు చవిచూసినా వారికి ప్రభుత్వ ఆర్థిక విధానాలను, పరిపాలనను విమర్శించే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. బడ్జెట్‌ను నిస్సారమైనదని విమర్శిస్తున్న విపక్షాలకు.. ప్రజలు ప్రధాని మోదీపై ఉంచిన నమ్మకం కనిపించడం లేదని బీజేపీ నేతలు విమర్శించారు.మరోవైపు బడ్జెట్ 2026 సామాన్యులను, రైతులను విస్మరించిందని విపక్షాలు ఆరోపించాయి. సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారం మాట్లాడుతూ ఈ బడ్జెట్ కేవలం అంబానీ, అదానీ వంటి బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే రూపొందించారని, రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ బడ్జెట్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బెంగాల్‌కు ఏమీ దక్కలేదని మండిపడ్డారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి వాస్తవ సమస్యలను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ సహా పలువురు నేతలు ఆరోపించారు.పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 4న సమాధానం ఇస్తారని తెలిపారు. సర్బానంద సోనోవాల్ ప్రారంభించే ఈ చర్చలో బీజేపీ నుండి ఐదుగురు ప్రముఖ వక్తలు పాల్గొంటారని చెప్పారు. కేంద్ర బడ్జెట్లోని సానుకూల అంశాలను గుర్తించడానికి నిరాకరిస్తూ, ప్రతిపక్షాలు ప్రతికూల మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో, సోమవారం నుంచి ఈ కీలక చర్చ ప్రారంభమైంది. గడిచిన జనవరి 28న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము.. జాతీయ భద్రత, 'వికసిత్ భారత్' లక్ష్యం, ‘స్వదేశీ' ఉద్యమం వంటి అంశాలపై ఎంపీలందరూ ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ధన్యవాద తీర్మానంపై జరగనున్న చర్చలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎంపీలు తారిక్ అన్వర్, అమరీందర్ రాజా వారింగ్, ఆంటో ఆంటోనీ, జోతిమణి కూడా ఈ చర్చలో తమ గళాన్ని వినిపించనున్నారు. ఈ చర్చకు సంబంధించి లోక్‌సభలో మొత్తం 18 గంటల సమయాన్ని కేటాయించారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ చర్చ కొనసాగనుంది. విపక్షాల విమర్శలు, ప్రశ్నలకు ఫిబ్రవరి 11న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చే అవకాశం ఉంది.మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన అంతర్జాతీయ నివేదికలలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావనకు వచ్చిందని ఆరోపిస్తూ, దీనిపై తక్షణమే చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో వెలువడిన ఈ నివేదికలు అత్యంత తీవ్రమైనవని, దీనిపై సభలో సమగ్రంగా చర్చించాలని ఆయన తన నోటీసులో పేర్కొన్నారు. ఈ అంశం సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ఏఐ ‘దొంగ’ ఫొటోలు.. కంగుతిన్న పర్యాటకులు -
కొత్తగా రూ.17.2 లక్షల కోట్ల రుణాలు
రానున్న ఆర్థిక సంవత్సరానికి (2026–27) కేంద్ర సర్కారు రూ.17.2 లక్షల కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకోనుంది. జీడీపీలో ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించాలన్న లక్ష్యానికి నిధులను వినియోగించనుంది. 2025–26 సంవత్సరానికి స్థూల రుణ సమీకరణ అంచనా రూ.14.80 లక్షల కోట్లుగా ఉంది.‘ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు డేటెడ్ సెక్యూరిటీల రూపంలో రూ.11.7 లక్షల కోట్లు నికర రుణ సమీకరణ చేయనున్నాం. మిగిలిన రుణాలు చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఇతర రూపాల్లో ఉంటాయి. స్థూల రుణ సమీకరణ రూ.17.2 లక్షల కోట్లుగా ఉంటుంది’ అని బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.5.5 లక్షల కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉందని, అందుకే రుణ సమీకరణ నంబర్ పెద్దగా కనిపిస్తోందని ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీ అనురాధా ఠాకూర్ వివరించారు.ద్రవ్య నిర్వహణ విషయమై రాష్ట్రాలతోనూ మాట్లాడుతున్నామని బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో భాగంగా మంత్రి సీతారామన్ తెలిపారు. ఆర్టికల్ 293 (3) కింద రాష్ట్రాల రుణాలను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. పరిమితికి మించి రుణ సమీకరణను అడ్డుకోవడం లేదంటూ.. ఎఫ్ఆర్బీఎం కింద రాష్ట్రాలు తమ బాధ్యతను అర్థం చేసుకోవాలన్నారు.ఇదీ చదవండి: క్యాపిటల్ గెయిన్స్‌గా షేర్ల బైబ్యాక్ -
బడుగు జీవికి.. భరోసా లేని బడ్జెట్
-
APకి గుండు సున్నా.. చంద్రబాబు పరపతి ఉత్తదే!
-
దేశానికి వికసిత విజన్... 2026-27 బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
-
నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్
కొత్త ఆదాయపు పన్ను.. జీఎస్టీ మార్పుల వంటి అనూహ్య నిర్ణయాలు చూస్తున్న వీక్షకులంతా... బడ్జెట్ కూడా ఈ వారంలో మొదలయ్యే టి–20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లా ఉంటుందనుకున్నారు. తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షాన్ని ఆశించారు. అభిషేక్ శర్మ స్థాయి పవర్‌ప్లేకి రెడీ అయిపోయారు. కానీ... కెప్టెన్ మోదీ తమది టి–20 ధనాధన్ కాదని.. సుదీర్ఘ టెస్ట్ ఇన్నింగ్స్‌తోనే అనుకున్న వృద్ధిని సాధిస్తామని సంకేతాలిచ్చారు. తమ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఫుల్గార్డ్తో పంపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతావనిని సాధిస్తామంటూ రెండు దశాబ్దాల తరువాతి లక్ష్యాన్ని ఆవిష్కరించారు. ఆ దిశగా టెస్ట్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టారు. వీరబాదుడు లేదు.. రిస్కీ షాట్లు లేనే లేవు. బౌండరీలు, సిక్సర్లు అస్సలే లేవు. ప్రతి బంతినీ పద్ధతిగా ఆడుతూ సింగిల్స్‌కు పరిమితమయ్యారు. సునీల్ గవాస్కర్‌ను మరిపించారు. కళ్లు చెదిరే షాట్లు అక్కర్లేదు... క్రీజ్‌లో ఉంటే చాలనే స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా కెప్టెన్ నరేంద్ర మోదీ చెప్పింది ఒక్కటే.. ‘నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్... ఇది లాంగ్‌టర్మ్ ఇన్నింగ్స్’’.ఇన్‌కమ్‌ట్యాక్స్ పిచ్ ఏమాత్రం మారలేదు. అవే శ్లాబ్స్. కాకపోతే టీసీఎస్, టీడీఎస్ విషయాల్లో చిన్నచిన్న ఉపశమనాలిచ్చారు. ఎన్నారైలు, ఫారిన్ అసెట్స్‌కు సంబంధించి పాత తప్పులు దిద్దుకోవటానికి కొన్ని ఫ్రీహిట్స్ ఇచ్చారు. వన్‌టైమ్ డిస్క్లోజర్ అనేది ఓ వారి్నంగ్. అంటే... నోబాల్‌గా ప్రకటించిన క్లీన్‌బౌల్డ్ అన్నమాట. 7 రంగాల్లో తయారీ సామర్థ్యాన్ని పెంచటం... 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు అంటూ మోదీ ‘7’వ నంబర్లో వచ్చే ధోనీ, కపిల్ వంటి కెప్టెన్ల స్థాయిని కళ్లకు కట్టారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0, బయోఫార్మా శక్తి, కెమికల్ పార్కులు, రేర్ ఎర్త్ కారిడార్లు, కంటైనర్ తయారీ, ఎల్రక్టానిక్ కాంపోనెంట్ల తయారీ వంటి పథకాలన్నీ మున్ముందు స్కోర్‌బోర్డును ముందుకు తీసుకెళ్లబోయే షాట్లు. ఇన్ని ఒత్తిళ్ల నడుమ... ద్రవ్య లోటును 4.3 శాతానికే పరిమితం చేస్తామంటూ... సింగిల్స్తోనైనా రన్‌రేటు మాత్రం పడిపోకుండా చూసుకున్నారు. ఇక స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే... ఎస్టీటీ రూపంలో మోదీ ప్రభుత్వం ఓ బౌన్సర్ వేసింది. ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలి కనక స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్నును 150 శాతం, ఆప్షన్లపై 50 శాతం పెంచారు. మార్కెట్లకిది నచ్చలేదు. బంతిని బలంగానే కొట్టాయి. ప్రస్తుతానికైతే బంతి గాల్లోకి లేచి మార్కెట్లు పడ్డాయి. అది క్యాచో కాదో మున్ముందు తెలుస్తుంది. ఇవీ చదవండి:రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్అదే పిచ్.. కాస్త రిలీఫ్ఖనిజ సంపదకు కారిడార్ వెలుగులునిధుల సిక్సర్విలేజ్.. విన్నర్ -
రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27వ సంవత్సరానికి సంబంధించి ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2026–27 ఆర్థిక సంవత్పరానికి రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆమె ప్రకటించారు. దేశ తయారీ రంగానికి ఊతమిచ్చేలా పలు చర్యలను ప్రతిపాదించారు. గ్లోబల్ డేటా సెంటర్లకు టాక్స్ హాలిడేను ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. అదేవిధంగా వ్యవసాయం, పర్యాటక రంగాలకు పలు రాయితీలను ప్రతిపా దించారు. అంతర్జాతీయ పెరుగుతున్న అస్థిరతల నేపథ్యంలో...దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక బ్లూప్రింట్‌ను ఆమె ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టిన నిర్మలా సీతారామన్ వరసగా 9 సార్లు పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్‌ను సృష్టించారు. దేశ చరిత్రలో మహిళా ఆర్థిక మంత్రి ఇన్ని సార్లు ఆర్థికపద్దును సభ ముందుకు తేవడం ఇదే తొలిసారి. మాజీ ప్రధానమంత్రి, దివంగత మొరార్జీ దేశాయ్ అందరికంటే ఎక్కువగా 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎంఎస్ఎంఈకి రూ.10వేల కోట్ల ఫండ్దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ ఎంఈ) ఛాంపియన్లుగా ఎదగడానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.10,000 కోట్లతో డెడికేటెడ్ ఫండ్‌ను తాజా బడ్జెట్లో ప్రకటించింది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఉత్పాదకత పెంచడం, వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సమగ్ర ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మన కర్తవ్యం నెరవేర్చుకో వడానికి సంస్కరణల ఎక్స్‌ప్రెస్ వేగం ఇలాగే కొనసాగుతుందని స్పష్టంచేశారు. మనకు మూ డు కర్తవ్యాలు ఉన్నట్లు చెప్పారు. అవి.. వేగవంతమైన, సుస్థిరాభివృద్ధి, ఆకాంక్షలు నెరవేర్చు కోవడం–సామర్థ్యాలు పెంచుకోవడం, సబ్కా సాత్, సబ్కా వికాస్ అని వివరించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎస్ఈలు ఛాంపియ న్లుగా మారాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రోత్ ఇంజన్ కు ఎంఎస్ఎంఈలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆయా కంపెనీలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అందుకోసం రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ప్రతిపాదించారు. రక్షణ రంగానికి సింహ భాగంపొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా మిలటరీ ఆధునీకరణపై కేంద్రం ఫోకస్ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో రక్షణ రంగానికి సింహ భాగం కేటాయించింది. ముఖ్యంగా మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా లక్ష కోట్లకు పైగానే కేటాయింపులు జరిపింది. 2025–26లో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.7,84,678 కోట్లు ప్రకటించింది. ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 15 శాతం అధికంగా కేటాయింపులు జరిపింది. పాకిస్తాన్ పై ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో అత్యాధునిక యుద్ధరీతులపై కేంద్రం దృష్టి పెట్టింది. కొత్త ఆ యుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధనౌకలు, మిలటరీ హార్డ్‌వేర్ కొనుగోళ్లు లక్ష్యంగా మొత్తం రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.2,19,306 కోట్లు కేటాయించింది. వికసిత్ భారత్‌కు రోడ్‌మ్యాప్: ప్రధాని మోదీఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ బారత్‌కు రోడ్‌మ్యా ప్ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నా రు. ‘‘ఇదొక విశిష్టమైన, ప్రతిష్టాత్మకమైన బడ్జెట్. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసే బడ్జెట్. ప్రపంచ వేదికపై మనదేశ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం. అద్భుత అవకాశాలకు ఈ బడ్జెట్ ఒక రహదారి. వికసిత్ భారత్–2047కు బలమైన పునాదిగా నిలుస్తుంది. దేశం ప్రయాణిస్తున్న సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌కు నూతన వేగం, నూతన శక్తి లభించడం తథ్యం. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి రోడ్‌మ్యాప్‌గా తోడ్పడుతుంది. దేశ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను కచ్చితంగా తీరుస్తుంది. మన పరిశ్రమలు లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం సహకరిస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 సంవత్సరానికి గాను బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదిసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారు. -
ఫ్యూచర్స్ ట్రేడర్లపై ఎస్టీటీ గూగ్లీ
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీ స్థాయి స్పెక్యులేషన్‌ని కట్టడి చేసే దిశగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో)పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ని (ఎస్టీటీ) పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ఫ్యూచర్స్‌పై ప్రస్తుతం 0.02 శాతంగా ఉన్న ఎస్టీటీని 0.05 శాతానికి (150 శాతం) పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఆప్షన్స్ ప్రీమియంపై, ఆప్షన్స్ వినియోగంపై ప్రస్తుతం వరుసగా 0.1 శాతం, 0.125 శాతంగా ఉన్న ఎస్టీటీని 0.15 శాతానికి (దాదాపు 50 శాతం) పెంచుతున్నట్లు తెలిపారు. క్యాష్ ఈక్విటీ మార్కెట్‌పై కాకుండా అత్యధిక వాల్యూమ్స్ ఉంటున్న డెరివేటివ్ ట్రేడింగ్‌నే లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో యాక్టివ్, స్వల్పకాలిక ట్రేడింగ్ లావాదేవీల వ్యయాలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. అతి స్పెక్యులేటివ్ యాక్టివిటీని నివారించేందుకు, మార్కెట్ సమతుల్యతను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు రూ. 1 లక్ష విలువ చేసే ఫ్యూచర్స్ విక్రయంపై ఎస్టీటీ రూ. 12.50గా ఉండగా ఇకపై రూ. 20కి పెరుగుతుంది. అలాగే రూ. 10,000 ఆప్షన్ కాంట్రాక్ట్ విక్రయంపై ఎస్టీటీ రూ. 6.25 నుంచి రూ. 10కి పెరుగుతుంది‘ అని స్టాక్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం లెమన్ సహ వ్యవస్థాపకుడు ఆశీష్ సింఘాల్ తెలిపారు. 2027 ఆర్థిక సంవత్సరంలో ఎస్టీటీ రూపంలో కేంద్రానికి రూ. 73,000 కోట్లు రావొచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ముందుగా అంచనా వేసిన రూ. 78,000 కోట్ల కన్నా తక్కువగా రూ. 63,670 కోట్లకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. ‘నామమాత్రపు పెంపు అనేది కేవలం స్పెక్యులేషన్‌ని నివారించేందుకే తప్ప ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చేందుకు కాదు. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌కి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవుతున్నప్పుడు మేము మౌనంగా చూస్తూ ఉండిపోలేము. ఈ నిర్ణయం అలాంటి స్పెక్యులేటివ్ పెట్టుబడులను నివారించేందుకు ఉపయోగపడుతుంది‘ అని బడ్జెట్ అనంతరం కాన్ఫరెన్స్‌లో నిర్మలా సీతారామన్ వివరించారు. మార్కెట్లు డౌన్.. ఎస్టీటీ పెంపు ప్రభావంతో మార్కెట్లు గణనీయంగా తగ్గాయి. కీలకమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 2 శాతం క్షీణించాయి. బ్రోకరేజ్ సంబంధ స్టాక్స్ ఒక దశలో 18 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈలో ఎంసీఎక్స్ షేరు సుమారు 12 శాతం తగ్గి రూ.2,232కి (ఇంట్రాడేలో 18 శాతం డౌన్), ఏంజెల్ వన్ స్టాక్ దాదాపు 9 శాతం క్షీణించి రూ. 2,320కి, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సరీ్వసెస్ 8 శాతం క్షీణించి రూ. 304కి పడ్డాయి. అటు గ్రో మాతృ సంస్థ బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేరు 5 శాతం క్షీణించి రూ. 168 వద్ద, ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ 2 శాతం తగ్గి రూ. 567 వద్ద క్లోజయ్యాయి. ఎఫ్‌పీఐలకు ప్రతికూలం.. సమీప భవిష్యత్తులో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ముఖ్యంగా డెరివేటివ్స్ ఆధారిత హై–ఫ్రీక్వెన్సీ గ్లోబల్ ఫండ్స్‌కి ప్రతికూలంగా ఉండొచ్చని చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ ఆకాశ్ షా తెలిపారు. అంతర్జాతీయంగా రిసు్కలు, కరెన్సీపరమైన ఒత్తిళ్లు మొదలైన వాటి వల్ల ఎఫ్‌పీఐలు ఇప్పటికే ఆచితూచి వ్యవహరిస్తూ మన ఈక్విటీ మార్కెట్ నుంచి జనవరిలో రూ. 41,000 కోట్లు ఉపసంహరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్టీటీ పెంపు ప్రతికూలంగా పరిణమిస్తుందన్నారు.దీనితో ట్యాక్స్ అనంతర లాభాలు తగ్గిపోయి, భారత మార్కెట్ ఆకర్షణను కోల్పోయే అవకాశం ఉందని షా వివరించారు. ఫండమెంటల్స్ ప్రాతిపదికన, దీర్ఘకాలిక దృష్టితో లావాదేవీలు నిర్వహించే ఎఫ్‌పీఐలపై ప్రభావం పరిమితంగానే ఉంటుందన్నారు. కాకపోతే, లావాదేవీల వ్యయాలు పెరిగిపోవడం వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు..ఇతర ఆసియా మార్కెట్లవైపు మళ్లే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది పెంపునకు అదనంగా ఇప్పుడు ఎస్టీటీని భారీగా పెంచడం వల్ల ట్రేడర్లు, హెడ్జర్ల వ్యయాలు పెరిగిపోతాయని కోటక్ సెక్యూరిటీస్ ఎండీ శ్రీపాల్ షా చెప్పారు. దీనితో డెరివేటివ్స్ విభాగంలో పరిమాణాలు తగ్గుతాయన్నారు. ఆదాయాన్ని గరిష్టంగా పెంచుకోవడం కన్నా వాల్యూమ్స్‌ని తగ్గించడమే ఈ ప్రతిపాదన అంతరార్థం అయి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, లిక్విడిటీ మెరుగ్గా ఉండటం, మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు పెరుగుతున్న నేపథ్యంలో యాక్టివ్ ఎఫ్‌అండ్‌వో ఇన్వెస్టర్లను ఎస్టీటీ పెంపు అనేది పెద్ద అవరోధంగా ఉండకపోవచ్చని గ్రీన్ పోర్ట్‌ఫోలియో పీఎంఎస్ సహ–వ్యవస్థాపకుడు దివమ్ శర్మ తెలిపారు. అతి స్పెక్యులేటివ్ ధోరణులను తగ్గించి ఫైనాన్షియల్ మార్కెట్లను మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎన్ఎస్ఈ ఎండీ ఆశీష్ కుమార్ చౌహాన్ తెలిపారు. -
మార్కెట్ డకౌట్
2026 బడ్జెట్ మ్యాచ్‌లో నిర్మలా సీతారామన్ వేసిన తొలి ఓవర్‌కే స్టాక్ మార్కెట్ డకౌట్ అయింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ పై ఆర్థిక మంత్రి వేసిన పన్నుల ఫుల్ టాస్‌కి బ్రోకరేజీలు క్లీన్ బౌల్డ్ అయ్యాయి. బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ పాయింట్ల బ్యాటింగ్ చేస్తుందనుకుంటే నిర్మలా సీతారామన్ వేసిన అనూహ్య బౌన్సర్‌కు సెన్సెక్స్–నిఫ్టీ స్టంపులు ఎగిరిపోయాయి. ఓపెనింగ్ ఓవర్లోనే సెన్సెక్స్‌పై భారీ అమ్మకాల యార్కర్ల దాడి జరిగింది. మిడ్ సెషన్‌కల్లా రెడ్ స్కోర్‌బోర్డ్ దడ పుట్టించింది.. ఇన్వెస్టర్లు డకౌట్ అయ్యి వెనుదిరిగితే, ఎల్బీడబ్లు్య అప్పీల్‌కి బుల్స్ చేతులు ఎత్తేశారు. బడ్జెట్ మ్యాచ్ లాభాల గెలుపుతో కాకుండా.. నష్టాల ఓటమి షాక్‌తో ముగిసింది.న్యూడిల్లీ: నిర్మలమ్మ బడ్జెట్ స్టాక్ మార్కెట్‌పై ‘పన్నుల’ దాడి చేసింది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ) 0.02% నుంచి 0.05 శాతానికి పెంచడం, కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్లపై 22%, నాన్ కార్పొరేట్ ప్రమోటర్లపై 30% పన్ను విధింపు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశపరిచింది. కీలక మౌలిక రంగాలకు ఆశించిన స్థాయిలో మూలధన వ్యయాన్ని కేటాయించకపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా బడ్జెట్ రోజైన ఆదివారం సెన్సెక్స్ 1,547 పాయింట్లు క్షీణించి 80,723 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 496 పాయింట్లు కుప్పకూలి 25 వేల స్థాయి దిగువన 24,825 వద్ద నిలిచింది. మార్కెట్ పతన తీవ్రత ఎంతలా ఉందంటే..., ఒక్కరోజులో రూ.9.40 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.450 లక్షల కోట్లకు దిగివచ్చింది. ట్రేడింగ్ సాగిందిలా బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించిన ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 82,389 వద్ద, నిఫ్టీ 25,334 వద్ద మొదలయ్యాయి. ఎస్టీటీ రద్దు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపులపై ఆశలతో తొలిభాగంలో లాభాలు ఆర్జించాయి. ఒక దశలో సెన్సెక్స్ 457 పాయింట్లు పెరిగి 82,727 వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు బలపడి 25,321 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. బడ్జెట్ ప్రసంగంలో పన్నుల ప్రతిపాదన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడడంతో సూచీలు క్షణాల్లో కుప్పకూలాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 2,371 పాయింట్లు క్షీణించి 79,899 వద్ద, నిఫ్టీ 549 పాయింట్లు కోల్పోయి 24,572 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. దిగువ స్థాయిల్లో కొంతమేర రికవరీ వచి్చనప్పటికీ.., సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెక్యూరిటీ మార్కెట్లకు ఇదొక కఠిన పరీక్ష ‘‘బడ్జెట్లో ఎస్టీటీ, కార్పొరేట్ బైబ్యాక్లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. ట్రేడింగ్ వ్యాపారంపై పన్నుల భారం పెరగడంతో భవిష్యత్‌లో వాల్యూమ్ తగ్గే అవకాశం ఉంది. సెక్యూరిటీ మార్కెట్లకు ఇదొక కఠిన పరీక్షగా మారనుంది. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ’’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని అంశాలు ఎల్రక్టానిక్స్ ఉపకరణాల తయారీని ప్రోత్సహించేందుకు బడ్జెట్లో రూ.40,000 కోట్ల ప్రతిపాదనతో ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల షేర్లు వెలిగిపోయాయి. అత్యధికంగా సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ 6% లాభపడింది. డిక్సాన్ టెక్నాలజీస్ 4.21%, కేన్స్ టెక్నాలజీ 3.82%, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్స్ 2.95%, డీసీఎక్స్ సిస్టమ్స్ 2.06%, సైయంట్ డీఎల్ఎం 1 శాతం లాభపడ్డాయి. → సెన్సెక్స్ 30 షేర్లలో టీసీఎస్(2%), ఇన్ఫోసిస్(1.17%), సన్‌ఫార్మా(0.95%), టైటాన్ (0.33%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి. ఎస్బీఐ(5.61%), అదానీపోర్ట్స్(5.53%), బీఈఎల్(5.36%), ఐటీసీ (3.91%), టాటా స్టీల్ (3.88%) õÙర్లు నష్టపోయాయి. → ఒక ఐటీ షేర్లకు మాత్రమే స్వల్పంగా డిమాండ్ లభించింది. బీఎస్ఈలో రంగాల వారీ సూచీల్లో పీఎస్‌యూ బ్యాంక్స్ 5.60%, మెటల్ 3.85% క్షీణించాయి. కమోడిటీస్ 3.35%, ఇంధన 3.14%, క్యాపిటల్ గూడ్స్ 3.08%, వినిమయ 2.98%, → ఇండ్రస్టియల్స్ 2.66%, విద్యుత్ 2.52% పతనమయ్యాయి. బీఎస్ ఈ స్మాల్, మిడ్‌క్యాప్ ఇండెక్సులు వరుసగా 3%, 2% పతనమయ్యాయి. → ఎస్టీటీ పెంపు ప్రభావం బ్రోకరేజ్ కంపెనీల షేర్లపై తీవ్రంగా కనిపించింది. ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గుతుందనే ఆందోళనలతో ఈ రంగంలోని కీలక కంపెనీల షేర్లు 12% వరకు క్షీణించాయి. → క్యూ3లో లాభం 16% వృద్ధి నమోదుతో సన్‌ఫార్మా షేరు 1% పెరిగి రూ.1,610 వద్ద స్థిరపడింది. -
అదే పిచ్.. కాస్త రిలీఫ్
సాక్షి, అమరావతి : ట్యాక్స్ శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయనప్పటికీ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే పలు కీలక నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ముఖ్యంగా టీడీఎస్, టీసీఎస్‌ల భారం తగ్గించడంతోపాటు వ్యక్తిగత ట్యాక్స్ రిటర్నులు ఏడాదంతా మార్చుకునే వెసులుబాటు కల్పించారు. విదేశాల్లో ఉన్న ప్రకటించని ఆస్తులను వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ప్రకటించుకునే అవకాశాన్ని కల్పించారు. ఆదివారం నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన కొన్ని కీలక నిర్ణయాలు... » ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇన్‌కమ్‌ట్యాక్స్– 2025 చట్టం అమల్లోకి రానుంది. దీని ప్రకారం రూ.12 లక్షల వరకు ఆదాయంపై ఇచ్చే ట్యాక్స్ రిబేట్, రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను పరిగణనలోకి తీసు కుంటే రూ.12.75 లక్షల ఆదాయం వరకు ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు. » వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులు ఐటీఆర్–1, ఐటీఆర్–2కింద రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీ జూలై 31, అదే ఆడిట్ అవసరం లేని సంస్థలకు గడువు తేదీ ఆగస్టు 31. » దాఖలు చేసిన రిటర్నుల్లో మార్పులు చేసుకోవడానికి ప్రస్తుతం డిసెంబర్ 31గా ఉన్న గడువును మార్చి 31 వరకు పొడిగించారు. » విదేశీ టూర్ ప్యాకేజీలపై ప్రస్తుతం విధిస్తున్న 5 శాతం , 20 శాతం టీసీఎస్‌ను రెండు శాతానికి తగ్గించారు. » మానవ వనరులు అందించే సంస్థలపై విధించే టీడీఎస్‌ను ఒకటి లేదా రెండు శాతానికి పరిమితం చేశారు.» విదేశీ ఆస్తులను ప్రకటించడానికి వన్‌టైమ్ డిస్క్లోజర్ స్కీంను ప్రవేశపెట్టారు» గత రిటర్నుల్లో విదేశీ ఆస్తులను ప్రకటించడంలో విఫలమైతే ఈ స్కీం కింద తక్కువ పెనాల్టీతో ప్రకటించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. » ఆస్తి విలువ రూ.20 లక్షల లోపు ఉంటే ఎటువంటి పెనాల్టీ ఉండదు. అదే కోటి రూపాయల లోపు ఉంటే మార్కెట్ విలువలో 30 శాతం చెల్లిస్తే సరిపోతుంది. » ప్రవాస భారతీయులు పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీం(పీఐఎస్) కింద పెయిడప్ క్యాపిటల్‌లో 10 శాతం వరకూ వాటా తీసుకోవచ్చు.ఇప్పటిదాకా ఇది 5 శాతంగానే ఉండేది. స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల్లో వీరు ఇక నుంచి 24 శాతం వరకూ వాటా తీసుకోవచ్చు. ఇప్పటివరకూ ఇది 10 శాతంగా ఉండేది.» కార్పొరేట్స్పై విధిస్తున్న మినిమమ్ఆల్టర్నేటివ్ ట్యాక్స్‌ను (మ్యాట్) 15 నుంచి 14 శాతానికి తగ్గించారు. » ఆర్బీఐ నుంచి నేరుగా సావరిన్‌గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసిన వారు... కాలపరిమితి ముగిసేంత వరకూ తమ వద్దఉంచుకుంటే, వాళ్లకు మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇవే బాండ్లను సెంకడరీ మార్కెట్ నుంచికొనుగోలు చేసిన వారు మాత్రం క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.మ్యాచ్ సమ్మరీపిచ్ మారలేదు. ఫీల్డ్ సెట్టింగ్ కూడా మునుపట్లానే. ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబులు యథాతథం. కాకపోతే అంపైర్ నుంచి అనుకోకుండా నోబాల్ వచ్చింది. అంటే... ఓ సింగిల్ రన్‌తో పాటు మరో బాల్ అదనమన్న మాట. టీడీఎస్, టీసీఎస్‌లను తగ్గించటం సింగిల్ రన్ అదనంగా లభించటమే. అదనపు బాల్, సింగిల్ రన్ కాంబినేషన్‌తో కొంతయినా రన్‌రేట్‌పై ఒత్తిడి తగ్గింది. ఎన్నారైలకైతే లూజ్ డెలివరీలు పడ్డాయి. విదేశీ ఆస్తులపై వన్‌టైమ్ సెటిల్మెంట్ ఫ్రీ హిట్లాగామారింది. బౌండరీలు లేవు, హిట్టింగ్ లేదు. కానీ వికెట్లు కాపాడుకుంటూ స్కోర్‌బోర్డు ముందుకు నడిపిన ఒక క్లాసిక్ కన్సాలిడేషన్ ఓవర్ ఇది. -
ఖనిజ సంపదకు కారిడార్ వెలుగులు
సాక్షి, అమరావతి: దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించే భవిష్యత్తు ఇంధనాలుగా పిలిచే అరుదైన ఖనిజాలు ఆంధ్ర ప్రదేశ్‌కు వరంగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత లభించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ ఈ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది కేవలం ఖనిజ తవ్వకాలకే పరిమితం కాకుండా రాష్ట్రాన్ని ఒక పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు దోహదపడుతుందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. అరుదైన ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తామని నిర్మల ప్రకటించారు.దీనికోసం బడ్జెట్లో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం) కింద రూ.16,300 కోట్లను కేటాయించారు. ఈ ఖనిజాల ద్వారా తయారయ్యే పర్మనెంట్ మాగ్నెట్స్ ఉత్పత్తి కోసం గత ఏడాది ప్రకటించిన రూ.7,280 కోట్ల ఇన్సెంటివ్ స్కీమ్‌ను ఈ కారిడార్‌కు అనుసంధానం చేయనున్నారు.ఏపీలో విస్తారంగా రేర్ ఎర్త్ మినరల్స్..ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో మోనజైట్ అనే ఖనిజం ద్వారా పలు అరుదైన మూలకాలు లభిస్తాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నంవంటి ప్రాంతాలు ఈ బీచ్ సాండ్ నిక్షేపాలకు ప్రధాన కేంద్రాలు. అనంతపురం జిల్లాలోని దంచెర్ల, పెద్దవడుగూరు ప్రాంతాల్లోనూ రేర్ ఎర్త్ మూలకాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైఎస్ఆర్ కడప, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో గ్రాఫైట్, కోబాల్ట్, కాడ్మియం వంటి ఖనిజాలు ఉన్నాయి. బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ కారిడార్ ద్వారా కేవలం తీర ప్రాంతమే కాకుండా ఖనిజ నిక్షేపాలున్న లోతట్టు ప్రాంతాలను రవాణా పరంగా అనుసంధానించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మన ఖనిజ సంపదను ముడి రూపంలో తక్కువ ధరకు విదేశాలకు పంపించి తిరిగి వాటితో తయారైన ఖరీదైన బ్యాటరీలను, అయస్కాంతాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ సంస్కృతికి విడనాడాలని భావిస్తున్నారు. ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే రిఫైనరీలు, ఖనిజాలను వేరు చేసే అత్యాధునిక ల్యాబ్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీలను ఒకే తాటిమీదకు తెస్తారు. దీంతో ఖర్చు తగ్గి, స్థానికంగా ఉపాధి పెరుగుతుంది. బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఈ కారిడార్ విజయవంతం కావాలంటే పర్యావరణ ప్రభావం, స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా చూడటం ప్రధానమని నిపుణులు చెబుతున్నారు. ఈసీఎంఎస్కు రూ.40 వేల కోట్లున్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీలో ఆత్మనిర్భరతే లక్ష్యంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్‌ను విస్తరించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల ఆదివారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. చిప్‌ల తయారీరంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ పరిశ్రమల్లో ఉపకరణాల సేకరణ, ముడి సరకులు, దేశీయ డిజైన్లు, ఇతర ముడి సామగ్రి విషయంలో సముపార్జనే ధ్యేయంగా ముందుకెళ్లాలని నిర్ణయించామని నిర్మల చెప్పారు. పారిశ్రామికంగా పరిశోధన శిక్షణా కేంద్రాల ఏర్పాటుపైనా దృష్టిపెట్టామని, ఇందుకోసం ఇండియా సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎం) 2.0ను తీసుకొస్తామని నిర్మల వెల్లడించారు.‘‘ త్వరలో ఐఎస్ఎస్ 2.0ను తీసుకొచ్చి చిప్‌ల సంబంధ ఉపకరణాలు, మెటీరియల్స్, భారతీయ మేథోపర హక్కులున్న చిప్ డిజైన్, సరకు రవాణా గొలుసులను అభివృద్ధి చేస్తాం’’ అని నిర్మల వెల్లడించారు. ‘‘ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్)ను 2025 ఏప్రిల్‌లో రూ.22,919 కోట్లతో ఆరంభించాం. ఈ పథకానికి నిధుల కేటాయింపులను రూ.40,000 కోట్లకు పెంచుతున్నాం’’ అని నిర్మల చెప్పారు. ‘‘మొత్తంగా రూ.54,567 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వద్దకు జనవరి నాటికి 46 దరఖాస్తులు చేరాయి. ఈ ప్రాజెక్టులు సాకారమైతే మరో 51,000 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని నిర్మల చెప్పారు. -
హైస్పీడ్‌గా రైల్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేని అత్యాధునికంగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైస్పీడ్ రైల్, రవాణా సామర్థ్యం పెంపు, భద్రత విభాగాలపై మరింత దృష్టి కేంద్రీకరించింది. ఇందులోభాగంగా దేశంలో ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ఏర్పాటుచేయాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. అభివృద్ధి అనుసంధానకర్తగా భావించే ఈ కారిడార్లను ముంబై–పుణే, పుణే–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, చెన్నై–బెంగళూరు, ఢిల్లీ–వారణాసి, వారణాసి–సిలిగురి మధ్య ఏర్పాటుచేయాలని ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 బడ్జెట్లో రైల్వే శాఖకు రూ.2,77,830 కోట్లను కేటాయించారు. దీంతోపాటు అదనపు బడ్జెటరీ వనరుల నుంచి రూ.15 వేల కోట్లు సమకూరుతాయని బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు. ఈ నిధులతో కొత్తలైన్ల నిర్మాణ,ం లోకోమోటివ్స్, కోచ్‌లు, వేగన్ల కొనుగోలు, ఇతర పనులు చేపడతారు. 2025–26లో రైల్వేకి 2,52,000 కోట్లు కేటాయించగా, ఈసారి 10.25 శాతం ఎక్కువగా కేటాయించారు. ఇప్పటివరకు రైల్వేకి చేసిన కేటాయింపుల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. రవాణా కారిడార్» సుస్థిర రవాణా కోసం డెడికేటెడ్ రవాణా కారిడార్ (డీఎఫ్సీ)ను డాంకునీ (పశ్చిమబెంగాల్) నుంచి సూరత్ (గుజరాత్) వరకు 2.052 కి.మీ. నిడివి తో ఏర్పాటుచేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. దీన్ని తూర్పు– పశ్చిమ డీఎఫ్ఏసీగా పేర్కొంటారు.» అధిక రద్దీ ఉండే 18 వేల కి.మీ. ట్రాక్ మార్గంలో భద్రతకు నిర్దేశించిన కవచ్, సీసీటీవీ కెమెరాలు, టెలికం కోసం రూ.7,500 కోట్లు కేటాయించారు. రైల్వే నెట్వర్క్ మొత్తానికి కవచ్ వ్యవస్థను ఏర్పాటుచేయాలని బడ్జెట్ లో పేర్కొన్నారు» దేశీయ కంటెయినర్ తయారీ కోసం కొత్త పథకం ప్రవేశపెడుతూ రూ.10వేల కోట్లు కేటాయించారు. » లోకోమోటివ్స్, వేగన్లు తదితరాల కొనుగోలుకు రూ.52,108.73 కోట్లు కేటాయించారు. దీంతో మరిన్ని వందేభారత్ రైళ్లు, 24–కోచ్ స్లీపర్ రైళ్లను తీసుకుంటారు.» అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కోసం రూ.11,917 కోట్లు కేటాయించారు. » కొత్త లైన్ల నిర్మాణానికి రూ.36,721.55 కోట్లు, రూ. గేజ్ మార్పిడికి రూ.4,600 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 37,750 కోట్లు కేటాయించారు.రూపురేఖలు మారిపోతాయిహైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణంతో దేశ రవాణారంగం రూపురేఖలు మారిపోతాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఏడు కారిడార్లు మొత్తం 4000 కి.మీ. నిడివితో విస్తరించి ఉంటాయని తెలిపారు. బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి రూ.1.20 లక్షల కోట్లు ప్రయాణికులు, భద్రత కోసం వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. భద్రతపై రైల్వే ఎక్కువ ఫోకస్ పెట్టిందని, దీనివల్ల 95 శాతం రైలు ప్రమాదాలు తగ్గినట్లు తెలిపారు. ముంబై–అహ్మదాబాద్ మధ్య తొలిసారి చేపట్టిన హైస్పీడ్ రైలు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. – రైల్వే మంత్రి3,547.32 కోట్ల మిగులురైల్వే శాఖకు వచ్చే సంవత్సరంలో రూ.3,85,733.33 కోట్ల ఆదాయం వస్తుందని, రూ. 3,82,186.01 కోట్లు వ్యయమవుతాయని బడ్జెట్లో అంచనా వేశారు. ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 3,547.32 కోట్లు మిగులుతుందని భావిస్తున్నారు. 2024–25లో రైల్వేకి రూ. 3,35,757.09 కోట్ల ఆదాయం సమకూరగా, రూ.3,32,440.64 కోట్లు వ్యయమైంది. రూ.3,316.45 కోట్లు మిగులు వచ్చింది. మ్యాచ్ సమ్మరీవందే భారత్‌తో రైల్వే శాఖ బౌలింగ్ స్పీడు పెరిగింది. ఆ స్పీడు మరింత పెంచేందుకు వీలుగా... ఎంత ఫాస్ట్ బౌలింగ్‌నైనా తట్టుకునేందుకు తగ్గ పిచ్‌లు తయారు చేయాలని మోదీ సర్కారు సంకల్పించింది. దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించింది. ఇవి అమల్లోకి వస్తే కొత్త రైళ్లు హైస్పీడ్ బంతుల్లా దూసుకెళతాయి. స్థిరమైన ఆటకు తగ్గ పిచ్‌లా సరకు రవాణాను గాడిలో పెట్టడానికి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అక్కరకొస్తుంది. కవచ్, సీసీటీవీలతో భద్రతపై పెట్టే వ్యయం... నోబాల్స్, వైడ్స్‌కు అడ్డుకట్ట వేస్తుంది. రూ.2.77 లక్షల కోట్ల భారీకేటాయింపుతో ఈ బడ్జెట్లో రైల్వే మామూలు ఓవర్ కాదు. దేశ రవాణాను వేగంగా నడిపించే పవర్ స్పెల్ వేసింది. -
సాగు.. ఫోకస్ మిస్!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,62,671 కోట్లు కేటాయించారు. 2025–26 సవరించిన అంచనాల (రూ. 1,51,853 కోట్లు) కంటే ఈసారి 7.12 శాతం మాత్రమే కేటాయింపులు పెంచారు. దీంతో వ్యవసాయ రంగంలో ఏ విభాగంపై కూడా పెద్దగా ఫోకస్ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ రంగాన్ని ఆర్థిక మంత్రి పూర్తి నిర్లక్ష్యం చేశారని అఖిల భారత కిసాన్ సభ ఆరోపించింది. వ్యవసాయ రంగం వ్యూహాత్మక పునరుజ్జీవనం పట్ల ఎటువంటి నిబద్ధతను చూపలేదని ఆక్షేపించారు. అయితే, వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ’సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే దార్శనికతను కనబరిచిందని ఆర్థిక మంత్రి నిర్మలచెప్పారు. సంప్రదాయసాగుపై ఆధారపడటాన్ని తగ్గించి గ్రామీ ణ జీవనోపాధిని వైవిధ్యపరిచేందుకు బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు. కొత్త ఏఐ టూల్.. » కేంద్రం ‘భారత్–విస్తార్ (వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్)’ అనే పేరుతో బహుళ భాషా కృత్రిమ మేధ టూల్‌ను ప్రకటించింది. దీనికోసం రూ.150 కోట్లు కేటాయించింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, రైతులకు సలహాలు అందించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ టూల్ అగ్రిస్టాక్ పోర్టల్‌లను, సాగు పద్ధతులపై ఐకార్ ప్యాకేజీని ఏఐ వ్యవస్థలతో అనుసంధానం చేస్తుంది. » పండ్లు, కూరగాయల మిషన్‌ను క్రిష్నియోన్నతి యోజన కింద కలిపేసి రూ.700 కోట్లు కేటాయించారు. » మఖానా బోర్డు పేరును బిహార్, ఇతర రాష్ట్రాల్లో మఖానా అభివృద్ధి పథకంగా మార్చారు. దీనికి రూ.90 కోట్లు కేటాయించారు. » పీఎం–కిసాన్‌కు రూ.63,500 కోట్లు కేటాయించారు. » వ్యవసాయ విద్య, పరిశోధనకు 3 శాతం కోతవేసి రూ. 9,964 కోట్లు కేటాయించారు. » ఇన్లాండ్ ఫిషరీల కోసం 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్లను స్టార్టప్‌లు, మహిళా సంఘాలు, చేపల పెంపకందారుల ద్వారా పటిష్టం చేస్తారు. ప్రధానమంత్రి సంపద యోజనకు కేటాయింపులను రూ.1,500 కోట్ల నుంచి 2,500 కోట్లకు పెంచారు. » కోస్తా, కొండ ప్రాంతాల్లో అధిక వ్యయమయ్యే పంటలైన కొబ్బరి, గంధం, కోకో, జీడిపప్పు, బాదం, వాల్నట్స్ సాగుకు రూ.350 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించారు. » పేద, సన్నకారు రైతులకు వస్తున్న ఆదాయంలో దాదాపు 16 శాతం పశుసంపద నుంచి వస్తోందంటూ.. 20,000 కంటే ఎక్కువ పశువైద్య నిపుణుల లభ్యతను పెంచడానికి రుణ–సంబంధిత మూలధన సబ్సిడీ పథకాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ పథకం ప్రైవేట్ రంగంలో వెటర్నరీ, పారావెట్ (పారా–వెటర్నరీ) కళాశాలలు, వెటర్నరీ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, బ్రీడింగ్ సౌకర్యాల స్థాపనకు తోడ్పడుతుంది. » గత బడ్జెట్లో ప్రకటించిన కాటన్ టెక్నాలజీ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ హైబ్రిడ్ సీడ్స్‌కు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. దీంతో ఈ పథకాలు ఇంకా ప్రారంభంకాలేదు. చరిత్రాత్మక బడ్జెట్..అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశానికి బలమైన పునాది వేసే చరిత్రాత్మక బడ్జెట్ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ఇది రైతులు, యువత, మహిళలు, పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని చెప్పారు. – వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్మ్యాచ్ సమ్మరీఈ ఇన్నింగ్స్‌లో వ్యవసాయ రంగానిది విచిత్రమైన పరిస్థితి. బంతి నేరుగా వ్యయసాయ రంగం చేతిలోకి వచ్చింది. కానీ కీపర్ చేతిలోకి రాకుండానే జారిపోయింది. అంటే... అన్నీ ఉన్నా కొంచెం ఫోకస్ మాత్రం మిస్సయింది. కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. పెద్ద షాట్లు వస్తాయని ఆశించిన చోట బంతి జారిపోయింది. అటు బ్యాట్స్‌మన్‌కూ అందలేదు. ఇటు కీపర్‌కూ దొరకలేదు. సాగు, అనుబంధ రంగాల కేటాయింపుల్లో స్కోర్‌బోర్డు ముందుకు కదిలినట్టే కనిపించినా, ఫీల్డ్‌లో మాత్రం ఫోకస్ తప్పిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. ఏఐ టూల్స్, పథకాలు ప్రకటించినా రైతులు ఎదురుచూస్తున్న అంశాలకు మాత్రం చోటు దొరకలేదు. వికెట్ పడలేదు. కానీ ఫోకస్ లేక వ్యవసాయానికి అవకాశం మిస్ అయింది. డేటా సెంటర్లలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులుకేంద్ర ప్రభుత్వం అంచనా న్యూఢిల్లీ: డేటా సెంటర్లలో 200 బిలియన్ డాలర్ల(రూ.18.33 లక్షల కోట్లు) పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం అణు ఇంధనంపై ఆధారపడాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 90 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. ఇందులో 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కార్యరూపం దాలుస్తున్నాయని వివరించారు. భారత్‌లో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియాలో డేటా సెంటర్లు సహా ఏఐ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెడతామని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డిజిటల్ కనెక్షన్ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. డేటా సెంటర్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో 2047 దాకా ట్యాక్స్ హాలిడే ప్రకటించింది. దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రతిపాదిత ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0తో చిప్‌ల తయారీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. క్యాన్సర్ బాధితులపై కరుణ17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకం రద్దుఅత్యాధునిక చికిత్సలు మరింత మందికి చేరువ సాక్షి, అమరావతి: క్యాన్సర్ బాధితులకు కేంద్రం భారీ ఆర్థిక ఊరట ఇచ్చింది. క్యాన్సర్ చికిత్సల్లో వినియోగించే 17 రకాల ప్రాణాధార ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ ఆధునిక ఔషధాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. టార్గెట్, ఇమ్యునోథెరపీ లాంటి ఖరీదైన చికిత్సలు మరింత మందికి అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు అభిప్రాయపడు తున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ మందులపై సాధారణంగా 10% కస్టమ్స్ సుంకం ఉంటుంది. తాజాగా దీన్ని మినహాయించనుండటంతో బాధి తులకు ఊరట లభించనుంది. శరీరంలో నిర్దిష్టంగా క్యాన్సర్ కణాలను మాత్రమే వెతికి పట్టుకుని నాశనం చేసే టార్గెటెడ్ థెరపీ, రోగ నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేసి క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసే ఇమ్యునోథెరపీ లాంటి ఆధునిక చికిత్సలు ప్రస్తుతం పేద రోగులకు అందుబాటులో లేవు. ఆ మందులు విదేశాల నుంచి దిగుమతి అవుతుండటమే దీనికి కారణం. ఇక 7 రకాల అరుదైన వ్యాధులకు సంబంధించి వ్యక్తిగతంగా దిగుమతి చేసుకునే ఔషధాలను కూడా సుంకాల మినహాయింపు జాబితాలో చేర్చారు. -
హెల్త్ 'హబ్'
న్యూఢిల్లీ : ఆరోగ్య రంగంలో సదుపాయాలను విస్తరించడం, వైద్య విద్య, ఫార్మా రంగాలకు ప్రోత్సాహం, హెల్త్‌కేర్‌లో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడం లక్ష్యంగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే పది శాతం పెంపుతో రూ.1,06,530.42 కోట్లను ఆరోగ్యశాఖకు కేటాయించారు. ఆధునిక చికిత్సలతో బయో ఫార్మాస్యూటికల్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ‘బయో ఫార్మా శక్తి’ కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం చేయనున్నారు. దేశం బయో ఫార్మా తయారీ హబ్‌గా ఎదిగి దిగుమతులపై ఆధార పడాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుంది. కొత్తగా మూడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ఏర్పాటుతోపాటు ఇప్పటికే ఉన్న 7 నైపర్లను ఆధునీకరిస్తారు. వెయ్యి అక్రిడిటెడ్ క్లినికల్ ట్రయల్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు రూ.4,000 కోట్లు కేటాయించారు. నేషనల్ ఎయిడ్స్, లైంగిక సాంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమానికి రూ.3,477 కోట్లు వ్యయం చేయనున్నారు. రాంచి, తేజ్‌పూర్‌లోని మానసిక ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు ఉత్తరాదిలో ‘నిమ్హాన్స్’ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆరోగ్య రంగంలో డిజిటల్ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు రూ.350 కోట్లు కేటాయించారు. ప్రమాదాల సమయంలో వేగంగా అత్యవసర వైద్య సదుపాయాలు అందేలా ప్రతి జిల్లా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ, ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆరోగ్య, వైద్య విద్య రంగంలో సిబ్బంది, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, వైద్య విద్య సీట్ల అప్‌గ్రెడేషన్, నర్సింగ్ విద్య తదితరాల కోసం రూ.1,725 కోట్లు కేటాయించారు. దేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా, జీవన శైలి జబ్బుల చికిత్స భారం, నైపుణ్యం కలిగిన హెల్త్‌కేర్ నిపుణులకు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ విద్య విస్తరణ, బలోపేతం కోసం మూడేళ్లలో రూ.980 కోట్లు వ్యయం చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. దీని ద్వారా 10 కీలక విభాగాల్లో హెల్త్ ప్రొఫెషనల్ అనుబంధ ఇన్స్టిట్యూట్లను నెలకొల్పి ఐదేళ్లలో లక్ష మంది నిపుణులైన ప్రొఫెషనల్స్‌ను సిద్ధం చేస్తారు. వృద్ధుల జనాభాకు అనుగుణంగా 1.5 లక్షల మంది కేర్ టేకర్స్‌ను సిద్ధం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడతారు. దేశంలో ఐదు ప్రాంతీయ మెడికల్ టూరిజం హబ్‌ల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆయుష్, ఆధునిక మౌలిక సదుపాయాలతో ఆస్పత్రులు, అధునాతన రోగ నిర్ధారణ పరీక్షలు, పునరావాసం, వైద్య విద్య , పరిశోధన సౌకర్యాలతో ఇవి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లుగా ఉంటాయని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కేంద్రాలు 3 ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.ప్రధాని స్వాస్థ సురక్ష యోజన రూ.11,307 కోట్లు ఎన్హెచ్ఎం రూ.39,390 కోట్లు పీఎం –జేఏవై రూ.9,500 కోట్లు పీఎం – ఏబీహెచ్ఐఎం రూ.4770 కోట్లు ఢిల్లీ ఎయిమ్స్ రూ.5500.92 కోట్లు సీజీహెచ్ఎస్ పెన్షనర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్ పథకానికి రూ.8697.86 కోట్లు కేంద్ర ఆస్పత్రులకు రూ.4599.66 కోట్లు హెల్త్ రీసెర్చ్ విభాగానికి రూ.4,821.21 కోట్లు (డీహెచ్ఆర్) సురక్షితమైన రక్త మార్పిడి సేవలకు రూ.275 కోట్లు -
విలేజ్.. విన్నర్
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలాంటి గ్రామీణ భారతావనిపై మరింత దృష్టి సారించింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి, ఇళ్ల నిర్మాణం, అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం కీలక ఫ్లాగ్షిప్ పథకాలకు తాజా బడ్జెట్లో దండిగా నిధులు కేటాయించింది. గత ఉపాధి హామీ పథకం స్థానంలో మరింత పటిష్టమైన వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. రాష్ట్రాలను భాగస్వామ్యం చేసే ఈ కొత్త పథకానికి మునుపెన్నడూ లేని రీతిలో కేటాయింపులు చేయడం విశేషం. మొత్తంమీద గ్రామీణాభివృద్ధికి 2026–27 బడ్జెట్లో రూ.1,94,369 కోట్లు దక్కాయి. పాత ఉపాధి హామీ పథకానికి రూ.30,000 కోట్లు, వ్యవసాయ మౌలికసదుపాయాలు, అభివృద్ధి ఫండ్‌కు రూ.4,400 కోట్లను కలుపుకుంటే 21 శాతం మేర నిధులు ఎగబాకినట్లు లెక్క!గ్రామీణ ప్రజలకు పక్కాగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో రెండు దశాబ్దాల క్రితం యూపీఏ సర్కారు అమల్లోకి తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో మోదీ సర్కారు కొత్త చట్టాన్ని తీసుకొచి్చంది. దీనికి వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ).. సంక్షిప్తంగా వీబీ–జీ రామ్ జీ అని పేరు పెట్టారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు ఇకపై ఏటా 125 రోజుల పాటు (పాత చట్టంలో 100 రోజులు) ఉపాధి హామీ దక్కుతుంది. కీలక వ్యవసాయ సీజన్లో కూలీల కొరతను నివారించేందుకు 60 రోజుల పాటు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. దీని కింద ప్రధానంగా జల సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధిని కల్పించే పనులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులను చేపడతారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం(వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా, మెరుగైన ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ గవర్నెన్స్ పెంపొందించడం, పల్లెవాసుల్లో ఆర్థిక సాధికారతను పెంచడం కొత్త చట్టం ప్రధానోద్దేశమని మోదీ ప్రభుత్వం చెబుతోంది. పాత ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలు 100 శాతం, మెటీరియల్ ఖర్చులో 75 శాతం కేంద్రమే భరించేది. అయితే 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న జీ–రామ్–జీ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్రాలు ఉపాధి వ్యయాన్ని 60:40 శాతం చొప్పున భరించాల్సి ఉంటుంది. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది 90:10 నిష్పత్తిలో ఉంటుంది. తాజా బడ్జెట్ కేటాయింపులకు రాష్ట్రాల వాటా తోడైతే జీ–రామ్–జీ కోసం ఏకంగా రూ.1.51 లక్షల కోట్లు దక్కుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఈ కేటాయింపులను ‘చరిత్రాత్మకం, అపూర్వమైనది’గా ఆయన అభివర్ణించారు. కాగా, ముగిసిపోతున్న పాత పథకం కింద చేపట్టిన పనుల కోసం అదనంగా ఈ బడ్జెట్లో మరో రూ.30,000 కోట్లను కేటాయించడం ద్వారా ఉపాధి కల్పనకు గట్టిగానే నిధుల హామీ లభించింది.‘వికసిత్ భారత్ జీ–రామ్–జీ’తో ఉపాధికి మరింత గ్యారంటీ... 2026–27 కేటాయింపులు:రూ.95,692 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.86,000 కోట్లు (సవరించిన అంచనా రూ.88,000 కోట్లు)జోరుగా ఇళ్ల నిర్మాణం (పీఎంఏవై)గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వర్గాల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా తాజా బడ్జెట్లోనూ కేంద్రం నిధులను భారీగా కేటాయించింది. పీఎంఏవై 2.0 స్కీమ్ కింద పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్లో రూ.18,625 కోట్లు దక్కాయి. గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేసిన లబి్ధదారులకు వడ్డీ సబ్సిడీ స్కీమ్ కింద 2026–27లో రూ.3,000 కోట్లు జమ చేయనున్నారు. కాగా, ఆర్థికంగా బలహీన వర్గాలకు 2026–27లో 6.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్ధేశించారు. తద్వారా 30.75 లక్షల మంది కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరనుంది. పీఎంఏవై (గ్రామీణ్)కు రూ.54,917 కోట్ల నిధులు అందనున్నాయి. గ్రామాల్లో 2029 మార్చికల్లా 2 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026–27లో 40 లక్షల ఇళ్లు నిర్మించాలనేది బడ్జెట్ అంచనా.2026–27 కేటాయింపులు: రూ.73,542 కోట్లు2025–26 కేటాయింపులు:రూ.74,626 కోట్లు(సవరించిన అంచనా రూ.40,000 కోట్లు)మ్యాచ్ సమ్మరీఈ బడ్జెట్ మ్యాచ్‌లో గ్రామీణ భారతం క్రీజ్‌లో నిలబడి గెలిచింది. ఉపాధి, ఇళ్లు, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీతో పల్లెల ఇన్నింగ్స్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఫ్లాగ్షిప్ పథకాలకు దండిగా నిధులు రావడంతో గ్రామీణ అభివృద్ధి స్ట్రైట్ బ్యాట్‌తో ఆడిన క్లియర్ విన్నర్‌గా మారింది. ఉపాధి హామీకి కొత్త రూపు, ఇళ్ల నిర్మాణానికి వేగం, గ్రామ రహదారులకు దిశ, ఇంటింటికీ నీరు, నెట్‌కి హైస్పీడ్‌తో గ్రామాలు ఈ బడ్జెట్లో చేతులెత్తి విజయాన్ని ప్రకటించాయి. ఇది వికసిత్ భారత్ లక్ష్యం దిశగా గ్రామీణ భారతం సమయం చూసుకుని కొట్టిన మ్యాచ్– విన్నింగ్ షాట్.రహదారులు.. రయ్ రయ్ (పీఎంజీఎస్‌వై) 2026–27 కేటాయింపులు:రూ.19,000 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.19,000 కోట్లు(సవరించిన అంచనా రూ.11,000 కోట్లు) గ్రామీణ ప్రాంతాల్లో పక్కా రోడ్ల నిర్మాణం, వాటిని సక్రమంగా నిర్వహించేందుకు అమలవుతున్న ఫ్లాగ్ షిప్ స్కీమ్ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన – పీఎంజీఎస్‌వై) ఇది. తాజా బడ్జెట్లోనూ మోదీ సర్కారు ఈ పథకంపై మరింత ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ స్కీమ్ నాలుగో దశ అమలవుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 26,000 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్ల నిర్మాణం లక్ష్యం. పర్యావరణ అనుకూల సాంకేతికతతో 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 4,200 గ్రామీణ ప్రాంతాలను పక్కా రోడ్లతో అనుసంధానించాలని కేంద్రం సంకల్పించింది. ఈ పథకం ప్రారంభం నుంచి 2025 డిసెంబర్ నాటికి 7,87,809 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు అంచనా.స్వచ్ఛ భారత్.. రెండో దశ 2014లో ఆరంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్షిప్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన (ఓడీఎఫ్) స్టేటస్ సాకారమైంది. దీన్ని కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణ కోసం ఇప్పుడు రెండో దశ అమలవుతోంది. 2026–27లో 48,096 గ్రామాలను ఘన వ్యర్ధాల నిర్వహణ పరిధిలోకి తీసుకురానున్నారు. 36,119 గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. 1,352 బ్లాక్‌లలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నెలకొల్పనున్నారు. 1,50,000 గ్రామాల్లో సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. స్వచ్ఛ భారత్ (అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో 2026–27లో 50,000 వ్యక్తిగత టాయిలెట్లు, 5,000 కమ్యూనిటీ టాయిలెట్లు, 10,000 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించనున్నారు. 2026–27 కేటాయింపులు:రూ.9,692 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.12,192 కోట్లు (సవరించిన అంచనా రూ.8,000 కోట్లు)ఇంటింటికీ తాగునీరు (జల్‌జీవన్ మిషన్) జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ పథకం ద్వారా దేశంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనేది లక్ష్యం. దీన్ని సాకారం చేసేందుకు పథకాన్ని 2028 వరకు పొడిగించారు. తదనుగుణంగానే తాజా బడ్జెట్లో దండిగా నిధులు కేటాయించారు. ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా. 2026–27లో 1,70,000 గ్రామ పంచాయితీల్లో హర్‌ఘర్ జల్ కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. 80 శాతం గ్రామాలకు కుళాయిల ద్వారా తాగునీరు అందించాలనేది తాజా బడ్జెట్ లక్ష్యం.2026–27 కేటాయింపులు:రూ.67,670 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.67,000 కోట్లు (సవరించిన అంచనా రూ.17,000 కోట్లు)భారత్ నెట్.. హైస్పీడ్దేశంలో గ్రామ పంచాయతీలన్నింటినీ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ కనెక్ట్ చేయాలనేది ఈ స్కీమ్ లక్ష్యం. ఇప్పటిదాకా 2,24,323 పంచాయితీలను కనెక్ట్ చేశారు. 7,72,676 లక్షల కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) వేశారు. 2025–26లో 10,000 జీపీలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించారు. 80,000 కిలోమీటర్ల పొడవైన ఓఎఫ్సీ నెట్వర్క్ వేశారు. 2026–27లో 42,000 పంచాయతీలకు కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం లభించనుంది. 1,60,000 కిలోమీటర్ల పొడవైన ఓఎఫ్సీ వేయనున్నారు. 20,50,00 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం.2026–27 కేటాయింపులు: రూ.24,000 కోట్లు2025–26 కేటాయింపులు: రూ.22,000 కోట్లు (సవరించిన అంచనా రూ.5,500 కోట్లు)ఇక చాంపియన్లుగా ఎంఎస్ఎంఈలుబడ్జెట్లో రూ.10,000 కోట్లతో డెడికేటెడ్ ఫండ్ న్యూఢిల్లీ: దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) చాంపియన్లుగా ఎదగడానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.10,000 కోట్లతో డెడికేటెడ్ ఫండ్‌ను తాజా బడ్జెట్లో ప్రకటించింది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఉత్పాదకత పెంచడం, వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సమగ్ర ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ ఆదివారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మన కర్తవ్యం నెరవేర్చు కోవడానికి సంస్కరణల ఎక్స్‌ప్రెస్ వేగం ఇలాగే కొనసాగుతుందని స్పష్టంచేశారు. మనకు మూడు కర్తవ్యాలు ఉన్నట్లు చెప్పారు. అవి.. వేగవంతమైన, సుస్థిరాభివృద్ధి, ఆకాంక్షలు నెరవేర్చుకోవడం–సామర్థ్యాలు పెంచుకోవడం, సబ్కా సాత్, సబ్కా వికాస్ అని వివరించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎస్ఈలు చాంపియన్లుగా మారాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రోత్ ఇంజన్‌కు ఎంఎస్ఎంఈలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆయా కంపెనీలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అందుకోసం రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ప్రతిపాదించారు. సూక్ష్మ పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి 2021లో ఏర్పాటుచేసిన ‘స్వయం సమృద్ధ భారత్ నిధి’కి రూ.2,000 కోట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. రూ.7 లక్షల కోట్లకుపైగా విలువైన టీఆర్ఈడీఎస్లను ఎంఎస్ఎంఈలు ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఆయా కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. టీడీఎస్‌ను సులభతరం చేయడంతో ఎంఎస్ఎంఈలకు మేలు జరుగుతుందన్నారు. -
నిధుల సిక్సర్
న్యూఢిల్లీ : పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా మిలటరీ ఆధునీకరణపై కేంద్రం ఫోకస్ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆదివారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ రంగానికి సింహ భాగం కేటాయించింది. ముఖ్యంగా మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా లక్ష కోట్లకు పైగానే కేటాయింపులు జరిపింది. 2025–26లో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.7,84,678 కోట్లు ప్రతిపాదించింది. అంటే ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 15 శాతం అధికంగా కేటాయింపులు జరిపింది. ముఖ్యంగా పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో అత్యాధునిక యుద్ధరీతులపై కేంద్రం దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగా కొత్త ఆయుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధనౌకలు, మిలటరీ హార్డ్‌వేర్ కొనుగోళ్లు లక్ష్యంగా మొత్తం రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.2,19,306 కోట్లు కేటాయించింది. ‘ఆపరేషన్ సిందూర్’చరిత్రాత్మక విజయం నేపథ్యంలో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే తమ దృఢ సంకల్పానికి మూలధన సేకరణ సహా రక్షణ రంగ బడ్జెట్ పెంపు మరింత ఊతం ఇచి్చందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. రెవెన్యూ వ్యయం రూ.5,53,668 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు రూ.1.80 లక్షల కోట్లతో పోల్చుకుంటే మూలధన వ్యయం రూ.39 వేల కోట్లు పెంచింది. అయితే 2025–26 సంవత్సరానికి సవరించిన మూలధన వ్యయాన్ని రూ.1,86,454 కోట్లుగా అంచనా వేశారు. తాజా మూలధన వ్యయంలో యుద్ధ విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం రూ.53,733 కోట్లు, నౌకాదళం కోసం రూ.25,023 కోట్లు కేటాయించారు. రూ.1,71,338 కోట్ల పింఛన్లతో కలిపి రెవెన్యూ వ్యయాన్ని రూ.5,53,668 కోట్లుగా చూపించారు. కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు పౌర, శిక్షణ విమానాల తయారీకి అవసరమైన కాంపొనెంట్లు, విడిభాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) మినహాయింపును ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. రక్షణ రంగ పరిశ్రమలకు.. విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాలింగ్కు అవసరమైన విడిభాగాలపై బీసీడీ రద్దును ప్రతిపాదించారు. రక్షణ రంగ వైమానిక పరిశ్రమకు ఈ రెండు నిర్ణయాలు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో అత్యాధునికయుద్ధరీతులపై కేంద్రందృష్టి పెట్టింది.మాజీ సైనికుల సీహెచ్‌ఎస్‌కు రూ.12,100కోట్లు మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (సీహెచ్ఎస్) కోసం రూ.12,100 కోట్లు ప్రతిపాదించామని రాజ్‌నాథ్ చెప్పారు. భద్రత, అభివృద్ధి, స్వయం సమృద్ధి మధ్య సమతూకాన్ని ఈ బడ్జెట్ బలోపేతం చేస్తుందని అన్నారు. 2026–27 నాటికి అంచనా వేస్తున్న జీడీపీలో రక్షణ రంగ బడ్జెట్ సుమారు 2 శాతంగా ఉండే అవకాశం ఉందన్నారు. రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీకి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మిలటరీ ఆధునీకరణతో పాటు సాంకేతిక ఆవిష్కరణలు, వనరుల సముచిత వినియోగానికి వీలుగా క్రమబద్ధమైన సేకరణపై రక్షణ బడ్జెట్ దృష్టి పెడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా సాయుధ దళాల బడ్జెట్‌పై దేశ రక్షణ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. సాయుధ దళాల ఆధునీకరణ, బలోపేతానికి దేశం కట్టుబడి ఉందనే విషయాన్ని రక్షణ బడ్జెట్ ప్రస్ఫుటం చేసిందని థాలేస్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అంకుర్ కనగ్లేకర్ అన్నారు. త్రివిధ దళాల ఆధునీకరణే లక్ష్యం: రక్షణ మంత్రి త్రివిధ దళాల ఆధునీకరణే ఈ బడ్జెట్లో అతి ముఖ్యమైన అంశమనిరాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.85 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందని, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది సుమారు 24 శాతం అధికమని పేర్కొన్నారు. ఈ పెంపుదలతో దేశ మిలటరీ సామర్థ్యం మరింత శక్తివంతం అవుతుందని అన్నారు. మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కూడా ప్రస్తుత బడ్జెట్లో ప్రాధాన్యత ఇచి్చనట్లు తెలిపారు. మ్యాచ్ సమ్మరీమిగతా విషయాల్లో ఎంత ‘డిఫెన్స్’ ఆడినా... డిఫెన్స్ రంగం విషయానికి వచ్చేసరికి నో డిఫెన్స్. ఎందుకంటే భద్రతపై రాజీ ఉండకూడదన్నది ప్రభుత్వ పాలసీ. అందుకే... రక్షణ రంగం సేఫ్ ప్లేను వదిలి నిధుల సిక్సర్ కొట్టింది. రూ.7.84 లక్షల కోట్ల రికార్డు కేటాయింపుతో కేంద్రం బంతిని నేరుగా బౌండరీ దాటించింది. చైనా, పాకిస్తాన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో కొట్టిన ఈ షాట్ కేవలం స్కోర్ పెంచడానికి కాదు, మ్యాచ్‌ను కంట్రోల్లోకి తీసుకురావడానికి. మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతూ కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, నౌకలు, ఆధునిక మిలటరీ హార్డ్‌వేర్‌తో దేశ రక్షణ విషయంలో ఎంత హిట్టింగ్‌కైనా సిద్ధమని మోదీ సర్కారు స్పష్టంగా చెప్పింది. ఆపరేషన్ సిందూర్’ తర్వాత సన్నద్ధతకు మరింత పదునుపెట్టిన ఈ బడ్జెట్... డిఫెన్స్‌లో కాదు, అగ్రెసివ్ ఫీల్డ్ సెటప్‌తో ఆడుతున్న స్పష్టమైన సంకేతం. -
వికసిత్ భారత్‌కు రోడ్‌మ్యాప్
‘‘ఇదొక విశిష్టమైన, ప్రతిష్టాత్మకమైన బడ్జెట్. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసే బడ్జెట్. ప్రపంచ వేదికపై మనదేశ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ అనే పేరుతో 140 కోట్ల మంది భారతీయులు సంతృప్తి చెందడం లేదు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలని కోరుకుంటున్నారు. ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, పెట్టుబడి వ్యయాన్ని పెంచడం, అధిక వృద్ధిని సాధించడమే ధ్యేయంగా బడ్జెట్ రూపుదిద్దుకుంది. ఇది భారతీయుల సమ్మిళిత సంకల్పం. విశ్వసనీయ ప్రజాస్వామ్య భాగస్వామిగా, విశ్వసనీయ నాణ్యమైన ఉత్పత్తుల సరఫరాదారుగా భారత్ పాత్ర మరింత విస్తరిస్తుంది.యువతకు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్‌ను రూపొందించారు. ఈ చరిత్రాత్మక బడ్జెట్ యువత ఆకాంక్షలను నెరవేరుస్తుంది. మహిళల సాధికార స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. గ్రామాల సంక్షేమం, పేదలు, రైతుల అభివృద్ధి కోసం చక్కటి బడ్జెట్‌ను తీసుకొచ్చిన నిర్మలా సీతారామన్, ఆమె బృందానికి నా అభినందనలు. వరుసగా తొమ్మిదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉంది. అద్భుత అవకాశాలకు ఈ బడ్జెట్ ఒక రహదారి. వికసిత్ భారత్–2047కు బలమైన పునాదిగా నిలుస్తుంది. దేశం ప్రయాణిస్తున్న సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌కు నూతన వేగం, నూతన శక్తి లభించడం తథ్యం.మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి రోడ్‌మ్యాప్‌గా తోడ్పడుతుంది. దేశ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను కచ్చితంగా తీరుస్తుంది. మన పరిశ్రమలు లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. బడ్జెట్లో ప్రతిపాదించిన చర్యలతో ‘అభివృద్ధి చెందిన భారత్’ దిశగా మన ప్రయాణం వేగవంతమవుతుంది. ఏ దేశానికైనా ప్రజలే అతిపెద్ద బలం. అందుకే ప్రజల్లో శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు పెంచడానికి కృషి చేస్తున్నాం. యువశక్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. తాజా బడ్జెట్‌తో వేర్వేరు కీలక రంగాల్లో నాయకులు, నూతన ఆవిష్కరణలు తయారు కాబోతున్నారు. క్రీడా రంగంలో యువతకు నూతన అవకాశాలు దక్కబోతు న్నాయి.మన దేశాన్ని ప్రపంచ డేటా సెంటర్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పన్ను మినహా యింపులు ప్రకటించాం. దేశంలో కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. మహిళల సారథ్యంలోని స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం నుంచి మరింత మద్దతు దక్కుతుంది. ప్రతి జిల్లాలో బాలికల కోసం కొత్త హాస్టళ్లు రాబోతున్నాయి. దాంతో వారి విద్యాభ్యాసం మరింత మెరుగవుతుంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమలు ఎల్లప్పుడూ ప్రభుత్వ ప్రాధాన్య రంగాలే. కొబ్బరి, జీడిపప్పు, కోకోవా, చందనం రైతులకు బడ్జెట్లో ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించాం’’ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ -
అతి విశ్వాసంతో స్వారీ
మొత్తంగా చూస్తే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ 2026–27... ప్రధానంగా నమ్మకం, ఆశ, దృఢ విశ్వాసం వంటి వాటిపై స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కూడా ఆశించిన మేర ఆదాయ అంచనాలను చేరుకోలేదు. దీనిని బట్టి ప్రభుత్వపరంగానూ ఆయా అంశాలు, రంగాల్లో ఆశించిన మేర పెట్టుబడులు, ఖర్చు పెట్టలేదు. గత బడ్జెట్లోనూ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించినా అందులో రూ. 200 కోట్లు కూడా ఖర్చుచేయలేదని ఆ రంగానికి చెందినవారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ప్రైవేట్ రంగం నుంచి ఆశించిన మేర పెట్టుబడులు రాకపోతే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెట్టిన పెట్టుబడులు ఏ మేరకు ఉపయోగపడతాయనేది చర్చనీయాంశమవుతోంది. మన బడ్జెట్లన్నీ కూడా ఎక్కువ మటుకు పెట్టుబడి దారులకు అనుకూలంగానే ఉంటున్నాయి. వీటిపై సమ తూకం సాధించే క్రమంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తామనీ, దీనినుంచి మంచి ఫలితాలు వస్తా యనీ చెబుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతుందనేది చూడాల్సి ఉంది. 7.5 కోట్ల యూనిట్లలో 32 కోట్ల మంది ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నందున, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలు కూడా క్రియా శీలమై కొంత శాతం ఉపాధిని కల్పిస్తే వీటి పునరుద్ధరణ జరిగే అవకాశాలున్నాయి. జాతీయస్థాయిలో 6.4 శాతం నుంచి 7.2 శాతం దాకా వృద్ధిరేటు సాధిస్తామని ప్రభుత్వం చెబుతున్నా... ఈ వృద్ధి నుంచి ఏ వర్గానికి ఎంత పంపిణీ అవుతుందనేది ముఖ్యం. కొన్నేళు్లగా చూస్తే మన వృద్ధి ఎగుడుదిగుళ్లు గానే ఉంటోంది. ఉదాహరణకు.. తాజా ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం చూస్తే... మొత్తం వంద రూపాయల జీడీపీ ఉత్పత్తిలో పై వర్గానికి 60 శాతం, మధ్య తరగతికి 25 శాతం, దిగువన ఉన్న వారికి 15 శాతం వస్తోంది. అధిక ఆదాయం పొందుతున్న వారు కొంత అధిక పన్ను కట్టాల్సి ఉండగా ఈ వర్గాన్ని ముట్టుకునే సాహసం చేయడం లేదు. అదీగాకుండా ఆరోగ్య రంగం విషయాని కొస్తే... మెడికల్ టూరిజంను ప్రోత్సహించడం ద్వారా డబ్బు భరించగలిగిన విదేశీయులకు నాణ్యతా పరమైన వైద్యసేవలు అందించి, దేశంలోని పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుచేయలేని సామాన్యులకు ఆ నాణ్యమైన వైద్య సేవలు ఏవనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశ పౌరు లందరికీ సమానమైన వైద్య సేవలను అందించి... అప్పుడు వ్యాపారం చేస్తే బాగుంటుంది. బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా, దానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల్లో గత కొన్నేళ్లలో ఎలాంటి వృద్ధీ లేదు. దీనికి భిన్నంగా భారత పెట్టుబడిదారులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఎక్కువైంది. దేశీయంగా తగిన డిమాండ్ లేదనీ, తమ పరి శ్రమల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం లేదనీ వారు చెబుతున్నారు. తాజాగా బడ్జెట్లో... విదేశాల్లో పెట్టుబడులపై నిబంధనలను మరింతగా సులభతరం చేశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడం కంటే కూడా ఇక్కడి నుంచి బయటి దేశాల్లో పెట్టే పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేశీయంగా కేంద్రప్రభుత్వం మాత్రమే పెట్టు బడులు పెడుతోంది. మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులు గతేడాది రూ.11.20 లక్షల కోట్ల నుంచి ఈ ఏడాది రూ.12.25 లక్షల కోట్లకు పెంచుతామని బడ్జెట్లో ప్రతిపాదించారు. వృద్ధిరేటును నిలబెట్టేందుకు ఈ పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభుత్వపరంగా రోడ్లు, కమ్యూ నికేషన్లు, తదితరాలన్నీ చేస్తుంటే దానిని ప్రోత్సాహకంగా తీసుకుని, ప్రైవేట్ పెట్టుబడులు రావాలి. కానీ అవి రావడం లేదు. మెరుగైన ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేటు వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం అతి విశ్వాసం, నమ్మకం పెట్టుకోవడం వల్ల మిగతా ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టడం లేదు. గతంలో ఎన్నడూలేని విధంగా దేశ రక్షణ బడ్జెట్‌ను ఒక్కసారిగా రూ.27 లక్షల కోట్లు (గతం కంటే 21 శాతం పెంపుదల) ప్రతిపాదించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా విజయం సాధించామనే భావనతో ఈ రంగానికి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి దీనిని ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం, వృద్ధి రేటు 6–7 శాతం మధ్యలో ఉండటం కలిసొచ్చే అంశాలు. ప్రొఫెసర్ డి. నర్సింహా రెడ్డి వ్యాసకర్త ఆర్థికవేత్త, హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ సోషల్‌సైన్సెస్ మాజీ డీన్ -
విమర్శలకు దీటైన జవాబు
న్యూఢిల్లీ: రైతులు, యువత, తయారీ దారులు, కుటుంబాల వ్యథలను పట్టించుకోకుండా బడ్జెట్‌ను తయారుచేశారని విపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మల మీడియా భేటీలో తిప్పికొట్టారు. ‘‘ రాహుల్‌గాంధీ ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థంకాలేదు. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితి, ప్రతికూల పరిస్థితుల ప్రభావం మన రంగాల మీదా పడుతోంది. అందుకే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మొదలు వస్త్ర, తోలు పరిశ్రమల దాకా అన్నింట్లోనూ కొత్త పథకాలు తీసుకొచ్చాం. రైతులు, మహిళా వ్యవస్థాపకుల దాకా అందరి ప్రయోజనాలకు పెద్దపీట వేశాం. ఇవన్నీ చూశాక కూడా మీరు(రాహుల్) రాజకీయంగా విమర్శలు గుప్పించాలనుకుంటే అది మీ ఇష్టం.కానీ మీరు ఏ అంశాల మీదయితే విమర్శించాలనుకుంటున్నారో అవన్నీ నాకు చెప్తే నేను సావధానంగా వింటా. అందుకు తగ్గట్లు బదులిస్తా’’ అని నిర్మల అన్నారు. ‘‘ గత 12 ఏళ్లుగా భారతీయ ఆర్థికపథం స్థిరంగా ముందుకు సాగుతోంది. స్థిర అభివృద్ధిని సాధిస్తోంది. ద్రవ్యోల్బణం మధ్యస్తంగా ఉంది. అత్యధిక అనిశ్చితి, అస్తవ్యస్త పరిస్థితుల్లోనూ ఉమ్మడిగా మేం తీసుకున్న నిర్ణయాల వల్లే భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలకు జై కొట్టాం. ప్రజోపయోగ పథకాలపై పెట్టుబడులు పెడుతూనే ఆర్థిక వివేకం ప్రదర్శించాం. ఆత్మనిర్భరతను మదిలో నిలుపుకుని దేశీయ తయారీరంగ సామర్థ్యాన్ని ఇనుమడింపజేశాం. ఇంధన భద్రతకు పట్టంకట్టాం. దిగుమతులపై ఆధారపడే తత్వం నుంచి కాస్తంత దూరం జరిగాం’’ అని ఆమె అన్నారు. డెరివేటివ్ మార్కెట్లో ఎస్టీటీ పన్ను పెంపుఅత్యాశకు పోయి పెట్టుబడులను పోగొట్టుకొనే మదుపరులను అప్రమత్తంచేసే లక్ష్యంతో డెరివేటివ్ మార్కెట్లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ పన్ను(ఎస్టీటీ)ని కాస్తంత పెంచామని నిర్మల చెప్పారు. తాజా బడ్జెట్లో ఎస్టీటీని ప్రస్తుతమున్న 0.02 నుంచి 0.05 శాతానికి పెంచారు. ‘‘ నేనేం డెరివేటివ్ ట్రేడింగ్‌కు వ్యతిరేకం కాదు. చిన్న మదుపరులు పెట్టుబడులను నష్టపోవద్దనే సదుద్దేశంతోనే ఎఫ్ అండ్ ఓ మార్కెట్లో పన్నులను పెంచాం’’ అని నిర్మల పేర్కొన్నారు. -
వికసిత్ భారత్.. పెట్టుబడిదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: సామాన్యుడికి కొంత మోదం.. స్టాక్ మార్కెట్లకు, మదుపర్లకు ఖేదం.. స్టార్టప్‌లకు కాస్త నిరాశ.. పన్ను చెల్లింపుదారులకు అసంతృప్తి.. విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. తయారీరంగం వారికి ఊరట.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బడ్జెట్ క్రికెట్ మ్యాచ్ చూశాక.. వివిధ వర్గాల అనుభూతులివి. 2026–27 సంవత్సరానికిగానూ రూ.53.47 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను నిర్మల ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ, ప్రజాకర్షక హామీలకు దూరంగా బడ్జెట్‌ను రూపొందించారు. విత్త మంత్రి తన బడ్జెట్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు ప్రకటించారు.యువశక్తి బడ్జెట్మాఘ పౌర్ణమి శుభ పర్వదినాన, సిక్కుల ఆధ్యాత్మిక గురువు గురు రవిదాస్ జయంతి రోజున 2026–27 బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు నిర్మల తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ 12 ఏళ్లలో ఆర్థిక రంగానికి స్థిరత్వం వచ్చిందని, సుస్థిరాభివృద్ధి, ద్రవ్య క్రమశిక్షణ సాధ్యమయ్యాయని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ప్రజాకర్షక హామీలకంటే ప్రజల ప్రయోజనాలను నిరంతరం ఎంచుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. మోదీ ఆలోచనలకు అనుగుణంగా.. దీన్ని ‘యువ శక్తి నడిపిన బడ్జెట్’గా ఆమె అభివర్ణించారు.3 కర్తవ్యాలువిత్తమంత్రి తన ప్రసంగాన్ని మూడు ప్రధాన కర్తవ్యాలతో ప్రారంభించారు. అవి సమ్మిళిత వృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, అందరితో కలసి–అందరి ప్రగతి. జీఎస్టీ సరళీకరణ, లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ వంటి 350కిపైగా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మొదటి కర్తవ్యం కింద 6 రంగాల్లో చర్యలు ప్రతిపాదించారు. కీలక రంగాల్లో తయారీని భారీగా పెంచడం, ‘చాంపియన్ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎమ్ఈ)’ తయారుచేయడం, మౌలిక వసతుల రంగానికి ఊపునివ్వడం, ఇంధనరంగంలో సుస్థిరాభివృద్ధి – దీర్ఘకాలిక భద్రతకు చర్యలు, పట్టణ ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి. కస్టమ్స్ పన్నుల్లో సరళీకరణ2026–27 బడ్జెట్లో కస్టమ్స్ విధానాన్ని సరళీకరించారు. అనవసర మినహాయింపులను తగ్గించారు. 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తేశారు. ప్రయాణికుల బ్యాగేజ్ నిబంధనలను సడలించి, వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి తగ్గించారు. ‘ఇంద్రధనుస్సు’ తయారీఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, రసాయనాలు, క్యాపిటల్ గూడ్స్, టెక్స్టైల్స్, క్రీడా పరికరాలు వంటి ఏడు రంగాల్లో తయారీ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేశారు. ఉద్యోగాల సృష్టి, సాంకేతికత ఆధారిత అభివృద్ధిపై దృష్టి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. పర్యాటకం – చిరు వ్యాపారాలుహిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లలో పర్యావరణ హిత పర్వత మార్గాల అభివృద్ధికి ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా 15 పురావస్తు కేంద్రాల అభివృద్ధికి కూడా బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేకంగా రూ.10,000 కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. డేటా సెంటర్లు, స్టాక్ మార్కెట్మనదేశంలో డేటా సెంటర్లు ఏర్పాటుచేసే సంస్థలకు నిర్మలమ్మ పెద్ద శుభవార్తే చెప్పారు. భారతదేశం నుంచి గ్లోబల్ డేటా సెంటర్ సేవలు అందించే సంస్థలకు ఏకంగా 20 ఏళ్ల పాటు.. అంటే 2047 వరకు పన్ను మినహాయింపు ప్రకటించారు. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను, నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30 శాతం పన్ను విధించారు. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) పెంచుతున్నట్టు ప్రకటించారు. విదేశీ టూర్లు – విదేశీ విద్యవిదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్‌ను 2 శాతానికి తగ్గించారు. విదేశీ విద్య, వైద్య ఖర్చులపై కూడా టీసీఎస్ తగ్గింపు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. విద్యార్థులు, యువ ఉద్యోగులు, టెక్ ఉద్యోగులు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఎన్నారైలు వంటి చిన్న పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు, 6 నెలల పాటు అమల్లో ఉండే విదేశీ ఆస్తుల వెల్లడింపు పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు.విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్తఆర్థిక మార్కెట్లను బలోపేతం చేసేందుకు, విదేశాల నుంచి మరింత మూలధనాన్ని ఆకర్షించేందుకు నిర్మల మూడు కీలక అంశాలు ప్రకటించారు. కార్పొరేట్ బాండ్లకు మార్కెట్ – మేకింగ్ ఫ్రేమ్‌వర్క్, విదేశీ వ్యక్తులు భారతీయ ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి వినూత్న మార్గం, లిస్టెడ్ కంపెనీల్లో అలాంటి పెట్టుబడిదారులకు యాజమాన్య పరిమితులు పెంచడం వంటి నిర్ణయాలు వెల్లడించారు. ముఖ్యంగా పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (పీఐఎస్) ద్వారా ఎన్ఆర్ఐలు ఇప్పుడు భారతీయ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. మౌలిక వసతులుమౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా, తూర్పున పశ్చిమ బెంగాల్‌లోని డంకుని నుంచి పశ్చిమాన సూరత్ వరకు కలిపే ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే వచ్చే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను ప్రారంభిస్తారు. తీర ప్రాంత సరుకు రవాణాను ప్రోత్సహించే పథకాన్ని కూడా అమలు చేస్తారు. సీప్లేన్ ల తయారీ దేశీయంగా జరిగేలా ప్రోత్సాహకాలు ఇస్తారు.క్లీన్ ఎనర్జీస్వచ్ఛ ఇంధన రంగంలో భాగంగా, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగించే కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ సాంకేతికతల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.20,000 కోట్ల వ్యయం ప్రకటించారు. పర్యావరణ అనుకూల ప్రయాణ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు, నగరాల మధ్య ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ‘వృద్ధి అనుసంధానాలుగా’ అభివృద్ధి చేయనున్నారు. లిథియం–అయాన్ బ్యాటరీలు, అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన దిగుమతులపై కూడా డ్యూటీ మినహాయింపు కొనసాగుతుందని ప్రకటించారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు ఏర్పాటుచేయనున్నారు.దివ్యాంగులకు వరాలుదివ్యాంగులకు చేయూతకోసం ‘దివ్యాంగజన్ కౌశల్ యోజన’, ‘దివ్యాంగ్ సహకార యోజన’ వంటి పథకాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, ఒడిశా, బిహార్, జార్ఖండ్ వంటి 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యావరణ ప్రజా రవాణా ప్రోత్సహించేందుకు 4వేల విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టనున్నారు. ఇంకా, 7 అరుదైన వ్యాధులకు అవసరమైన మందులు, ఆహార పదార్థాలను వ్యక్తిగత వినియోగం కోసం డ్యూటీ లేకుండా దిగుమతికి అనుమతి ఇచ్చారు.ప్రపంచ స్థాయికి ఉత్పాదక రంగందేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మల అనేక పథకాలు ప్రకటించారు. సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’, ఫార్మా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.10వేల కోట్లతో బయోఫార్మా శక్తి పథకాన్ని ప్రకటించారు. ఎలక్ట్రానిక్ వస్తువుల విడి భాగాల తయారీ ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పథకం, గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ వాటా పెంచేందుకు రూ.10వేల కోట్లతో కంటైనర్ తయారీ పథకం ప్రకటించారు. సాగు – బ్యాంకింగ్ – క్రీడలువ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం, తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం వంటి చర్యలు ప్రకటించారు. బ్యాంకింగ్ రంగం మీద అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే పదేళ్లలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఖేలో ఇండియా మిషన్‌కు శ్రీకారం చుడుతున్నట్టు నిర్మల తెలిపారు. -
కంచి పట్టుచీరలో హుందాగా..
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే కాకుండా.. ఆమె ధరించే చీరలు కూడా ఏటా ఆసక్తికి కేంద్రంగా మారుతుంటాయి. నిర్మల వరుసగా తొమ్మిదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిసారీ ప్రత్యేకమైన చీరలో కనిపించారు. తమిళనాడులో సంప్రదాయ కుటుంబంలో జన్మించి, తెలుగింటికి కోడలిగా వచ్చిన నిర్మలా సీతారామన్ దక్షిణ భారత సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబించే వస్త్రాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు.ఈసారి బడ్జెట్ సందర్భంగా మెజెంటా రంగు కంచి పట్టుచీర ధరించారు. బంగారు రంగు గడులు, కాఫీ–ఊదా రంగు బోర్డర్ చీరలో హుందాగా కనిపించారు. పసుపు రంగు, నిండు చేతుల రవిక ధరించారు. తమిళనాడు చేనేత కార్మికులు మగ్గంపై తయారుచేసే కంచి పట్టుచీరలకు దేశవ్యాప్తంగా పేరుంది. ఈ చీరలకు శతాబ్దాల చరిత్ర ఉంది. 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం దాకా చోళ రాజుల హయాంలో కంచి చేనేత పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. -
రాష్ట్రానికి నిర్మలమ్మ నిరాశే మిగిల్చారు
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చూపెట్టలేదు. దేశ వ్యాప్తంగా ప్రకటించిన ఏడు రైల్వే కారిడార్లు ( మూడు హైదరాబాద్ మీదుగా) మినహా ఈసారి బడ్టెట్‌లో కూడా తెలంగాణ ప్రస్తావన కనిపించలేదు. విజన్–2047కు అనుగుణంగా రీజినల్ రింగురోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన వరకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ఏ కార్యక్రమానికీ నిధులు కేటాయించలేదు. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, జాతీయ స్థాయి విద్యా సంస్థలు, పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ తెలంగాణకు ఎలాంటి ఊరట దక్కలేదు. కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా అమలు చేసే పథకాల్లో భాగంగానే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరాలి తప్ప ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాయం అడిగినా చేయలేదు ఈసారి కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మూడు అంశాల్లో కేంద్ర సహకారాన్ని ఆశించింది. ముఖ్యంగా 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిధులు వస్తాయని, 2014 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలకు మోక్షం కలుగుతుందని, విభజన హామీల్లో కొన్నింటికైనా ఈసారి కేటాయింపులు ఉంటాయని రాష్ట్రం భావించింది. అయితే తెలంగాణకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేకుండానే బడ్జెట్ ప్రతిపాదనలు జరిగాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక పథకాలకు రూ.1.65 లక్షల కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఇందుకోసం పలుమార్లు కేంద్రాన్ని రాష్ట్ర పెద్దలు కలిశారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు తోడు రాష్ట్ర ఎంపీలు, తమ శాఖలకు నిధుల కేటాయింపు కోసం రాష్ట్ర మంత్రులు ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆర్థికమంత్రి, ప్రధాన మంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ ఈ విజ్ఞప్తులేవీ కేంద్రం పట్టించుకోలేదు. రీజినల్ రింగు రోడ్డు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో ప్రాజెక్టు విస్తరణ, హైదరాబాద్‌లో సీవరేజి మాస్టర్ ప్లాన్, వరంగల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రేడియల్ రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఇండ్రస్టియల్ హబ్‌లు, లాజిస్టిక్, రీక్రియేషన్ పార్కులు, ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, కరీంనగర్, జనగామ జిల్లాల్లో లెదర్ పార్కులు, తెలంగాణలోని గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాక్‌లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి, కేంద్రీయ విద్యాలయాలు, జిల్లాకో నవోదయ పాఠశాల, పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదాలకు తోడు రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదలన్నింటినీ కేంద్ర బడ్జెట్ బుట్టదాఖలు చేసింది. రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి సహకారం ఉంటుందని ఆశించినా, అది కూడా దక్కలేదు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లాంటి సోషల్ ఇంజనీరింగ్ కార్యక్రమాలకు కూడా ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. మిర్చిబోర్డు, స్కిల్ వర్సిటీ లాంటి ఊసు కూడా లేకుండానే పార్లమెంటు ముందుకొచ్చిన కేంద్ర వార్షిక బడ్జెట్ రాష్ట్రాన్ని నిరాశలో ముంచెత్తింది. ఈ బడ్జెట్ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చొరవ తీసుకుంటే ప్రయోజనం కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కొన్ని పథకాలు, కార్యక్రమాల విషయంలో తెలంగాణ చొరవ తీసుకుంటే... కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మాత్రం కొంతమేర ప్రయోజనం కలుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైస్పీడ్ రైల్ కారిడార్లకు అనుసంధానంగా రోడ్డు కనెక్టివిటీని పెంచుకోవడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయవచ్చని అంటున్నారు. డాటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సహకారం, ఇతర దేశాల నుంచి పెట్టుబడుల సమీకరణ, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం తదితర అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధానాలు, కేంద్రం అందించే సాయం బట్టి కొంత ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. ఇక, ఆదాయ పన్ను విషయంలో ఎలాంటి మార్పు లేకపోవడం, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌ల విషయంలోనూ విధానాల్లో ఎలాంటి మార్పు ప్రకటించకపోవడంతో వేతన జీవులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ఈ బడ్జెట్ ద్వారా ఆశించిన ప్రయోజనాలు కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతుండడం గమనార్హం. స్వల్పంగా పెరిగిన పన్నుల్లో వాటా కేంద్ర పన్నుల్లో వాటా ఈసారి బడ్జెట్లో స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి గతంలో ఉన్న 41 శాతం పన్నుల్లో వాటాను ఈసారి 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా 42.5 శాతానికి పెంచారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో వాటా కూడా గత ఏడాది కంటే కొంచెం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 2.102 శాతంగా ఉన్న పన్నుల్లో వాటా ఈసారి 2.174 శాతానికి పెరగడం గమనార్హం. ఈ మేరకు రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటా కింది రూ. 33,181 కోట్లు వస్తాయని అంచనాలు చెబుతున్నాయి. ప్రతి నెలా సగటున రూ.2,370 కోట్ల చొప్పున మొత్తం 14 విడతల్లో ఈ మొత్తం వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అయితే, పన్నుల్లో వాటి ఈసారి రూ.4వేల కోట్ల వరకు పెరిగింది. గత బడ్జెట్లో రూ.29,280 కోట్లు రాగా, ఈసారి అది రూ.33వేల కోట్లకు పెరగడం ఒక్కటే తెలంగాణకు ఈసారి కేంద్ర బడ్జెట్లో దక్కిన ఊరట అని చెప్పుకోవచ్చు. -
‘ఛాంపియన్ల’ కోసం మూడంచెల వ్యూహం
కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రపంచ స్థాయి ‘ఛాంపియన్స్’గా తీర్చిదిద్దేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక వినూత్నమైన మూడంచెల వ్యూహాన్ని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈక్విటీ, లిక్విడిటీ, ప్రొఫెషనల్ సపోర్ట్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.దేశంలోని ఎంఎస్ఎంఈలు కేవలం చిన్న సంస్థలుగానే మిగిలిపోకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే ఛాంపియన్లుగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు.పెట్టుబడి మద్దతుఎంఎస్ఎంఈలకు రుణ భారంతో సంబంధం లేకుండా పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. భవిష్యత్తులో దిగ్గజ సంస్థలుగా ఎదిగే అవకాశం ఉన్న ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో ప్రత్యేక ‘ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్’ను ఏర్పాటు చేశారు. 2021లో ప్రారంభించిన ‘సెల్ఫ్-రిలయంట్ ఇండియా ఫండ్’కు అదనంగా రూ.2,000 కోట్లు కేటాయించి మైక్రో ఎంటర్ప్రైజెస్ రిస్క్ క్యాపిటల్‌ను పొందేలా చర్యలు తీసుకున్నారు.లిక్విడిటీ సపోర్ట్చిన్న పరిశ్రమలకు చెల్లింపుల సమస్య లేకుండా ఉండేందుకు TReDS (Trade Receivables Discounting System) ప్లాట్‌ఫారమ్‌ను మరింత శక్తివంతం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులను తప్పనిసరిగా TReDS ద్వారానే జరపాలి. ఇది కార్పొరేట్ రంగానికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుంది. TReDS ప్లాట్‌ఫారమ్‌పై ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కోసం క్రెడిట్ గ్యారెంటీ మద్దతును ప్రభుత్వం కల్పిస్తుంది.‘జెమ్స్’తో అనుసంధానం: ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ (జెమ్స్)ను TReDSతో అనుసంధానించడం ద్వారా వేగంగా తక్కువ వడ్డీకే ఫైనాన్సింగ్ పొందే వెసులుబాటు కలుగుతుంది.ప్రొఫెషనల్ సపోర్ట్చిన్న సంస్థలు చట్టపరమైన నిబంధనలను తక్కువ ఖర్చుతో పూర్తి చేసేందుకు ‘ప్రొఫెషనల్ సపోర్ట్’ అందించనున్నారు. టైర్-2, టైర్-3 నగరాల్లోని ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా ‘కార్పొరేట్ మిత్ర’లను అభివృద్ధి చేస్తారు. ఐసీఏఐ, ఐసీఎస్ఐ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో ఈ కార్పొరేట్ మిత్రలకు శిక్షణ ఇచ్చి ఎంఎస్ఎంఈలకు సరసమైన ధరలకే సేవలు అందేలా ప్రభుత్వం సహకరిస్తుంది.కొరియర్ ఎగుమతులపై పరిమితి ఎత్తివేతఎంఎస్ఎంఈ రంగం ప్రపంచ మార్కెట్లకు చేరువయ్యేలా చేసేందుకు పన్ను ప్రతిపాదనల్లో కీలక మార్పు చేశారు. ప్రస్తుతం కొరియర్ ద్వారా చేసే ఎగుమతులపై ఉన్న రూ.10 లక్షల గరిష్ట విలువ పరిమితిని పూర్తిగా ఎత్తివేశారు. దీనివల్ల ఈ-కామర్స్ ద్వారా విదేశాలకు వస్తువులను పంపే చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026-27 లైవ్ అప్డేట్స్ -
Budget 2026 : సోషల్ మీడియాలో మీమ్స్ పండగ
ఫిబ్రవరి 1 ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026 చాలామందిని నిరాశపర్చింది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొమ్మిదో యూనియన్ బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా, ప్రతిపక్ష నాయకులు, ఇతర పలువురు రాజనీయ నాయకులు, ఆర్థిక వేత్తలు మాత్రం సామాన్యులకు ఒరిగిందేమీ లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అటు సోషల్మీడియాలోవ్యంగ్యోక్తులు, విమర్శలు వెల్లువెత్తాయి.నిర్మలా సీతారామన్ ప్రసంగం బడ్జెట్ ముగిసిన వెంటనే, టాక్స్ విధానంలో ఎలాంటి ఉపశమనం రాకపోవడంతో సోషల్ మీడియాలో కామెడీ మీమ్స్ వెల్లువెత్తాయి.సెలబ్రిటీలు, వేతన జీవులు మధ్యతరగతి ఆందోళనల వరకు ఫన్నీ, క్రియేటివ్ మీమ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: దురంధర్ రంభ హో ఫీవర్ 70 ఏళ్ల వయసులో స్టన్నింగ్ డ్యాన్స్ వైరల్ వీడియోసీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ఉద్దేశించి, "ఫిబ్రవరి నెల మొత్తం మూడ్ ఒకే మహిళపై ఆధారపడి ఉంటుంది" అని ఒక మీమ్ పేర్కొనగా, మరో మీమ్‌లో, "మీ ఫండ్ నుండి కొంచెం డబ్బు వస్తే చాలా బాగుంటుంది" అంటూ ఇంకో మీమ్‌ను చూడవచ్చు. బడ్జెట్ 2026 అసలీ జాంజ్..పర్సు బరువు, సహనానికి పరీక్ష, మీమ్స్ పండుగ". అనే మరో ఫన్నీ మీమ్ కూడా ఉంది.మరోవైపు తాజా బడ్జెట్‌పై బెంగాల్ సీఎం మమతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్, జైరాం రమేష్ మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగం పారదర్శకంగా లేదని, కీలక కార్యక్రమాలు , పథకాలకు బడ్జెట్ కేటాయింపుల గురించి ఎలాంటి సమాచారం లేదని విమర్శించారు.మరో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ సామాన్య ప్రజల కోసం కాదని, పెద్ద కార్పొరేట్ల కోసం అని, ఇందులో ఏమీ లేనప్పుడు ప్రజలు దీనిని ఎలా స్వాగతించగలరని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో ఏమీ లేదు. ఇది పూర్తిగా డొల్ల అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: దిశా నిర్దేశంలేని కేంద్ర బడ్జెట్ : ధ్వజమెత్తిన మమతా బెనర్జీBudget Memes - A thread 🧵 Nirmala Sitharaman to Middle Class people pic.twitter.com/XOl1QDWCOO— Phunsuk Wangdu (@Phunsukwangduji) February 1, 2025కేంద్ర బడ్జెట్ 2026ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ. 11.2 లక్షల కోట్ల నుండి 2027 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం లక్ష్యాన్ని రూ. 12.2 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు. టైర్-2 , టైర్-3 నగరాలతో సహా దేశంలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఆమె అనేక చర్యలను కూడా ప్రకటించిన సంగతి విదితమే.BCOM students trying to understand the budget pic.twitter.com/JpUTLsVEoV— Phunsuk Wangdu (@Phunsukwangduji) February 1, 2025Government to salaried people during every budget#Budget2025 pic.twitter.com/VnfvuKYolM— Finance Memes (@Qid_Memez) February 1, 2025 -
నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలోని కీలక ప్రకటనలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించడమే కాకుండా 75 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగం చేయడం విశేషం. రూ.53.47 లక్షల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్ మంత్రి ప్రకటనలు కీలకంగా కింది విధంగా ఉన్నాయి.ఆదాయపు పన్నుపన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఈసారి పన్ను శ్లాబుల్లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ సరళీకరణపై దృష్టి సారించారు.కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.ఐటీ రిటర్నులను సవరించుకునే గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు.మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చే పరిహారంపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు.విదేశీ విద్య, వైద్యం, టూర్ ప్యాకేజీలపై ‘ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్’ (టీసీఎస్)ను 5% నుంచి 2%కి తగ్గించారు.మౌలిక సదుపాయాలు, రవాణాదేశాభివృద్ధికి ఇంజిన్లుగా భావించే మౌలిక సదుపాయాల కల్పనకు రికార్డు స్థాయిలో రూ.12.2 లక్షల కోట్లు కేటాయించారు.మెట్రో నగరాలను అనుసంధానిస్తూ 7 కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు.కొత్తగా 20 జాతీయ జల మార్గాలను అభివృద్ధి చేయనున్నారు.అత్యధికంగా రవాణా రంగానికి రూ.5.98 లక్షల కోట్లను కేటాయించారు.సాంకేతికత, పరిశ్రమలుభారత్ను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెమీకండక్టర్ మిషన్ 2.0లో భాగంగా చిప్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.40,000 కోట్లు కేటాయించారు.ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా సహా 5 రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల వెలికితీత కోసం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు.ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్: చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.10,000 కోట్ల నిధిని ప్రకటించారు.ఆరోగ్య, రక్షణ రంగాలుక్యాన్సర్ మందులు: 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేశారు. దీనివల్ల ప్రాణరక్షక మందులు చౌకగా లభించనున్నాయి.దేశ భద్రత కోసం రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లను కేటాయించారు.ఆర్థిక లోటు, వృద్ధి రేటుభారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధి నమోదు చేస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.2026-27 సంవత్సరానికి ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతంగా అంచనా వేశారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026-27 లైవ్ అప్డేట్స్ -
కొత్త ఇన్కమ్ టాక్స్
-
బడ్జెట్ 2026: చౌకైనవి.. ఖరీదైనవి ఇవే!
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ 2026లో చాలా అంశాలను వెల్లడించారు. ఈ కథనంలో బడ్జెట్ తరువాత చౌకగా లభించే వస్తువులు ఏవి?, ఖరీదైనవిగా మారిన వస్తువులు ఏవి? అనేది తెలుసుకుందాం.చౌకగా లభించే వస్తువులువిమాన భాగాలుమైక్రోవేవ్ ఓవెన్లుEV బ్యాటరీలుసోలార్ ప్యానెల్స్డయాబెటిక్ & క్యాన్సర్ మందులుభారతదేశంలో తయారయ్యే స్మార్ట్ఫోన్లుటాబ్లెట్లుఖరీదైనవిగా మారే వస్తువులులగ్జరీ గడియారాలుదిగుమతి చేసుకున్న మద్యంసిగరెట్లుబీడీలుపాన్ మసాలాగుట్కాకొన్ని ఎరువులుదిగుమతి చేసుకున్న టీవీ పరికరాలు, కెమెరాలు & సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే ఇతర పరికరాలుఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026-27 లైవ్ అప్డేట్స్ -
బడ్జెట్ 2026: మౌలిక వసతులు, రక్షణ రంగాలకు ప్రాధాన్యం
దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి దిశగా నడిపించే లక్ష్యంతో రూపొందించిన 2026-27 కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. మొత్తం రూ.53.47 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో కొన్ని రంగాలు అగ్రస్థానంలో నిలిచాయి.కీలక రంగాల కేటాయింపులు (రూ.కోట్లలో)రవాణా: రూ. 5,98,520 కోట్లురక్షణ: రూ. 5,94,585 కోట్లుగ్రామీణాభివృద్ధి: రూ. 2,73,108 కోట్లుహోం వ్యవహారాలు: రూ. 2,55,234 కోట్లువ్యవసాయం & అనుబంధ రంగాలు: రూ. 1,62,671 కోట్లువిద్య: రూ. 1,39,289 కోట్లుఇంధనం: రూ. 1,09,029 కోట్లుఆరోగ్యం: రూ. 1,04,599 కోట్లుపట్టణాభివృద్ధి: రూ. 85,522 కోట్లుఐటీ అండ్ టెలికాం: రూ. 74,560 కోట్లువాణిజ్యం & పరిశ్రమలు: రూ. 70,296 కోట్లుసాంఘిక సంక్షేమం: రూ. 62,362 కోట్లుశాస్త్ర సాంకేతిక విభాగాలు: రూ. 55,756 కోట్లుపన్ను పరిపాలన: రూ. 45,500 కోట్లువిదేశీ వ్యవహారాలు: రూ. 22,119 కోట్లుఆర్థిక శాఖ: రూ. 20,649 కోట్లుఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి: రూ. 6,812బడ్జెట్లో అత్యధికంగా రవాణా రంగానికి రూ.5.98 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా హైవేలు, రైల్వేలు, పోర్టుల ఆధునీకరణపై ప్రభుత్వం తన పట్టును చాటింది. దీనికి సమాంతరంగా రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతతో పాటు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి ఈ నిధులు ఊతమివ్వనున్నాయి.గ్రామీణ భారతం, వ్యవసాయంగ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2.73 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.1.62 లక్షల కోట్లు కేటాయించడం విశేషం. రైతుల ఆదాయం పెంచడం, డిజిటల్ అగ్రి-స్టాక్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు.విద్య, ఆరోగ్యం, ఐటీమానవ వనరుల వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యకు రూ.1.39 లక్షల కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.1.04 లక్షల కోట్లు కేటాయించారు. రాబోయే కాలంలో టెక్నాలజీ పాత్రను గుర్తిస్తూ ఐటీ, టెలికాం రంగానికి రూ.74,560 కోట్లు కేటాయించడం డిజిటల్ ఇండియా వేగాన్ని పెంచనుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026 సమగ్ర స్వరూపం.. -
నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
ఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 140కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబం ఈబడ్జెట్. వికసిత్ భారత్ నిర్మాణానికి మార్గనిర్ధేశనం చేస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్ర బడ్జెట్ అధిక మూలధన వ్యయం, అధిక వృద్ధి మధ్య సరైన సమతుల్యతను సాధించిందన్నారు. సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టిన తొమ్మిదవ కేంద్ర బడ్జెట్. ప్రపంచంలో భారత్ బలమైన స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
నిర్మలమ్మ చీర : గ్రహ గతుల విశ్లేషణ ఇదీ!
కేంద్ర బడ్జెట్ రోజున, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చీర ఎపుడూ ప్రత్యేకంగా ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే బడ్జెట్లో లభించే కేటాయింపులు, ఊరటలు, తాయిలాలతో నిర్మలమ్మ చీరపై కూడా అంతే ఆసక్తి ఉంటుంది. అయితే ఈ చీరల వెనుక అర్థం పరమార్ధం ఉందంటున్నారు పండితులు.కేంద్ర బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి ధరించే చీర కేవలం వస్త్రధారణ మాత్రమే కాదు, అది బడ్జెట్ స్వభావాన్ని సూచించే ఒక దృశ్య సంకేతం. రంగు, ఆకృతి, ఆ డిజైన్‌లోని సంయమనం దేశప్రజలకు రాబోయే ఆర్థిక నిర్ణయాలకు మానసికంగా సిద్ధం చేస్తాయట. బడ్జెట్ ప్రసంగంలో ఎపుడూ చేనేత చీరలకే ప్రాధానమిచ్చే నిర్మలా ఈ సారి అదే సంప్రదాయాన్ని పాటించారు. తమిళనాడు పురాతన నేత వారసత్వాన్ని గౌరవిస్తూ, చేనేత కాంచీవరం పట్టు చీరలోకనిపించారు. 2026 బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాఘ పూర్ణిమ రవి పుష్య యోగంలో తన తొమ్మిదవ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా విత్తమంత్రి చీరఎంపిక క్రమశిక్షణ, నియంత్రిత అధికారం, గంభీరతను ప్రతిబింబిస్తుంది. ఈ చీరను అర్థం చేసుకోవడానికి ఈ నేపథ్యం చాలా అవసరమని అంటున్నారు. ఇదీ చదవండి: గుడ్‌న్యూస్, మార్కెట్లకు ఊతం, డైరెక్ట్ పెట్టుబడులునిర్మలమ్మచీర, గ్రహ గతుల విశ్లేషణ2026, ఫిబ్రవరి 1,ఆదివారంఆదివారం: సౌర అధికారాన్ని, ఆజ్ఞను సూచిస్తుంది.మాఘ నక్షత్రం: చట్టబద్ధత , శక్తికి ప్రతీక.గ్రహాల స్థితి: మకర రాశిలో గ్రహాల కూటమి, ఉచ్ఛస్థితిలో ఉన్న కుజుడు, కుంభంలో రాహువు , మీనంలో శని ఉండటం వల్ల... ఈ రోజు భావోద్వేగాల కంటే వ్యవస్థాత్మక నిర్మాణం , నియంత్రణకు ప్రాధాన్యతనిస్తుంది.చీర రంగు పర్పుల్-మెజెంటా, నియంత్రిత శక్తికి నిదర్శనం. పర్పుల్ , మెజెంటా మిశ్రమ రంగు ధైర్యానికి సంకేతం. జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఇది కుజ శక్తిని సూచిస్తుంది. ఇది భావోద్వేగాలకు లొంగకుండా, దృఢమైన నిర్ణయాలు తీసుకునే ధోరణిని తెలుపుతుంది. ప్రజాకర్షక (Populist) పథకాల కంటే కఠినమైన ఆర్థిక క్రమశిక్షణకే మొగ్గు చూపుతారని ఇది సూచిస్తోంది.పసుపు-బంగారు అంచు (Border): పరిమిత వృద్ధి ఇది గురు గ్రహానికి (అభివృద్ధి, సంక్షేమం) సంబంధించినవిగా భావిస్తారు. అయితే, ఈ రంగు చీర మొత్తం కాకుండా కేవలం అంచుకే పరిమితం కావడం గమనార్హం. అంటే, వృద్ధి ,సంక్షేమం గురించి చర్చ ఉంటుంది, కానీ అవి ఆర్థిక పరిమితులకు లోబడే ఉంటాయి.ప్యాటర్న్ అడ్డ , నిలువు గీతలు : శని , క్రమశిక్షణకు సంకేతం.చీరపై ఉన్న సమాంతర , నిలువు గీతలు అనేవి క్లాసిక్ శనిగ్రహ చిహ్నాలు. శని ప్రభావానికి , మకర రాశి తత్వానికి నిదర్శనం. ఎలాంటి పూల డిజైన్లు (Motifs) లేకపోవడం వల్ల, ఈ బడ్జెట్ సెంటిమెంట్‌పై కాకుండా పాలసీ స్ట్రక్చర్ పైనే ఆధారపడి ఉంటుందని పండితుల అంచనా. నిర్మల ఈ చీరను ఎంచుకోవడం అంటు తన వస్త్రధారణ ద్వారా దేశానికి 'క్రమశిక్షణ' అనే సందేశాన్ని పంపినట్టు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు భావోద్వేగ ప్రాతిపదికన కాకుండా, వ్యవస్థాత్మక పద్ధతిలో, దీర్ఘ కాలిక ప్రయోజాలను ఆశించేలా, నియమపాలన, సంస్థాగత బలంపై దృష్టిపెట్టేలా తమ బడ్జెట్ ఉండబోతోందని అంచనాలను దేశప్రజలకు అందించినట్టన్నమాట. -
కేంద్ర బడ్జెట్ 2026 సమగ్ర స్వరూపం..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.53,47,315 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.రూ.35,33,150 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ.18,14,165 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్ 2026-27 సమగ్ర స్వరూపం కింది విధంగా ఉంది.బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపంరెవెన్యూ వసూళ్లు రూ.35,33,150 కోట్లుపన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లుపన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లుమూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లురుణాల రికవరీ రూ.38,397 కోట్లుఇతర వసూళ్లు రూ.80,000 కోట్లుఅప్పులు, ఇతర వసూళ్లు రూ.16,95,768 కోట్లుమొత్తం ఆదాయం రూ.53,47,315 కోట్లుమొత్తం వ్యయం రూ.53,47,315 కోట్లురెవెన్యూ ఖాతా రూ.41,25,494 కోట్లువడ్డీ చెల్లింపులు రూ.14,03,972 కోట్లుమూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,92,702 కోట్లుమూలధన ఖాతా రూ.12,21,821 కోట్లువాస్తవ మూలధన వ్యయం రూ.17,14,523 కోట్లురెవెన్యూ లోటు రూ.5,92,344 కోట్లునికర రెవెన్యూ లోటు రూ.99,642 కోట్లుద్రవ్య లోటు రూ.16,95,768 కోట్లుప్రాథమిక లోటు రూ.2,91,796 కోట్లు -
యువతకు కేంద్రం గుడ్ న్యూస్.. లక్షల ఉద్యోగాలు
-
హైదరాబాద్ పై వరాల జల్లు, 7 హైస్పీడ్ రైళ్లు
-
Budget 2026 : NRIలకు గుడ్‌న్యూస్, మార్కెట్లకు ఊతం, డైరెక్ట్ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా 2026-27 బడ్జెట్లో విదేశీ పెట్టుబడిదారులకు శుభ వార్త చెప్పారు. లోక్‌సభలో తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న ఆమె భారతదేశ ఆర్థిక మార్కెట్లను మరింత బలోపేతం చేయడానికి, మరింత ప్రపంచ మూల ధనాన్ని ఆకర్షించేందుకు సీతారామన్ ఈ రోజు మూడు కీలక అంశాలను ప్రకటించారు కార్పొరేట్ బాండ్లకు మార్కెట్-మేకింగ్ ఫ్రేమ్‌వర్క్, విదేశీ వ్యక్తులు భారతీయ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి కొత్త మార్గం, లిస్టెడ్ కంపెనీలలోఅటువంటి పెట్టుబడిదారులకు యాజమాన్య పరిమితులను పెంచడం.NRI లకు గుడ్న్యూస్పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (PIS) ద్వారా NRIలు ఇప్పుడు భారతీయ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. విదేశీ పెట్టుబడిదారులు RBI ఆమోదించిన ప్రత్యేక బ్యాంక్ ఖాతా ద్వారా భారతీయ స్టాక్లను కొనుగోలు చేయడానికి , విక్రయించడానికి అనుమతిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా భారతీయ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ముఖ్యంగా భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత పెంచే లక్ష్యంతో విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు (PROI) ఇకపై భారతీయ లిస్టెడ్ కంపెనీల ఈక్విటీ షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు ఉన్న పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత పరిమితిని 5 శాతం పెట్టుబడి పరిమితిని 10 శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు. అయితే అటువంటి పెట్టుబడిదారులందరికీ కలిపి పరిమితిని 10శాతం నుంచి 24శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ మార్పు తీవ్రమైన విదేశీ వ్యక్తిగత పెట్టుబడిదారులు భారతీయ కంపెనీలలో మరింత అర్థవంతమైన వాటాలను తీసుకోవడానికి వీలు ల్పిస్తుంది. ధరల ఆవిష్కరణను, వాటాలను మరింతగా పెంచుతుంది. దీర్ఘకాలిక మూలధన నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. పోర్ట్‌ఫోలియో పెట్టుబడి పథకం ద్వారా నేరుగా భారతీయ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం అనుమతించాలని కూడా భావిస్తోంది. ప్రస్తుతం, చాలా విదేశీ పోర్ట్‌ఫోలియో ప్రవాహాలు రిజిస్టర్డ్ విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) లేదా నిర్దిష్ట నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) మార్గాల ద్వారా వస్తాయి. ఇది సాధారణ విదేశీ వ్యక్తికి సంక్లిష్టంగా ఉంటుంది. అటువంటి పెట్టుబడిదారులకు నియంత్రిత, ప్రామాణిక ఈక్విటీ పెట్టుబడి మార్గాలను సులభ తరం చేస్తుంది.అలాగే కార్పొరేట్ బాండ్ల కోసం ప్రతిపాదిత మార్కెట్-మేకింగ్ ఫ్రేమ్‌వర్క్ భారత రుణ మార్కెట్లోని అతిపెద్ద సమస్యలలో ఒకటైన పూర్ లిక్విడిటీని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫ్రేమ్‌వర్క్ కింద, నియమిత సంస్థలు ఎంపిక చేసిన కార్పొరేట్ బాండ్లలో నిరంతర కొనుగోళ్లు, అమ్మకాల కోట్లను అందించేలా సాయపడతాయి. పెట్టుబడిదారులు మరింత సులభంగా మరియు సరసమైన ధరలకు స్థానాల్లోకి ఎంట్రీకి, ఎగ్జిట్‌కి సహాయపడుతుంది. ఇది సేవర్లు , సంస్థలకు సమానంగా, కార్పొరేట్ బాండ్లను బ్యాంకు రుణాలు, స్థిర డిపాజిట్లకు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కంపెనీలు మరింత పోటీ ధరల వద్ద డబ్బును సేకరించడంలో సహాయపడుతుంది. -
బడ్జెట్ 2026.. ఇండియా ఏఐ మిషన్ విస్తరణకు చాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను పాలన, పరిశ్రమల అభివృద్ధికి కీలక శక్తిగా అభివర్ణించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామన్నారు. ఈ క్రమంలో యూనియన్ బడ్జెట్ 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. పాలన- ప్రజా సేవలు.. ఏఐ అనువర్తనాలు “ఫోర్స్ మల్టిప్లయర్స్”గా పనిచేస్తాయని.. సేవల అందజేతలో సమర్థత పెరుగుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆరోగ్యరంగం, వ్యవసాయం, సామాజిక సంక్షేమ పథకాలలో AI వినియోగం ద్వారా లక్ష్యబద్ధత పెరిగి.. లీకేజీలు తగ్గుతాయని అంచనా వేశారు.రంగాల వారీగా AI వినియోగం చూసుకుంటే.. డిజిటల్ పాలన: మోసాల గుర్తింపు, కంప్లయెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం.విద్య: వ్యక్తిగతీకరించిన లెర్నింగ్ ప్లాట్ఫారమ్లుఆరోగ్య రంగం: డయాగ్నస్టిక్స్, టెలీమెడిసిన్ విస్తరణ.వ్యవసాయం: పంట దిగుబడుల అంచనా, వాతావరణ సూచనలు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కోసం..ఇండియా AI మిషన్ విస్తరణ.. పరిశ్రమ వర్గాలు ఇండియా AI మిషన్‌కు కేటాయింపులను రూ.2,000 కోట్ల నుంచి కనీసం రూ.5,000 కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా.. జాతీయ కంప్యూట్ సామర్థ్యం (GPUలు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపు), స్టార్టప్‌లు, పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం అవసరమైన కంప్యూటింగ్ వనరులు (GPUలు, క్లౌడ్ సర్వర్లు, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటర్లు) తక్కువ ఖర్చుతో ఉపయోగించుకునేలా ప్రభుత్వం లేదా సంస్థలు క్రెడిట్లు/సబ్సిడీలు ఇవ్వడం.. అందుబాటులో ఉండే AI ప్రయోగశాలలు (labs) ఏర్పాటు చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వనరులు, సాంకేతికత, శిక్షణ, పరిశోధన అవకాశాలను అందరికీ సమానంగా అందించడం ఉన్నాయి.AI స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు.. AI స్వీకరణ ఖర్చు తగ్గించేందుకు పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇవ్వాలని సూచనలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. తక్కువ ఖర్చుతో కంప్యూట్ వనరులు, స్పష్టమైన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా భారత్‌ను గ్లోబల్ AI అభివృద్ధిలో పోటీదారుగా నిలపాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలనుకుంటోంది. మొత్తంగా ఏఐని దేశ అభివృద్ధి, పరిశ్రమల పోటీ, ప్రజా సేవల సమర్థత కోసం ప్రధాన సాధనంగా ప్రభుత్వం గుర్తించినట్లు ఈ బడ్జెట్‌తో అర్థమవుతోంది. -
రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయం.. ఎలా ఖర్చు చేస్తారంటే..
కేంద్ర బడ్జెట్ 2026-27లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ మౌలిక స్వరూపాన్ని మార్చే దిశగా ఉన్నాయి. ముఖ్యంగా మూలధన వ్యయాన్ని రూ.12.2 లక్షల కోట్లకు పెంచడం దేశాభివృద్ధికి బలమైన సంకేతం. 2014-15లో కేవలం రూ.2 లక్షల కోట్లుగా ఉన్న ఈ వ్యయం, ఇప్పుడు ఆరు రెట్లు పెరగడం గమనార్హం. ఈ భారీ కేటాయింపుల నేపథ్యంలో రాబోయే కాలంలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందో చూద్దాం.మౌలిక సదుపాయాల కల్పనబడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి స్పష్టంగా పేర్కొన్నట్లుగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, వంతెనల నిర్మాణం వేగవంతం అవుతుంది. వందే భారత్ రైళ్ల విస్తరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల పూర్తికి ఈ నిధులు ఉపయోగపడతాయి.టైర్ 2, టైర్ 3 నగరాల అభివృద్ధిఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలపై బడ్జెట్లో దృష్టి సారించారు. ఈ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులు, మెరుగైన మురుగునీటి వ్యవస్థ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. చిన్న నగరాలు వృద్ధి కేంద్రాలుగా మారుతున్నందున అక్కడ గృహ నిర్మాణ రంగానికి, కమర్షియల్ స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది.ఇంధన రంగం, గ్రీన్ ఎనర్జీభారీ కాపెక్స్ కేటాయింపులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎల్లప్పుడూ ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. సోలార్ ప్యానెల్స్, విండ్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ మిషన్లలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. పాత విద్యుత్ లైన్ల ఆధునీకరణ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిధులు మళ్లుతాయి.లాజిస్టిక్స్, తయారీ రంగం‘వేగాన్ని కొనసాగించడం’ అనే లక్ష్యంతో వస్తువుల రవాణా ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వివిధ రవాణా మార్గాలను అనుసంధానించడం ద్వారా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణం జరుగుతుంది. మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో తయారీ రంగంలో దేశీ, విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.ఉపాధి, అనుబంధ రంగాలుమూలధన వ్యయం పెరగడం వల్ల సిమెంట్, స్టీల్, పెయింట్స్, భారీ యంత్రాల పరిశ్రమలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ పరిశ్రమల వృద్ధి వల్ల లక్షలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె.. -
కేంద్ర బడ్జెట్.. పెరిగేవి తగ్గేవి ఇవే..!
-
వికసిత్ భారత్ లక్ష్యంగా ‘కర్తవ్య మంత్రం’: నిర్మలా సీతారామన్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ దేశాభివృద్ధికి సంబంధించి కీలకమైన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. కర్తవ్య భవన్లో రూపొందించిన తొలి బడ్జెట్‌గా దీన్ని అభివర్ణిస్తూ యువతను కీలకంగా చేసుకొని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ‘మూడు కర్తవ్యాలు’, ‘ఆరు దశల ప్రక్రియ’ను ఆమె ప్రకటించారు.మూడు ప్రధాన కర్తవ్యాలుప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చడానికి మూడు ముఖ్యమైన విధులను (కర్తవ్యాలను) ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.1. ఆర్థిక వృద్ధి: అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం. ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచడం ద్వారా ప్రపంచ సవాళ్లను తట్టుకోగల సామర్థ్యాన్ని నిర్మించడం.2. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం. వారిని కేవలం లబ్ధిదారులుగా కాకుండా భారతదేశ శ్రేయస్సులో బలమైన భాగస్వాములుగా మార్చేలా వారి నైపుణ్యాలను పెంపొందించడం.3. సమ్మిళిత వనరుల పంపిణీ: ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ విజన్‌తో ప్రతి కుటుంబం, సమాజం, ప్రాంతానికి వనరులు అందేలా చూడటం.‘నీరు, ఎనర్జీ, క్లిష్టమైన ఖనిజాల అవసరం పెరుగుతోంది. కొత్త సాంకేతికతలు ఉత్పత్తి వ్యవస్థలను మారుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆశయాన్ని, సమ్మిళిత వృద్ధిని సమతుల్యం చేస్తూ భారతదేశం వికసిత్ భారత్ వైపు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తుంది’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.ఆరు దశల ప్రక్రియభారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు బడ్జెట్లో ఆరు కీలక అంశాలపై దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి చెప్పారు.వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి: ఉత్పాదకత పెంపుదల.యువశక్తి, ఉపాధి: యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన.మౌలిక సదుపాయాల కల్పన: ఆధునిక రవాణా, డిజిటల్ మౌలిక వసతులు.సుస్థిర ఇంధనం: ఇంధన భద్రత, క్లీన్ ఎనర్జీ.ఇన్నోవేషన్, పరిశోధన: టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధి.సమ్మిళిత అభివృద్ధి: అణగారిన వర్గాలు, పేదల సాధికారత. ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె.. -
బడ్జెట్ భావుకత
ఏడు దశాబ్దాలకు పైగా మన బడ్జెట్ ప్రసంగాలు ఆర్థిక క్రమశిక్షణను మాత్రమే కాకుండా, మన దేశపు గొప్ప సాహిత్య వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి! వివేకానందుడి ధీరత్వం, తిరువళ్ళువర్ నైతికత, చాణక్యుడి వ్యూహం; గాలిబ్, ఇక్బాల్‌ల కవిత్వం.. ఇలా ఎందరో సాహితీవేత్తల ఉల్లేఖనాలు మన ఆర్థిక ప్రణాళికా ప్రసంగాలకు ఆత్మగా నిలిచాయి. దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఆ ప్రసంగ పాఠాలలో, మహనీయుల మాట ఎలా ఒక దిక్సూచిలా మారిందో.. ఆర్థిక మంత్రులు తమ దార్శనికతను సాహిత్యం ద్వారా ఎలా ప్రజల హృదయాలకు చేరవేశారో వివరించే ‘బడ్జెట్ కావ్యం’ ఇది. ఆస్వాదించండి.సొగసైన వ్యక్తీకరణలుభారత కేంద్ర బడ్జెట్ చరిత్రను పరిశీలిస్తే, ఆర్థిక మంత్రులు కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, సందర్భోచితమైన ‘గొప్ప మాటల’ ద్వారా ప్రభుత్వ దూరదృష్టిని, విజయాలను చాటిచెప్పడం ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. విధానపరమైన నిర్ణయాలకు బలాన్ని చేకూర్చడానికి, దేశ భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించడానికి వీరు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల కోట్స్‌ను ‘దన్ను’గా ప్రయోగిస్తుంటారు. చారిత్రక వ్యక్తులు మొదలుకొని, ప్రసిద్ధ కవులు, రచయితల వరకు వైవిధ్య భరితమైన మూలాల నుండి ఆ కోట్లను స్వీకరిస్తారు. ప్రసంగంలోని తీవ్రతను బట్టి వాటి శైలి మారుతూ ఉంటుంది. అవి, దేశ ఆర్థిక గమనాన్ని సామాన్యులకు సైతం ప్రభావవంతంగా వివరించడానికి తోడ్పతాయి.కభీ ఖుషీ కభీ ఘమ్ఉదాహరణకు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసిద్ధ కవి ఇక్బాల్ కవిత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. పి. చిదంబరం తన బడ్జెట్ ప్రతిపాదనలకు తిరువళ్ళువర్, థోరో వంటి గొప్ప వ్యక్తుల విజ్ఞానాన్ని జోడించేవారు. ప్రణబ్ ముఖర్జీ ప్రాచీన భారతీయ రాజనీతిజ్ఞుడైన కౌటిల్యుడి సూత్రాల నుండి మార్గదర్శకత్వాన్ని పొందేవారు. కేవలం షేక్స్పియర్ లేదా వివేకానందుడి వంటి వారే కాకుండా; అమర్త్యసేన్, ఇందిరా గాంధీ వంటి వారి ప్రస్తావనలు కూడా ఆర్థిక నిర్ణయాల వెనుక ఉన్న హేతుబద్ధతను బలోపేతం చేయడానికి బడ్జెట్ ప్రసంగాలకు ఉపయోగపడ్డాయి. ఇక 2002 నాటి ప్రసంగంలో యశ్వంత్ సిన్హా ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ (కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు విచారం), ‘ఫిల్హాల్’ (క్షణికమైన) వంటి బాలీవుడ్ చిత్రాల పేర్లను సైతం ఉదహరించారు!మొరార్జీ ఆశావాదం1960వ, 70వ దశాబ్దాలలో భారతదేశం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి పారిశ్రామిక దేశంగా రూపాంతరం చెందుతున్న తరుణంలో కూడా, ఆర్థిక మంత్రులు ఈనాటికీ స్ఫూర్తినిచ్చే అద్భుతమైన ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా 1967–68 బడ్జెట్ ప్రసంగంలో, అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ పేదరికంపై పోరాటం–మారుతున్న ఆర్థిక పరిస్థితుల మధ్య అత్యంత ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. సరైన విధానాలను అనుసరిస్తే దేశ ఆర్థిక పురోగతికి ఒక మలుపు అవుతుందని ఆయన ఆశించారు. ‘‘రాబోయే ఆర్థిక సంవత్సరాన్ని నేను పూర్తి ఆశావాదంతో చూస్తున్నాను. నిర్ణయాలను సరిగ్గా అమలు చేస్తే, ఈ ఏడాది.. ఆర్థిక పునరుజ్జీవనానికి నాంది అవుతుందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను’’ అని ఆయన తన ప్రసంగంలో అన్నారు.మన్మోహన్ ఉర్దూ అద్దకం1990వ దశాబ్దంలో భారతదేశం ఆర్థిక సరళీకరణ దిశగా అడుగులు వేసింది. అప్పటి ఆర్థిక మంత్రి, భవిష్యత్ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఈ మార్పు చోటుచేసుకుంది. 18,650 పదాలతో నేటికీ అత్యంత సుదీర్ఘమైనదిగా నిలిచి ఉన్న తన 1991 నాటి బడ్జెట్ ప్రసంగంలో ప్రముఖ ఉర్దూ కవి అల్లామా ఇక్బాల్ రాసిన భావగర్భితమైన కవితను ఆయన చదివారు.దాని భావం: ‘‘గ్రీకు, ఈజిప్షియన్, రోమన్ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాని మన గుర్తింపు ఇంకా సజీవంగా ఉంది. ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మనం ఇంకా నిలబడగలిగామంటే మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండి ఉండాలి.’’! అదే ప్రసంగంలో ఆయన విక్టర్ హ్యూగో రాసిన..‘‘సమయం ఆసన్నమైన ఏ ఆలోచననైనా ఈ భూమిపై ఏ శక్తీ అడ్డుకోలేదు’’ అనే ప్రసిద్ధ వాక్యాన్ని కూడా ప్రస్తావించారు. మరుసటి ఏడాది కూడా మన్మోహన్ మరో ఉర్దూ కవి ముజఫర్ రజ్మీ రాసిన మాటలను గుర్తుచేశారు. దాని అర్థం: ‘‘చరిత్రలో కొన్ని సందర్భాలు ఇలా కూడా ఉన్నాయి, క్షణాల్లో జరిగిన పొరపాట్ల వల్ల శతాబ్దాల తరబడి శిక్షను అనుభవించాల్సి వచ్చింది.’’జస్వంత్.. తీరం, తుఫానుబీజేపీ హయాంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్ బడ్జెట్ ప్రసంగాలు కూడా కవితాత్మను ప్రతిఫలించాయి. 1999 నుండి 2003 వరకు ఆర్థికమంత్రిగా సేవలందించిన యశ్వంత్ సిన్హా.. బడ్జెట్‌ను సంప్రదాయానికి భిన్నంగా సాయంత్రం పూట కాకుండా, మధ్యాహ్నం పూట ప్రవేశపెట్టిన మొదటి మంత్రిగా గుర్తింపు పొందారు. ఆర్థిక వ్యవస్థలో రెండవ తరం సంస్కరణలు, వృద్ధి, సమానత్వం ఎంత ముఖ్యమో వివరిస్తూ ఆయన ఒక కవితను పేర్కొన్నారు.దాని తాత్పర్యం: ‘‘సమయం మనల్ని తుఫానులతో పోరాడమని కోరుతోంది. తీరం వెంబడి సురక్షితంగా ఎంతకాలం నడుస్తూ వెళ్తాం?’’ (సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం).అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో, యశ్వంత్ సిన్హా తర్వాత ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జస్వంత్ సింగ్, ప్రభుత్వ చివరి సంవత్సరాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగంలో సామాన్యుల అవసరాలకు పెద్దపీట వేస్తూ – ‘‘పేదవాడి కడుపులో ఆహారం, గృహిణి కొంగులో ధనం ఉండాలి..’’ అన్నారు. గాలి మేడలు.. పునాదులుకాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.చిదంబరం తన బడ్జెట్ ప్రసంగాల్లో మేధావుల మాటలను జోడించడంలో సిద్ధహస్తులు. ముఖ్యంగా తమిళ తాత్విక కవి తిరువళ్ళువర్ పట్ల ఆయనకు ఉన్న భక్తి, గౌరవం ప్రతి బడ్జెట్ ప్రసంగంలోనూ స్పష్టంగా కనిపిస్తాయి. తరచు ఆయన తిరువళ్ళువర్ రాసిన ప్రసిద్ధ ‘తిరుక్కురల్’ నుండి, ‘‘ఏది సరైనదో నీ విచక్షణకు స్పష్టంగా తెలిసినప్పుడు, దానిని పూర్తి దృఢ సంకల్పంతో, అలసత్వం లేకుండా సాధించాలి..’’ అనే మాటను ఉదహరించేవారు. 2006–07 మధ్యంతర బడ్జెట్ సమయంలో, భారతదేశ యువత కలలను, ఆకాంక్షలను ప్రతిఫలించేలా, ‘‘మీరు గాలిలో కోటలు కట్టినట్లయితే, మీ శ్రమ వృథా కాదు. అవి ఉండాల్సిన చోటు అదే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆ కోటల కింద బలమైన పునాదులను నిర్మించడమే..’’ అని హెన్రీ డేవిడ్ థోరో చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. అంతేకాదు, స్వామి వివేకానందుడి స్ఫూర్తిదాయక వాక్యాలను గుర్తు చేస్తూ, ‘‘మనం ఏది విత్తుతామో దాన్నే కోస్తాము. మన తలరాతను మనమే రాసుకుంటాము. గాలి అందరికీ సమానంగానే వీస్తుంది. ఎవరైతే తమ పడవ తెరచాపలను తెరిచి ఉంచుతారో వారు ముందుకు వెళ్తారు. తెరచాపలు మూసి ఉంచిన వారు వెనుకబడిపోతారు. అది గాలి తప్పా? కాదు... మన విధిని మనమే నిర్మించుకుంటాము..’’ అని మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో నొక్కి చెప్పారు. అరుణ్ జైట్లీ.. పూలు–ముళ్లుజైట్లీ తన బడ్జెట్ ప్రసంగాల్లో సందర్భోచితమైన సూక్తులను, కవితలను ప్రయోగిస్తూ ఆర్థిక విధానాలను ఎంతో ఆసక్తికరంగా వివరించేవారు. 2017–18 బడ్జెట్ ప్రసంగంలో ఆయన, ‘‘నా లక్ష్యం సరైనదై, గమ్యం నా కళ్ల ముందు ఉన్నప్పుడు.. గాలులు నాకు అనుకూలిస్తాయి, నేను ఉన్నత శిఖరాలకు చేరుకుంటాను’’ అని తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. అలాగే 2016–17లో, ‘‘చాంపియన్లు అనేవారు వారి అంతరాత్మలో ఉండే గాఢమైన కోరిక, ఒక కల, ఒక దార్శనికత నుండి ఉద్భవిస్తారు..’’ అని ఎంతో స్ఫూర్తిమంతంగా మాట్లాడారు. 2014–15 బడ్జెట్ ప్రసంగంలో ఆయన చేసిన, ‘మినిమం గవర్నమెంట్, మాగ్జిమం గవర్నెన్స్’ అనే పద ప్రయోగం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఒక ప్రతీకాత్మక నినాదంగా మారిపోయింది. ప్రధాని మోదీ ఘన విజయం తర్వాత అరుణ్ జైట్లీ తన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, దేశ పరిస్థితులపై ఓ కవితను చదివారు. దాని భావం: ‘‘మనం కొన్ని పూలను పూయించగలిగాము, మరికొన్ని వికసించాల్సి ఉంది. కాని, తోటలో ఇంకా కొన్ని పాత ముళ్లు మిగిలే ఉన్నాయి.’’ 2017లో, గత ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చిన ఆర్థిక ఇబ్బందుల నుండి దేశాన్ని గట్టెక్కించే క్రమంలో, జైట్లీ ఒక శక్తిమంతమైన ఉర్దూ కవితను స్మరించారు. ‘‘పడవను నడిపేవారు ఓటమిని అంగీకరించి చుక్కానిని మాకు అప్పగించినప్పుడు, ప్రతి అలపైనా మాకు తుఫానులు, సుడిగుండాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ, ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా నదిని ఎలా దాటాలో మేము నిరూపించాము, భవిష్యత్తులోనూ నిరూపిస్తాము.’’. సీతారామన్.. వేకువ పక్షులుఆర్థిక మంత్రులందరిలో నిర్మలా సీతారామన్ తన ఆలోచనలను, ప్రణాళికలను ఎంతో స్పష్టంగా స్వేచ్ఛగా వ్యక్తపరచే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆమె తన ప్రసంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్, పండిట్ దీనానాథ్ కౌల్, ప్రసిద్ధ మహిళా సాధ్వి అవ్వయ్యార్, కాళిదాసు, పిసిరాంతైయార్ వంటి వైవిధ్యభరితమైన మేధావుల నుండి తన బడ్జెట్ ప్రసంగానికి స్ఫూర్తిని అందుకొంటుంటారు. ఆమె ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్ ప్రసంగం ప్రధానంగా ‘‘ఆకాంక్షల భారతం, ఆర్థిక అభివృద్ధి, బాధ్యతాయుతమైన సమాజం’ అనే అంశాల చుట్టూ సాగింది. రాబోయే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని వివరిస్తూ, ఆమె ఉర్దూ రచయిత మంజూర్ హష్మీ రాసిన ఒక కవితను పఠించారు. ‘‘నీపై నీకు నమ్మకం ఉంటే, ఏదో ఒక మార్గం తప్పకుండా కనిపిస్తుంది. గాలి బలంగా వీస్తున్నప్పటికీ, ఆ గాలిని అడ్డుగా పెట్టుకుని కూడా దీపం వెలుగుతుంది..’’ అని ఆ కవిత భావం. నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో చాణక్య నీతి గురించి చెబుతూ, పట్టుదలతో కూడిన కృషి గురించి మాట్లాడారు. ‘‘మనుషులు దృఢ నిశ్చయంతో శ్రమిస్తే, అనుకున్న కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది’’ అని ఆ నీతి భావం. అలాగే, 2020 కేంద్ర బడ్జెట్ ప్రారంభోపన్యాసంలో.. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత, భారతదేశ ఐక్యతను చాటి చెప్పడానికి కశ్మీరీ కవి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పండిట్ దీనానాథ్ కౌల్ రాసిన కవితను ఆమె చదివారు. ‘‘మన దేశం వికసించిన శాలిమార్ తోట వంటిది, దాల్ సరస్సులో విరిసిన తామర పువ్వు వంటిది, యువత ఉడుకు రక్తంలా శక్తిమంతమైనది. నా దేశం, నీ దేశం, మన దేశం.. ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన దేశం’’ అని ఆ కవిత భావం. ఇక 2021లో, కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన చీకటి నీడల నుండి దేశం కోలుకుంటున్న తరుణంలో, ఆశావాదాన్ని నింపడానికి ఆమె.. ‘‘తెల్లవారుజాములో ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, వెలుగును ముందే పసిగట్టి పాట పాడే పక్షి వంటిదే నమ్మకం’’.. అనే రవీంద్రనాథ్ టాగోర్ కోట్‌ను జ్ఞప్తికి తెచ్చారు.చూడాలి, నేడు (1 ఫిబ్రవరి 2026) నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఏ ప్రాచీన కవులు, రచయితలు, తత్త్వవేత్తలు, ఆమెతో పాటుగా ‘ప్రసంగిస్తారో’!మొత్తంమ్మీద ఇలా, బడ్జెట్ అంకెల్లో ఎన్నో అక్షర నక్షత్రాలు మెరిశాయి. భారతదేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ‘కేంద్ర బడ్జెట్’ అంటే కేవలం ఆదాయ వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది దేశ ప్రజల ఆశలకూ, ఆకాంక్షలకు ప్రతిరూపం. లోక్‌సభ వేదికపై ఆర్థిక మంత్రులు ప్రసంగిస్తున్నప్పుడు, ఆ అంకెల ప్రవాహంలో అకస్మాత్తుగా ఒక ఉర్దూ శాయరీయో, సంస్కృత శ్లోకమో లేదా ఒక స్ఫూర్తిదాయక కవితో మెరిసి.. సభలోని వారినే కాదు, యావద్దేశాన్నే మంత్రముగ్ధులను చేస్తుంటాయి. జమాఖర్చుల ప్రసంగ పాఠానికి మనోరంజకమైన జీవిత సత్యాల కవితాత్మక జోడింపు ఇది. ఆర్థిక మంత్రులు తమ బడ్జెట్ ప్రసంగాల్లో ఉపయోగించిన కొన్ని సూక్తులుసమయం ఆసన్నమైన ఏ ఆలోచననైనా ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. – డాక్టర్ మన్మోహన్ సింగ్మన దేశం వికసించిన శాలిమార్ బాగ్ లాంటిది, దాల్ సరస్సులో విరిసిన తామర పువ్వు లాంటిది; ఇది యువత ఉడుకు రక్తం లాంటిది, నా దేశం, నీ దేశం, ప్రపంచం ప్రేమించే అత్యంత ప్రియమైన దేశం.– నిర్మలా సీతారామన్పరిస్థితులు మనల్ని తుఫానులతో పోరాడమని కోరుతున్నాయి. తీరం వెంబడి ఎంతకాలం నడుస్తూ వెళ్తాం? – యశ్వంత్ సిన్హాలక్ష్యం స్పష్టంగా ఉండి, గమ్యం కళ్లముందు ఉన్నప్పుడు.. గాలులు కూడా నాకు అనుకూలించి, నేను ఎత్తుకు ఎగురుతాను.; ‘‘ఛాంపియన్లు వారి అంతరాత్మలో ఉండే గాఢమైన కోరిక, కల.. ఇంకా వారి దార్శనికత నుండి పుడతారు.’’ – అరుణ్ జైట్లీ -
Watch Live: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
కాంజీవరం చీరలో నిర్మలమ్మ.. ప్రత్యేకతలివే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంట్లో తన తొమ్మిదో బడ్జెట్‌ను (2026-27) ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆమె ధరించిన ‘కాంజీవరం చీర’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు ఆర్థిక లెక్కలు, మరోవైపు రాజకీయ సమీకరణాల నడుమ ఈ చీర ప్రత్యేక చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన కాంజీవరం పట్టు చీరను ధరించడం ద్వారా ఆ రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పిటన్లవుతుందని కొందరు భావిస్తున్నారు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి, ఆ రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న గౌరవాన్ని చాటడానికి ఇదొక సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కాంజీవరం చీర ప్రత్యేకతలు..కాంజీవరం చీరలను దక్షిణ భారతదేశం నుంచి సేకరించిన స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో తయారు చేస్తారు. ఇందులో వాడే జరిలో వెండి తీగపై బంగారు పూత ఉంటుంది. దీనివల్ల చీర చాలా కాలం పాటు మెరుస్తూ ఉంటుంది. ఇందులో చీర, అంచు విడివిడిగా నేస్తారు. తర్వాత చాలా బలంగా వాటిని ‘కోర్వాయ్’ పద్ధతిలో జత చేస్తారు. ఒకవేళ చీర చిరిగినా అంచు మాత్రం చీర నుంచి విడిపోకుండా జాగ్రత్తపడుతారు.మూడు దారాల కలయికసాధారణ పట్టు చీరల కంటే ఇవి కొంచెం బరువుగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో మూడు పట్టు దారాలను కలిపి నేస్తారు. దీనివల్ల చీర చాలా మన్నికగా, దృఢంగా ఉంటుంది.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె.. -
బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతిని ఎందుకు కలవాలి?
దేశ ఆర్థిక దిశను నిర్దేశించే 2026-27 వార్షిక బడ్జెట్ సమర్పణకు సమయం దగ్గరపడింది. ‘డిజిటల్ బహీ-ఖాతా’తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కర్తవ్య భవన్ నుంచి బయలుదేరారు. పార్లమెంట్లో బడ్జెట్ చదవడానికి ముందు ఆమె నేరుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. రాజ్యాంగబద్ధంగా వస్తున్న ఈ ఆనవాయితీకి కారణాలేమిటి? సూట్‌కేస్ స్థానంలో వచ్చిన ‘డిజిటల్ బహీ-ఖాతా’ కథేంటి? వంటి వివరాలు మీకోసం..రాష్ట్రపతిని ఎందుకు కలుస్తారు?బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి రాష్ట్రపతిని కలవడం కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు. దీని వెనుక రాజ్యాంగ, సాంప్రదాయ కారణాలు ఉన్నాయి.రాజ్యాంగ నిబంధన (ఆర్టికల్ 112): భారత రాజ్యాంగం ప్రకారం, బడ్జెట్‌ను (వార్షిక ఆర్థిక నివేదిక) పార్లమెంట్లో ప్రవేశపెట్టే బాధ్యత నిజానికి రాష్ట్రపతిదే. రాష్ట్రపతి తరపున ఆర్థిక మంత్రి ఈ బాధ్యతను నిర్వహిస్తారు. అందుకే బడ్జెట్ ప్రసంగం చదవడానికి ముందు రాష్ట్రపతి నుంచి అధికారికంగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి.బడ్జెట్ అనేది ఒక ‘మనీ బిల్లు’. రాజ్యాంగం ప్రకారం ఏదైనా మనీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు సిఫార్సు అవసరం.సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతిని కలిసినప్పుడు ఆర్థిక మంత్రికి రాష్ట్రపతి ‘పెరుగు-చక్కెర’ తినిపిస్తారు. ఒక ముఖ్యమైన పనికి వెళ్లే ముందు ఇది దేశీయంగా ఒక శుభసూచకంగా భావిస్తారు.రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు చేరుకుని ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి (Cabinet) సమావేశంలో బడ్జెట్‌కు తుది ఆమోదం పొందుతారు.#WATCH | President Droupadi Murmu feeds Union Finance Minister Nirmala Sitharaman the customary 'dahi-cheeni' (curd and sugar) ahead of her ninth consecutive Union Budget presentation. pic.twitter.com/WouiznFEMr— ANI (@ANI) February 1, 2026ఏంటి ఈ ‘డిజిటల్ బహీ-ఖాతా’?బ్రిటిష్ హయాం నుంచి వస్తున్న ‘లెదర్ బ్రీఫ్‌కేస్’ సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ 2019లో నిర్మలా సీతారామన్ ‘బహీ-ఖాతా’ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది ఎర్రటి వెల్వెట్ క్లాత్‌తో చేసిన బ్యాగ్. దీనిపై బంగారు రంగులో మన జాతీయ చిహ్నం (అశోక చక్రం) ముద్రించి ఉంటుంది. 2021 నుంచి కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్‌ను పేపర్‌లెస్‌గా మార్చారు. ఇప్పుడు ఆ ఎర్రటి బహీ-ఖాతా లోపల కాగితపు పత్రాలకు బదులుగా ఒక డిజిటల్ టాబ్లెట్ ఉంటుంది.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె.. -
అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)
-
Budget 2026: ఊరటనిస్తారా? ఉసూరుమనిస్తారా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే 2026-27 కేంద్ర బడ్జెట్ (Union Budget 2026-27) గురించి చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆమె సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా నడిపించేందుకు ఈ బడ్జెట్ ఒక దిక్సూచిలా నిలవనుంది.ఈ నేపథ్యంలో నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఏడాది బడ్జెట్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.పన్ను చెల్లింపుదారులకు ఊరటమధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఎప్పుడూ ఆశించేది ఆదాయపు పన్ను రాయితీలు. ఈసారి కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు పన్ను స్లాబుల్లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం ఉన్న రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని మరింత పెంచే అవకాశం ఉంది.వివాహిత జంటలకు కలిపి ఒకే పన్ను రిటర్నులు దాఖలు చేసే వెసులుబాటు కల్పించడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించే దిశగా కొత్త ప్రతిపాదన రావొచ్చు.మౌలిక సదుపాయాల కల్పనగత కొన్ని బడ్జెట్ల మాదిరిగానే ఈసారి కూడా మూలధన వ్యయంపై ప్రభుత్వం భారీగా దృష్టి పెట్టనుంది.వందే భారత్ స్లీపర్ రైళ్ల విస్తరణ, అమృత్ భారత్ స్టేషన్ల ఆధునీకరణ, కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి భారీ కేటాయింపులు ఉండవచ్చు.వస్తు రవాణా ఖర్చులను తగ్గించడానికి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యత లభించనుంది.ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధిదేశంలో నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక్ష ఉపాధి ప్రోత్సాహక పథకాలను ప్రకటించే అవకాశం ఉంది.తయారీ రంగాన్ని ప్రోత్సహించి ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని మరిన్ని రంగాలకు విస్తరించవచ్చు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది.వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిగ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం బడ్జెట్లో కీలక అంశం కానుంది.చిన్న, సన్నకారు రైతులకు రుణ పరిమితి పెంపు, మహిళా రైతులకు ప్రత్యేక రాయితీలు ఆశించవచ్చు.వ్యవసాయ రంగంలో సాంకేతికతను జోడించి ఉత్పాదకతను పెంచేందుకు ‘అగ్రి-టెక్’ స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఉండవచ్చు.గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలుపర్యావరణ హిత ఇంధనాల వైపు మళ్లడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి.ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గించేలా బ్యాటరీ తయారీపై పన్ను రాయితీలు, చార్జింగ్ స్టేషన్ల విస్తరణపై ప్రకటనలు వెలువడవచ్చు.నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు మరిన్ని నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది.ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి?ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కొత్త రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు లేదా ప్రత్యేక ప్యాకేజీల ప్రకటనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె.. -
గ్రేటర్ నగరంపై నిర్మలమ్మ కరుణ చూపేనా?
గ్రేటర్ నగరానికి ఊతం.. పెండింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.. సుస్థిర ఆర్థిక వృద్ధికి సాయం.. ఇలా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌పై మహా నగరం ఎన్నో ఆశలు పెట్టుకుంది. బల్దియా పరిధిలో అభివృద్ధి పథకాలకు ఆసరా కలిగించేలా నిర్మలమ్మ కరుణ చూపుతారని అంతా ఆశిస్తున్నారు. జీహెచ్ఎంసీ, జలమండలి, జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళికలో మూసీ నది భాగస్వామ్యం, మెట్రో, ఎంఎంటీఎస్, హెచ్ఎండీఏ.. ఇలా వివిధ విభాగాల్లో ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేలా.. నిధులు భారీగా విదిలించేలా ‘ఆశల పద్దు’పై ఈ పొద్దు ఎంతో ఉత్కంఠగా గ్రేటర్ నగరం ఎదురు చూస్తోంది. బల్దియా విన్నపాలు వినవలె..గత ఆర్థిక సంవత్సరం కేంద్రంపై ఆశలతో రూ.10,500 కోట్ల నిధులివ్వాలని విజ్ఞాపనలు చేసిన జీహెచ్ఎంసీ ఓవైపు వాటి కోసం ఎదురు చూస్తూనే.. మరోవైపు, కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.719 కోట్లు రాగలవనే ఆశలు పెట్టుకుంది. ఆ ఆశతోనే జీహెచ్ఎంసీ కొత్త బడ్జెట్ (2026–27)లో కేటాయింపులు చేసింది. ఘనవ్యర్థాల నిర్వహణ కోసం రూ.279 కోట్లు, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం పనులకు రూ.140 కోట్లు, పేదల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు, ప్రత్యేక ఆర్థిక సహకారంగా రూ.200 కోట్లు కేంద్రం నుంచి ఆశిస్తోంది.జలమండలికి కావాలి రూ.49,196 కోట్లు మహా నగర తాగునీటి అవసరాలు, మురుగునీటి పారుదల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు జలమండలి కేంద్ర బడ్జెట్‌పై పెట్టుకుంది. ప్రస్తుతం కేంద్రం వద్ద సుమారు రూ.49,196 కోట్ల విలువైన తొమ్మిది పథకాల ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్లో అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాల కింద నిధులు మంజూరు కావాల్సి ఉంది.గ్రీన్‌ఫీల్డ్ రోడ్లకు నిధులిస్తారా? హెచ్ఎండీఏ పరిధిలోని సుమారు 10,050 చ.కి.మీ పరిధిలో రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన దృష్టి సారించారు. వివిధ చోట్ల 10 గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. వీటి నిర్మాణానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.4,5000 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా.ఈ మేరకు కేంద్రం నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మూసీ మురిసేనా..? జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళికలో మూసీ నదిని భాగస్వామ్యం చేయాలని.. రూ.3,188 కోట్లు అందించాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ప్రాథమిక ప్రాజెక్ట్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమరి్పంచింది. కేంద్రంపై పెట్టుకున్న ఆశలు ప్రస్తుత బడ్జెట్లో నెరవేరుతాయో లేదో చూడాలి. రెండో దశకు రెక్కలొచ్చేనా?మెట్రో రెండో దశలో ‘ఎ’, ‘బి’ విభాగాల కింద విస్తరించనున్న 8 కారిడార్ల నిర్మాణం కోసం కేంద్రం వాటా 50 శాతం నిధులను అందజేయాల్సి ఉంది. రెండో దశలో చేపట్టనున్న 76.4 కి.మీ మొదటి 5 లేన్ల నిర్మాణం కోసం రూ.24,269 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ‘బి’ విభాగం కింద మూడు మార్గాల్లో నిర్మించనున్న 86.1 కి.మీ కారిడార్లకు మరో రూ.19,759 కోట్లతో అంచనాలను రూపొందించారు. మెట్రో విస్తరణకు మాత్రం కేంద్రం నిధులను విడుదల చేయకపోవడమే కాకుండా సాంకేతిక కారణాల దృష్ట్యా రెండో దశ ప్రాజెక్టును పక్కన ఎంఎంటీఎస్, చర్లపల్లి టెరి్మనల్ కనెక్టివిటీలకు బ్రేక్.. కొత్త లైన్లతో పాటు 9 బోగీలతో కూడిన ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నడపాలనే ప్రతిపాదన ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క రైలు కూడా పట్టాలెక్కలేదు. అలాగే.. చర్లపల్లి టెర్మినల్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా పునరభివృద్ధి చేసినప్పటికీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంఎంటీఎస్, సిటీబస్ కనెక్టివిటీ అరకొరగానే ఉంది. గత ఏడాది బడ్జెట్లో యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపునకు రూ.10 కోట్లు కేటాయించినా.. ఈ ప్రాజెక్టు ముందుకు సాగడంలేదు. నిధులు, వనరులు, భూమి, మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతోంది. రైల్వేశాఖ రూ.60 కోట్లు కేటాయించినా పనులు ప్రారంభించలేదు.తెలంగాణ సంపర్క్ క్రాంతి పట్టాలెక్కేనా?ఏళ్లుగా ఎదురు చూస్తున్న తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఈసారి కేంద్రం పచ్చజెండా ఊపనుందా...ఇప్పటికే రైల్వేబోర్డు ప్రతిపాదనల్లో ఉన్న ఈ ట్రైన్‌కు ఈ బడ్జెట్లో ఆమోదం లభించనుందా.. రైల్వేవర్గాలు అందుకు అవుననే చెబుతున్నాయి. -
బడ్జెట్ రచయితలు వీరే..
భారత ఆర్థిక ముఖచిత్రాన్ని నిర్దేశించే కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పిస్తున్న మంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ బడ్జెట్ రూపకల్పన వెనుక ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, వృద్ధిని సమతుల్యం చేస్తూ ఒక శక్తివంతమైన అధికారుల బృందం గత కొన్ని నెలలుగా శ్రమించింది.బడ్జెట్ వెనుక ఉన్న వ్యక్తులునిర్మలా సీతారామన్ (కేంద్ర ఆర్థిక మంత్రి): బడ్జెట్ రూపకల్పనకు దిశానిర్దేశం చేస్తూ భారత ఆర్థిక విధానాలను ప్రపంచ వేదికపై శక్తివంతంగా నిలుపుతున్న నాయకురాలు.అనురాధ్ ఠాకూర్ (ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి): బడ్జెట్ తయారీలో ఈమె అత్యంత కీలక పాత్ర పోషించారు. వనరుల కేటాయింపు, వృద్ధి ప్రాధాన్యతలు, బడ్జెట్ పత్రాల తుది రూపకల్పనలో ఈమెది ప్రధాన నిర్ణయం.ఆర్వింద్ శ్రీవాస్తవ (రెవెన్యూ కార్యదర్శి): బడ్జెట్లోని పన్నుల ప్రతిపాదనల బాధ్యతను ఈయన పర్యవేక్షించారు. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ, కస్టమ్స్ సుంకాల మార్పులపై కీలకంగా వ్యవహరించారు.ఉమ్లున్మాంగ్ ఉల్నమ్ (వ్యయ కార్యదర్శి): ప్రభుత్వ ఖర్చులు, వివిధ పథకాలకు సబ్సిడీల కేటాయింపులను సమన్వయం చేస్తూ నిధుల దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించారు.ఎం.నాగరాజు (ఆర్థిక సేవల కార్యదర్శి): బ్యాంకింగ్ రంగం బలోపేతం, బీమా, పెన్షన్ వ్యవస్థల వృద్ధిపై దృష్టి సారించారు.అరునిష్ చావ్లా (దీపమ్ కార్యదర్శి): ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా పన్నేతర ఆదాయాన్ని సమకూర్చే బాధ్యతను నిర్వహించారు.కె.మోసెస్ చాలై (పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కార్యదర్శి): కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, వాటి మూలధన వ్యయాన్ని పర్యవేక్షించారు.వి.అనంత నాగేశ్వరన్ (ప్రధాన ఆర్థిక సలహాదారు): అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తూ దేశీయ వృద్ధి రేటు అంచనాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.ప్రధాన లక్ష్యాలు.. వ్యూహాలుఈ బడ్జెట్ ప్రధానంగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక లోటు నియంత్రణ మధ్య సమతుల్యతను సాధించడంపై దృష్టి సారించనుందని అంచనాలున్నాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పాదక రంగం వృద్ధి, భారీ స్థాయిలో ఉద్యోగ సృష్టికి ఈ బడ్జెట్ పెద్దపీట వేస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
Budget 2026 Updates: కేంద్ర బడ్జెట్ 2026-27 లైవ్ అప్డేట్స్
Budget 2026 Live Updates: 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' ఈ రోజు (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా సీతారామన్‌కు ఇది రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయింపులు చేయనున్నారు. -
బడ్జెట్ క్వీన్ సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్‌ను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. తద్వారా చరిత్ర సృష్టించనున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఎవరూ వరుసగా తొమ్మిది బడ్జెట్లను సమర్పించలేదు. మొరార్జీ దేశాయ్ మొత్తంగా 10 బడ్జెట్లను ప్రవేశపెట్టినప్పటికీ అవి వివిధ కాలాల్లో చోటుచేసుకున్నవే. ఆయన 1959 నుంచి 1964 వరకు ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరు బడ్జెట్లు సమర్పించారు. తిరిగి 1967–1969 మధ్య నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టారు.మాజీ ఆర్థిక మంత్రులైన పి.చిదంబరం తొమ్మిది, ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లు సమర్పించారు. అది కూడా వివిధ ప్రధాన మంత్రుల కాలంలో. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ 1991 నుంచి 1995 వరకు ఆర్థిక మంత్రిగా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కానీ నిర్మలా సీతారామన్ ప్రధాని మోదీ సారథ్యంలో వరుసగా తొమ్మిదో బడ్జెట్‌తో రికార్డు సృష్టించనున్నారు. 2019లో కేంద్రంలో రెండోసారి ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సీతారామన్ మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆమె చేతుల మీదుగానే బడ్జెట్ ప్రయాణం సాగిపోతోంది. 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌తో కలిపి ఇప్పటివరకు ఎనిమిది బడ్జెట్లను అందించారు. ⇒ స్వాతంత్య్రానంతరం మొదటి బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న దేశ తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి సమర్పించారు. ⇒ అత్యధిక సమయంపాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన ఆర్థిక మంత్రి రికార్డు నిర్మలా సీతారామన్ పేరిటే ఉంది. 2020 ఫిబ్రవరి 1న ఆమె రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించారు. ⇒ అతితక్కువ బడ్జెట్ ప్రసంగం 1977 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా హీరూభాయ్ ముల్లిజ్భాయ్ పేరిట ఉంది. కేవ లం 800 పదాలతో ఆయన బడ్జెట్ ప్రసంగం ముగించారు. ⇒ ఫిబ్రవరి చివర్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీని మోదీ సర్కారు 2017 నుంచి ఫిబ్రవరి 1కి మార్చింది. -
ఈసారైనా కరుణించేనా..?
2024 – 25 కేంద్ర బడ్జెట్లో అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల అప్పు తప్ప రాష్ట్రానికి ఒనగూరిందేమీ లేదు. నిర్మలమ్మ వరాలన్నీ బీహార్‌కు ఇచ్చేస్తే సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు మౌనం వహించారు. కీలకమైన కేకే రైల్వే లైన్ లేకుండానే విశాఖ జోన్ ఏర్పాటు చేసేస్తున్నా నోరు మెదపలేకపోతున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులూ మౌనం వహిస్తున్నారు. కీలకమైన కేకే లైన్‌తో కూడిన జోన్ ఏర్పాటుకు కేంద్రాన్ని డిమాండ్ చేయలేకపోతున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నేటికీ కేంద్ర పెద్దల నుంచి స్పష్టత సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. తరచూ ఢిల్లీ వెళ్తున్నా కేసుల ఎత్తివేతపైనే శ్రద్ధ పెడుతున్నారు తప్పా రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వైపు ఏపీ ప్రజానీకం ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొండిచేయి చూపిన నిర్మలమ్మ... ఈ సారైనా రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు అవసరమైన నిధులు కేటాయించి, కొత్త వరాలేమైనా ఇస్తారేమోనని ఉత్కంఠతో ఉన్నారు. తన వల్లే కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు కాపాడడంలో, నిధులు సాధించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. గతేడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. అమరావతి కోసం అప్పు తప్ప సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు ఏమీ సాధించలేకపోయారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు నిత్యం ఢిల్లీ వచ్చి వెళ్తున్నా ఏపీకి ఒరిగింది శూన్యం. ఇప్పటి వరకు ప్రత్యేక విమానాల్లో 27 సార్లు ఢిల్లీకి వచ్చి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అయినా నిధులు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ తన అనుకూల ఎల్లో మీడియాను పిలిపించుకోవడం... తనకు తోచింది చెప్పి డప్పు కొట్టించుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. రాష్ట్రానికి అది వచ్చేస్తోంది... ఇది వచ్చేస్తోంది అంటూ బాబు లీకులివ్వడం... వాటిని పట్టుకుని ఎల్లో మీడియా డప్పు కొట్టడం... ఇంతకు మించి రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనాలేం లేవని మేధావులు, విద్యావంతులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. -
సవాళ్లపై సవారీ!
అమెరికా టారిఫ్‌లు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, ద్రవ్యోల్బణం ఓవైపు.. జీడీపీ వృద్ధి మందగమనం, ప్రపంచ దేశాల్లో అనిశి్చతితో రూపాయి పతనం, భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు, ఉపాధిని మింగేస్తున్న ఏఐ ద్వారా ఎదురవుతున్న సవాళ్లు మరోవైపు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం మరికొన్ని గంటల్లో 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. నేటి బడ్జెట్ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా, యువతకు ఉత్సాహాన్ని కలిగించేలా, మౌలిక రంగాలను మెరిపించేలా గేమ్ చేంజింగ్ విధానాలతో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు బడ్జెట్లో నజరానాలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. తయారీ నుంచి మౌలిక సదుపాయాల వరకు.. ఉద్యోగ సృష్టి నుంచి గ్రామీణాభివృద్ధి వరకు.. పునరుత్పాదక శక్తి నుంచి డిజిటల్ ఆవిష్కరణల వరకు.. దేశ ఆర్థిక ఇంజన్‌ను నడిపించే అనేక వ్యూహాత్మక విధానాలను కేంద్రం ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే వృద్ధి వేగాన్ని కొనసాగించడంతోపాటు ఆర్థిక వ్యవస్థను రక్షించే సంస్కరణలను ఈ బడ్జెట్ చేపడుతుందని భావిస్తున్నారు. న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి పార్లమెంటులో 2026–27 బడ్జెట్‌ను ప్రవేపెట్టనున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెడుతుండటం విశేషం. కేంద్రం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఐటీ, జీఎస్టీ శ్లాబుల్లో తీసుకొచి్చన విప్లవాత్మక మార్పులకు తోడు మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటివి ఇప్పటివరకు అమెరికా సుంకాలను తట్టుకోవడానికి దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి కేంద్రం సరికొత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. సవాళ్లు ఎన్నో.. ఈసారి కేంద్ర బడ్జెట్ ఎన్నో సంక్లిష్ట పరిస్థితుల మధ్య వస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అస్థిరంగా మారిన కమోడిటీల ధరలు, ప్రధాన బ్యాంకులు అనుసరించిన ద్రవ్య విధానాల వంటి సమస్యలు దేశ ఆర్థిక వ్యవస్థను కమ్ముకున్నాయి. దేశీయంగా ఆర్థిక లోటును తగ్గించుకుంటూనే వినియోగాన్ని పెంచడం, ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడం, మూలధన వ్యయాన్ని పెంచాలన్న ఒత్తిళ్లను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అయితే పన్ను తగ్గింపుల వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గడం వల్ల కొత్త బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్రానికి ఉన్న అవకాశాలను పరిమితం చేసింది. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశి్చత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సరికొత్త ఆర్థిక వృద్ధి చోదకాన్ని కనుగొనడం నిర్మలా సీతారామన్‌కు అతిపెద్ద సవాల్ కానుంది. అమెరికాతో వాణిజ్య చర్చలపై అనిశ్చితి కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీలను విక్రయిస్తుండటం, రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడంతో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం కూడా ఆమె ముందున్న మరో కష్టతరమైన లక్ష్యమని ఆర్థికవేత్తలు అంటున్నారు. బడ్జెట్ టీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. చిత్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కొన్ని ఊరటలు..⇒ కేంద్రం ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ధరల పెంపు భారాన్ని వినియోగదారులపై వేయకుండా అంతర్గతంగా సర్దుబాటు చేసుకొనే అవకాశం ఉంది. ⇒ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బెంగాల్, తమిళనాడు, కేర ళ, అస్సాం రాష్ట్రాలకు కొత్త పథకాలను ప్రకటించొచ్చు. ⇒ రైల్వే, పునరుత్పాదక ఇంధన, పట్టణ రవాణా రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ మూలధన వ్యయం పెరగొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ⇒ పన్నుల విషయంలో పెద్ద మార్పులు ఉండే అవకాశం లేదు. కార్పొరేట్ పన్ను రేట్లు మారకపోవచ్చు. ⇒ ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత లభించనుంది. నైపుణ్యాభివృద్ధి, తయారీ రంగాలకు ప్రోత్సాహకాలు ఉండవచ్చు. ⇒ పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఈవీ రంగాలకు మరింత చేయూత అందించే అవకాశం ఉందని అంచనా. ⇒ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బడ్జెట్ కేటయింపులు పెంచడమో లేదా క్రెడిట్ గ్యారెంటీలు ఇవ్వడమో ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మొత్తంగా నిర్మలమ్మ బడ్జెట్ పద్దు ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా వృద్ధిని కొనసాగించడమే లక్ష్యంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎస్బీఐ రీసెర్చ్ ఆర్థికవేత్తల అంచనా ప్రకారం ప్రభుత్వ మూలధన వ్యయం రూ. 12 లక్షల కోట్లు దాటొచ్చు. బడ్జెట్ క్వీన్ సీతారామన్దేశ చరిత్రలో వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రిగా రికార్డుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్‌ను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. తద్వారా చరిత్ర సృష్టించనున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఎవరూ వరుసగా తొమ్మిది బడ్జెట్లను సమర్పించలేదు. మొరార్జీ దేశాయ్ మొత్తంగా 10 బడ్జెట్లను ప్రవేశపెట్టినప్పటికీ అవి వివిధ కాలాల్లో చోటుచేసుకున్నవే. ఆయన 1959 నుంచి 1964 వరకు ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరు బడ్జెట్లు సమర్పించారు. తిరిగి 1967–1969 మధ్య నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మాజీ ఆర్థిక మంత్రులైన పి.చిదంబరం తొమ్మిది, ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లు సమర్పించారు. అది కూడా వివిధ ప్రధాన మంత్రుల కాలంలో. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ 1991 నుంచి 1995 వరకు ఆర్థిక మంత్రిగా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కానీ నిర్మలా సీతారామన్ ప్రధాని మోదీ సారథ్యంలో వరుసగా తొమ్మిదో బడ్జెట్‌తో రికార్డు సృష్టించనున్నారు. 2019లో కేంద్రంలో రెండోసారి ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సీతారామన్ మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆమె చేతుల మీదుగానే బడ్జెట్ ప్రయాణం సాగిపోతోంది. 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌తో కలిపి ఇప్పటివరకు ఎనిమిది బడ్జెట్లను అందించారు. ⇒ స్వాతంత్య్రానంతరం మొదటి బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న దేశ తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి సమర్పించారు. ⇒ అత్యధిక సమయంపాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన ఆర్థిక మంత్రి రికార్డు నిర్మలా సీతారామన్ పేరిటే ఉంది. 2020 ఫిబ్రవరి 1న ఆమె రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించారు. ⇒ అతితక్కువ బడ్జెట్ ప్రసంగం 1977 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా హీరూభాయ్ ముల్లిజ్భాయ్ పేరిట ఉంది. కేవ లం 800 పదాలతో ఆయన బడ్జెట్ ప్రసంగం ముగించారు. ⇒ ఫిబ్రవరి చివర్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీని మోదీ సర్కారు 2017 నుంచి ఫిబ్రవరి 1కి మార్చింది. నేరుగా ‘బడ్జెట్’ను వీక్షించనున్న 30 మంది విద్యార్థులుకేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెట్టనున్న 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను కళాశాల విద్యార్థులు లోక్‌సభ గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక అవకాశం కల్పించింది. అలాగే ఆర్థిక శాఖ కార్యకలాపాలపై వారికి అవగాహన కల్పించడంతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది కళాశాల విద్యార్థులు ఆదివారం బడ్జెట్‌ను నేరుగా వీక్షిస్తారు. అలాగే ఆర్థిక శాఖ కార్యాలయం ఉన్న కర్తవ్య భవన్–1ను సందర్శించి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ శాఖ కార్యకలాపాలు, విధానాల రూపకల్పన, సంస్థల పాత్ర గురించి తెలుసుకోనున్నారు. ఆదివారం సాయంత్రం ఆర్థిక మంత్రి ఆయా విద్యార్థులతో ముచ్చటించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యకలాపాలు, ప్రభుత్వ పరిపాలన, ప్రజాస్వామిక ప్రక్రియల గురించి అవగాహన కల్పించడంతోపాటు యువతను అందులో భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆర్థిక శాఖ తెలిపింది. -
నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి) రాయని డైరీ
మంచి టీమ్‌కి హెడ్‌గా ఉండటం, మంచి హెడ్ కింద టీమ్‌లో ఉండటం, రెండూ ఒకే విధమైన బాధ్యతలు! టీమ్‌లోని వాళ్లు టీమ్‌లో ఉంటూనే హెడ్‌గా పని చేయాలి, హెడ్‌గా ఉన్నవాళ్లు హెడ్‌గా ఉంటూనే టీమ్‌లో పని చేయాలి. అప్పుడే మంచి హెడ్, మంచి టీమ్ తయారవుతారు! మునుపటి 8 బడ్జెట్లు కూడా నాకు ఇదే నేర్పించాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నా 9వ బడ్జెట్. ఆర్థిక మంత్రిగా మాత్రమే ఇది నా బడ్జెట్. అసలు కసరత్తంతా నా టీమ్‌ది. కనుక, బడ్జెట్ సమర్పణ కూడా అదృశ్యంగా నా టీమ్‌దే అవుతుంది. సెక్రెటరీలు ఆరుగురు, అడ్వైజర్ ఒకరు... మొత్తం ఏడుగురు అపర చాణక్యులు!బడ్జెట్లో ఏముందో ఇంకొన్ని గంటల్లో దేశ ప్రజలకు తెలిసిపోతుంది. బడ్జెట్‌ను తయారు చేయటంలో నా టీమ్ కష్టం ఎంతుందో చెప్పాలంటే మాత్రం అది బడ్జెట్ ప్రసంగాన్ని మించిన ప్రసంగమే అవుతుంది! టీమ్‌లోని అనురాధా ఠాకూర్ ఎకనమిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ. బడ్జెట్ రూమ్‌లోకి ప్రవేశించిన తొలి మహిళ! నేటి బడ్జెట్‌కు ప్రాథమిక రూపశిల్పి. హల్వాను అడుగంటకుండా ఉడికించటంలోని వివిధ స్థాయుల సన్నని మంటల గురించి తెలిసిన నిపుణురాలు. ఇంట్లో మనుషుల్ని కదిలించకుండానే ఇంటి గదుల్ని, గోడల్ని పునర్నిర్మించగల నేర్పరి.అజయ్ సేuЇ ఫైనాన్స్ సెక్రెటరీ. గ్రాండ్ మాస్టర్! బడ్జెట్ టీమ్‌లోని సెక్రెటరీలందరికీ కెప్టెన్. ‘ఆర్థిక లోటు’ వార్నింగ్ సిగ్నల్ ఎర్రగా వెలిగి ఆరిపోతున్నా కూడా చలించని శాంత మనస్కుడైన పైలట్! అరవింద్ శ్రీవాత్సవ రెవిన్యూ సెక్రెటరీ. బడ్జెట్లో కొత్త ముఖం. ముక్కులుపిండకుండా, బుగ్గలు పుణికి పన్నులు వసూలు చేయగల టాక్స్ కలెక్టర్. బడ్జెట్ స్పీచ్‌లో పార్ట్–బి ఆయనదే. పన్నుల పెంపు, తగ్గింపు ఉండేది ఆ పార్ట్‌లోనే. డిన్నర్ బిల్లుని సమానంగా పంచే ధర్మరాజు. ఒకరెవరైనా అదనంగా ఆర్డర్ చేసి ఉంటే, వారికి అదనంగా ‘వడ్డించే’ నియమబద్ధుడు.ఉమ్లున్మాంగ్ ఉవల్నామ్ ‘ఎక్స్పెండిచర్’ సెక్రెటరీ. ప్రభుత్వాన్ని దేనినీ కొననివ్వరు. ఏం అడిగినా సరే, ‘ఇప్పుడు కాదు బాస్’ అనేస్తారు.అనంత నాగేశ్వరన్ ఛీఫ్ ఎకనమిక్ అడ్వైజర్. డేటా డిటెక్టివ్. సంక్లిష్టమైన ప్రపంచ గందరగోళాన్ని ‘ఆర్థిక సర్వే’గా అనువదిస్తారు. గాలివానలు సహాయకరంగా ఉంటాయా, లేక మనం తుపానులోకి వెళ్లబోతున్నామా అన్నది ఆర్థిక శాఖకు చెబుతారు. వర్షం వచ్చే ముందు మీ గొడుగు విరిగిపోయిందన్న విషయాన్ని కూడా కచ్చితంగా మీకు గుర్తు చేస్తారు.నాగరాజు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రెటరీ. బ్యాంకుల వైద్యుడు. బ్యాంకుల ఆరోగ్యాన్ని పరిరక్షించటం కోసం, మీరు ‘టీ’ తాగి చేసిన డిజిటల్ చెల్లింపులు లోప భూయిష్ఠంగా లేకుండా చూసుకునేది ఆయనే. అరుణిష్ చావ్లా ఇన్వెస్ట్మెంట్లు, పబ్లిక్ అసెట్ల కార్యదర్శి. ప్రభుత్వ కంపెనీల వాటాల కోసం కొనుగోలుదారులను వెతికి పెడతారు. వెతికి పడతారు. ఆయనొక ఇ–బే వేలం పవర్ సెల్లర్. ప్రభుత్వానికి లాభం వస్తుందంటే ఎవరి చేతనైనా ఏదైనా కొనిపించేస్తారు.నిజంగా, ఎంత గొప్ప టీమ్! కాకపోతే, ఇలాంటి టీమ్ ఉన్న ప్రతి లీడర్కీ ఎదురయ్యే సమస్య ఒకటే. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి ఇడ్లీ, వడ మాత్రమే అయినా ఆ రెండిట్లోంచి కూడా ఒక దానిని ఎంపిక చేసుకోలేక సతమతం అవటానికి తగినంత సమయాన్నింకా చేతిలో మిగిల్చే ఉంచుతారు! నాదీ ఇప్పుడు అటువంటి సమస్యే. ఏ కలర్ శారీ బాగుంటుందా అని ఆలోచిస్తూ, తెరిచి ఉన్న అల్మరా ముందు నిలబడి పోవటం అన్నది నాకు ఏనాడూ సమయం దొరకని పని. కానీ ఇవాళ నా టీమ్ నా చేత ఆ పనిని చేయించబోతున్నట్లే ఉంది! -
8 బడ్జెట్లు.. 8 చీరలు.. దేని స్పెషాలిటీ దానిదే!
కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే రోజున దేశమంతా వివిధ శాఖలకు కేటాయింపుల గురించి చర్చించుకుంటుంటే ఫ్యాషన్ ప్రియులు, చేనేత వస్త్రాల ప్రేమికులు మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరపై దృష్టి సారిస్తున్నారు. ఏటా ఆమె ధరించే చీర భారతీయ సంస్కృతిని, వైవిధ్యాన్ని చాటిచెప్పడమే కాకుండా దేశీయ చేనేత కళాకారులకు ఇచ్చే గౌరవంలా కనిపిస్తుంది. ఈ కథనంలో గడిచిన ఎనిమిది బడ్జెట్ సెషన్లలో (2019 నుంచి 2025 వరకు) నిర్మలమ్మ ధరించిన చీరల ప్రత్యేకతలు తెలుసుకుందాం.2019: మంగళగిరి చేనేత వైభవంతొలి బడ్జెట్ ప్రసంగం కోసం నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగళగిరి చేనేత చీరను ఎంచుకున్నారు. బంగారు రంగు అంచు ఉన్న ఈ గులాబీ రంగు చీర ఆరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.2020: కంచి పట్టు సంప్రదాయంరెండో బడ్జెట్ సమయంలో ఆమె దక్షిణ భారత దేశ సంప్రదాయానికి నిలువుటద్దమైన కంచి పట్టు చీరలో మెరిశారు. పవిత్రతకు, శ్రేయస్సుకు సూచిక అయిన పసుపు రంగు చీరను ధరించి సభలో హుందాతనాన్ని చాటారు.2021: పోచంపల్లి ఇక్కత్ కళతెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరను 2021 బడ్జెట్ సందర్భంగా ఆమె ధరించారు. ఎరుపు, ఆఫ్-వైట్ కలయికతో ఉన్న ఈ చీరపై ఉన్న ఆకర్షణీయమైన గ్రీన్ బోర్డర్ దేశీయ చేనేత కళాకారుల ప్రతిభను ప్రతిబింబించింది.2022: బొంకాయ్ సిల్క్ఒడిశా రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ బొంకాయ్ శైలి చీరను 2022లో ఆమె ఎంచుకున్నారు. రస్ట్ బ్రౌన్ రంగులో ఉండి మెరూన్ బోర్డర్, సిల్వర్ జరీతో ఉన్న చీరను ధరించారు.2023: కసూతి ఎంబ్రాయిడరీ2023 బడ్జెట్ రోజున కర్ణాటక సంస్కృతిని ప్రతిబింబించే కసూతి ఎంబ్రాయిడరీ చీరలో ఆమె కనిపించారు. ఎరుపు రంగు చీరపై నలుపు రంగు టెంపుల్ బోర్డర్, చేతితో అల్లిన ప్రత్యేకమైన కసూతి వర్క్ ఆకర్షణీయంగా నిలిచింది.2024 (మధ్యంతర బడ్జెట్): బెంగాల్ కాంతా వర్క్2024 ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కోసం ఆమె పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంతా ఎంబ్రాయిడరీ ఉన్న ఇండిగో బ్లూ రంగులో ఉన్న సిల్క్ చీరను ధరించారు. ‘రామా బ్లూ’గా పిలిచే ఈ రంగు ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని సూచించింది.2024 (పూర్తి స్థాయి బడ్జెట్): మంగళగిరి పట్టు పునరావృతంమరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ఆమె మళ్లీ మంగళగిరి పట్టు చీరను ఎంచుకున్నారు. ఆఫ్-వైట్ రంగులో ఉండి పర్పుల్, గోల్డ్ బోర్డర్ ఉన్న చీరను ధరించారు.2025: మధుబని చిత్రకళా సౌరభం2025 బడ్జెట్ సెషన్లో బిహార్‌కు చెందిన సుప్రసిద్ధ మధుబని పెయింటింగ్ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీమ్ కలర్ సిల్క్ చీరపై పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి స్వయంగా వేసిన చిత్రకళతో ఈ చీర రూపొందించారు. -
మరో రికార్డ్ క్రియేట్ చేయబోతున్న FM నిర్మల సీతారామన్
-
కేంద్రం ఫోకస్ ఇదే..! భార్యాభర్తల కోసం ప్రత్యేక జాయింట్ ట్యాక్స్
-
GST 2.0పై గంపెడు ఆశలు.. EV లపై భారీ రాయితీ..?
-
కేంద్ర బడ్జెట్ 2026-27: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..
దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026-27కు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వ మూడో విడత పాలన, అంతర్జాతీయ అనిశ్చితులు, యూఎస్ టారిప్‌లు, వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ఇది కీలకమైన బడ్జెట్ కావడంతో సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరి కళ్లు ఆర్థిక మంత్రి ప్రసంగంపైనే ఉన్నాయి.ఆశలు.. ఆకాంక్షలుద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఆదాయపు పన్ను మినహాయింపులు, స్టాండర్డ్ డిడక్షన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు చిరువ్యాపారులు, ఇటు బడా కార్పొరేట్ సంస్థలు కూడా తమ రంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్‌తో ఆర్థిక మంత్రి తన తొమ్మిదో బడ్జెట్ ప్రసంగాన్ని సుదీర్ఘ సమయంపాటు చదివి కొత్త రికార్డును సృష్టిస్తారని కొందరు భావిస్తున్నారు.రికార్డు ప్రసంగాలుభారత బడ్జెట్ చరిత్రలో ప్రసంగాలకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ప్రసంగ సమయంలో కొందరు మంత్రులు కవితలతో ఆకట్టుకుంటే మరికొందరు గంటల తరబడి గణాంకాలతో వివరిస్తారు.బడ్జెట్ ప్రసంగం నిడివి పరంగా నిర్మలా సీతారామన్ పేరిట రికార్డు ఉంది. 2020 బడ్జెట్ సమయంలో ఆమె 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు సృష్టించారు. 2019లో ఆమె నెలకొల్పిన 2 గంటల 19 నిమిషాల రికార్డును ఆమె మళ్లీ తిరగరాశారు. అంతకుముందు ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ (2003లో 2 గంటల 13 నిమిషాలు), అరుణ్ జైట్లీ (2014లో 2 గంటల 10 నిమిషాలు) సుదీర్ఘ ప్రసంగాలు చేశారు.పదాల పరంగా మన్మోహన్ సింగ్ రికార్డుప్రసంగంలోని పదాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చిన 1991 బడ్జెట్ ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. లైసెన్స్ రాజ్ చట్టానికి స్వస్తి పలికి ఆర్థిక సరళీకరణకు బాటలు వేసిన ప్రసంగం ఇది.సంక్షిప్త ప్రసంగం1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరూభాయ్ ఎం. పటేల్ కేవలం 800 పదాలతో తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఇది భారత చరిత్రలోనే అతి తక్కువ నిడివి గల ప్రసంగం. 2024 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ కేవలం 60 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించి తన శైలికి భిన్నంగా వ్యవహరించారు.ఈసారి ఏం జరగబోతోంది?దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును స్థిరంగా ఉంచుతూనే సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చే నిర్ణయాలను నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రసంగంతో అన్ని ఊహాగానాలకు తెరపడనుంది.ఇదీ చదవండి: సీనియర్ సిటిజన్లకు తీపి కబురు? -
బడ్జెట్: బ్రీఫ్‌కేస్ నుంచి టాబ్లెట్ వరకు ఇలా..
యూనియన్ బడ్జెట్ అనేది భారతదేశంలో కేవలం ఆదాయ-వ్యయాల లెక్కలు మాత్రమే కాదు. అది దేశ ఆర్థిక దిశను సూచించే ముఖ్యమైన పత్రం. అయితే స్వాతంత్య్రం రాకముందు ప్రారంభమైండ్ ఈ బడ్జెట్లో.. పార్లమెంటులో సమర్పించే విధానంలో కూడా కాలక్రమేణా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకెళ్లిన ఆర్థిక మంత్రులు, నేడు టాబ్లెట్ ద్వారా పూర్తిగా కాగిత రహితంగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న చరిత్ర, ఆలోచన, ఆధునికత మొదలైన విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.తొలినాళ్లలో.. భారతదేశపు తొలి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి బడ్జెట్ పత్రాలను బ్రీఫ్‌కేస్‌లో పార్లమెంటుకు తీసుకెళ్లారు. ఈ బ్రీఫ్‌కేస్ బ్రిటిష్ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. బ్రిటన్‌లో అప్పటి ఆర్థిక మంత్రి విలియం ఎవార్ట్ గ్లాడ్‌స్టోన్ ఉపయోగించిన “గ్లాడ్‌స్టోన్ బాక్స్”కు అనుకరణగా ఇది ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ సంప్రదాయం అలాగే కొనసాగింది. దశాబ్దాల పాటు చాలామంది ఆర్థిక మంత్రులు తమ బడ్జెట్ ప్రసంగానికి బ్రీఫ్‌కేస్‌తోనే వెళ్లడం ఆనవాయితీగా మారింది.ఇదీ చదవండి: 2019 నుంచి 2025 వరకు: 8 బడ్జెట్లు.. 13 గంటలు!కాలం మారింది.. ఆలోచనలు మారాయి. 2019లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బ్రీఫ్‌కేస్ సంప్రదాయానికి ముగింపు పలికారు. బ్రీఫ్‌కేస్ స్థానంలో భారతీయ సంప్రదాయానికి ప్రతీక అయిన 'బహి ఖాతా'ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 2021లో సీతారామన్ పూర్తిగా కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 'మేడ్ ఇన్ ఇండియా' టాబ్లెట్‌ను ఉపయోగించి బడ్జెట్ పత్రాలను డిజిటల్ రూపంలో పార్లమెంటుకు సమర్పించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ టాబ్లెట్‌ను కూడా బహి ఖాతా ఆకృతిని తలపించే ఎరుపు రంగు కవర్లో తీసుకెళ్లడం విశేషం. ఇది సంప్రదాయం & ఆధునికత కలయికకు ప్రతీకగా నిలిచింది.బడ్జెట్ మార్పుకు కారణం!బడ్జెట్ సమర్పించడంలో మార్పు రావడానికి ప్రధాన కారణం.. కాగిత వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం, డిజిటలైజేషన్ ద్వారా బడ్జెట్ పత్రాలను వేగంగా, సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. అంతే కాకుండా.. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా ప్రభుత్వ పనితీరును ఆధునీకరించడం అని తెలుస్తోంది. -
క్షీణిస్తున్న రూపాయి విలువ
-
2019 నుంచి 2025 వరకు: 8 బడ్జెట్లు.. 13 గంటలు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారతదేశ బడ్జెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. ఆదివారం, ఫిబ్రవరి 1న ఆమె యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెడుతున్న 9వ కేంద్ర బడ్జెట్ కావడం విశేషం. ఇప్పటికే ఎనిమిది బడ్జెట్లను విజయవంతంగా ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. అయితే ప్రారంభం నుంచి ఏ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం?, సుదీర్ఘ ప్రసంగం ఎప్పుడు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే కీలక బడ్జెట్లను నిర్మలా సీతారామన్ అందించారు. కరోనా వంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా.. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్లు చరిత్రలో నిలిచిపోయాయి. ముఖ్యంగా 2020లో ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం సుమారు 2 గంటలు 42 నిమిషాలు కొనసాగి, భారత పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంగా గుర్తింపు పొందింది.కాలక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగ శైలిలో మార్పు కనిపించింది. ప్రారంభంలో సుధీర్ఘంగా సాగిన బడ్జెట్ ప్రసంగాలు, తరువాతి సంవత్సరాల్లో.. క్రమంగా సంక్షిప్తంగా మారాయి. 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం 56 నిమిషాల్లో (గంట లోపు) పూర్తయింది. ఇది ఇప్పటివరకు ఆమె చేసిన అత్యంత చిన్న ప్రసంగంగా నిలిచింది. అలాగే 2025 బడ్జెట్ ప్రసంగం కూడా తక్కువ సమయం (74 నిమిషాలు)లోనే పూర్తి కావడం విశేషం.బడ్జెట్ - ప్రసంగ సమయం➤2019 బడ్జెట్: 140 నిమిషాలు (2 గంటల 20 నిమిషాలు)➤2020 బడ్జెట్: 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు - అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం)➤2021 బడ్జెట్: 100 నిమిషాలు (1 గంట 40 నిమిషాలు)➤2022 బడ్జెట్: 91 నిమిషాలు (1 గంట 31 నిమిషాలు)➤2023 బడ్జెట్: 87 నిమిషాలు (1 గంట 27 నిమిషాలు)➤2024 ఫిబ్రవరి బడ్జెట్: 56 నిమిషాలు➤2024 జులై బడ్జెట్: 85 నిమిషాలు (1 గంట 25 నిమిషాలు)➤2025 బడ్జెట్: 74 నిమిషాలు (1 గంట 14 నిమిషాలు) మొత్తం 8 బడ్జెట్లు.. 793 నిమిషాలు / 13 గంటల 13 నిమిషాలుఇక 9వ బడ్జెట్‌తో ఆమె మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం సాగుతుంది, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 2026 బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
మరో మూడు రోజుల్లో...!! 2026-27 బడ్జెట్ పై పార్లమెంట్ సమావేశాలు
-
లక్ష కోట్లు టార్గెట్..! కేంద్ర బడ్జెట్ పైనే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఆశలు
-
సవాళ్లున్నా ముందుకే
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధితో ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రస్థానం కొనసాగుతుందని ఆర్థిక సర్వే విశ్వాసం వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) జీడీపీ 6.8–7.2 శాతం మధ్య వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.4 శాతం కంటే తగ్గించడం గమనార్హం. జీడీపీలో ద్రవ్యలోటు 2025–26లో 4.8 శాతం అంచనా కాగా, 2026–27లో 4.4 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో తీసుకొచ్చిన విధానపరమైన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మధ్య కాల వృద్ధిని 7 శాతానికి చేర్చుతాయి.కనుక ప్రపంచ అనిశ్చితుల మధ్య స్థిరమైన వృద్ధికి అవకాశం ఉంది. కావాల్సింది అప్రమత్తతే కానీ, నిరాశావాదం కాదు’’అని ఆర్థిక సర్వే పేర్కొంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య రక్షణాత్మక పెట్టుబడుల ధోరణితో బంగారం, వెండి ధరల మంటలు ఇప్పుడప్పుడే చల్లారకపోవచ్చని అభిప్రాయపడింది. 739 పేజీలతో కూడిన 2025–26 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటుకు సమర్పించారు. సందర్భానుసారం వేదాలు, ఇతిహాసాల్లోని సూక్తులను సైతం ప్రస్తావించడం విశేషం. ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ బృందం దీన్ని రూపొందించింది. ఏటా బడ్జెట్‌కు ముందు ఆవిష్కరించే ఆర్థిక సర్వే నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు రానున్న రానున్న సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుందన్నది తెలియజేస్తుంది.‘స్వదేశీ’ మంత్రం.. అంతర్జాతీయంగా వాణిజ్యం, ఇతర సమస్యల నుంచి గట్టెక్కేందుకు ‘స్వదేశీ’ మంత్రాన్ని ఆర్థిక సర్వే సూచించింది. ‘‘అన్నిరకాల దిగుమతులకు ప్రత్యామ్నాయం అన్నది ఆచరణ సాధ్యం కాబోదు. అలాగే, ఆమోదనీయం కూడా కాదు. అభివృద్ధి చెందిన దేశాలు ఎగుమతులపై నియంత్రణలు విధిస్తూ, టెక్నాలజీ బదిలీకి నిరాకరిస్తున్న తరుణంలో స్వదేశీ అన్నది తప్పనిసరే కాదు అవసరం కూడా’’అని ఆర్థిక సర్వే పేర్కొంది. ఐరోపాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ తయారీ రంగ పోటీతత్వాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, ఎగుమతుల పరంగా ఉన్న అవరోధాలను తొలగించడంపై దృష్టి సారించాలి. సర్వేలోని అంశాలు.. ⇒ 2026–27లో జీడీపీ వృద్ధి రేటు 6.8–7.2 శాతంగా ఉంటుంది. మధ్య కాలానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా కొనసాగొచ్చు. ⇒ 2026–27లో ద్రవ్యలోటు 4.4 శాతానికి దిగొస్తుంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువే ఉండొచ్చు. అయినప్పటికీ ఆర్బీఐ లకి్ష్యత స్థాయి 4 శాతం పరిధిలోనే ఉంటుంది. ⇒ అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలు ఈ ఏడాదిలో ముగుస్తాయి. దీంతో విదేశీ వాణిజ్యం పరంగా అనిశ్చితులు తగ్గుతాయి. ⇒ కృత్రిమ మేధ (ఏఐ)పై ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ట్రిలియన్ డాలర్లు కుమ్మరిస్తున్న నేపథ్యంలో.. ఈ పెట్టుబడులు ఆశించిన ప్రతిఫలం ఇవ్వకపోతే అది ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అధిక విలువలు కలిగిన అసెట్స్‌లో దిద్దుబాటు చోటుచేసుకోవచ్చు. ⇒ రూపాయి విలువ పటిష్టమైన దేశ ఆర్థిక మూలాలను ప్రతిఫలించడం లేదు. అమెరికా టారిఫ్‌లతో రూపాయి విలువ 5 శాతం పతనమైంది. అయినప్పటికీ కరెన్సీ విలువ క్షీణించడం వల్ల మన ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్‌ల ప్రభావాన్ని కొంత వరకు తగ్గిస్తోంది. ⇒ దేశ వృద్ధిలో సేవల ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వస్తు ఎగుమతులపై టారిఫ్‌ల అనిశ్చితుల ప్రభావాన్ని ఇవి భర్తీ చేస్తున్నాయి. ⇒ ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉంది. కంపెనీలు, గృహాల పద్దులు ఆరోగ్యంగా ఉన్నాయి. వినియోగం కూడా బలంగా ఉంది. ⇒ తదుపరి జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇ–వే బిల్లు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి. ⇒ ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.8.1 లక్షల కోట్ల చెల్లింపుల్లో జాప్యం ఈ రంగం వృద్ధికి అవరోధంగా మారింది. నగదు ప్రవాహాల ఆధారితంగా రుణ సాయం అందించడం వంటి వినూత్నమైన చర్యలు అవసరం. ⇒ ఎరువుల తయారీలోకి వినియోగించే ముడి పదార్థాలు, ఫార్మా ముడిసరుకులు (ఇంగ్రేడియెంట్స్), మ్యాగ్నెట్, బ్యాటరీ సెల్స్, నూనెలు, టెలికం ఎక్విప్మెంట్, వైద్య పరికరాల పరంగా స్వావలంబనను పెంచేందుకు బహుళ అంచల విధానం అవసరం. ⇒ ప్రస్తుతం ఏదైనా కంపెనీలో ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంటే దాన్ని ప్రభుత్వ సంస్థగా పేర్కొంటుండగా, దీన్ని 26 శాతానికి తగ్గించాలి. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 51 శాతం కంటే తక్కువకు తగ్గించుకోవచ్చు. పూర్తిగా వైదొలగొచ్చు. ⇒ పీఎల్ఐ పథకం కింద రూ.13,759 కోట్ల ప్రోత్సాహకాలతో దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ 2025 సెప్టెంబర్ నాటికి రూ.9.34 లక్షల కోట్లకు చేరింది. ఎగుమతులు రూ.5.12 లక్షల కోట్లుగా ఉన్నాయి. ⇒ డిజిటల్ వ్యసనానికి చెక్ పెట్టేందుకు సోషల్ మీడియా యాప్‌ల వినియోగంలో వయసుల వారీ పరిమితులు తీసుకురావాలి. కరోనా సమయంలో మొదలైన ఆన్లైన్ బోధన టూల్స్‌పై ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు అవసరం. పిల్లలకు బేసిక్ ఫోన్లు లేదా కంటెంట్ పరంగా ఫిల్టర్లతో విద్యా సంబంధిత సమాచారంతో కూడిన ట్యాబ్‌లను అనుమతించొచ్చు. ⇒ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య మీడియాలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై ప్రచారాన్ని నిషేధించాలి. చంటి పిల్లలకు సంబంధించి పాలు, పానీయాల మార్కెటింగ్‌పై పరిమితులు విధించాలి. ⇒ దేశంలో స్థూలకాయం పెరిగిపోతుండడం ప్రధాన ప్రజారోగ్య సవాలుగా మారింది. కనుక సరైన పోషకాహారం తీసుకోవడంపై దృష్టి సారించాలి. 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మహిళల్లో 24 శాతం, పురుషుల్లో 23 శాతం అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ⇒ ఐటీ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉండొచ్చు. కొన్ని రకాల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుంది. దీనిపై దృష్టి సారించేందుకు ఏఐ ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలి.వికసిత్ భారత్‌కు మార్గసూచీభారతదేశ సంస్కరణల ప్రస్థానాన్ని ఆర్థిక సర్వే విశదీకరించింది.అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన వాతావరణం మధ్య స్థిరమైన పురోగతిని ప్రతిబింబించింది. బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, స్థిరమైన వృద్ధితోపాటు దేశ నిర్మాణంలో ఆవిష్కరణలు, పారిశ్రామిక పాత్రను హైలైట్ చేస్తోంది. తయారీని బలోపేతం చేయడానికి, ఉత్పాదకతను పెంచడానికి, వికసిత్ భారత్ లక్ష్యం దిశగా మన ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి ఈ సర్వే కార్యాచరణను కూడా వివరించింది’’ – ప్రధాని నరేంద్ర మోదీపటిష్ట స్థితిలో భారత్ దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు ఇంతకుముందెన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ సవాళ్లను విజయవంతంగా అధిగమించడం ద్వారా భారత్‌ను అధిక వృద్ధి పథంలో నిలిపాం. జీడీపీ వృద్ధి సామర్థ్యాన్ని 7 శాతానికి చేర్చాం. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం మధ్య భారత్ అంతర్జాతీయ ఆశాకిరణంగా నిలిచింది’’ – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎగుమతులు, వ్యవసాయంలో లోపాలు.. పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే 2025–26 దేశ ఎగుమతి విధానాలు.. ముఖ్యంగా వ్యవసాయ రంగం విషయంలో లోపాలను ఎత్తి చూపించింది. విలువ పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద వ్యవసాయ దేశంగా ఉన్న భారత్ నుంచి.. వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, ఆహారం, పానీయాల ఉత్పత్తుల ఎగుమతులు వచ్చే నాలుగేళ్ల కాలంలో 100 బిలియన్ డాలర్లకు (రూ.9.2 లక్షల కోట్లు) చేరుకుంటాయని అంచనా వేసింది.2024–25లో ఇవి 51.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే విధానాల్లో తరచూ చేసే మార్పులతో సరఫరా వ్యవస్థలు దెబ్బతినొచ్చని, అనిశ్చితికి కారణమై.. విదేశీ కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాలను ఆశ్రయించేందుకు దారితీయొచ్చంటూ హెచ్చరించింది. ఒక్కసారి ఎగుమతుల మార్కెట్లను కోల్పోతే తిరిగి పొందడం కష్టమవుతుందని పేర్కొంది. -
సర్వేలో ఆశావహ స్వరం
ప్రపంచవ్యాప్తంగా అలముకున్న అనిశ్చితికి తోడు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అదనపు సుంకాలు, పడిపోతున్న రూపాయి విలువ, ఉపాధి లేమి తదితరాలు హడలెత్తిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో దేన్నయినా అంచనా వేయటమంటే కత్తి మీద సాము. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటుకు ఆర్థిక సర్వే సమర్పించారు. ముగియబోతున్న ఆర్థిక సంవత్సరంలో మన స్థితిగతులెలా ఉన్నాయో వివరించి, ఇకముందు రాగల సవాళ్లేమిటో... వాటిని అధిగమించటానికి ప్రభుత్వానికున్న ఆలోచనేమిటో స్థూలంగా వివరించటం ఆర్థిక సర్వేల లక్ష్యం. నిజానికి ఆర్థిక సర్వేకు ముందురోజు పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలో సంస్కరణలు మరింత వేగవంతం కాబోతున్నాయని సూచనప్రాయంగా చెప్పారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో మన జీడీపీ 6.8–7.2 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రపంచ దేశాలన్నిటా ఆర్థికంగా మందగమనం కొనసాగుతున్నా మన దేశం ‘వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ’గా కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలా ఆశించటానికి కారణం ఉంది. వృద్ధి రేటు బలంగా ఉండటం, మునుపెన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి ఆర్థిక వ్యవస్థను ఆర్థిక నిపుణులు ‘గోల్డీలాక్స్ ఎకానమీ’ అంటారు. దేశం ఏదైనా, పాలకులు ఎంతగానో కోరుకునే సమతౌల్య స్థితి ఇది. స్వేచ్ఛగా ప్రాథమ్యాలను ఎంచుకోవటానికీ, దూకుడుగా ముందుకు పోయేందుకూ అనువైన బడ్జెట్‌ను రూపొందించుకొనేందుకు ఇది వీలు కల్పిస్తుంది. కానీ ఒడుదొడుకులు ఉన్నా యని ఆర్థిక సర్వే గమనిస్తే అర్థమవుతుంది. 2025–26 సంవత్సరానికి గణాంకాల మంత్రిత్వ శాఖ లోగడ అంచనా వేసిన వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.4 శాతంకాగా, అది అంతకన్నా తక్కువే ఉంటుందని సర్వే చెబుతోంది. పన్ను వసూళ్లలో 11 శాతం వృద్ధి ఉండొచ్చని నిరుడు అంచనా వేస్తే అది 8 శాతం మించలేదు. నిరుడంతా విదేశీ మదుపుదారులు 1,900 కోట్ల డాలర్లమేర వెనక్కి తీసుకోగా, ఈ జనవరిలోనే 400 కోట్ల డాలర్ల ఈక్విటీలు విక్రయించారు. సంస్కరణలు మొదలయ్యాక ఇలా జరగటం ఇదే ప్రథమం. అయితే విదేశీ మారక నిల్వల్లో మనం ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నామని సర్వే వివరిస్తోంది. ఈ నిల్వలు 701.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని చెబుతోంది. అలాగే ప్రవాస భారతీయుల ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యం కూడా భారీగా పెరిగింది. ముగుస్తున్న సంవత్సరంలో ఇది 135.4 బిలియన్ డాలర్లు. దేశ ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న సమస్యలకు మూలం ప్రపంచ స్థితిగతుల్లో ఉంది తప్ప అది అంతర్గతమైంది కాదని సర్వే ప్రకటించింది. అయితే తయారీ రంగ పరిశ్రమలు విస్తరించి, ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా చూడటం మన బాధ్యతే. కృత్రిమ మేధ(ఏఐ)తో ఉద్యోగాలు పోతాయన్న భయాలు అవాస్తవమనీ, పైపెచ్చు తగిన మార్పులు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనీ సర్వే అంటున్నది. డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా, యాప్‌ల ద్వారా దేశంలో శరవేగంతో విస్తరిస్తున్న ‘గిగ్ ఎకానమీ’పై ఈ సర్వే దృష్టి సారించటం ప్రశంసనీయం. 2021లో ఈ రంగంలో 77 లక్షల మంది ఉండగా, వారి సంఖ్య ప్రస్తుతం కోటీ 20 లక్షలు. కానీ దాదాపు 40 శాతం మంది నెలకు రూ. 15,000 కన్నా తక్కువే సంపాదిస్తున్నారని చెబుతూ... గంటకు నిర్ణీత మొత్తం ఇచ్చేలా, లేక నిర్దేశించిన లక్ష్యానికి ఫలానా మొత్తం అనే విధంగా ఉంటే మెరుగైన ఆర్జన సాధ్యమవుతుందని సర్వే భావించింది. వారి పని పరిస్థితులు మెరుగయ్యేలా చూస్తామని వాగ్దానం చేస్తోంది. అయితే సామాజిక రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని మరింత పెంచితే తప్ప, ఉగ్రరూపం దాలుస్తున్న ఉపాధి లేమిని సరిచేస్తే తప్ప వాస్తవ అభివృద్ధి సాధ్యపడదు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ వ్యయం చాలా తక్కువుంది. ఆ రంగాలపై శ్రద్ధ పెట్టనంతకాలం నాసిరకం చదువులు, అనారోగ్యం, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు పీడిస్తూనే ఉంటాయి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదేమిటో రెండు రోజుల్లో రాబోయే బడ్జెట్ తేటతెల్లం చేస్తుంది. -
జగన్ సర్వేపై కేంద్రం ప్రశంసలు
-
కేంద్ర బడ్జెట్ 2026-27: జమిలీ బిల్లుతో పాటు కీలక బిల్లులు ఇవే!
-
సంస్కరణల బాటా...సుంకాల మోతా..?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్‌ను (2026–27 ఆర్థిక సంవత్సరం) వచ్చే నెల (ఫిబ్రవరి) 1న పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. గతేడాది జీఎస్టీలో శ్లాబులను క్రమబద్ధీకరించడం ద్వారా వినియోగానికి ఊతమిచి్చనట్టుగానే.. కస్టమ్స్ సుంకాల్లోనూ ఇదే మాదిరి సంస్కరణ ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే, అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగి, వాణిజ్య అనిశి్చతులు నెలకొన్న తరుణంలో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంస్కరణలను ప్రకటించొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. జీడీపీలో రుణ నిష్పత్తిని తగ్గించే మార్గ సూచీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ద్రవ్యలోటు నిర్వహణకు పరిమితం కాకుండా, రుణ భారాన్ని తగ్గించుకోవడంపై కేంద్ర సర్కారు ఇటీవలి కాలంలో దృష్టి సారించడం తెలిసిందే. ముఖ్య అంచనాలు.. → ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానుంది. పాత, కొత్త ఆదాయపన్ను విధానాల్లో స్టాండర్డ్ డిడక్షన్ అమల్లో ఉంది. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షలకు మించని ఆదాయంపై పన్ను మినహాయింపును గత బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు కొత్త పన్ను విధానంలోకి మరింత మందిని తీసుకొచ్చే విధంగా ప్రోత్సాహానికి స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచాలన్న డిమాండ్ ఉంది. → టీడీఎస్ శ్లాబులను తగ్గించొచ్చన్న అంచనా ఉంది. కస్టమ్స్ వివాదాల రూపంలో చిక్కుకుపోయిన రూ.1.53 లక్షల కోట్ల విడుదలకు వీలుగా క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించొచ్చు. అలాగే, నిబంధనల అమలును సులభతరం చేయాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. → రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించొచ్చు. → భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో రక్షణ రంగానికి ఈ విడత మరిన్ని కేటాయింపులు చేయొచ్చు. → వీబీజీ రామ్‌జీ పథకం కింద వ్యయాలను కేంద్రం, రాష్ట్రాల మధ్య 60:40 నిష్పత్తిలో పంచుకోవచ్చు. → 2026 జనవరి 1 నుంచి 8వ పే కమిషన్ అమలుకు వీలుగా కేటాయింపులు చేయొచ్చు. → 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రాలకు పన్నుల పంపిణీ. → టారిఫ్‌ల కారణంగా ప్రభావితమవుతున్న రత్నాభరణాలు, వస్త్రాలు, లెదర్ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ప్రకటించొచ్చు. → లిథియం, కోబాల్ట్ తదితర అరుదైన ఖనిజాల అన్వేషణకు నిధుల మద్దతును ప్రకటించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. -
నేడు అఖిలపక్ష భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28నుంచి మొదలుకానున్న దృష్ట్యా, సభా కార్యక్రమాల అజెండాపై చర్చించేందుకు కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు పార్లమెంట్ అనెక్స్‌లో జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీల పార్లమెంటరీ ఫోర్లీడర్లు హాజరుకానున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగేలా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారం కోరనుంది. ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల కార్యకలాపాల్లో పాల్గొని, కీలక బిల్లులపై చర్చకు సహకరించాలని రిజిజు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28న బడ్జెట్ సమావేశాల తొలిరోజు లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి ఒకటిన ఆదివారం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు జరుగనుండగా, రెండో విడత మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి వీబీ జీ రామ్ జీ తేవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఇప్పటికే దేశ వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తోంది. దీనిపై పార్లమెంట్ వేదికగా మరోమారు కాంగ్రెస్ తన ఆందోళనను కొనసాగించే అవకాశాలున్నాయి. తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపడుతోంది. కేంద్ర నిధుల విడుదలలో తమపట్ల వివక్ష కొనసాగుతోందని మరోపక్క తమిళనాడు ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఇక బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల తీరును సైతం విపక్ష పార్టీలు కేంద్రాన్ని తప్పుపడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం జరిగే అఖిలపక్ష భేటీ కీలకం కానుంది. -
కేంద్ర బడ్జెట్ 2026: ఆరోజు నిర్మలమ్మ పలికే పదాలివే..
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నకేంద్ర బడ్జెట్ 2026ను మరికొద్ది రోజుల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం వ్యయం, పన్నులు, అభివృద్ధి ప్రణాళికలపై తన దిశానిర్దేశాన్ని వెల్లడిస్తుంది. అందుకే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వినిపించే పదాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావం చూపుతాయి. అలాంటి కొన్ని పదాలు.. వాటి అర్థాల గురించి తెలుసుకుంటే, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయం–వ్యయాలపై స్పష్టమైన అవగాహన వస్తుంది.యూనియన్ బడ్జెట్: ప్రభుత్వ ఆర్థిక స్థితిని సమగ్రంగా వివరించే నివేదిక. ఆదాయ వనరులు, వ్యయాలు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనాలు ఇందులో ఉంటాయి.ఫిస్కల్ పాలసీ (విత్త విధానం): వ్యయం, పన్నుల ద్వారా ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు ప్రభుత్వం అనుసరించే విధానం. ఇది బడ్జెట్ ద్వారా అమలవుతుంది.ఇన్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం): వస్తువులు, సేవల ధరలు కాలక్రమేణా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. దీని వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది.మానిటరీ పాలసీ (Monetary Policy): డబ్బు సరఫరా, వడ్డీ రేట్లు, రుణ పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకు (ఆర్బీఐ) తీసుకునే చర్యలు.బడ్జెట్ ఎస్టిమేట్స్ (Budget Estimates): రాబోయే ఆర్థిక సంవత్సరానికి మంత్రిత్వ శాఖలు, పథకాలకు కేటాయించిన నిధుల అంచనాలు.రివైజ్డ్ ఎస్టిమేట్స్ (Revised Estimates): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్యలో వాస్తవ పరిస్థితులను బట్టి సవరించిన ఆదాయం–వ్యయాల అంచనాలు.రెవెన్యూ బడ్జెట్: ప్రభుత్వ రెవెన్యూ వసూళ్లు (పన్ను, పన్నుయేతర ఆదాయం), రెవెన్యూ వ్యయాలను చూపుతుంది.క్యాపిటల్ బడ్జెట్: మూలధన వసూళ్లు, మూలధన వ్యయాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి.ఫినాన్స్ బిల్ (ఆర్థిక బిల్లు): బడ్జెట్లో ప్రతిపాదించిన పన్నుల మార్పులను అమలు చేయడానికి రూపొందించే చట్టప్రతిపాదన.క్యాపిటల్ ఎక్స్పెండీచర్ (మూలధన వ్యయం): ఆస్తుల కొనుగోలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు వంటి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేసే ఖర్చు.రెవెన్యూ ఎక్స్పెండీచర్ (రెవెన్యూ వ్యయం): జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు వంటి తక్షణ వినియోగ ఖర్చులు.ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్యలోటు): ప్రభుత్వ మొత్తం వ్యయం, రుణం కాని వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే లోటు.ప్రైమరీ డెఫిసిట్ (ప్రాథమిక లోటు): ద్రవ్యలోటు నుంచి వడ్డీ చెల్లింపులను మినహాయించిన మొత్తం.రెవెన్యూ డెఫిసిట్ (రెవెన్యూ లోటు): రెవెన్యూ వ్యయం, రెవెన్యూ వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది.గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ (స్థూల ద్రవ్యలోటు): ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అవసరమైన మొత్తం రుణ పరిమాణం.నెట్ ఫిస్కల్ డెఫిసిట్ (నికర ద్రవ్యలోటు): ప్రభుత్వం ఇచ్చే నికర రుణాలను మినహాయించిన ద్రవ్యలోటు.క్యాపిటల్ రిసీట్స్ (మూలధన వసూళ్లు): రుణాలు, పెట్టుబడుల ఉపసంహరణ, రుణ రికవరీలు మొదలైనవి.రెవెన్యూ రిసీట్స్ (రెవెన్యూ వసూళ్లు): పన్నులు, పన్నుయేతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం.డైరెక్ట్ ట్యాక్స్ (ప్రత్యక్ష పన్నులు): ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను వంటి నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులు.ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ (పరోక్ష పన్నులు): జీఎస్టీ వంటి వస్తువులు, సేవలపై విధించే పన్నులు. -
1950లో బడ్జెట్ లీక్!.. తర్వాత ఏం జరిగిందంటే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రజెంటేషన్‌కు ముందు అనేక సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. అందులో ఒకటి హల్వా వేడుక. హల్వా వేడుకతో బడ్జెట్ పత్రాల ముద్రణకు అనుమతి లభిస్తుంది. ప్రింటింగ్ ప్రక్రియ సాధారణంగా ప్రభుత్వ ప్రెస్ ఉన్న నార్త్ బ్లాక్ నేలమాళిగలో (అండర్ గ్రౌండ్) జరుగుతుంది.ఒకప్పుడు రాష్ట్రపతి భవన్ ప్రెస్‌లో..గతంలో బడ్జెట్‌కు సంబంధించిన డాక్యుమెంట్ ప్రింటింగ్ అనేది.. ఈ నార్త్ బ్లాక్‌లో జరిగేది కాదు. ఎందుకంటే 1950లో జాన్ మథాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర బడ్జెట్ వివరాలు లీక్ అయ్యాయి. అప్పుడు డాక్యుమెంట్ ప్రింటింగ్ రాష్ట్రపతి భవన్ ప్రెస్‌లో జరిగింది. కేంద్ర బడ్జెట్ లీక్ అవ్వడంతో మథాయ్ కూడా రాజీనామా చేశారు.తరువాత నార్త్ బ్లాక్‌కు..ఎప్పుడైతే బడ్జెట్ లీక్ అయిందో.. వెంటనే ప్రింటింగ్ చేసే ప్రదేశాన్ని కూడా మార్చేశారు. దీంతో రాష్ట్రపతి భవన్ నుంచి మింటో రోడ్‌లోని మరింత సురక్షితమైన సదుపాయానికి మార్చడానికి దారితీసింది. ఆ తరువాత 1980లో మళ్ళీ బడ్జెట్ ముద్రణ ప్రదేశం నార్త్ బ్లాక్‌కు మారింది. ఆ తరువాత ప్రదేశం మారలేదు, కాబట్టి నేటికీ ఇక్కడే బడ్జెట్ ముద్రణ జరుగుతోంది.బడ్జెట్ ముద్రణ సమయంలో చాలా కఠినమైన భద్రతలు ఉంటాయి. ఇది కూడా చాలా రహస్యంగా జరుగుతుందని సమాచారం. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు 'లాక్-ఇన్' వ్యవధికి లోబడి ఉంటారు. అంటే వీరు కొన్ని రోజులు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటారు. వారందరూ కనీసం ఫోన్లను కూడా ఉపయోగించకూడదు. ఆర్థిక మంత్రి లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాతే వాళ్లందరూ బయటకు రావడానికి అనుమతిస్తారు.ఇదీ చదవండి: బ్రిటిష్ సంప్రదాయానికి చెక్.. 1999లో మారిన బడ్జెట్ టైమ్నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు. -
28 నుంచి బడ్జెట్ సెషన్ 27న అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: జనవరి 28వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఒక రోజు ముందుగా 27వ తేదీన అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో ఎజెండాతోపాటు ఇతర అంశాలు చర్చకు రానున్నాయి. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని కమిటీ మెయిన్ రూంలో 27వ తేదీ ఉదయం 11 గంటలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరుగనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూపీయే హయాంలో తీసుకువచి్చన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థాయిలో కేంద్రం ఇటీవల తీసుకువచి్చన వీబీ– గ్రామీణ్ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఒక వైపు దేశ వ్యాప్త ఆందోళనలు కొనసాగిస్తుండగా, మరో వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలైన వేళ పార్లమెంట్ సెషన్ మొదలవుతుండటం గమనార్హం. ఈ నెల 28వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో సెషన్ ప్రారంభం కానుంది. పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత అరుదుగా ఫిబ్రవరి ఒకటో తేదీ, ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం తెల్సిందే. -
నార్త్ బ్లాక్‌లోనే బడ్జెట్ పత్రాల ముద్రణ
దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంది. అయితే ఈసారి ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం కొత్త పార్లమెంట్ భవనానికి మారినప్పటికీ, బడ్జెట్ పత్రాల ముద్రణ మాత్రం పాత పార్లమెంట్ భవనంలోని నార్త్ బ్లాక్‌లోనే కొనసాగనుంది.కొత్త భవనంలో లేని సౌకర్యంకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తమ బృందంలోని కీలక అధికారులు 2025 సెప్టెంబర్‌లోనే ఆధునిక సెంట్రల్ సెక్రటేరియట్‌లోని ‘కర్తవ్య భవన్’కు మారారు. అయితే, అక్కడ బడ్జెట్ పత్రాల ముద్రణకు అవసరమైన అత్యంత సురక్షితమైన, ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా పాత పార్లమెంట్ బిల్డింగ్‌లోని నార్త్ బ్లాక్‌లో ఉన్న ప్రెస్లోనే ముద్రణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.బడ్జెట్ పత్రాల ముద్రణను 1950 వరకు రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. 1950లో పత్రాలు లీక్ కావడంతో ముద్రణను మింట్ రోడ్డులోని ప్రెస్‌కు మార్చారు. తర్వాత 1980 నుంచి భద్రతా కారణాల దృష్ట్యా నార్త్ బ్లాక్‌లోని ప్రత్యేక ప్రెస్‌కు ఈ బాధ్యతలు బదిలీ చేశారు.రెండు వారాల క్వారంటైన్.. కట్టుదిట్టమైన భద్రతబడ్జెట్ ముద్రణ అనేది అత్యంత రహస్యంగా సాగే ప్రక్రియ. ముద్రణలో పాల్గొనే సిబ్బందిని సుమారు రెండు వారాల పాటు నార్త్ బ్లాక్‌లోని గదుల్లోనే ఉంచుతారు. ఈ సమయంలో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. కీలక అధికారుల ఫోన్లపై కూడా పరిమితులు ఉంటాయి. బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు వీరు అక్కడే ఉంటూ ఈ పుస్తకాల తయారీని పర్యవేక్షిస్తారు.త్వరలో ‘హల్వా వేడుక’బడ్జెట్ తయారీ ప్రక్రియ ముగింపునకు సూచికగా నిర్వహించే సాంప్రదాయ ‘హల్వా వేడుక’ వచ్చే వారం జరగనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ బడ్జెట్ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, రికార్డుల కోసం పరిమిత సంఖ్యలో పత్రాల ముద్రణ కోసం ఈ కసరత్తును పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్! -
పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక ప్రగతిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రాబోయే కేంద్ర బడ్జెట్లో సముచిత ప్రాధాన్యం కల్పించాలని, రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఢిల్లీలోని అశోక్ హోటల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ప్రీ–బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘వికసిత్ భారత్’లక్ష్య సాధనలో తెలంగాణ పాత్రను వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులపై భట్టి నివేదిక సమరి్పంచారు. కేంద్రం తోడ్పాటు అందించాలి... దేశ జీడీపీలో తెలంగాణ వాటా ప్రస్తుతం 5.1 శాతంగా ఉందని, దీన్ని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని భట్టి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘తెలంగాణ రైజింగ్–2047’విజన్‌ను రూపొందించామని, దీని ద్వారా ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమని, ఇందుకు రాష్ట్రంలో పెట్టుబడి రేటును ప్రస్తుతమున్న 37 శాతం నుంచి 50 శాతానికి (జీఎస్డీపీలో) పెంచాల్సి ఉందని, దీనికి కేంద్రం తోడ్పాటు అందించాలని కోరారు. పన్నుల పంపిణీలో అన్యాయం... రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 41 శాతం వాటా ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టంగా సిఫారసు చేసినప్పటికీ, ఆచరణలో మాత్రం 30 శాతం నిధులు మాత్రమే అందుతున్నాయని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం విధిస్తున్న సెస్సులు, సర్ చార్జీల వాటా 20 శాతానికి చేరడమే ఇందుకు కారణమన్నారు. దాదాపు రూ.1,55,000 కోట్ల సర్ చార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలని లేదా వాటిని ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు న్యాయబద్ధమైన వాటా పంచాలని ఆయన సూచించారు. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో రాష్ట్రాల వాటాను తగ్గించి, ఆ నిధులను (దాదాపు రూ.2.21 లక్షల కోట్లు) నేరుగా రాష్ట్రాలకే బదిలీ చేయాలని కోరారు. రాష్ట్రాల ఆర్థిక వెసులుబాటు కోసం ద్రవ్య లోటు పరిమితిని ఏడాదికి కనీసం 4 శాతానికి పెంచాలని భట్టి డిమాండ్ చేశారు. విద్య, ఆరోగ్య రంగాల కోసం సేకరించే రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని కోరారు.భారీ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల కోసం... రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని, హైదరాబాద్ మెట్రో రెండో దశకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని భట్టి కోరారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం రూ.14,100 కోట్లు, హైదరాబాద్‌లో రేడియల్ రోడ్ల కోసం రూ.45,000 కోట్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ కోసం రూ.17,212 కోట్లు కేటాయించాలని కోరారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాలను మంజూరు చేయాలని, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటును ప్రకటించాలని భట్టి తన ప్రసంగంలో ప్రస్తావించారు. -
28 నుంచి బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయన్నారు. లోక్‌సభ ఛాంబర్లో జరిగే ఉభయ సభల సభ్యుల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించడం సెషన్ మొదలవుతుందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేతోపాటు సాధారణ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారని చెప్పారు. ఈ సెషన్ మొదటి దశ సమావేశాలు జనవరి 28– ఫిబ్రవరి 13వ తేదీ వరకు, రెండో దశలో మార్చి 9–ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉంటాయన్నారు. మధ్యలో ఫిబ్రవరి 13 నుంచి మార్చి 9 వరకు విరామం ఉంటుందన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం నాడు ప్రవేశపెట్టే బడ్జెట్‌ను గురించిన విషయాలను ఆయన వెల్లడించలేదు. -
అఫీషియల్: ఆదివారమే కేంద్ర బడ్జెట్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA).. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కీలక తేదీలను ఆమోదించింది. పార్లమెంట్ క్యాలెండర్ ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో దేశ చరిత్రలో ఆదివారం ప్రవేశపెట్టడం ఇది రెండోసారి కానుంది.బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి గుర్తుగా.. జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. కాగా జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి సెషన్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 తేదీలలో జరుగుతుందని, రెండవ భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 మధ్య రెండో సెషన్ జరుగుతాయి.సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు. ఇది రెండోసారి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు.. 2025 బడ్జెట్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. గతంలో.. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2015లో ఫిబ్రవరి 28న శనివారం, 2016లో ఫిబ్రవరి 28న ఆదివారం కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. -
ఈసారి కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర గందరగోళం!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీల ప్రకటన నేపథ్యంతో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆనవాయితీ ప్రకారం.. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టాలి. అయితే ఈసారి ఆదివారం కావడంతో ఆ తేదీ మారవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టే తేదీపై ఆసక్తి నెలకొంది. 2017 నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతోంది కేంద్రం. కానీ, ఈసారి ఒకటో తేదీ ఆదివారం వచ్చింది. సాధారణంగా వారాంతాల్లో పార్లమెంట్ సమావేశాలే జరగవు. బ్రిటీష్ కాలం నుంచే ఆదివారాలను తప్పించాలనే ఆచారం కొనసాగేది. అలాంటిది.. అందునా ఆదివారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫిబ్రవరి 1నే కొనసాగిస్తారా? లేదంటే ఫిబ్రవరి 2 (సోమవారం)కి మార్చుతారా? అంటూ చర్చ మొదలైంది. అయితే.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాత్రం.. తుది నిర్ణయం కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ తీసుకుంటుందని చెబుతున్నారు. దీంతో.. ఆదివారం నిర్వహించడంపై సందేహాలు కొనసాగుతున్నాయి. అలాగని వారాంతాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం కొత్త విషయమేమీ కాదు. 2025లోనూ శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతంలో.. అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు 2015లో శనివారం, 2016లో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2020లో కోవిడ్ సమయంలో.. అలాగే 2012 మే 13వ తేదీన 60వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం పార్లమెంట్ సమావేశమైంది కూడా. దీంతో ఈసారి కూడా ఆదివారమే బడ్జెట్ ప్రవేశపెట్టే అస్కారం లేకపోలేదు. ఫిబ్రవరి 1నే ఎందుకంటే..2017 ఏడాదికి ముందు బడ్జెట్ ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టబడేది. అయితే.. బడ్జెట్ ప్రవేశపెట్టాక మొదటి త్రైమాసిక ఖర్చుల కోసం ‘వోట్ ఆన్ అకౌంట్’ ఆమోదం తీసుకోవాల్సి వచ్చేది. తర్వాత విభాగాల వారీగా డిమాండ్లను పరిశీలించి పూర్తి బడ్జెట్ ఆమోదించబడేది.ఈ ఆలస్యాన్ని నివారించేందుకు 2017లో అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దీంతో ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ముందు పార్లమెంట్ బడ్జెట్‌ను ఆమోదించే అవకాశం లభించింది. -
ఈసారి బడ్జెట్ ఆదివారమే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ‘కేంద్ర బడ్జెట్’ ఈసారి ఒక సంచలనానికి వేదిక కాబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సెలవు రోజు పార్లమెంటు సభలు జరగడం అరుదైన విషయమైనా, ఈసారి అది కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.సస్పెన్స్ రేపుతున్న ఫిబ్రవరి 12017 నుండి బడ్జెట్‌ను ఫిబ్రవరి మొదటి తేదీనే ప్రవేశపెట్టడం ఒక ఆచారంగా మారింది. అయితే, 2026 ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కేంద్రంపై పడింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును దీనిపై ప్రశ్నించగా.. ‘సరైన సమయంలో క్యాబినెట్ కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది’.. అంటూ సస్పెన్స్‌ను కొనసాగించారు.కొత్తేమీ కాదు కానీ..బ్రిటిష్ కాలం నాటి ’వారాంతపు సెలవు’ విధానం మన బడ్జెట్ తేదీని మార్చలేదు. గతంలో కూడా కోవిడ్ సమయంలో, పార్లమెంటు 60వ వార్షికోత్సవం (మే 13, 2012) సందర్భంగా ఆదివారాల్లో సభలు నిర్వహించిన చరిత్ర ఉంది. ఒకప్పుడు బడ్జెట్ అంటే ఫిబ్రవరి చివరి రోజు జరిగేది. -
నిధుల నిర్వహణలో పారదర్శకత
కేంద్ర ప్రభుత్వం ద్రవ్య నిర్వహణలో పారదర్శకతకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, అమలు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనితో రుణభారం గణనీయంగా తగ్గిందని ఆమె తెలిపారు. రాష్ట్రాలు కూడా రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఇదే తరహా విధానాన్ని పాటించాలని సూచించారు. తద్వారా 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్య సాకారంలో తమ వంతు పాత్ర పోషించాలని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.‘ద్రవ్య నిర్వహణ తీరుతెన్నులు అందరికీ ప్రస్ఫుటంగా తెలిసేలా, అత్యుత్తమ జవాబుదారీతనపు ప్రమాణాలను పాటించేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తయారీలో పారదర్శకతకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను విధించుకుంది. ఫలితంగా కోవిడ్ అనంతరం 60 శాతానికి పైగా ఎగిసిన రుణ, జీడీపీ నిష్పత్తిని తగ్గించగలిగింది. ఇప్పుడిది మరింతగా తగ్గుతోంది’ అని ఆమె తెలిపారు.కోవిడ్ అనంతరం రుణ,జీడీపీ నిష్పత్తి 61.4 శాతానికి ఎగిసింది. అయితే, ప్రభుత్వ విధానాలతో 2023–24 నాటికి 57.1 శాతానికి దిగి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 56.1 శాతానికి తగ్గొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రుణభారాన్ని తగ్గించుకునే దిశగా ద్రవ్య నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు మంత్రి సూచించారు.ఇదీ చదవండి: మురిపిస్తున్న ముగింపు! -
బీమా బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) 100 శాతం అనుమతిస్తూ కేంద్రం తీసుకొచ్చిన సబ్కా బీమా సబ్కా రక్షా(బీమా చట్టాల సవరణ) బిల్లు–2025 పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ బిల్లును మంగళవారం లోక్‌సభలో ఆమోదించగా, బుధవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. బీమా రంగంలో ప్రస్తుతం 74 శాతం ఎఫ్‌డీఐలను ఆమోదిస్తున్నారు. దీన్ని ఇకపై 100 శాతానికి పెంచబోతున్నారు. రాజ్యసభలో బిల్లుకు ప్రతిపక్షం సూచించిన పలు సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. సమగ్ర పరిశీలన కోసం బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించాలని విపక్ష సభ్యులు కోరగా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ప్రజలకు మేలు జరిగేలా బీమా రంగంలో మరిన్ని సానుకూల మార్పులు రాబోతున్నాయని చెప్పారు. ఈ రంగంలో విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయని వెల్లడించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇప్పటికే పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ప్రజలకు, వ్యాపారాలకు, వ్యవసాయానికి బీమా రక్షణ విస్తృతంగా లభిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. 100 శాతం ఎఫ్డీలతో బీమా సదుపాయం మరింత విస్తరిస్తుందని, చౌకగా పాలసీలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ రంగంలో వృద్ధికి అపరిమిత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. విదేశీ కంపెనీల రాకతో పోటీ పెరిగి, కొత్త పాలసీలు వస్తాయని, ప్రీమియం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా దేశంలో యువతకు మరిన్ని ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ‘శాంతి’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం అణు ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం రూపొందించిన సస్టైనబుల్ హార్నెసింగ్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(శాంతి) బిల్లును లోక్‌సభలో బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించారు. బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. ప్రైవేట్ కంపెనీల రాకతో అణు ఇంధన రంగం మరింత వేగం పుంజుకుంటుందని చెప్పారు. ‘రామ్ జీ’ బిల్లుపై చర్చ ప్రారంభం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్–గ్రామీణ(వీబీ–జీ రామ్ జీ) బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఈ బిల్లుతో కూలీలకు ప్రతిఏటా 125 రోజులపాటు పని లభిస్తుందన్నారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న జాతిపిత మహాత్మాగాంధీ కల నెరవేరుతుందని వివరించారు. ఉపాధి హామీ పథకం నుంచి గాం«దీజీ పేరును తొలగించడం పట్ల కాంగ్రెస్ సభ్యుడు జైప్రకాశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అది అతిపెద్ద నేరమని పేర్కొన్నారు. 71 పాత చట్టాల రద్దు బిల్లుకు సై కాలం చెల్లిన 71 చట్టాలను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన రిపీలింగ్, అమెండ్మెంట్–2025 బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించింది. మంగళవారం లోక్‌సభలో, బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. -
ఆయుధాలుగా మారుతున్న వాణిజ్య సుంకాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం టారిఫ్‌లు, ఇత ర రూపాల్లో ఆయుధాలు గా మారుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్ కేవలం టారిఫ్‌లను ఎలా ఎదుర్కోవాలన్న దానికే పరిమితం కాకుండా, ఈ విషయమై జాగ్రత్తగా సంప్రదింపులు కొనసాగించాల్సి ఉంటుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం మనకు అనుకూలమని ఒక జాతీయ దినపత్రిక నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. ‘‘స్వీయ ప్రయోజనాల ధోరణితో ఉందంటూ భారత్‌కు పాఠాలు బోధించొచ్చు. సుంకాల రాజుగా అభివరి్ణ ంచొచ్చు. కానీ, టారిఫ్ ఆయుధంగా మారిపోయింది. వీటిని ఆయుధాలుగా మార్చు కోకూడదన్నది భారత్ ఉద్దేశం. పోటీ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తులు వరుస∙కట్టినప్పుడే దేశీ పరిశ్రమను కాపాడుకునేందుకు భారత్ రక్షణాత్మక చర్యలను అనుసరిస్తుంది’’అని మంత్రి స్పష్టం చేశారు. -
విద్యకు ఇవ్వండి మినహాయింపు.. నిర్మలా సీతారామన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యారంగం సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ నిధుల సమీకరణకు తాము ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్పీసీ)ను ఏర్పాటు చేయనున్నామని, దాని ద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. నిర్మలా సీతారామన్‌తో పార్లమెంట్ ఆవరణలోని ఆమె చాంబర్లో రేవంత్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రాధాన్యతను రేవంత్ వివరించారు. ‘5 నుంచి 12 తరగతుల వరకు ఉండే ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 2,560 మంది విద్యార్థులు ఉంటారు. మొత్తం 105 పాఠశాలల్లో 2.70 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా నాణ్యమైన విద్యాబోధన లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు సమీప ప్రభుత్వ పాఠశాలలకు విద్యాహబ్లుగా ఉండటంతో పరోక్షంగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. అత్యాధునిక వసతులు, లే»ొరేటరీలు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుంది. అలాగే, రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు వెచి్చంచనున్నాం’అని రేవంత్ కేంద్రమంత్రికి వివరించారు. విద్యారంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలని విజ్ఞప్తి చేశారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, విద్యారంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపుతున్న చొరవను నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మోడల్ బాగుందన్న కేంద్ర మంత్రి.. ఎస్‌పీసీకి సంబంధించిన వివరాలను అందజేయాలని సూచించారు. ఐఐఎం మంజూరు చేయండి తెలంగాణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విద్యాసంస్థను మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్Šడ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్‌తో పార్లమెంట్ ఆవరణలోని ఆయన చాంబర్లో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. దేశంలో 19 రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎంలు ఉన్నాయని, తెలంగాణ లోనూ ఐఐఎం ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ‘ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించాం. ఐఐఎం తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉంది. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేస్తే.. అవసరమైన వసతుల కల్పనకు మేం సిద్ధంగా ఉన్నాం. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్‌కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీతోపాటు అనుకూల వాతావరణం ఉంది’అని ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించారు. పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూతనంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని రేవంత్ కోరారు. కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు; హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు, ఇతర వసతులు కలి్పంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మందాడి అనిల్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. సోనియాతో భేటీ ఏఐసీసీ అగ్రనేత సోనియాగాం«దీతోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియాకు అందజేశారు. ప్రజాపాలనలో రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృధ్ధికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృధ్ధి పథంలో తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సోనియా ఆకాంక్షించారు. -
డెడ్ ఎకానమీయా?
న్యూఢిల్లీ: భారత్ డెడ్ ఎకానమీ అయితే గ్లోబల్ ఏజెన్సీలు అంతంత గొప్ప రేటింగులు ఎలా ఇస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలను ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను డెడ్ ఎకానమీగా పేర్కొనడంపై కేంద్రం వివరణ ఇచ్చి తీరాలని విపక్షాలు సోమవారం లోక్‌సభలో పట్టుబట్టాయి. దాంతో నిర్మల మాట్లాడారు. విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని స్పష్టం చేశారు. సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా 8.2 శాతం వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ గతంలో బయటి సాయంపై ఆధారపడేది. అలాంటిది గత పదేళ్లలో బయటి దేశాలకు ఆదర్శంగా మారేలా ఎదిగింది. డెడ్ ఎకానమీ అన్నదే నిజమైతే డీబీఆర్ఎస్, ఎస్ అండ్ పీ, సర్ అండ్ ఐ వంటి ప్రముఖ సంస్థలు మన క్రెడిట్ రేటింగ్‌ను పెంచుతాయా? ఎవరో ఏదో అంటే మనం పట్టించుకోవాలా? ఆరోపణలు చేసేది ఎంత పెద్దవారైనా సరే, గణాంకాలు ఏం చెబుతున్నాయన్నదే చూడాలి. వాటి ఆధారంగానే మాట్లాడాలి’’ అంటూ విపక్షాలకు మంత్రి నిర్మల హితవు పలికారు.రూ. 41 వేల కోట్ల వ్యయానికి లోక్ సభ ఆమోదంప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు కీలక శాఖలకు సంబంధించి రూ.41,455 కోట్ల మేరకు అదనపు వ్యయానికి లోక్‌సభ అనుమతి మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్లను సోమవారం ఆమోదించింది. దీన్ని బడ్జెట్ రూపకల్పనలో అసమర్థతగా విపక్ష ఎంపీలు చేసిన విమర్శలను మంత్రి నిర్మల తిప్పికొట్టారు. బాధ్యతాయుత ప్రభుత్వానికి ఇలాంటి సప్లిమెంటరీ డిమాండ్లు చాలా అవసరమన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని చెప్పారు. -
ప్రైవేటీకరణ ఆపండి నిర్మలా సీతారామన్‌కు YSRCP ఎంపీల ఫిర్యాదు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ఇండిగో తరహా సంక్షోభమే!
సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వేగంగా చేయాలని ప్రయత్నిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కోరుతున్నారు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీల బృందం ఈ మేరకు వినతి పత్రం అందజేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మెడికల్ కోర్సులు చదవడం కష్టంగా మారుతుంది. పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర ఇది. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. ఈనెల 17న ఈ కోటి సంతకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌కు అందిస్తారు. అందుకే ప్రభుత్వం వేగంగా మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రైవేటీకరణను ఆపాలి.. .. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హాయంలో 17 కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆస్తులను లీజుకు ఇస్తున్నారు. వంద రూపాయలకు ఎకరం చొప్పున ఒక్కో సంస్థకు 50 ఎకరాలు అప్పజెప్తున్నారు. దొడ్డి దారిన వారి నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ విధానాల వల్ల ప్రభుత్వ కాలేజీలలో డాక్టర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అని వినతి పత్రంలో ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో.. వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, రఘునాథ్ రెడ్డి , సుభాష్ చంద్రబోస్ , బాబురావు , అయోధ్య రామిరెడ్డి తదితరులు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామను కలిసి కుట్రను వివరించాం. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆమెనే నిధులు కేటాయించారు. ఏపీలో ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు ఫండింగ్ వచ్చింది. మిగిలిన మెడికల్ కాలేజీలకు ఫండ్ ఇవ్వాలని కోరాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దని కోరాంప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వల్ల పేదల విద్యార్థులకు పేదలకు అన్యాయం జరుగుతుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పిన అమరావతికి ఇప్పుడు అప్పు ఎందుకు తెచ్చారు?. మెడికల్ కాలేజీల రూపంలో లక్ష కోట్ల రూపాయలు ఆస్తి వస్తున్నా.. తనకు కావలసిన మనుషులకు పంచడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది రాబోయే తరాలకు, పేదలకు నష్టం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను విద్యార్థులు తమ టాపు ప్రయారిటీగా ఎంచుకుంటారు. వైద్య రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల ఇండిగో లాంటి సంక్షోభం తలెత్తుతుంది అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. -
ట్యాక్స్ అయిపోయింది.. ఇక భారీ మార్పులు వీటిలోనే..
భారీ సంస్కరణలకు సంబంధించి తదుపరి అజెండాలో కస్టమ్స్ నిబంధనలను సరళతరం చేయడం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వాటిని మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఇప్పటివరకు ఆదాయ పన్ను రేట్లు, వస్తు..సేవల పన్నుల (జీఎస్టీ) క్రమబద్ధీకరణ తదితర సంస్కరణలను అమలు చేసినట్లు ఆమె వివరించారు. ఇక కస్టమ్స్ డ్యూటీ రేట్లను క్రమబదీ్ధకరించడంపై దృష్టి పెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో దీనిపై ప్రకటనలు ఉండొచ్చని ఆమె వివరించారు. గత రెండేళ్లుగా కస్టమ్స్ సుంకాన్ని తాము గణనీయంగా తగ్గించామని తెలిపారు.అంతర్జాతీయ వాణిజ్యంలో భారత పోటీతత్వాన్ని పెంచేందుకు కస్టమ్స్ విధానాల్లో ఆధునీకరణ అత్యవసరమైందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారని మంత్రి సూచించారు. సరుకుల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయడం, పేపర్‌లెస్ విధానాలను మరింత విస్తరించడం, రిస్క్ మేనేజ్మెంట్ను మెరుగుపరిచే చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలతో ఎగుమతులు, దిగుమతుల సంబంధిత ఖర్చులు తగ్గి దేశీయ పరిశ్రమలకు మరింత అవకాశాలు కలుగుతాయని తెలిపారు.అదేవిధంగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశ ర్యాంకును మెరుగుపరిచేందుకు కస్టమ్స్ విభాగం కీలకంగా మారబోతోందని ఆమె అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా పారదర్శకమైన, అంచనాలు స్పష్టంగా ఉండే కస్టమ్స్ విధానాలు ఎంతో అవసరమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వ్యాపార వర్గాల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలనలోకి తీసుకుని రాబోయే బడ్జెట్లో వాటికి అనుగుణంగా విధానాలు ప్రకటించే అవకాశం ఉన్నదని ఆమె వెల్లడించారు. -
పైసలేవి మేడం?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విచిత్రమైన సన్నివేశం ఎదురైంది. శనివారం జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ ఇందుకు వేదికైంది. అందులో నిర్మల మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ‘కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక అక్కడ ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ జమ్మూ కశ్మీర్‌కు అతి కీలకమైన పర్యాటకం ’బయటి’ పరిస్థితుల వల్ల పూర్తిగా పడకేసింది‘ అని అన్నారు. తర్వాత అదే సదస్సులో ఒమర్ మాట్లాడుతూ, అసలు జమ్మూ కశ్మీర్లో డబ్బులు ఎక్కడున్నాయి మేడమ్ అంటూ నిర్మలను ప్రశ్నించారు. కశ్మీరం ఇప్పుడు మీ కాసులకు చెప్పలేనంతగా కటకటలాడుతోందని ఆవేదన వెలిబుచ్చారు. తమ ప్రాంత ప్రయోజన కోసం కేంద్రంతో సఖ్యంగా ఉంటే తప్పేమిటని విపక్షాలను, తన విమర్శకులను ప్రశ్నించారు. అందుకోసం పాలక బీజేపీతో జట్టు కట్టాల్సి అవసరం ఏమీ లేదని స్పష్టం చేశారు. -
‘రూపాయి’ని అలా చూడొద్దు: నిర్మలా సీతారామన్
కొనసాగుతున్న రూపాయి పతనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు స్పందన వచ్చింది. యూఎస్ డాలర్‌తో రూపాయి మారక విలువ కొన్ని రోజులుగా రికార్డ్ కనిష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. ఇటీవల ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ .90.43కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రూపాయి ఇటీవలి కదలికలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ మొదటి స్పందనను అందించారు.హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో మాట్లాడుతూ.. రూపాయి విలువలో భారీ జోక్యం చేసుకోకుండా మార్కెట్ శక్తులకు వదిలివేయాలన్నారు. మారకం రేట్లు "చాలా సున్నితమైనవి" అన్నారు. కరెన్సీ కదలికలను అతిగా రాజకీయం చేయడం లేదా అతిగా నిర్వహించడం గురించి ఆమె హెచ్చరించారు. అవి ప్రపంచ ఒత్తిళ్లకు త్వరగా స్పందిస్తాయని పేర్కొన్నారు.ఆర్థిక ప్రాథమికాంశాలు ముఖ్యంనేటి రూపాయి స్థాయిలను గత పరిస్థితులతో పోల్చకుండా 2026 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ అంచనా వేసిన భారతదేశ ప్రస్తుత వృద్ధి పథంపై దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ పరిశీలకులను కోరారు.పూర్తిగా ప్రతికూలం కాదురూపాయి బలహీనమైనప్పుడల్లా పూర్తిగా ప్రతికూలంగా చూడాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. రూపాయి విలువ క్షీణించినప్పుడు ఎగుమతిదారులు తరచుగా ప్రయోజనం పొందుతారని, ఎందుకంటే ఇది భారతీయ వస్తువులను విదేశాలలో మరింత పోటీగా మారుస్తుందని ఆమె పేర్కొన్నారు. -
పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్
న్యూఢిల్లీ: ప్రతిపాదిత హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లులో పాన్ మసాలా తయారీ యూనిట్లపై పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రకటించారు. ఈ పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటామని, ఆరోగ్య పథకాల కోసం వెచ్చిస్తామని తెలిపారు. హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు–2025పై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రత్యేక ప్రయోజనాల కోసం సెస్ విధించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 వీలు కల్పిస్తోందని చెప్పారు. అనంతరం బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. పాన్ మసాలా, అలాంటి ఉత్పత్తులను తయారు చేసేందుకు వినియోగించే యంత్రాలు, వాటి సామర్థ్యం ఆధారంగా విధించే సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని జాతీయ భద్రత, ప్రజారోగ్యం కోసం వినియోగించుకునేందుకు ఈ బిల్లులో ఏర్పాటుంది. గతంలోనూ ఇలా సెస్‌లను వివిధ వనరులపై ప్రభుత్వాలు విధించాయన్నారు. 1974 నుంచి క్రూడాయిల్‌పై సెస్, 2001 నుంచి నేషనల్ కెలామిటీ కంటింజెంట్ డ్యూటీ, 2000 నుంచి రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ పేరుతో పన్ను వసూలు చేస్తున్న చరిత్ర ఉందన్నారు. పాన్ మసాలా చౌకగా మారడానికి, అదే సమయంలో ఆదాయాన్ని కోల్పోయేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆమె తెలిపారు. వినియోగం ఆధారంగా పాన్ మసాలాపై గరిష్టంగా 40 శాతం మేర జీఎస్టీ ఉంటుందని చెప్పారు. అయితే, జీఎస్టీ ఆదాయంపై ఈ సెస్ ఎటువంటి ప్రభావం చూపదని ఆమె స్పష్టం చేశారు. -
ముంబై కల… అమరావతి గిమ్మిక్
అమరావతిలో 15 బ్యాంకులు, రెండు బీమా సంస్థల కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్‌లు కేంద్రం తమకు సహకరిస్తోందని చంకలు గుద్దుకుంటున్నారు. పైగా ఈ చిన్న విషయంతోనే అమరావతి ముంబై అయిపోతుందన్నంత బిల్డప్ కూడా ఇచ్చేశారు. నిన్నమొన్నటివరకూ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అన్నవాళ్లు కాస్తా ఇప్పుడు అమరావతి అంటున్నారు. ఇలా రోజుకో మాట మారిస్తే నమ్మేదెలా?.. ఇంతకి ఏమిటి వీరి బలహీనత?.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారుకు చిత్తశుద్ది ఉంటే, ఈ బ్యాంకు కార్యకలాపాలన్నీ కొత్తగా వస్తువన్నవి అని నమ్ముతూంటే అవి విశాఖలో పెరిగేలా చేస్తే ఏపీకి సత్వర ప్రయోజనం కలిగేది కదా! అని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ విలువలు పెంచడానికి, ధరలు పెరిగాయన్న కృత్రిమ భావన కల్పించడానికి తంటాలు పడుతున్న ప్రభుత్వ పెద్దలు దీనిని ఒక గిమ్మిక్కుగా మార్చారన్న అనుమానం కలుగుతుంది. తాజా ప్రచారం ప్రకారం మరికొన్ని సంస్థలను కూడా విశాఖ అమరావతికి తరలిస్తున్నారట. స్టాక్ ఎక్చేంజ్ బోర్డు ఆఫీస్‌ను గతంలో విశాఖలో ఏర్పాటు చేయాలని తలపెట్టగా ఇప్పుడు అమరావతికి మార్చే యోచన చేస్తున్నారు. గత ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫీస్‌ను వైజాగ్‌లో ప్రతిపాదిస్తే అమరావతికి మార్చారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, బిట్స్ పిలాని క్యాంపస్, ఏఐ, స్కిల్ యూనివర్శిటీలరె కూడా అమరావతికి మారుస్తారట. ఇప్పటికే అనంతపురం నుంచి ఎయిమ్స్, కర్నూలు నుంచి లా యూనివర్శిటీ తిరుపతి నుంచి హెచ్సీఎల్లను తరలించారు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడ నుంచి ఒక కార్యాలయం ఇక్కడకు తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇలా చేస్తే మళ్లీ ప్రాంతీయ అసమానతలు,విద్వేషాలు పెరగవా అని కొంతమంది విజ్ఞులు బాదపడుతున్నారు. కొత్త ప్రభుత్వ సంస్థలను అమరావతిలో స్థాపించవచ్చు.గతంలో అనేక ప్రైవేటు పరిశ్రమలు అమరావతికి పరుగులు పెట్టుకుంటూ వస్తాయని అన్నారు.అలా జరిగితే అందరికి ప్రయోజనంగా ఉంటుంది. వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారు. దాని ప్రయోజనం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి దక్కాలి.అలాకాకుండా అప్పులు భారం అందరిపై పడి, ఆర్థిక లాభం మాత్రం అమరావతి ప్రాంతంలోని కొందరికే లభిస్తే అది సమస్యలకు దారి తీయవచ్చు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమరావతిలో పెడుతున్న బ్యాంకు ఆఫీసులు అన్ని విజయవాడలో ఇప్పటికే పనిచేస్తున్నాయట. వాటినే అమరావతికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నమాట. కాకపోతే దానికి ఫైనాన్షియల్ స్ట్రీట్ అని ఒక పేరు తగిలిస్తారన్నమాట. నిజానికి బ్యాంకులు, బీమా సంస్థలు అన్నీ ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదు. మరో సంగతి ఏమిటంటే ఆయా చోట్ల వివిధ బ్యాంకులకు రీజినల్ ఆఫీసులు కూడా ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లో అన్ని బ్యాంకులు ఓకే చోట ఉండడం వల్ల కలిసివచ్చేది ఏమీ ఉండదు. వికేంద్రీకరిస్తే అందరికి సమన్యాయం జరుగుతున్నట్లు అవుతుంది.అందుకు భిన్నంగా ఇతర చోట్ల నుంచి తీసుకు వచ్చి వాటిని అమరావతిలో పెడితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.కాకపోతే ప్రభుత్వ సొమ్ము కాబట్టి కోట్ల రూపాయలకు వారికి భూమిని కేటాయించామని చెప్పుకోవచ్చేమో!. విశాఖలో ప్రైవేటు సంస్థలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు పందారం కావిస్తూ, అమరావతిలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించాలి. ఒకప్పుడు అమరావతిలో ఐటీ మొదలు అనేక సంస్థలు వస్తున్నాయని ఊదరగొట్టారు.నవ నగరాల పేరుతో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేశారు. ఇప్పుడేమో అందుబాటులో ఉన్న ఏభైవేల ఎకరాలు సరిపోదని, అలా అయితే మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని చంద్రబాబు బెదిరిస్తున్నారు. కొత్తగా మరో నలభైవేల ఎకరాల భూముల సమీకరణకు సిద్దం అవుతున్నారు. నిర్మలా సీతారామన్ కు ఈ విషయాలన్నీ తెలుసో ,లేదో కాని ఆమె ఒక విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో కూరగాయలు బాగా పండుతాయని, వాటికి ప్రోసెసింగ్ యూనిట్లు పెట్టడం, ఎగుమతికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు నెలకొల్పడం వంటివి చేయాలని సూచించారు. కాని ఇప్పటికే రాజధాని పేరుతో భూములన్నిటిని చంద్రబాబు ప్రభుత్వం దున్నివేయించింది. వేలాది ఎకరాలలో పంటలు లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అడవిలా మారినట్టు పలు కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె గమనించి సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది. బ్యాంకులు వారు రైతులకు సహకరించాలని చెబుతూనే కమర్షియల్ గా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. అంటే ఎవరికి ఎలాంటి రాయితీలు ఇవ్వవలసిన అవసరం లేదని తేల్చేశారన్నమాట. పోనీ అమరావతికి ఏమైనా కొత్తగా నిధులు ఇస్తున్నారా అంటే అదేమి చెప్పలేదు. చంద్రబాబు తన ప్రసంగంలో కేంద్రం రూ.15 వేల కోట్ల ఇచ్చి సహకరిస్తోందని అన్నారు. కాని అది రుణమా?లేక గ్రాంటా అన్నది చెప్పినట్లు కనిపించలేదు. నిజంగానే అది గ్రాంట్ అయితే నిర్మలా సీతారామన్ ప్రస్తావించకుండా ఉంటారా?.. బడ్జెట్ లో ఏపీకి బలమైన మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ చెప్పారని ఆమె తెలిపారు. కాని అది ఏ రూపంలో ఇంతవరకు ఇచ్చారు. ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇస్తే ఏపీకి ఆర్థిక భారం అవుతుంది. అలాంటప్పుడు అది సాయం ఎలా అవుతుంది?. కేంద్రం నుంచి సుమారు రూ.36 వేల కోట్ల సాయం వస్తుందని ఏపీ బడ్జెట్లో పెడితే ఇప్పటికి కేవలం ఐదువేల కోట్ల లోపే అందిందట. దీని గురించి ఆమె ఏమైనా హామీ ఇస్తే బాగుండేది కదా!. రాష్ట్రం సుమారు రూ.45 వేల కోట్ల భారీ రెవెన్యూ లోటుతో కొట్టుమిట్టాడుతోంది. అది తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సాయపడి ఉంటే అందరు అభినందించేవారు. అవేవి చేయకపోయినా చంద్రబాబు, తదితరులు మెచ్చుకుంటున్నారు. కాబట్టి కేంద్రంలోని వారికి ఇబ్బంది లేదనుకోవాలి. నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబుకు లేని క్రెడిట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. ఆయన చేసిన పనులు చెప్పి పొగిడితే తప్పు లేదు. కాని హైదరాబాద్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం అయనే చేసినట్లు నిర్మలా వ్యాఖ్యానించడం అందరిని విస్తుపరచింది. హైదరాబాద్‌లో ఈ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ది అంతా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ అంతా తానే నిర్మించానన్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటారు. ఈ మధ్య ఆయన ఒక స్పీచ్ ఇస్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తానే వేసినట్లు చెప్పుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దానికింద ఒక అధికారి గతంలో ఈ రింగ్ రోడ్డును వైఎస్సార్ ఎలా అభివృద్ది చేసింది వివరిస్తున్న దృశ్యం కనిపించింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రింగ్ రోడ్డు నిర్మాణం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిందని తెలిపే వీడియో కూడా వచ్చింది. అయినా చంద్రబాబు ఎందుకో అసత్యాలు చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తూంటారు. ఇలాంటి పరిస్థితిలో నిర్మలా సీతారామన్ కూడా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్రెడిట్ ను చంద్రబాబుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. చంద్రబాబు ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి. ఆ తర్వాత జరిగిన అభివృద్దిని కూడా తన ఖాతాలో వేసుకుని ఏపీలో ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్నది ఆయన ఉద్దేశం అన్నది కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్‌ను అంతగా అభివృద్ది చేసి ఉంటే మరి ఏపీలో విశాఖ,విజయవాడ,తిరుపతి వంటి నగరాలను ఎందుకు వృద్ది చేయలేకపోయారు?.. ఇకపై ముంబై ఆర్ధిక నగరం కాదట.అమరావతి అట. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.ఈ రకంగా మాట్లాడడం నవ్వులపాలయ్యే అంశమా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. ముంబై ఎక్కడ?అమరావతి ఎక్కడ? అర్థం ఉండాలి కదా మాట్లాడడానికి!. విమానాశ్రయం పేరుతో, స్పోర్ట్స్ సిటీ పేరుతో రకరకాలుగా వేల ఎకరాల అదనపు భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్దమవుతున్న తీరు అమరావతి రైతుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తోంది. వారిని మభ్య పెడుతూ ఇలాంటి కార్యక్రమాలలో ప్రసంగాలు చేస్తే ఏమి ఉపయోగం?.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఎక్సైజ్ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: పొగాకు, పొగాకు సంబంధ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన కేంద్ర ఎక్సైజ్ (సవరణ), బిల్లు–2025కు గురువారం పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక కోవిడ్ కాలంలో రాష్ట్రాలు కోల్పోయిన రెవెన్యూ ఆదాయాన్ని భర్తీచేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ పరిహార సెస్ ముగిసిపోయాక ఈ కొత్త అత్యధిక ఎక్సైజ్ సుంకాలను విధిస్తారు. అధిక ఎక్సైజ్ సుంకం కారణంగానైనా రైతులు పొగాకు సాగును వదిలేసి ఇతర పంటల వైపు మళ్లుతారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానంగా నిర్మల మాట్లాడారు. ‘‘ పొగాకు సాగును రైతులు భారీగా తగ్గించుకుని ఇతర పంటల వైపు దృష్టిసారించడమే ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్, బిహార్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రైతులు ఇప్పటికే అదే బాటలో నడిచారు. దాదాపు లక్ష ఎకరాలకుపైగా సాగు భూమిలో పొగాకు సాగును వదిలేసి ఇతర పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. జీఎస్టీ పరిహార సెస్ ముగిసేదాకా పొగాకు ఉత్పత్తులను అయోగ్య ఉత్పత్తుల కేటగిరీలో 40 శాతం పన్నులే వసూలుచేస్తాం’’ అని ఆమె అన్నారు. బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టరూపం దాల్చాక కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, నమిలే పొగాకు, చుట్టలు, హుక్కా, గుట్కా, ఖైనీ, జర్దా తదితర పొగాకు ఉత్పత్తులపై అధిక ఎక్సయిజ్ డ్యూటీ విధించనుంది. ముడి పొగాకుపై 60 నుంచి 70 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు. చుట్టలు, సిగరెట్లపై 25 శాతం లేదా ప్రతి 1,000 సిగరెట్లు/చుట్టలపై గరిష్టంగా రూ.5,000 ఎక్సైజ్ డ్యూటీ వసూలుచేస్తారు. ఆయా సిగరెట్లు, చుట్టలకు ఫిల్టర్, నాణ్యత, పొడవు ఆధారంగా ప్రతి 1,000 చుట్టలు/సిగరెట్లపై కనిష్టంగా రూ.2,700, గరిష్టంగా రూ.11,000 ఎక్సయిజ్ సుంకం విధిస్తారు. నమిలే పొగాకుపై కేజీకి రూ.100 వసూలుచేస్తారు. నిత్యావసర వస్తువులపై ఆరోగ్య, జాతీయభద్రతా సెస్ ఉండదు నిత్యావసర వస్తువులపై కొత్తగా ప్రతిపాదించిన ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్‌ను విధించబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. పాన్ మసాలా వంటి అయోగ్య(డీమెరిట్) వస్తువులపై మాత్రమే కొత్త సెస్‌ను వసూలుచేస్తామని ఆమె పేర్కొన్నారు. ఇలా వచ్చిన రెవెన్యూను రాష్ట్రాల్లో ఆరోగ్య పథకాల కోసం ఖర్చుచేసేందుకు రాష్ట్రాలతో పంచుకుంటామని ఆమె చెప్పారు. గురువారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల ఈ విషయాన్ని వెల్లడించారు. అవగాహన కంటే ఆదాయంమీదే దృష్టిపెట్టారుపొగాకు ఉత్పత్తుల అతి వినియోగాన్ని తగ్గించేందుకు, జనాల్లో దురలవాట్లపై దుష్ప్రభావాలపై అవగాహన పెంచడంపై దృష్టిపెట్టకుండా ప్రభుత్వం అధిక ఆదాయంపై దృష్టిసారించిందని విపక్ష పార్టీల సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బిల్లు ఆమోదం పొందడానికి ముందు బిల్లుపై జరిగిన చర్చలో పలువురు ఎంపీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. -
క్రిప్టో తరహా ఆర్థిక ఉత్పత్తులతో సవాళ్లు
ఆర్థిక వ్యవస్థలు డిజటల్‌గా మారుతుండడం, క్రిప్టో, స్టెబుల్ కాయిన్లు తరహా కొత్త ఆర్థిక ఉత్పత్తులు పుట్టుకొస్తుండడంతో.. వీటి కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.లబ్ధిదారుల వివరాలు, పన్నుల సమాచారాన్ని సకాలంలో పంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఇందుకోసం కృత్రిమ మేథ (ఏఐ) వంటి సాధనాలను వినియోగించుకోవాలని, దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఇందుకు వీలుగా అంతర్జాతీయ ఫోరమ్ కోసం మంత్రి సీతారామన్ పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రమాణాలను మరింత బలోపేతం చేయడంతోపాటు పంచుకున్న సమాచారం ఆధారంగా ఫలితాలు సాధించేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు.ఢిల్లీలో మంగళవారం 18వ గ్లోబల్ ఫోరమ్ ప్లీనరీ సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. ఏ ఒక్క దేశం తనంతట తాను ఈ సవాళ్లను పరిష్కరించలేదన్నారు. సహకారం, విశ్వాసం, సకాలంలో సరైన సమాచారం పంచుకోవడం అవసమరన్నారు. స్పష్టమైన నిబంధనల మేరకు నడుచుకుంటే పన్నుల్లో పారదర్శకత, కచ్చితత్వం ఉంటుందన్నారు.గడిచిన దశాబ్ద కాలంలో దేశంలో స్వచ్చంద నిబంధనల అమలు మెరుగుపడినట్టు మంత్రి చెప్పారు. సకాలంలో సమాచారాన్ని గుర్తించేందుకు ఏఐ తరహా టెక్నాలజీలు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆవిష్కరణలు అన్నవి జవాబుదారీగా ఉండాలంటూ.. ఇవి వ్యవస్థలకు బలాన్ని, విశ్వసనీయతను తెచ్చిపెట్టే విధంగా ఉండాలన్నారు. రహస్య సమాచారం.. డేటా గోప్యతకు సంబంధించి బలమైన వ్యవస్థల దిశగా దేశాలు కలసి పనిచేయాలని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ పిలుపునిచ్చాన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పంచుకునే సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించు కోవాలన్నారు. -
ఎల్ఐసీ స్టాక్స్ కొనుగోళ్లపై సలహాలివ్వం
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై తమ శాఖ ఎలాంటి సలహాలివ్వదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే ఈ విషయంలో మార్గనిర్దేశం సైతం చేయదని తెలియజేశారు. అదానీ గ్రూప్ కంపెనీలలో ప్రామాణిక నిర్వహణా సంబంధ నిబంధనల (ఎస్వోపీ)మేరకే ఎల్ఐసీ వాటాల కొనుగోళ్లు చేపట్టినట్లు ఒక ప్రశ్నకు గాను లోక్‌సభకి ఇచి్చన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. టాప్ ర్యాంక్ బీమా దిగ్గజం అనేక సంవత్సరాలుగా ఆయా కంపెనీల ఆర్థిక మూలాలు (ఫండమెంటల్స్) ఆధారంగానే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. కంపెనీలపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాక మాత్రమే స్టాక్స్ కొనుగోళ్లు చేపడుతుందని వివరించారు. వెరసి ఎస్వోపీల ప్రకారం తగిన పరిశీలనతోపాటు.. రిసు్కలపై అధ్యయనం చేశాక అదానీ గ్రూప్‌లోని ఆరు కంపెనీలలో ఎల్ఐసీ ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్ కంపెనీల పుస్తక విలువ రూ. 38,659 కోట్లుకాగా.. సంబంధిత కంపెనీల రుణ పత్రాలలోనూ మరో రూ. 9,626 కోట్లవరకూ పెట్టుబడులు చేపట్టినట్లు తెలియజేశారు. ఎల్ఐసీ ఫండ్ చేపట్టే పెట్టుబడి నిర్ణయాలపై ఆర్థిక శాఖ ఎలాంటి సూచనలు లేదా సలహాలు ఇవ్వబోదని, స్టాక్ కొనుగోళ్లలో ఎలాంటి ప్రమేయం ఉండదని పేర్కొన్నారు. చట్టాల ప్రకారమే ... ఎల్ఐసీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు 1938 బీమా చట్టం, ఐఆర్డీఏఐ నియంత్రణలు, ఆర్బీఐసహా.. సెబీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు. అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబడులకు వీలుగా ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రణాళికను రూపొందించినట్లు అక్టోబర్‌లో వాషింగ్టన్ పోస్ట్‌లోని ఒక నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో రుణభారంతోపాటు.. యూఎస్‌లో నిశిత పరిశీలనను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబడులకు ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రణాళికను అమలు చేసినట్లు నివేదిక ఆరోపించింది. 2025 మే నెలలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో ఎల్ఐసీ 57 కోట్ల డాలర్లు (సుమారు రూ. 5,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి సీతారామన్ వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఎస్‌వోపీలు, బోర్డు అనుమతులతో 2025 మేలో ఎల్ఐసీ.. అదానీ పోర్ట్స్ జారీ చేసిన ఎన్‌సీడీలలో రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయిన టాప్–500 కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడులు చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం పెట్టుబడుల్లో ప్రధాన వాటా భారీ కంపెనీలలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 50 కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడుల పుస్తక విలువ 2025 సెపె్టంబర్ 30 కల్లా రూ. 4,30,777 కోట్లుగా పేర్కొన్నారు. -
రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం
జాతీయ భద్రత, ప్రజారోగ్య రంగాల కోసం అదనపు నిధులను సమీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ‘ఆరోగ్య భద్రత, జాతీయ భద్రతా సెస్ బిల్లు-2025’ను ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది.ఈ ప్రతిపాదిత సెస్ అనేది నిర్దిష్ట వస్తువుల ఉత్పత్తి, తయారీ యంత్రాలకు వర్తిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. త్వరలో ముగియనున్న పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్‌ను ఈ కొత్త సెస్ భర్తీ చేయనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా పొగాకు ఉత్పత్తులపై ఉన్నత స్థాయి జీఎస్టీ రేటును కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని సమాచారం.ఈ సెస్‌ను అమల్లోకి తీసుకువచ్చేందుకు జాతీయ భద్రత, ప్రజారోగ్యం అనే రెండు ప్రధాన అంశాలు కారణంగా ఉన్నాయి. ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటరీ స్థాయి ప్యానెల్ ‘ఫ్యూచర్ వార్ఫేర్ ఫండ్’ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఈ నిధిని సాయుధ దళాల్లో భవిష్యత్ యుద్ధ సాంకేతికతల అధ్యయనం కోసం ఉపయోగించాలని సూచించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రక్షణ కేటాయింపులు ఇప్పటికే రూ.6.18 లక్షల కోట్లు దాటాయి. ఈ సెస్ అమల్లోకి వస్తే మరింత నిధులు చేరే అవకాశం ఉంటుంది.ప్రజారోగ్యం, పథకాల విస్తరణఆయుష్మాన్ భారత్ వంటి కీలక ఆరోగ్య పథకాల విస్తరణకు అదనపు వనరుల అవసరం ఉంది. ప్రస్తుతం దేశ జనాభాలోని 40 శాతం ప్రజలకు చెందిన సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులకు అంటే దాదాపు 12.37 కోట్ల కుటుంబాలకు ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తోందని ప్రభుత్వ చెబుతుంది. 2025-26లో ఆరోగ్య రంగానికి సుమారు రూ.1 లక్ష కోట్ల వ్యయం అంచనా వేయగా, జాతీయ ఆరోగ్య విధానం ఆరోగ్య వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని సిఫారసు చేస్తోంది. దాంతో ఈ సెస్ ఎంతో తోడ్పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.సెంట్రల్ ఎక్సైజ్ చట్టం సవరణఈ కొత్త సెస్ బిల్లుతో పాటు, 1944కి చెందిన వలస పాలన కాలం సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్‌ను కూడా ప్రభుత్వం సవరించనుంది. సవరణ అనంతరం ఎక్సైజ్ సుంకం కేవలం ముడి పెట్రోలియం, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్, సహజ వాయువు, పొగాకు ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుందనే అంచనాలున్నాయి. దీనికి సంబంధించి ఇంకా సమగ్ర వివరాలు తెలియాల్సి ఉంది. పన్ను పరిధిని విస్తరించే ఉద్దేశం లేకపోయినా సమకాలీన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పాత చట్టాన్ని ఆధునీకరించడమే ఈ సవరణ లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొంది.ఇప్పటికే అమలవుతున్న సెస్లుఆదాయపు పన్నుపై 4% హెల్త్, ఎడ్యుకేషన్ సెస్.పెట్రోల్, డీజిల్‌పై వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్, రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్.పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్.సాధారణంగా ఈ సెస్‌ల నుంచి వచ్చే ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకోదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తరచూ విమర్శలు వస్తున్నాయి.సరిహద్దు ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఆరోగ్య డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం ఈ రెండు కీలక రంగాలను సమానంగా బలోపేతం చేయాలని చూస్తోంది. అయితే సెస్‌లపై అధికంగా ఆధారపడటం వల్ల కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంబంధాలు, వినియోగదారులపై అదనపు భారం వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు బిల్లులు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ప్రధాన చర్చాంశంగా మారనున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగాలు మట్టి కొట్టుకుపోతాయి!.. మస్క్ ఇంటర్వ్యూ -
ఇన్ఫ్రా, ఇంధన రంగ నిపుణులతో ఆర్థిక మంత్రి భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఢిల్లీలో మౌలిక రంగం, ఇంధన రంగాలకు చెందిన నిపుణులతో భేటీ అయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) బడ్జెట్‌పై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆఫ్కాన్స్ ఎండీ ఎస్.పరమశివన్, షాపూర్జీ పల్లోంజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ డైరెక్టర్ మనీష్ త్రిపాఠి, జీఎంఆర్ గ్రూప్ డిప్యూటీ ఎండీ కె.నారాయణరావు, జేఎం బక్సి గ్రూప్ డైరెక్టర్ సందీప్ వాద్వా, ఇన్ఫ్రా విజన్ ఫౌండేషన్ సీఈవో జగదన్‌షా తదితర కంపెనీల సారథులు ఇందులో పాల్గొన్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సీతారామన్ రానున్న 2026–27 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి 11వ ముందస్తు సమావేశాన్ని ఇన్ఫ్రా, ఇంధన రంగాల నిపుణులతో నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ, షిప్పింగ్ శాఖల కార్యదర్శులు, రైల్వే బోర్డ్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు హాజరయ్యారు’’అని ఆర్థిక శాఖ తన పోస్ట్‌లో వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ 2026–27 బడ్జెట్‌ను 2026 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా వాణిజ్య అనిశి్చతుల నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు ప్రాధాన్యం నెలకొంది. డిమాండ్, ఉపాధి కల్పనను పెంచడం, దేశ జీడీపీని 8 శాతం వృద్ధి రేటుకు చేర్చడం వంటి ప్రధాన సవాళ్లు ఆర్థిక మంత్రి ముందున్నాయి. వ్యవసాయం, ఎంఎస్‌ంఎఈలు, ఆరోగ్య సంరక్షణ, క్యాపిటల్ మార్కెట్ రంగాల ప్రతినిధులు, ప్రముఖ ఆర్థికవేత్తలతో ఇప్పటి వరకు బడ్జెట్ ముందస్తు సమావేశాలు నిర్వహించడం గమనార్హం. -
పర్యాటక రంగానికి జాతీయ బోర్డు ఉండాలి
న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగం దీర్ఘకాల అభివృద్ధి కోసం నేషనల్ టూరిజం బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను పరిశ్రమల ప్రతినిధులు కోరారు. అలాగే, మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు నిధుల మద్దతు అవసరమని స్పష్టం చేశారు. బడ్జెట్‌కు ముందు పర్యాటకం, ఆతిథ్య రంగాల ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పర్యాటకం–ఆతిథ్యానికి అన్ని రాష్ట్రాలూ పరిశ్రమ హోదా కలి్పంచేందుకు సహకరించాలని.. దీనివల్ల అందుబాటు ధరలపై రుణాలను పొందడం సాధ్యపడుతుందని ఈ రంగాల ప్రతినిధులు కోరారు. కొన్ని రాష్ట్రాలు పరిశ్రమ హోదా ఇవ్వగా, మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండంతో పరిశ్రమ ప్రతినిధులు కేంద్రం సహకారాన్ని ఆశించారు. పరిశ్రమ హోదా లేకపోవడం, సమన్వయం లేని నియంత్రణలు వృద్ధికి అడ్డు పడుతున్నట్టు చెప్పారు. లైసెన్స్‌ల మంజూరు, హోటళ్లకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) దాఖలుకు వీలుగా సింగిల్ విండో అనుమతుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్, ఇండియా ఫుడ్ టూరిజం ఆర్గనైజేషన్, టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తదితర సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
పన్ను మినహాయింపులు ఇవ్వాలి
రానున్న బడ్జెట్లో సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను(ఎస్టీటీ) తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు క్యాపిటల్ మార్కెట్ సంస్థల ప్రతినిధులు విన్నవించారు. ఆర్థిక మంత్రితో ప్రీబడ్జెట్ సమావేశం సందర్భంగా క్యాపిటల్ మార్కెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిలో చోటు కల్పించడం తదితర అంశాలను సూచించారు. ఫైనాన్షియల్ రంగం మరింత లోతుగా విస్తరించేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. డెరివేటివ్స్తో పోలిస్తే నగదు విభాగంలో ఎస్టీటీని కుదించాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక బడ్జెట్ రూపకల్పనకు తెరతీసిన నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ ప్రతినిధులు నాలుగోసారి ఆర్థిక మంత్రిని కలవడం గమనార్హం! స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్‌ఈసహా ఎంసీఎక్స్, మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ), పెట్టుబడుల రిజిస్టర్డ్ సలహాదారులు, కమోడిటీ పార్టిసిపెంట్ల అసోసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులు ఆర్థిక మంత్రితో సమావేశానికి హాజరయ్యారు. ఫిబ్రవరి 1న 2026–27 బడ్జెట్‌ను సీతారామన్ లోక్‌సభలోప్రవేశపెట్టే అవకాశముంది. తద్వారా వరుసగా 9వసారి బడ్జెట్‌ను ప్రకటించనున్నారు. 33 శాతం అప్ గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో క్యాపిటల్ మార్కెట్లు 33 శాతం అధికంగా రూ. 14.6 లక్షల కోట్ల పెట్టుబడుల మొబిలైజేషన్‌కు వీలు కల్పించాయి. ఈక్విటీ, డెట్, రియల్టీ ట్రస్ట్(రీట్)లు, ఇన్ఫ్రా ట్రస్ట్(ఇన్విట్)లు తదితర ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ల ద్వారా నిధుల మొబిలైజేషన్ జరిగింది. కార్పొరేట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు విభిన్న ఫైనాన్సింగ్ వ్యూహాలను అందిపుచ్చుకోవడాన్ని ఇది ప్రతిఫలిస్తోంది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ, డెట్ విభాగాలే రూ. 14.2 లక్షల కోట్లను ఆక్రమించడం విశేషం! వెరసి ఆర్థిక వృద్ధికి అనువైన పెట్టుబడులను సమకూర్చడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాగా.. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అనురాధా ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌తోపాటు ఆర్థిక శాఖకు చెందిన ఇతర అధికారులు హాజరయ్యారు. వార్షిక బడ్జెట్ తుది రూపకల్పనకు ముందు ఆర్థిక శాఖ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించే విషయం విదితమే. ఈ బాటలో గత వారం సైతం ఆర్థికవేత్తలు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగ అత్యున్నత ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించింది. డిమాండును పెంచడం, ఉద్యోగ కల్పన, 8 శాతం ఆర్థిక వృద్ధి తదితర లక్ష్యాలతో బడ్జెట్ రూపొందనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. -
నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ చేసి.. 99లక్షలు కాజేశారు
పూణే: హలో మేడం.. మేం ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఆధార్‌కు లింక్ చేసిన ఫోన్ నంబర్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం" అంటూ అరెస్టు వారెంట్ పంపించారు. లెటర్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకం ఉండటంతో బాధితురాలు నమ్మింది.ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి రూ.99 లక్షలు అడిగాడు. భయంతో బాధితురాలు ఆ మొత్తాన్ని చెప్పిన బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసింది. అనంతరం అదే నంబర్‌కు కాల్ చేయగా..ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించింది. తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.సైబర్ నేరస్తులు ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఓటీపీలు షేర్ చేయొద్దంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో ప్రజల్లో అవగాహన పెరగడంతో, సైబర్ మోసగాళ్లు నకిలీ అరెస్ట్ వారెంట్లు, అధికార ముద్రలు, ప్రముఖుల సంతకాలను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.తాజా ఘటన అక్టోబర్ చివరి వారంలో పూణేలోని కొథ్రుడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలు ఎల్ఐసీ సంస్థలో ఉన్నతోద్యోగినిగా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేశారు.ఇంట్లో ఉంటున్న సమయంలో ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ నుంచి సీనియర్ అధికారినంటూ నిందితుడు పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆధార్‌కు లింక్ చేసిన ఫోన్ నెంబర్‌తో అక్రమ లావాదేవీలకు ఉపయోగించినట్లు బెదిరించాడు.తర్వాత ఆమెను జార్జ్ మాథ్యూ అనే మరో వ్యక్తికి కనెక్ట్ చేసి, మనీలాండరింగ్ కేసులో ఆమె పేరు ఉందని చెప్పాడు.నిర్మలా సీతారామన్ నకిలీ సంతకంతో, అధికారిక ముద్ర, సీల్‌తో కూడిన అరెస్ట్ వారెంట్ పంపించారు. ఆమె వయస్సు కారణంగా మినహాయింపు ఇస్తున్నామని, విచారణ కోసం కెమెరా ముందు రావాలని సూచించారు. ధృవీకరణ కోసం కొంత నగదు బదిలీ చేయాలని చెప్పడంతో, ఆమె రూ.99 లక్షలు పంపించారు. చివరికి తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాల్ని పోలీసుల్ని ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
వ్యవసాయంలో పరిశోధనలను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో పెరిగిపోతున్న వాతావరణ పరమైన సవాళ్లను అధిగమించేందుకు వీలుగా పరిశోధన, అభివృద్ధికి (ఆర్అండ్డీ) మరిన్ని నిధుల సాయం అందించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు నిపుణులు సూచించారు. ఈ దిశగా విధానపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన బడ్జెట్ ముందస్తు సమావేశంలో వ్యవసాయ రంగం, ఆర్అండ్డీ సంస్థల నుంచి 12 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగం ప్రస్తుత స్థాయి నుంచి మరింత ప్రగతి సాధించేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యల గురించి వారు తమ సూచనలు అందించారు. వ్యవసాయరంగ కార్యదర్శి దేవేష్ చౌదరి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ ఎంఎల్ జట్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం సానుకూలంగా జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను నిపుణులు ప్రస్తావించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్య క్రమంలో చర్యలు తీసుకోవాలని కోరినట్టు వెల్లడించాయి. వ్యవసాయంలో ఆర్‌అండ్‌డీకి వాస్తవ నిధుల కేటాయింపులు గత రెండు దశాబ్దాల కాలంలో తగ్గినట్టు ఈ సమావేశంలో పాల్గొన్న భారత్ క్రిషక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జఖార్ తెలిపారు. పంటల బీమాను తిరిగి సమీక్షించాలని, చాలా మంది రైతులు దీని విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. వ్యవసాయ ముడి పదార్థాల విక్రయ వివరాలను వర్తకులు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే విధానం ఉండాలని కోరారు. అలాగే, కనీస మద్దతు ధరలను ప్రకటిస్తున్న పంట ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు విధించాలని అభిప్రాయపడ్డారు.ప్రముఖ ఆర్థికవేత్తలతోనూ భేటీ మరోవైపు ప్రముఖ ఆర్థికవేత్తలైన సాజిద్ చినాయ్, నీల్కాంత్ మిశ్రా, ధర్మకృతి జోషి, రిధమ్ దేశాయ్, సోనల్ వర్మ, ఇందిరా రాజారామన్ తదితరులతోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. 2026–27 బడ్జెట్‌కు సంబంధించి ప్రముఖ ఆర్థికవేత్తలతో ఇది తొలి సమావేశమని ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించింది. -
బ్యాంక్ సిబ్బంది స్థానిక భాషలో మాట్లాడాలి
ముంబై: కస్టమర్లతో మరింత మమేకం అయ్యేందుకు గాను బ్యాంకు సిబ్బంది స్థానిక భాషలో మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) సూచించారు. స్థానిక భాష తెలిసిన వారినే నియమించాలన్న డిమాండ్లు ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల్లో వినిపిస్తుండడంతో కేంద్ర మంత్రి దీనిపై స్పందించారు. బెంగళూరులో ఇటీవల ఎస్బీఐ మేనేజర్ ఒకరు కన్నడ భాష తెలియక, దురుసు ప్రవర్తనతో విమర్శల పాలు కావడం తెలిసిందే. ‘‘బ్రాంచ్‌లో నియమించే ప్రతీ ఉద్యోగి తన కస్టమర్‌ను అర్థం చేసుకుని, స్థానిక భాషలో మాట్లాడే విధంగా ఉండాలి. ముఖ్యంగా యాజమాన్యానికి స్థానిక భాష తెలియని పరిస్థితుల్లో, బ్రాంచ్ స్థాయి అధికారులు అయినా స్థానిక భాషలో మాట్లాడగలగాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం ఆధారంగా ఉద్యోగుల పనితీరును మదింపు వేసే విధానం ఉండాలి’’అని ఎస్బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి స్పష్టం చేశారు. వివిధ మాతృభాషల అధికారులను వేర్వేరు భిన్న ప్రాంతాల్లో నియమించరాదన్న విధానాన్ని మాత్రం తాను సమర్థించబోనన్నారు. కస్టమర్లతో అనుబంధమే కీలకం బ్యాంకు తన కార్యకలాపాల నిర్వహణకు స్థానిక కస్టమర్లు కీలకమని, బ్యాంకు వృద్ధి అవసరాల పరంగా చూసినా వారితో అనుసంధానత ఎంతో కీలకమని మంత్రి గుర్తు చేశారు. కస్టమర్లతో అనుబంధం తగ్గిపోతుండడంతో క్రెడిట్ సమాచార సంస్థలపై (సిబిల్ తదితర క్రెడిట్ బ్యూరోలు) బ్యాంకులు ఎక్కువగా ఆధారపడాల్సి వస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఆయా సంస్థలు తాజా సమాచారాన్ని అప్డేట్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని, దీంతో కొన్ని సందర్భాల్లో కస్టమర్లు రుణ తిరస్కరణలు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు గుర్తు చేశారు. గతంలో బ్యాంక్ అధికారులకు తన కస్టమర్ల రుణ సామర్థ్యం గురించి అవగాహన ఉండేదన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను అడ్డుకోమురిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో)లో ట్రేడింగ్ చేయకుండా ప్రభుత్వం అడ్డుకోబోదని మంత్రి సీతారామన్ స్పష్టం చేశారు. కాకపోతే అందులో ఉండే రిస్క్ ల గురించి అవగాహన కల్పిస్తామని ప్రకటించారు. ఎఫ్‌అండ్‌వో మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లలో ప్రతి 100 మందికి 91 మంది నష్టపోతున్నట్టు సెబీ అధ్యయనంలో వెల్లడి కావడం తెలిసిందే.పెద్ద బ్యాంక్‌లు కావాలి.. మన దేశానికి అతిపెద్ద, ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు. ఇందుకు సంబంధించి ఆర్బీఐ, బ్యాంకులతో సంప్రదింపులు కొనసాగుతున్నట్టు చెప్పారు. ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంతో కసరత్తు చేయాల్సి ఉందంటూ.. బడా బ్యాంకుల ఏర్పాటుకు ఎలా ముందుకు వెళ్లాలనే విషయమైన ఆర్బీఐ అభిప్రాయాలు కూడా తీసుకుంటామని ప్రకటించారు. బ్యాంకుల విలీనం కూడా ఒక మార్గమని చెప్పారు. పరిశ్రమలకు బ్యాంకుల నుంచి రుణ వితరణ మరింత విస్తృతం కావాలన్నారు. జీఎస్టీ రేట్ల కోతతో డిమాండ్ పెరిగి, అది పెట్టుబడుల సైకిల్‌కు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. బలమైన బ్యాంకుల అంశంతోనే కేంద్ర సర్కారు 2019లో ప్రభుత్వరంగ బ్యాంకుల మెగా విలీనాన్ని చేపట్టడం తెలిసిందే. దీంతో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు విలీనాల అనంతరం 12కు తగ్గాయి. మరో విడత ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనంపై కేంద్ర సర్కారు యోచిస్తున్నట్టు ఇటీవలే వార్తలు రావడం గమనార్హం. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ దిశగా చర్యలు కూడా కొనసాగుతున్నాయి. -
మూడో భారీ ఎకానమీగా భారత్!
అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ త్వరలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. వివిధ అంశాల్లో భారత్ చాలా వేగంగా ముందుకు దూసుకెళ్తోందని ఆమె పేర్కొన్నారు. 2014లో పదో స్థానంలో ఉన్న భారత్ క్రమంగా అయిదు, నాలుగో స్థానాలకు ఎదిగిందని, త్వరలోనే మూడో స్థానానికి చేరుతుందని చెప్పారు. భారతీయులంతా తమ సామర్థ్యాలపై, దేశ ఆర్థిక సామర్థ్యాలపై నమ్మకం కలిగి ఉండాలని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (డీఎస్ఈ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి సూచించారు. బయటి వ్యక్తుల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.‘140 కోట్ల జనాభా గల మన దేశాన్ని నిర్జీవ ఎకానమీగా ఎవరైనా ఎలా అనగలరు? బయటి నుంచి ఎవరైనా ఏవైనా మాట్లాడొచ్చు గాక, కానీ మన కృషి, మన విజయాలను మనం తక్కువ చేసుకోరాదు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కృషి చేస్తున్న మనందరికీ మనం సొంతంగానే లక్ష్యాలను సాధించగలమనే ఆత్మవిశ్వాసం ఉండాలి‘ అని మంత్రి చెప్పారు. వృద్ధి సాధనలో టెక్నాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. సాంకేతిక లేకపోయి ఉంటే స్థలం, కారి్మక శక్తి, పెట్టుబడులు నిరుపయోగంగా ఉండేవని వివరించారు. అన్నింటా సాంకేతికతచిన్న రైతు పొలాన్ని గుర్తించడం నుంచి కొత్త మోడల్స్‌ను అత్యంత వేగంగా కృత్రిమ మేథ తీర్చిదిద్దుతున్న తయారీ రంగం వరకు అన్నింటా సాంకేతికత కీలకంగా ఉంటోందని మంత్రి చెప్పారు. కృత్రిమ మేథ వల్ల ఉద్యోగాలు పోతాయని కొందరిలో ఆందోళన నెలకొన్నప్పటికీ మరికొందరు మాత్రం ఏఐని ఉపయోగించి దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరిస్తున్నారని తెలిపారు. భారత్‌లో పరిశోధనలు నిర్వహించడంపై, వర్ధమాన దేశాలకు అనువైన మోడల్స్‌ను రూపొందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. ద్రవ్య లోటు లక్ష్యాన్ని సాధిస్తాం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.4 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పక సాధించగలదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2024–25లో 4.8 శాతంగా ఉన్న ద్రవ్య లోటును ఈసారి 4.4 శాతానికి (సుమారు రూ. 15.69 లక్షల కోట్లు) పరిమితం చేయాలని బడ్జెట్లో ప్రభుత్వం నిర్దేశించుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల ఆర్థిక సమ్మిళితత్వం, జాతీయ ప్రయోజనాల లక్ష్యాలకు భంగం వాటిల్లుతుందన్న ఆందోళనలను ఆమె తోసిపుచ్చారు. బ్యాంకులను జాతీయీకరణ చేసి 50 ఏళ్లు గడిచినా ఆర్థిక సమ్మిళితత్వ విషయంలో ఆశించిన ఫలితాలు కనిపించలేదని..వాటిని ప్రొఫెషనల్ విధానంలో తీర్చిదిద్దిన తర్వాత నుంచి చక్కని ఫలితాలు కనిపిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.ఇదీ చదవండి: గోపీచంద్ హిందూజా కన్నుమూత -
రోజుకు రూ.60 వేలు, నెలకు రూ.10 లక్షలు.. నమ్మేదేనా?
ఆధునిక సాంకేతికత, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. కొన్ని నమ్మశక్యం కానీ సమాచారాలను కూడా ఏఐ సాయంతో అవలీలగా వ్యాప్తి చేస్తున్నారు. అలాంటిదే ఇది.. 24 గంటల్లో రూ.60 వేలు.. ‘నెలకు రూ.10 లక్షలు సంపాదించే పెట్టుబడి పథకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.నకిలీ వార్తను ఛేదించిన పీఐబీకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ గురించి చెబుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీని గురించి పూర్తి అవగాహన లేనివారు ఎటువంటి ధ్రువీకరణ లేకుండానే వ్యాప్తి చేస్తున్నారు. అయితే ఇది ఏఐ మానిప్యులేటెడ్ వీడియో అని, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ తేల్చింది.'ఈజీగా రోజువారీ ఆదాయం వచ్చే 'పెట్టుబడి పథకం' కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు అంటూ ఫేస్బుక్లో ఒక వీడియో చలామణిలో ఉంది. ఆర్థిక మంత్రి లేదా భారత ప్రభుత్వం అటువంటి పథకాన్ని ప్రారంభించలేదు లేదా ఆమోదించలేదు" అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ‘ఎక్స్’ (ట్విటర్)లో అధికారిక పోస్ట్‌లో తెలిపింది."అలాంటి త్వరగా ధనవంతులవుతారని చెప్పే ఉచ్చులలో పడకండి! అప్రమత్తంగా ఉండండి. సమాచారం ఇవ్వండి. మీరు షేర్ చేసే ముందు ధృవీకరించుకోండి" అని పీఐబీ తెలిపింది. యూజర్లు అప్రమత్తంగా ఉండటానికి, స్కామ్‌లను గుర్తించడానికి కొన్ని సూచనలను చేసింది.ఇదీ చదవండి: ‘బంగారం, వెండి క్రాష్ అంటూ భయపెడుతున్నారు’ఇలాంటి వీడియోల్లో మాట్లాడుతున్నవారి పెదవుల కదలిక, అసహజమైన వాయిస్ సింక్ గమనించాలి. వీడియోల్లో చూపిస్తున్న తేదీ, బ్యాక్‌గ్రౌండ్, లోగో వంటివి సరిపోలాయా లేదా అన్నది పరిశీలించాలి. అధికారిక ప్రభుత్వ డొమైన్లు ఎల్లప్పుడూ .gov.in అనే ఎక్స్‌టెన్షన్‌తో ముగుస్తాయి. షేర్ చేసేముందు ఆ లింక్‌లను ధ్రువీకరించుకోవడం అవసరం. 💥 Earn ₹60,000 in 24 hours & ₹10 Lakhs a month! 🚨Sounds tempting❓ 💸 Think Again‼️A video on Facebook falsely shows Union Finance Minister @nsitharaman promoting an 'investment program' that promises easy daily income.#PIBFactCheck ✅❌ FAKE ALERT!👉The video is… pic.twitter.com/QsUkFkrYYW— PIB Fact Check (@PIBFactCheck) October 27, 2025 -
నిజాయితీగా పన్ను చెల్లించేవారితో మర్యాదగా మెలగండి: సీతారామన్
ఘజియాబాద్: నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులతో మర్యాదగా మెలగలాని, వారికి పన్ను నిబంధనల అమలును సులభతరం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ అధికారులకు సూచించారు. అదే సమయంలో పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఘజియాబాద్‌లో సెంట్రల్ జీఎస్టీ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. అధికారులపై క్రమశిక్షణ చర్యలను సకాలంలో ముగించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. తద్వారా విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనైతిక, దు్రష్పవర్తనను సహించేది లేదన్న స్పష్టమైన సందేశాన్ని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పంపించాలని కోరారు. వేగవంతమైన రిజి్రస్టేషన్‌కు, ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా టెక్నాలజీని వినియోగించుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు. టెక్నాలజీ సాయంతో స్మార్ట్ విచారణలు చేయొచ్చు. అవసరమైతే పన్ను చెల్లింపుదారులను సంప్రదించొచ్చు. అంతేకానీ, ఆ పత్రం ఇవ్వండి, ఈ పత్రం ఇవ్వండి అంటూ పన్ను చెల్లింపుదారులపై భారం వేయొద్దు. వర్తకులకు మీకు మధ్య ఎలాంటి ఉక్కు గోడ లేదు. సమస్యను పెంచడానికి బదులు అది ఎక్కడ ఉందన్నది మీరు అర్థం చేసుకోవాలి. నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులతో మర్యాదగా మెలగాలి. కొత్త తరం జీఎస్టీ కింద వారిని గౌరవిస్తున్నట్టు భావించేలా మసులుకోవాలి. పన్ను చెల్లింపుదారుల్లో ఎవరిలో అయినా నిజాయితీ లోపిస్తే నిబంధనల మేరకు వారిని నిలువరించండి. అంతేకానీ, ప్రతి ఒక్కరినీ అనుమానించొద్దు’’అంటూ మంత్రి జీఎస్టీ అధికారులకు హితవు పలికారు. కొత్త జీఎస్టీ అన్నది కేవలం రేట్లు, శ్లాబులు, సులభతరానికే పరిమితం కాదంటూ, తమను భిన్నంగా చూస్తున్నారన్న భావన పన్ను చెల్లింపుదారుల్లో కలిగేలా ఉండాలన్నారు. -
జీఎస్టీ ప్రయోజనాల పూర్తి బదలాయింపు
న్యూఢిల్లీ: ధరల తగ్గింపు రూ పంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) రేట్ల కోత ప్రయోజనాలు వినియోగదారులకు పూర్తిగా బదిలీ అవు తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రోజువారీ వినియోగించే 54 ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం సమీక్షిస్తోందని జీఎస్టీ బచత్ ఉత్సవ్‌పై నిర్వహించిన సమావేశంలో ఆమె చెప్పారు. వీటి వివరాలను ఎప్పటికప్పుడు జోనల్ ఏరియాల నుంచి తెప్పించుకుంటున్నామని మంత్రి వివరించారు. సెపె్టంబర్ 22 నుంచి జీఎస్టీ రేట్లను నిర్దిష్టంగా 2 శ్లాబుల కింద (5%, 18%, అల్ట్రా లగ్జరీ ఉత్పత్తులపై ప్ర త్యేకంగా 40% రేటు) సవరించిన సంగతి తెలిసిందే. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో కొనుగోళ్లు పెరిగాయని ఆమె పేర్కొ న్నారు. షాంపూ, పౌడరు, ఉపకరణాలు, బొమ్మలు మొదలైన వాటిపై రేట్లు తగ్గాయని వివరించారు. జీఎస్టీ రేట్ల కోతకు తగ్గట్లుగా ధరలు తగ్గించలేదంటూ వినియోగదారుల వ్యవహారాల విభాగానికి 3,169 ఫిర్యాదులు రాగా 3,075 ఫిర్యాదులు నోడల్ ఆఫీసర్లకు బదిలీ అయినట్లు పేర్కొన్నారు. -
రైతులకు బ్యాంకులు రుణాలు ఎందుకు ఇవ్వవంటే..
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, గ్రామీణ అభివృద్ధిని పెంచడానికి వ్యవసాయ రుణాలు చాలా ముఖ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను వ్యవసాయ రుణాలు పెంచాలని తరచుగా ఆదేశిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సకాలంలో రుణం అందడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతుల జీవనోపాధికి కీలకం. అయితే ఈ దిశగా కేంద్రం చేస్తున్న కృషికి అనుగుణంగా బ్యాంకులు వీటి పంపిణీని ఆశించినంతగా పెంచడం లేదు. అందుకు కొన్ని సవాళ్లను ఎదురవుతున్నాయనే వాదనలున్నాయి.నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్(NPA) భయంవ్యవసాయ రంగంలో అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వాల రుణమాఫీ పథకాల ప్రకటన కారణంగా రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. దీని ఫలితంగా బ్యాంకులకు మొండి బకాయిలు (NPA) పెరిగే అవకాశం ఉంది. పెద్ద పరిశ్రమల మొండి బకాయిలతో పోలిస్తే రైతుల మొండి బకాయిలు తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులకు ఇది ఆందోళనగా మిగిలిపోతుంది.రుణాల దుర్వినియోగంకొందరు రుణగ్రహీతలు వ్యవసాయం పేరుతో బంగారం తాకట్టు రుణాలు తీసుకుని వాటిని రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం (ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో) బ్యాంకు అధికారులు తనిఖీల్లో గుర్తిస్తున్నారు. దీనివల్ల రుణం పొందిన ప్రయోజనం నెరవేరకపోవడం, రాయితీ వడ్డీ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ కఠిన మార్గదర్శకాలు తీసుకువచ్చింది.పూచీకత్తు సమస్యలుచిన్న, సన్నకారు రైతులకు, కౌలు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. కౌలు రైతుల విషయంలో సరైన ధ్రువీకరణ వ్యవస్థ లేకపోవడంతో వారికి రుణాలు అందడం లేదు.వ్యవసాయ క్షేత్రాల పరిశీలన సవాళ్లుగ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాల పంపిణీ తర్వాత అవి నిజంగా వ్యవసాయ అవసరాలకు వాడుతున్నారా లేదా అని తనిఖీ చేయాలి. అందుకు బ్యాంకులకు తగినంత మానవ వనరులు, మౌలిక సదుపాయాలు లేకపోవడం ఒక సమస్యగా ఉంది.రుణమాఫీ జాప్యంగత ప్రభుత్వాల హయాంలో రుణమాఫీ పథకాలు ప్రకటించినప్పటికీ వాటి అమలులో జాప్యం జరుగుతుంది. దానివల్ల రైతులు పాత రుణాలను రెన్యూవల్ చేసుకోలేకపోతున్నారు. దీని ఫలితంగా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.ఇదీ చదవండి: భారత రైల్వేలో అపార అవకాశాలు -
ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలి
ముంబై: ప్రజలను మోసగించేందుకు నేరగాళ్లు కృత్రిమ మేధను (ఏఐ) ఉపయోగించి క్లోనింగ్, ఫేక్ వీడియోల్లాంటివి సృష్టిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని ఫిన్‌టెక్ సంస్థలకు సూచించారు. 6వ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. వివిధ రకాల ఏఐ ఉత్పత్తులు, సరీ్వసులను రూపొందించే విషయంలో గ్లోబల్ హబ్‌గా ఎదిగే సత్తా భారత్‌కి ఉందని మంత్రి చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా పలు రకాల అవసరాలకు ఉపయోగపడే ఏఐ ఉత్పత్తులను సృష్టించగలదని, ఏఐ ఐడియాలను అభివృద్ధి చేసేందుకు, ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ప్రయోగశాలగా కూడా ఉండగలదని ఆమె పేర్కొన్నారు. ఏఐ చీకటి కోణం..: ఏఐతో ఆర్థిక రంగం, గవర్నెన్స్‌లో సానుకూల మార్పులు వచి్చనప్పటికీ, ఈ టెక్నాలజీలో చీకటి కోణం కూడా ఉందని ఆమె చెప్పారు. ‘ఏఐతో అసాధారణ అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో అది దుర్వినియోగం కాకుండా కూడా మనం కట్టడి చేయాలి.కొత్త ఆవిష్కరణలకు దన్నుగా నిల్చే సాధనాలే మోసాలు చేసేందుకు ఆయుధాలుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేలా, వాస్తవాలను కప్పిపుచ్చేలా తయారు చేసిన నా డీప్‌ఫేక్ వీడియోలు ఎన్నో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతుండటాన్ని నేను స్వయంగా చూశాను. ఇలాంటి వాటిని తక్షణం ఎదుర్కొనేందుకు మన వ్యవస్థలను తక్షణం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది‘ అని చెప్పారు. ఆర్థిక సాధికారతకు ఫిన్‌టెక్ దన్ను.. ఫిన్‌టెక్ అనేది ఏదో పట్టణ ప్రాంతాలకు పరిమితమైన సౌకర్యం కాదని, దేశవ్యాప్తంగా ఆర్థిక సాధికారతకు ఉపయోగపడే సాంకేతికతని మంత్రి చెప్పారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలతో రోజువారీ జరిపే చెల్లింపుల తీరుతెన్నులను ఇది మార్చేసిందని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు సగభాగం రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలు భారత్‌లో జరుగుతున్నాయని తెలిపారు. ‘మనం ఆర్థికంగా ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నాం, దాన్ని ఎలా సాధించదల్చుకుంటున్నాం అనేది ఆలోచించుకునేందుకు ఇది సరైన తరుణం. ఆదాయ వృద్ధి, కొత్త ఆవిష్కరణలు, లాభదాయకత, రిస్క్ సామర్థ్యాలు మొదలైన ప్రాథమికాంశాలపై ఫిన్‌టెక్‌లు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది‘ అని వివరించారు.బయోమెట్రిక్‌తో యూపీఐ చెల్లింపులు..ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ)కి సంబంధించిన పలు సొల్యూషన్స్‌ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆవిష్కరించింది. ప్రస్తుతం డివైజ్‌లో యూపీఐ లావాదేవీ ధ్రువీకరణ కోసం ఉపయోగిస్తున్న పిన్ నంబరు స్థానంలో, బయోమెట్రిక్ విధానాన్ని (వేలి ముద్ర, ఫేస్ అన్‌లాక్) వాడేందుకు ఉపయోగపడే టెక్నాలజీని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు ప్రవేశపెట్టారు.ఏటీఎంలలో నగదు విత్డ్రాయల్తో పాటు యూపీఐ పిన్ను సెట్ చేసేందుకు లేదా రీసెట్ చేసేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. కొత్త యూజర్లు, సీనియర్ సిటిజన్లను కూడా యూపీఐ చెల్లింపుల పరిధిలోకి చేర్చేందుకు ఇది తోడ్పడుతుందని ఎన్పీసీఐ వివరించింది. అలాగే యూపీఐ క్యాష్ పాయింట్లలో యూపీఐని ఉపయోగించి నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. యూపీఐ లైట్ ద్వారా వేరబుల్ స్మార్ట్‌గ్లాసెస్‌తో కూడా చెల్లింపులు జరిపే సొల్యూషన్ని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ ఆవిష్కరించారు. ఫోన్‌తో పని లేకుండా, పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ని స్మార్ట్ కళ్లద్దాలతో స్కాన్ చేసి, వాయిస్ కమాండ్‌తో పేమెంట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చిన్న మొత్తాల్లో చెల్లింపులు అవసరమయ్యే రోజువారీ కొనుగోళ్లకు ఇది ఉపయోగకరం. ఇక జాయింట్ అకౌంట్ హోల్డర్లు కూడా చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగించే సదుపాయాన్ని ఆవిష్కరించింది. అటు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్‌తో జట్టు కట్టినట్లు పేపాల్ ప్రకటించింది. -
క్రిప్టోకరెన్సీ.. ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
సమకాలీన ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం (FinTech) పెరుగుతున్న నేపథ్యంలో స్టేబుల్ కాయిన్ల (Stablecoins) గురించి భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ ప్రారంభ సెషన్లో ఆమె ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్టేబుల్ కాయిన్ల అవసరాన్ని నొక్కి చెప్పారు. కొన్ని దేశాలు వాటిని స్వాగతించినా లేదా వ్యతిరేకించినా స్టేబుల్ కాయిన్ల వాడకానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ద్రవ్య ఆవిష్కరణలకు అనుగుణంగా ఎంత త్వరగా మారాల్సిన అవసరం ఉందో ఆమె వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.స్టేబుల్ కాయిన్స్ అంటే ఏమిటి?స్టేబుల్ కాయిన్లు అనేవి క్రిప్టోకరెన్సీలో ఒక ప్రత్యేక కేటగిరీకి చెందినవి. వీటిని ధరల అస్థిరతను తగ్గించడానికి రూపొందించారు. బిట్ కాయిన్ లేదా ఎథీరియం వంటి సాంప్రదాయ క్రిప్టోకరెన్సీల ధరలు విపరీతంగా మారే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా స్టేబుల్ కాయిన్లు సాధారణంగా యూఎస్ డాలర్ వంటి స్థిరమైన ఫియట్ కరెన్సీకి లేదా బంగారం వంటి వస్తువులతో ముడిపడి ఉంటాయి. ఈ మెకానిజం క్రిప్టోకరెన్సీ మాదిరిగా అస్థిరతకు లోనుకాకుండా వినియోగదారులకు డిజిటల్ కరెన్సీ ప్రయోజనాలను అందించడానికి ఉద్దేశించబడింది.కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తల ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ కరెన్సీల పెరుగుదలను, స్టేబుల్ కాయిన్లను ఇకపై విస్మరించలేమని చెబుతున్నారు. క్రిప్టో రంగంలో భారతదేశం జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సమయంలో ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశీయంగా ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు చట్టపరమైన గుర్తింపును ఇవ్వకపోయినప్పటికీ అది వర్చువల్ డిజిటల్ ఆస్తి లావాదేవీల కోసం పన్ను ఫ్రేమ్‌వర్క్‌ను (30% పన్ను, 1% టీడీఎస్) అమలు చేస్తోంది. చాలామంది దీన్ని ఆర్థిక వ్యవస్థలో క్రిప్టో ఉనికిని అంగీకరించే చర్యగా చూస్తున్నారు.ఆర్బీఐ వైఖరిరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై సందేహాస్పదంగా ఉంది. ఆర్థిక స్థిరత్వం, వినియోగదారుల రక్షణ, ద్రవ్య విధానానికి ప్రమాదాలు సంభవించవచ్చని పేర్కొంటూ గతంలో పూర్తి నిషేధాన్ని సమర్థించింది. అదే సమయంలో తన సొంత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) కోసం పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. దీన్ని ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలకు సురక్షితమైన, నియంత్రిత ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. సీబీడీసీలు కేంద్ర బ్యాంకులచే జారీ చేయబడతాయి. సాంప్రదాయ కరెన్సీ మాదిరిగానే చట్టపరమైన హోదాను పొందుతాయి. చైనా, స్వీడన్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు కూడా తమ CBDCలను పరీక్షించి అమలు చేస్తున్నాయి.సూక్ష్మ నియంత్రణ చర్చలకు దారిఇదిలాఉండగా, సీతారామన్ నిర్దిష్ట విధాన మార్పులను వివరించకపోయినా స్టేబుల్ కాయిన్లను పరివర్తన శక్తిగా గుర్తించడం భారతదేశ క్రిప్టో విధానంలో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. ఈ ప్రకటన మరింత సూక్ష్మమైన నియంత్రణ చర్చలకు దారితీస్తుందని కొందరు భావిస్తున్నారు. డిజిటల్ ఆస్తుల కేటగిరీల మధ్య తేడాను చూపే భవిష్యత్తు ఫ్రేమ్‌వర్క్‌కు ఇది మార్గం సుగమం చేయవచ్చని చెబుతున్నారు. ఆ ఫ్రేమ్‌వర్క్‌లో స్టేబుల్ కాయిన్లు, ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు, CBDCలను స్పష్టంగా పరిగణించే అవకాశం కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
ప్రపంచ ఆర్థిక స్థిరీకరణ శక్తిగా భారత్
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయని, ఆర్థిక ఆంక్షలు–టారిఫ్‌లు ప్రపంచ సరఫరా వ్యవస్థలను మార్చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ తరుణంలోనూ భారత్ 8 శాతం వృద్ధిరేటును ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ‘కౌటిల్య ఆర్థిక సమావేశం 2025’ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. వాణిజ్యం, ఇంధన భద్రత పరంగా ప్రపంచం ఎంతో అసమతుల్యతలను చూస్తోందని, నిర్మాణాత్మక పరివర్తనం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఈ తరుణంలో భారత్ స్థిరీకరణ శక్తిగా నిలుస్తున్నట్టు చెప్పారు. వెలుపలి షాక్‌లను తట్టుకోగలదన్నారు. ‘‘2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు 8 శాతం మేర స్థిరమైన జీడీపీ వృద్ధికి చేరుకోవడం అవసరం. మనం చూస్తున్నది తాత్కాలిక అస్థిరతలు కాదు. నిర్మాణాత్మక మార్పు. ఒకప్పుడు బలమైన కూటములు అనుకున్నవి నేడు కాల పరీక్షను ఎదుర్కొంటున్నాయి. కొత్త కూటములు అవతరిస్తున్నాయి. కనుక కేవలం ప్రపంచ అస్థిరతలను ఎదుర్కోవడమే కాదు. వాణిజ్యం, ఇంధనం, ఆర్థిక అస్థిరతలతోనూ పోరాడాల్సి రావడం మనముందున్న సవాలు’’అని అని పేర్కొన్నారు. ప్రపంచ సంస్థలు బలోపేతం కావాలి.. అంతర్జాతీయ సంస్థలు (డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ తదితర) బలోపేతం కావాల్సిన అవసరాన్ని మంత్రి సీతారామన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవి నిరీ్వర్యమవుతుండడంతో ప్రపంచ విశ్వాసం సన్నగిల్లుతున్నట్టు చెప్పారు. ఇవి నేటి వాస్తవాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉందన్నారు. దేశీయంగా సంస్కరణలు అమలు చేయడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సమన్వయం చేసుకోవడం ద్వారా భారత్ పెరుగుతున్న సుంకాల అవరోధాలను, వాణిజ్య కూటముల్లో మార్పులను అధిగమించగలదని చెప్పారు. పెరిగిపోయిన ఉద్రిక్తతలు, అధిక సుంకాలు, విధానపరమైన తీవ్ర అనిశి్చతులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే, పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం, పెరిగిపోయిన నిధుల వ్యయాలు, ఇంధన ధరల్లో అస్థిరతలు సైతం వేధిస్తున్నట్టు చెప్పారు. వీటన్నింటి మధ్య భారత్ స్థిరీకరణ శక్తిగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ ద్రవ్య స్థిరీకరణ, మూలధన వ్యయాల నాణ్యతపై దృష్టి సారించినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ‘‘జీడీపీలో వినియోగం, పెట్టుబడుల వాటా ఈ కాలంలో స్థిరంగా కొనసాగింది. భారత్ వృద్ధి దేశీ అంశాలపై బలంగా ఆధారపడి ఉంది. ఇది వెలుపలి షాక్‌లను పరిమితం చేస్తోంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది’’అని వివరించారు. -
అనిశ్చితిలోనూ పటిష్టంగా భారత్: నిర్మలా సీతారామన్
అంతర్జాతీయంగా అనిశ్చితి వల్ల పలు దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ పటిష్టంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. యువ జనాభా, దేశీయంగా డిమాండ్ మెరుగ్గా ఉండటం, స్థిరమైన ఆర్థిక విధానాలు ఎకానమీ వృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 91వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధి సాధించిందని, ఎస్అండ్పీలాంటి రేటింగ్ ఏజెన్సీలు కూడా దేశ రేటింగ్‌ను పెంచాయని మంత్రి చెప్పారు. భారత్‌పై ప్రపంచానికి గల నమ్మకానికి ఇది నిదర్శనమని వివరించారు. వృద్ధి సాధనలో కీలక పాత్ర పోషించే బ్యాంకులు, కస్టమర్ల నమ్మకాన్ని చూరగొనడం, ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడంపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. -
తక్షణ ఉపశమన చర్యలు అవసరం
అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లు తమపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయంటూ, ఈ తరుణంలో తక్షణ ఉపశమన చర్యలను ప్రకటించాలంటూ రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (GJEPC) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)ను కోరింది. బుధవారం మంత్రితో జీజేఈపీసీ ప్రతినిధులు సమావేశమై తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.అమెరికాతో వాణిజ్య సంప్రదింపులను తిరిగి ప్రారంభించడం ప్రోత్సాహకరమంటూనే.. పరిశ్రమ నిలదొక్కుకోవడానికి తక్షణ ఉపశమన చర్యలు ప్రకటించాల్సిన అవసరాన్ని జీజేఈపీసీ ప్రతినిధి బృందం ప్రస్తావించింది. చర్చలు ఫలవంతం అయ్యేందుకు సమయం పడుతుందని, ఈ లోపు ఉపాధి అవకాశాలు కోల్పోకుండా చూసేందుకు మద్దతు చర్యలు అవసరమని గుర్తు చేసింది.‘ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లోని యూనిట్లు రివర్స్ జాబ్ వర్క్ (ఎగుమతుల కోసం కాకుండా దేశీ తయారీదారులు, రిటైలర్ల కోసం ఉత్పత్తి చేయడం) చేపట్టేందుకు, దేశీ టారిఫ్‌ల కింద విక్రయాలకు అనుమతించాలని కోరాం. రుణాలపై మార టోరియం, మూలధన రుణాలపై వడ్డీ రాయితీ అందించడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుందని తెలి యజేశాం’అని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. ఈ చర్యలతో ఉద్యోగాలను, ఎగుమతిదారుల పోటీతత్వాన్ని కాపాడుకోవచ్చన్నారు.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
జీఎస్టీఏటీని ప్రారంభించిన ఆర్థిక మంత్రి
వ్యాపారవర్గాలు, ట్యాక్స్ డిపార్ట్మెంట్ మధ్య వివాదాల సత్వర పరిష్కారానికి ఉపయోగపడేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా జీఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్ (gstat)ని ప్రారంభించారు. వ్యాపార సంస్థలు ఈ పోర్టల్‌లో తమ కేసులను ఫైల్ చేయొచ్చు. డిసెంబర్ నుంచి వాటిపై విచారణ ప్రారంభమవుతుంది.భారత్‌లో సంస్కరణలు పురోగమించే తీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman.) చెప్పారు. మరింత మెరుగుపడాలన్న దృఢ సంకల్పాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. వివాదాల పరిష్కారానికి ఈ పోర్టల్‌ను ఉపయోగించుకోవాలని వ్యాపార సంఘాలకు ఆమె సూచించారు. అప్పీళ్ల ఫైలింగ్‌కి వ్యవధిని 2026 జూన్ 30 వరకు పొడిగించినట్లు వివరించారు.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!జీఎస్టీఏటీ ట్రిబ్యునల్ ముఖ్యాంశాలుప్రారంభ తేదీ: సెప్టెంబర్ 24, 2025పన్ను చెల్లింపుదారులు, అధికారుల మధ్య పెండింగ్‌లో ఉన్న 4.83 లక్షలకు పైగా జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం దీని ఉద్దేశం.డిజిటల్ ఫైలింగ్ ద్వారా జీఎస్టీఏటీ పోర్టల్‌లో పన్ను చెల్లింపుదారులు అప్పీళ్లను దాఖలు చేయవచ్చు. కేసులను ట్రాక్ చేయవచ్చు. వర్చువల్ విచారణలకు హాజరు కావచ్చు.దీని ప్రిన్సిపల్ బెంచ్ న్యూఢిల్లీలో ఉంటుంది.దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు. -
కొత్త జీఎస్టీ అమలు.. వైఎస్ జగన్ స్పందన
జీఎస్టీ కొత్త శ్లాబులు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. జీఎస్టీ క్రమబద్ధీకరణ సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగుగా అభివర్ణించారు. సామాన్య ప్రజానీకానికి ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు.‘జీఎస్టీ పునర్నిర్మాణం సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగు. వస్తువులు, సేవలను ప్రతి పౌరుడికి మరింత సరళంగా, సరసమైనదిగా మార్చడానికి ఈ చర్యలు ఎంతో తోడ్పడుతాయి. ప్రాథమికంగా కొన్ని ఫిర్యాదుల నిర్వహణలో లోపాలు ఉండొచ్చు. కానీ ఇది ఒక ప్రక్రియ. దీని ప్రయోజనాలు తుది వినియోగదారులకు చేరుకుంటాయని నేను ఆశిస్తున్నాను. ఇది కచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో వినియోగానికి, మరింత పెట్టుబడులకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.The GST restructuring is a revolutionary step towards a simpler, fairer tax system It is a commendable move to make goods & services more simpler and affordable to every citizen. Here and there ,there might be a few glitches with a few complaints but it’s a process and I am…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 22, 2025ఇక 12 శాతం; 28 శాతం ఉండవు..సేల్స్‌ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ సహా పలు రకాల పరోక్ష పన్నులన్నిటినీ తొలగిస్తూ 2017 జులై నుంచీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. తక్కువ పన్నురేట్లుండాలని మొదట లక్ష్యించినా సాధ్యం కాలేదు. తాజా సవరణలతో అది సాధ్యమై జీఎస్టీ శ్లాబ్‌లు 3కు తగ్గాయి. తక్కువ శ్లాబ్‌లుంటే పాలన, ధరల నిర్ణయం, బిల్లింగ్ సులువవుతుంది. పన్ను అధికారులపైనా భారం తగ్గుతుంది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత ప్రధానమైనది.. 12 శాతం, 28 శాతం పన్ను రేట్లను పూర్తిగా తొలగించటం.కొన్ని విలాస, అనారోగ్య (సిన్) వస్తువుల కోసం 40 శాతం పన్ను రేటును చేర్చటం. వాస్తవంగా చూస్తే చాలావరకూ ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ 5% పరిధిలోకి వచ్చాయి. కొన్నింటిపై పన్నే లేకుండా చేశారు. గతంలో వీటిపై 12, 28 శాతం పన్ను రేట్లుండేవి. ఇది అత్యధికులకు ఊరటే. ఇక కొన్ని విలాస వస్తువులు, కూల్‌డ్రింక్స్, టొబాకో ఉత్పత్తులు, పాన్ మసాలా వంటివి మాత్రం 28 శాతం పన్ను పరిధిలో ఉండగా ఇపుడు 40 శాతం శ్లాబ్‌లోకి వెళ్లాయి.ఇదీ చదవండి: ఏఐతో ఊడ్చుకుపోయే ఉద్యోగాలు ఇవే.. -
సంస్కరణలను అందిపుచ్చుకోండి..
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలు, సంస్కరణల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని కార్పొరేట్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు, సామర్థ్యాలను పెంచుకునేందుకు సందేహించకుండా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువతకు నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నారు. బడ్జెట్ ముందు మాత్రమే కాకుండా ఏడాది పొడవునా, ఎప్పుడైనా సరే ప్రభుత్వంతో మాట్లాడాలని ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (ఐఎఫ్‌క్యూఎం) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. పరిశ్రమ నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తోందనే టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. పరిశ్రమ అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం స్థిరంగా ముందుకెళ్తోందని వివరించారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా తగు పాలసీలను రూపొందించడం, పన్నులపరమైన ప్రయోజనాలివ్వడం, మరింతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాకకు అవకాశాలు కల్పించడం తదితర చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంస్కరణల అమలుకు ఎన్నడూ వెనుకాడలేదని, పరిశ్రమ విజ్ఞప్తులను వింటూనే ఉన్నారని ఆమె తెలిపారు. ‘మరింతగా ఇన్వెస్ట్ చేయడం, సామర్థ్యాలను పెంచుకోవడం, భారత్‌లో మరింతగా ఉత్పత్తి చేయడంపై ఇక మీదట సందేహాలు ఉండబోవని ఆశిస్తున్నాను‘ అని చెప్పారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) చిన్న పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకంగా ఉంటున్నాయని మంత్రి తెలిపారు. వాటి అవసరాలను గుర్తించే, ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ (సిడ్బి) ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడుల ఆవశ్యకత.. అధిక వృద్ధి సాధన దిశగా, ఎకానమీకి దన్నుగా చర్యలు తీసుకునే క్రమంలో కేంద్రం 2025–26లో రూ. 11.21 లక్షల కోట్ల మూలధన వ్యయాలను బడ్జెట్లో ప్రతిపాదించింది. అయితే, సామర్థ్యాల పెంచుకోవాలంటూ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, ప్రైవేట్ పెట్టుబడులు అంతగా రావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంవోఎస్పీఐ) శాఖ విడుదల చేసిన సర్వే నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ పెట్టుబడులు 26 శాతం తగ్గొచ్చనే అంచనాలు ఉన్నాయి. 2022, 2023, 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ కంపెనీలు వరుసగా రూ. 3.95 లక్షల కోట్లు, రూ. 5.72 లక్షల కోట్లు, రూ 4.22 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.. దేశీయ మార్కెట్లోనూ, ఎగుమతులపరంగానూ ప్రభుత్వం చక్కని అవకాశాలు కల్పిస్తోందని చంద్రశేఖరన్ చెప్పారు. మరింత మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు, చిన్న..మధ్యతరహా సంస్థలు, పెద్ద కార్పొరేట్లు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తాయని తాను గట్టిగా విశ్వసిస్తున్నట్లు వివరించారు. సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకునేలా ప్రపంచం ప్రత్యామ్నాయ సరఫరాదారులను అన్వేíÙస్తున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టకపోతే అవకాశాలను అందిపుచ్చుకోలేమని ఆయన పేర్కొన్నారు. -
జీఎస్టీ తగ్గింపుతో 140 కోట్ల మందికి ప్రయోజనం
కొత్త జీఎస్టీ సవరణల్లో భాగంగా 350కు పైగా వస్తువుల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకున్నామని, దీనివల్ల 140 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ తగ్గింపు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. చెన్నై ఆళ్వార్‌పేటలోని మ్యూజిక్ అకాడమీలో ఆదివారం ‘జీఎస్టీ సంస్కరణలు – రైజింగ్ ఇండియా కోసం పన్ను సంస్కరణలు’ అనే అంశంపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దీపావళికి ముందు జీఎస్టీ తగ్గింపు వల్ల వస్తువుల కొనుగోళ్లు మరింత వేగం పుంజుకుంటాయన్నారు. నిత్యావసర వస్తువులకు జీఎస్టీని తగ్గించడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు మరింత లాభం చేకూరుతుందన్నారు. జీఎస్టీ పన్ను సంస్కరణల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి సంస్థ ఈ తగ్గింపును ప్రజల్లో తీసుకెళ్తుందన్న నమ్మకం ఉందన్నారు.ఇదీ చదవండి: సెస్‌ల లక్ష్యం నీరుగారుతోందా? -
శీతాకాల సమావేశాల్లో బీమా సవరణ బిల్లు
న్యూఢిల్లీ: బీమా సవరణ బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బీమా రంగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ప్రస్తుత నిబంధనల కింద అనుమతి ఉంది. దీన్ని నూరు శాతానికి పెంచనున్నట్టు 2025–26 బడ్జెట్ సందర్భంగా మంత్రి సీతారామన్ ప్రకటించారు. 100 శాతం ఎఫ్‌డీఐ అనుమతి అన్నది భారత్‌లో ఆర్జించిన ప్రీమియంను ఇక్కడే ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు అమలు చేయనున్నట్టు చెప్పారు. అలాగే, నిబంధనలు, షరతుల్లోనూ మార్పులు చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. బీమా రంగం ఇప్పటి వరకు రూ.82,000 కోట్ల ఎఫ్‌డీఐని ఆకర్షించడం గమనార్హం. కాంపోజిట్ లైసెన్స్ (జీవిత, సాధారణ బీమా సేవలకు)తోపాటు చెల్లించిన మూలధనం తగ్గింపు కూడా ప్రభుత్వ ప్రతిపాదనల్లో భాగంగా ఉన్నాయి. మొదటిసారి 2015లో బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. తిరిగి 2021లో ఈ పరిమితిని 74 శాతం చేసింది. -
జీఎస్టీ సంస్కరణలు దీపావళి ముందే ఎందుకంటే..
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీఎస్టీ సంస్కరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రశంసించారు. ఇది దేశంలోని ప్రతి పౌరుడికీ భారీ విజయమని ఆమె అభివర్ణించారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు.దీపావళి పండుగకు ముందు జీఎస్టీ సంస్కరణల అమలు ఎందుకన్నదానిపైనా ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి వారి సొంత పండుగలు ఉంటాయన్న నిర్మలా సీతారామన్.. దీపావళి పండుగకు ముందు జీఎస్టీ సంస్కరణల అమలును ప్రారంభించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలకు ముందే నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.చెన్నై సిటిజన్స్ ఫోరం నిర్వహించిన 'ట్యాక్స్ రిఫార్మ్స్ ఫర్ రైజింగ్ భారత్' కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ, దేశ ప్రజలు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని ఉత్పత్తులపైనా జీఎస్టీ ప్రయోజనకరమైన ప్రభావం ఉంటుందని ఆమె అన్నారు.జీఎస్టీ కింద గతంలో 12 శాతం పన్ను విధించిన 99 శాతం వస్తువులను ఇప్పుడు 5 శాతానికి తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇప్పటివరకు ఉన్న శ్లాబులను రెండు శ్లాబులకే జీఎస్టీ కౌన్సిల్ కుదించింది. ఇకపై 5, 28 శాతం పన్ను శ్లాబులు మాత్రమే కొనసాగనున్నాయి. తాజా జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు పొడిగిస్తారా? వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు -
అభివృద్ధికి కొత్త ‘దారులు’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రహదారి నెట్వర్క్ విస్తరణ, విద్యాభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, నిర్మలా సీతారామన్‌ను మంగళవారం ఆయన వేర్వేరుగా కలిసి ఈ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. హైదరాబాద్ సమీపంలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా బందరు ఓడరేవు వరకు 12 వరుసల రహదారి నిర్మించాలని నితిన్ గడ్కరీని కోరారు. ఈ ప్రతిపాదిత మార్గంలో 118 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో ఉంటుందని సీఎం వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులను వేగవంతం చేయాలని కోరారు. శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించండి హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్లే మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన్ననూర్–శ్రీశైలం మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సీఎం రేవంత్ ప్రతిపాదించారు. దీనితో పాటు రావిర్యాల–ఆమన్‌గల్–మన్ననూర్ మార్గాన్ని నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారిగా, రద్దీ అధికంగా ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్–మంచిర్యాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్ రహదారిని మంజూరు చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తులపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ కింద ప్రతిపాదించిన రూ.868 కోట్ల పనులకు వారంలోగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. బందరు పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ రహదారిపై ఈ నెల 22న హైదరాబాద్‌లో ఎన్‌హెచ్, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రూ.30 వేల కోట్లతో విద్యా ప్రణాళిక తెలంగాణలో విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు రేవంత్‌రెడ్డి వివరించారు. మంగళవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఆమెను కలిసి.. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కూళ్ల ఏర్పాటు, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి ఉద్దేశించిన రూ.30 వేల కోట్ల ప్రణాళికకు అనుమతులివ్వాలని కోరారు. 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది చొప్పున సుమారు 2.70 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని వివరించారు. ఈ స్కూళ్లకు రూ.21 వేల కోట్లు, ఇతర ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధికి రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. నిధుల సమీకరణకు ఏర్పాటు చేసే ప్రత్యేక కార్పొరేషన్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం కోరారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు చేసిన అప్పుల రీస్ట్రక్చర్‌కు అనుమతించాలని విన్నవించారు. సీఎం విజ్ఞప్తులపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సీఎం వెంట ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ భేటీ
ఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి సంభవించిన నష్టంపై ఆర్థిక మంత్రికి నిర్మలా సీతారామన్‌కు నివేదిక అందజేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు ఆర్థిక సహాయం అందించాలని నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. ఇక సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఓం బిర్లాతో సమావేశమైన వారిలో సీఎం రేవంత్‌తో పాటు ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, కె.రఘువీర్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్‌లు ఉన్నారు. -
వినియోగం వృద్ధితో అధిక ఆదాయం
న్యూఢిల్లీ: జీఎస్టీ ఇటీవలి సంస్కరణలతో వినియోగం పుంజుకుని, మెరుగైన ఆదాయానికి బాటలు వేస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు. తద్వారా జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణతో ఏర్పడే రూ.48,000 ఆదాయ లోటు భర్తీ అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. జీడీపీ వృద్ధికి బలాన్నిస్తుందన్నారు. మొదటి త్రైమాసికంలో (జూన్ క్వార్టర్) బలమైన వృద్ధి రేటు నమోదు కావడం, చరిత్రాత్మక జీఎస్టీ సంస్కరణలతో.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.3–6.8 శాతం అంచనాలను అధిగమిస్తామని ప్రకటించారు.జీఎస్టీలో 12%, 28% జీఎస్టీ శ్లాబులను ఎత్తివేస్తూ.. అందులోని మెజారిటీ ఉత్పత్తులను 5, 18 శాతం శ్లాబుల్లోకి మార్చుతూ గత వారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించడం తెలిసిందే. దీన్ని ప్రజా సంస్కరణగా మంత్రి సీతారామన్ అభివరి్ణంచారు. దీనివల్ల ప్రతి కుటుంబానికీ ప్రయోజనం దక్కుతుందన్నారు. రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ కావడాన్ని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే కార్ల తయారీదారులు, బీమా కంపెనీలు, పాదరక్షల వంటి కొన్ని పరిశ్రమలు రేట్ల తగ్గింపును ప్రకటించడాన్ని గుర్తు చేశారు. ‘రూపాయి’ని గమనిస్తున్నాం.. కరెన్సీ మారకం విలువలను ప్రభుత్వం గమనిస్తున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ‘డాలర్‌తో రూపాయి ఎక్కువ విలువను కోల్పోయింది. ఇతర కరెన్సీలతో కాదు’ అని స్పష్టం చేశారు. భారత్‌పై అమెరికా పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధించడం, భారత క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలతో డాలర్‌తో రూపాయి విలువ 88.38 కనిష్ట స్థాయికి పడిపోవడం తెలిసిందే. ప్రధాని చొరవ.. ఆర్థిక మంత్రి కసరత్తు ‘ఒక్కసారి జీఎస్టీ సంగతి చూడండి’ ప్రధాని మోదీ చేసిన సూచన ఆధారంగానే ఈ భారీ కసరత్తుకు పూనుకున్నట్టు మంత్రి సీతారామన్ స్వయంగా వెల్లడించారు. ‘‘గత జీఎస్టీ కౌన్సిల్ భేటీకి ముందు (2024 డిసెంబర్లో) ప్రధాని నాకు కాల్ చేశారు. ‘ఒకసారి జీఎస్టీ విధానంపై దృష్టి పెట్టండి. రేట్ల పరంగా ఎందుకంత అయోమయం? వ్యాపారాలకు సులభతరంగా మార్చండి’ అని చెప్పారు. ఆ తర్వాత బడ్జెట్(2025–26)లో ఆదాయపన్ను ఉపశమన చర్యలపై చర్చల సమయంలోనూ.. ‘జీఎస్టీపై మీరు పనిచేస్తున్నారు కదా?’ అంటూ ప్రధాని మళ్లీ గుర్తు చేశారు. జీఎస్ టీ అమల్లోకి వచ్చి ఎనిమిదేళ్లు ముగిసిన నేపథ్యంలో సమగ్ర సమీక్ష అవసరమని భావించాం. వ్యా పారులు, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల కోణం నుంచి చూశాం’’ అని మంత్రి సీతారామన్ చెప్పారు. -
వినియోగానికి జీఎస్టీ సంస్కరణల దన్ను
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) సంస్కరణలతో వినియోగానికి మరింత ఊతం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. విస్తృత స్థాయిలో వివిధ ఉత్పత్తుల రేట్లను క్రమబద్ధీకరించడం వల్ల ప్రతి కుటుంబం ప్రయోజనం పొందుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇది దోహదపడుతుందన్నారు. మొత్తం మీద ప్రజలకు గణనీయంగా మేలు చేకూర్చే కీలక సంస్కరణగా జీఎస్టీ సవరణలను ఆమె ఓ ఇంటర్వ్యూలో అభివరి్ణంచారు. ధరల తగ్గుదల ప్రయోజనాలు ప్రజలకు బదిలీ అయ్యేలా తానే వ్యక్తిగతంగా పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటానని మంత్రి తెలిపారు. పరిశ్రమ ఇప్పటికే రేట్ల తగ్గింపు విషయంలో సానుకూలంగా స్పందించిందన్నారు. పలు కార్ల సంస్థలు మొదలుకుని ప్రభుత్వ రంగ బీమా సంస్థలు, పాదరక్షలు, దుస్తుల బ్రాండ్లు గణనీయంగా ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయని వివరించారు. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే నాటికి మిగతావి కూడా రేట్లను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ‘మొత్తం 140 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే సంస్కరణ ఇది. అత్యంత పేదలకు కూడా ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. గతంలో నాలుగు శ్లాబులుగా (5%, 12%, 18%, 28%) ఉన్న జీఎస్టీ రేట్లను రెండు శ్లాబులుగా (5%, 18%) మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇవి సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనితో సబ్బుల నుంచి కార్లు, షాంపూలు, ట్రాక్టర్లు, ఏసీల వరకు 400 పైగా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పన్ను ఉండదు. విలాస వస్తువులతో పాటు కొన్ని ఉత్పత్తులకు 40 శాతం శ్లాబ్ ఉంటుంది. సామాన్యులపై ఫోకస్ .. ఒక దేశం, ఒకే పన్ను నినాదంతో 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టిన అనంతరం తాజాగా చేపట్టిన సవరణలు, అతి పెద్ద సంస్కరణలని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానంగా సామాన్య ప్రజానీకం ప్రయోజనాలపై దృష్టి పెడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రోజువారీ ఉపయోగించే ఉత్పత్తులపై ప్రతి పన్నును లోతుగా సమీక్షించామని, చాలా మటుకు ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గుతాయని మంత్రి వివరించారు. బడ్జెట్లో ఆదాయ పన్ను మినహాయింపులపరంగా ఇచి్చన వెసులుబాటుతో ప్రజల చేతిలో మరింత డబ్బు మిగలనుండగా, తాజా జీఎస్టీ సంస్కరణల వల్ల ఉత్పత్తుల ధరలు తగ్గి వినియోగానికి ఊతం లభిస్తుందన్నారు. దీనితో కుటుంబాల నెలవారీ రేషన్, మెడికల్ బిల్లులు మొదలైన వాటి భారం తగ్గుతుందని చెప్పారు. జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనాలను పర్యవేక్షించేందుకు పరిశ్రమ వర్గాలతో ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతోందని, దీనిపై సానుకూలత వ్యక్తమవుతోందని సీతారామన్ చెప్పారు. వ్యాపారాల నిర్వహణ సులభతరం.. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేసేందుకు కూడా జీఎస్టీ సంస్కరణలు తోడ్పడతాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. నిబంధనల భారం సడలింపు, వేగవంతమైన రిఫండ్లు, సులభతరంగా రిజిస్ట్రేషన్ మొదలైన అంశాలన్నీ సంస్కరణల ప్యాకేజీలో భాగమేనని చెప్పారు. కొత్త విధానంలో 90 శాతం వరకు రిఫండ్లు నిర్దిష్ట కాలవ్యవధిలో ప్రాసెస్ అవుతాయని, కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మూడు రోజుల్లోనే పూర్తవుతుందని చెప్పారు. ఒకే తరహా ఉత్పత్తులను ఒకే శ్లాబ్ తేవడం వల్ల ఉత్పత్తుల వర్గీకరణపై నెలకొన్న గందరగోళం కూడా తొలగిపోతుందని మంత్రి చెప్పారు.రాష్ట్రాలకు ధన్యవాదాలు.. జీఎస్టీ సంస్కరణలకు మద్దతునిచ్చిందుకు గాను రాష్ట్రాలకు సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపాదిత సవరణలు సామాన్యుడికి ప్రయోజనం చేకూర్చేవేనని అంతిమంగా రాష్ట్రాలు అభిప్రాయపడినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ తాను లేఖలు రాసినట్లు చెప్పారు. రాష్ట్రాలు ఎల్లప్పుడూ రేట్ల కోతకు సుముఖంగానే ఉంటాయని, కానీ దానివల్ల రాబడికి కోత పడటంపైనే వాటికి ఆందోళన ఉంటుందని మంత్రి వివరించారు. ‘అయితే, దీని వల్ల రాష్ట్రాలపైనే కాకుండా కేంద్రంపైనా ప్రభావం ఉంటుందని వారికి చెప్పాను. కాకపోతే రేట్లు తగ్గి, ప్రజలు మరింతగా కొనుగోళ్లు చేయడం వల్ల, ఆదాయ లోటు భర్తీ అవుతుందని వివరించాను. ఆ విధంగా ఏకాభిప్రాయం సాధించడం వీలైంది‘ అని ఆమె వివరించారు. జీఎస్టీ మండలిలో రాష్ట్రాలు నిర్మాణాత్మకంగా పాలుపంచుకున్నాయని మంత్రి కితాబిచ్చారు. పన్ను సంస్కరణల విషయంలో నిబద్ధతతో వ్యవహరించాయని పేర్కొన్నారు. -
జీఎస్టీ తగ్గింపు.. తేడా వస్తే వారే బాధ్యులు: ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ: జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు సాధారణ ప్రజలకు చేరాలని, సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పన్ను విధానం అమలు తీరును కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.జీఎస్టీ పునర్వ్యవస్థీకరణ కింద ప్రజలకు హామీ ఇచ్చిన ఉపశమనం వారికి దక్కకపోతే తయారీదారులు, పరిశ్రమ భాగస్వాములు, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రయోజనాలను సామాన్యులకు అందించకపోతే రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.కొత్త జీఎస్టీ రేట్ల ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరేలా పర్యవేక్షించడానికి తయారీదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. జీఎస్టీ ప్రయోజనాలు ఏ రాష్ట్రంలోనైనా ప్రజలకు అందకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రిని ప్రశ్నిస్తామని చెప్పారు.ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబుల జీఎస్టీ నిర్మాణాన్ని మార్పు చేసి కేంద్ర ప్రభుత్వం రెండే శ్లాబులతో సరళీకృత జీఎస్టీ విధానాన్ని ఈనెలల 22 నుంచి అమలు చేస్తోంది. కొన్ని రకాల వస్తువులపై జీఎస్టీని 5 శాతానికి, మరికొన్ని వస్తువులపై పన్నును 18 శాతానికి పరిమితం చేసి సామాన్యులకు ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది. కొన్ని హానికరమైన, లగ్జరీ ఉత్పత్తులపై మాత్రం ప్రత్యేకంగా 40 శాతం జీఎస్టీని అమలు చేయనుంది. -
జీఎస్టీ 2.0.. కాంగ్రెస్ క్రెడిట్‌పై నిర్మలమ్మ చురకలు
వస్తు సేవల పన్ను (GST) 2.0 క్రెడిట్ ముమ్మాటికీ తమదేనంటున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చురకలంటించారు. గతంలో జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని విమర్శించినవాళ్లే.. ఇప్పుడు GST 2.0కు క్రెడిట్ తీసుకుంటున్నారని అన్నారామె. గతంలో వస్తు సేవల పన్నును గబ్బర్ సింగ్ టాక్స్ అని అభివర్ణించిన ప్రతిపక్ష నేతలు.. ఇప్పుడు అదే పన్ను వ్యవస్థలో మార్పుల క్రెడిట్‌ను ఖాతాలో వేసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘GST 2.0 అనేది ప్రజల కోసం, వ్యాపారాల కోసం తీసుకున్న నిర్ణయం. ఇది రాజకీయ విమర్శలకు సమాధానం కాదు. కానీ, గతంలో దీనిని ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని పిలిచినవాళ్లే ఇప్పుడు దీన్ని తమ విజయం అని చెప్పుకోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ అన్నారు.అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో దీన్ని ఎందుకు అమలు చేయలేకపోయిందో చెప్పాలి? అని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో GST అమలు చేయడం అసాధ్యమని భావించిందని, కానీ మోదీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి, ఇప్పుడు రెండో దశ సంస్కరణలు కూడా తీసుకువస్తోందని పేర్కొన్నారు.పన్ను శ్లాబ్‌ల సరళీకరణ, 5% & 18% ప్రధాన శ్లాబ్‌లు, 40% సిన్ టాక్స్ (తంబాకూ, లగ్జరీ వస్తువులపై) GST 2.0లో కీలక మార్పులని చెప్పొచ్చు. అయితే.. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిని ఆయుధంగా చేసుకునే ప్రతిపక్షాలు ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. జీఎస్టీ 2.0పై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. ఇది రాహుల్ గాంధీ 2016లో సూచించిన 18% GST క్యాప్‌ను అనుసరించడమే అని పేర్కొన్నారు. GST 2.0లో సాధారణ వినియోగదారులకు ప్రయోజనం కలగాలన్న ఉద్దేశంతో తీసుకున్న చర్యలపై తమ పాత్రను గుర్తు చేశారు.ఇదిలా ఉంటే.. జీఎస్టీని గబ్బర్ సింగ్ టాక్స్ అని మొదటగా పిలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. 2017 అక్టోబర్‌లో గుజరాత్ గాంధీనగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్య చేశారు. జీఎస్టీలో 28% అత్యధిక పన్ను ఉంది, మూడు రిటర్న్ ఫారమ్‌లు ఉన్నాయి. ఇది ప్రజలపై భారం పెడుతోంది. ఇది గబ్బర్ సింగ్ టాక్స్లా ఉంది అని అన్నారాయన. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ షోలేలోని విలన్ గబ్బర్ సింగ్ లాగా, ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందన్న ఉద్దేశంతో ఆయన పై వ్యాఖ్య చేశారు. GST అమలులో బహుళ పన్ను శ్లాబ్‌లు, క్లిష్టమైన కంప్లయన్స్ విధానం ఉండటం వల్ల చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ సమయంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి కూడా. -
మారిన శ్లాబుల మురిపెం
ఎటు చూసినా నిరాశామయ వాతావరణమే అలుముకుని అంతటా నిర్లిప్తత ఏర్పడిన తరుణంలో బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన అందరిలోనూ ఉత్సాహం నింపింది. ఈ క్షణం కోసం సామాన్యులు మొదలుకొని రైతులూ, చిరు వ్యాపారులూ, చిన్నా చితకా పరిశ్రమలవారూ ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. సరుకులు, సేవల పన్ను (జీఎస్టీ)ను హేతుబద్ధీకరిస్తూ, సాధారణ ప్రజానీకం వాడే అనేకానేక నిత్యావసరాలకు పన్ను తగ్గించటం లేదా పూర్తిగా ఎత్తేయటం... ఆరోగ్య బీమాకు పన్నుపోటు నుంచి మినహాయించటం తదితరాలు ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో ఊరట నిస్తాయి. సామాన్యుల్లో జీఎస్టీ ‘గబ్బర్‌సింగ్ టాక్స్’గా అపకీర్తి పాలైందంటేనే వారిని ఎంతగా కష్టపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే పన్నుల హేతుబద్ధీకరణను అమలు చేయబోతున్నామని పదే పదే ప్రకటించటంతో జీఎస్టీ మండలి సమావేశమైనప్పుడల్లా అందరిలోనూ ఆశలు చిగురించేవి. తీరా మరిన్ని సరుకుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటంతో వారంతా బిత్తరపోయేవారు. ప్రధాన రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడూ, వార్షిక బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడూ జీఎస్టీ తగ్గింపుపై ఊహాగానాలు రావటం, చివరకు నిట్టూర్చటం రివాజైపోయింది. ఈ దశలో మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీని సరళీకృతం చేయబోతున్నామని వెల్లడించారు. మొత్తానికి ఇప్పుడిక 5 శాతం, 18 శాతం పన్నుల విధానం అమలు కాబోతోంది.ఆరంభమైన మొదలుకొని జీఎస్టీని ఎవరూ మెచ్చింది లేదు. తమ ఆదాయ వనరు లకు గండి కొట్టిందని రాష్ట్రాలూ, తమ జేబులు కత్తిరిస్తోందని మధ్యతరగతి జీవులూ,ఎంతో కష్టపడి సంపాదిస్తున్నది కాస్తా జీఎస్టీ పేరు మీద ప్రభుత్వం తన్నుకు పోతున్నదని వ్యాపారులూ ఆక్రోశిస్తూనే ఉన్నారు. జీఎస్టీ చిత్రవిచిత్రాలు పోయింది. వడాపావ్ వెన్నతో తింటే ఒక రకమైన పన్ను, అది లేకుండా తింటే వేరే రకం పన్ను వేయటాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. ఆ మధ్య నిర్మలా సీతారామన్ సమక్షంలో ఒక వ్యాపారవేత్త జీఎస్టీపై వెటకారంగా వ్యాఖ్యానించటం, ఆ వీడియో కాస్తా వైరల్ కావటంతో ఆయన కంగారుపడి మంత్రిని కలిసి క్షమాపణలు చెప్పటం అందరికీ తెలుసు. జీఎస్టీ అరాచకం అంతా ఇంతా కాదు. సబ్బు, షాంపూలపై 18 శాతం, స్కూలు పుస్త కాలు, పెన్సిళ్లు, రంగు పెన్సిళ్లు తదితరాలపై 12 శాతం, ఆఖరికి కోచింగ్ తీసుకుంటే 18 శాతం పన్నులతో ఎడాపెడా బాదటం అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. అయినా కేంద్రంలో కదలిక రాలేదు. అమెరికా విధించిన 50 శాతం సుంకాల వల్ల ఎదురుకాగల సమస్యల్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రంలో కదలిక వచ్చిందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఆ సంగతలా ఉంచితే ప్రజల్లో వినిమయాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు తీసుకురావటానికి తాజా నిర్ణయాలు దోహదపడతాయి. ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచుకోవటానికి ఎంతసేపూ పరోక్ష పన్నులపైనే ఆధారపడతాయి. ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే నిజానికిది చాలా తక్కువ. కానీ పారిశ్రామికవేత్తలనూ, సంపన్నులనూ నొప్పించటం ప్రభుత్వాలకు ఇష్టం ఉండదు. వాళ్లంతా ఉపాధి కల్పనలో పాలుపంచుకుంటున్నారన్న కారణం చెబు తారు. పరోక్ష పన్నుల్ని ‘తిరోగమనం’గా అభివర్ణించేవారు కూడా ఉన్నారు. సినిమా టిక్కెట్లపై విధించే వినోదపు పన్నునే వారు ఉదాహరిస్తారు. సామాన్యుడికైనా, కోట్లకు పడగెత్తిన సంపన్నుడికైనా ఆ పన్ను ఒకేలా ఉంటుంది. అయితే పన్ను విధింపులో కాస్తంత హేతుబద్ధత చూపటం ద్వారా సామాన్యుల్ని కూడా సంతుష్టి పరచవచ్చు. అర్థశాస్త్రంలోని ‘లేఫర్ కర్వ్’ భావన అటువంటిదే. పన్నులు తక్కువగా ఉంటే సామాన్య జనం అధికంగా కొని ఖజానా ఆదాయాన్ని పెంచుతారని ఈ భావన చెబుతుంది.కానీ ప్రభుత్వాలు ఎంతసేపూ అధిక పన్నుల ద్వారా అధికాదాయం అనే ఆలోచనలోనే ఉంటాయి. అధిక పన్నులూ, వాటిని చెల్లించలేదంటూ వేధింపులూ వగైరాలను ‘ట్యాక్స్ టెర్రరిజం’గా కొందరు అభివర్ణిస్తున్నారు. ఈ సంస్కరణలు మైలురాయి వంటివా... కాదా అన్నది రానున్న కాలంలో తేలిపోతుంది. పనిలో పనిగా జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే యోచన కూడా చేస్తే దేశంలో ఫెడరలిజం వర్ధిల్లుతుంది. -
లక్షలాది కుటుంబాలకు తీపికబురు.. కిరాణా బిల్లులు తగ్గింపు
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 3న ఆమోదించిన జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణ వల్ల భారతీయ కుటుంబాలకు ఎంతో మేలు జరగనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఆమోదించిన నిర్ణయాల వల్ల మెజారిటీ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడంతో లక్షలాది కుటుంబాలకు నెలవారీ కిరాణా, ఆహార బిల్లులు తగ్గుతాయని భావిస్తున్నారు. కొత్తగా ఆమోదించిన శ్లాబుల ప్రకారం ఏయే వస్తువులపై జీఎస్టీ ఎలా మారుతుందో కింద చూద్దాం.సరుకులుపాత జీఎస్టీ శ్లాబుకొత్త జీఎస్టీ శ్లాబుఅల్ట్రా హై టెంపరేచర్ మిల్క్5%Nilప్యాకేజ్డ్ పనీర్5%Nilపిజ్జా బ్రెడ్5%Nilరోటీ/చపాతీ5%Nilపరాఠా/పరోటా18%Nilవెన్న, నెయ్యి, పాల ఉత్పత్తులు12%5%జున్ను12%5%ఘనీకృత పాలు12%5%డ్రై ఫ్రూట్స్, నట్స్12%5%బిస్కెట్లు, కేకులు, పేస్ట్రీలు18%5%చాక్లెట్, కోక్వ్ ఉత్పత్తులు18%5%కార్న్ ఫ్లేక్స్18%5%జెమ్స్, సాస్, ఊరగాయలు12-18%5%సూప్ ఉత్పత్తులు18%5%ఐస్ క్రీం18%5% ఇదీ చదవండి: అమెజాన్ ప్రైమ్ ఇన్విటేషన్ ప్రోగ్రామ్ నిలిపివేత -
ట్రంప్ టారిఫ్‌లా? బీహార్ ఎన్నికలా?: జీఎస్టీపై చిదంబరం ప్రశ్నలు
ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అంటూ కొందరు నేతలు కొనియాడగా.. మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలా ప్రకటన చేయడంతో ఎలక్షన్ స్టంట్ అని కామెంట్స్ చేశారు.జీఎస్టీ సంస్కరణల గురించి కాంగ్రెస్ నాయకులు చిదంబరం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా చిదంబరం.. ‘వివిధ వస్తువుల రేట్ల తగ్గింపు స్వాగతించదగినది. కానీ, ఎనిమిది సంవత్సరాలుగా చాలా ఆలస్యం జరిగింది. జీఎస్టీ రూపకల్పన, రేట్లకు వ్యతిరేకంగా గత ఎనిమిది సంవత్సరాలుగా మేం పోరాడుతున్నాం. కానీ మా విన్నపాలు పట్టించుకోలేదు. బీహార్ ఎన్నికలకు ముందు ఇలా ప్రకటన రావడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ట్రంప్ టారిఫ్‌లా కోసం చేశారా? లేక బీహార్ ఎన్నికల కోసమా? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా జీఎస్టీ సంస్కరణల గురించి ఆల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందించింది. ‘ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తర్వాత సాధించిన సామాన్య ప్రజల విజయం’ అని అభివర్ణించింది. కేంద్రంలోకి బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.మరోవైపు.. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని ప్రకటించిన దీపావళి కానుక దసరాకు ముందే వచ్చింది. ఇకపై జీఎస్టీలో 5, 18 శాతం పన్ను శ్లాబులే ఉంటాయి. 12 శాతం, 28 శాతం శ్లాబుల్లోని వస్తువులు 5, 18 శాతం శ్లాబుల్లోకి మారనున్నాయి. బంగారం, వెండి, వజ్రాభరణాలపై ప్రత్యేక పన్ను రేటు 3 శాతం ఇక ముందూ కొనసాగనుంది.సెప్టెంబర్ 22 నుంచే (దేవీ నవరాత్రి వేడుకలు మొదలయ్యే రోజు) కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. కేంద్రం ప్రతిపాదనలకు అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణలు చేపట్టాం. సామాన్యులు రోజువారీ వినియోగించే అధిక శాతం వస్తువులపై పన్ను రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. కార్మికుల ఆధారిత రంగాలకు చక్కని మద్దతు లభిస్తుంది. రైతులు, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం ప్రయోజనం పొందుతాయి. ఆర్థిక వ్యవస్థలోని కీలక చోదకాలకు ప్రాధాన్యం ఇచ్చాం’ అని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
GSTలో కీలక మార్పులు
-
జీఎస్టీలో ఇకపై 5, 18 శాతం పన్ను శ్లాబులే... తగ్గనున్న పలు వస్తువుల ధరలు.. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు
-
జీఎస్టీ సంస్కరణల ఆశలతో....
ముంబై: కొత్త జీఎస్టీ సంస్కరణలపై ఆశలతో పాటు మెటల్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు బుధవారం అరశాతం లాభపడ్డాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ భేటిలో 500 ఉత్పత్తుల ధరలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత విధానంలో నాలుగు పన్ను శ్లాబ్‌లు (5%, 12%, 18%, 28%) ఉండగా.. ఇకపై రెండు శ్లాబ్‌లు (5%, 18%) మాత్రమే ఉంటాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. జీఎస్టీ 2.0తో ధరలు తగ్గి వినియోగం పెరగొచ్చనే ఆశావహ అంచనాలతో సెన్సెక్స్ 410 పాయింట్లు లాభపడి 80,568 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 135 పాయింట్లు లాభపడి 24,715 వద్ద నిలిచింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 80,005 – 80,671 శ్రేణిలో మొత్తంగా 667 పాయింట్లు పరిధిలో కదలాడింది. నిఫ్టీ 157 పాయింట్లు బలపడి 24,737 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆసియాలో దక్షిణ కొరియా మినహా అన్ని రంగాల షేర్లూ నష్టాలు చవిచూశా యి. యూరప్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. → ట్రేడింగ్‌లో మెటల్ షేర్లు మెరిశాయి. చైనా 2025, 2026లో స్టీల్ ఉత్పత్తిని తగ్గించాలనే నిర్ణయం, అంతర్జాతీయంగా డాలర్ బలహీనత కారణంగా మెటల్ షేర్లకు డిమాండ్ లభించింది. టాటా స్టీల్ 6%, జిందాల్ స్టీల్, సెయిల్ 5.50% ర్యాలీ చేశాయి. నాల్కో, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3%, ఎన్ఎండీసీ, లాయిడ్స్ మెటల్స్, వేదాంత 2% రాణించాయి. → రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో మెటల్ 3%, కమోడిటీ 1.50% లాభపడ్డాయి, ఫార్మా, కన్జూమర్ డి్రస్కేషనరీ, ఫైనాన్సియల్ సరీ్వసెస్, బ్యాంకెక్స్, ఆటో సూచీలు 1% పెరిగాయి. మరోవైపు ఐటీ, టెక్, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. → విక్రాన్ ఇంజనీరింగ్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.97)తో పోలిస్తే బీఎస్ఈలో 3% ప్రీమియంతో రూ.98 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.102 వద్ద గరిష్టాన్ని, రూ.93 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి ఒకటిన్నర శాతం నష్టంతో రూ.95.64 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,467 కోట్లుగా నమోదైంది. -
జీఎస్టీ భారీగా తగ్గింపు.. వీటి ధరలు దిగొస్తాయ్
న్యూఢిల్లీ: సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రధాని ప్రకటించిన దీపావళి కానుక దసరాకు ముందే వచ్చింది. చపాతీ, పరోటా, బ్రెడ్డు, బన్నులపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షతన భేటీ అయిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అంతేకాదు కుటుంబాలకు ఆధారమైన ఆరోగ్య, జీవిత బీమాపై ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్టీని ఎత్తివేయనుంది. దీంతో ఆ మేరకు వాటి ప్రీమియంలు తగ్గనున్నాయి. ఇకపై జీఎస్టీలో 5, 18 శాతం పన్ను శ్లాబులే ఉంటాయి. 12 శాతం, 28 శాతం శ్లాబుల్లోని వస్తువులు 5, 18 శాతం శ్లాబుల్లోకి మారనున్నాయి. బంగారం, వెండి, వజ్రాభరణాలపై ప్రత్యేక పన్ను రేటు 3 శాతం ఇక ముందూ కొనసాగనుంది. సెప్టెంబర్ 22 నుంచే (దేవీ నవరాత్రి వేడుకలు మొదలయ్యే రోజు) కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. కేంద్రం ప్రతిపాదనలకు అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘‘సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణలు చేపట్టాం. సామాన్యులు రోజువారీ వినియోగించే అధిక శాతం వస్తువులపై పన్ను రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. కార్మీకుల ఆధారిత రంగాలకు చక్కని మద్దతు లభిస్తుంది. రైతులు, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం ప్రయోజనం పొందుతాయి. ఆర్థిక వ్యవస్థలోని కీలక చోదకాలకు ప్రాధాన్యం ఇచ్చాం’’అని మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. వ్యాపార నిర్వహణ సైతం సులభతరం అవుతుందని, నిబంధనల అమలు సరళంగా మారుతుందన్నారు. తాజా పన్ను శ్లాబుల క్రమబద్దీకరణతో రూ.48,000 కోట్ల ఆదాయం తగ్గిపోనుందని, ద్రవ్యపరంగా దీన్ని ఎదుర్కోగలమని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నిర్ణయాలతో దేశీ వినియోగం మరింత పెరుగుతుందన్నది కేంద్ర ప్రభుత్వం అంచనా. మన జీడీపీలో 61.4 శాతం వినియోగం రూపంలోనే సమకూరుతుండడం గమనార్హం. జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన రెండో ఏడాదిలో జీడీపీ వృద్ధి 0.5 శాతం మేర అదనంగా నమోవుతుందని ఆర్థిక వేత్తల అంచనా. భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లు దేశ ఆర్థిక వృద్ధిని 0.20–0.50 శాతం ప్రభావితం చేస్తాయన్న ఆందోళనలు నెలకొనగా.. జీఎస్టీ సంస్కరణలతో ఈ ప్రభావం సమసిపోనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటి ధరలు దిగొస్తాయ్.. ప్రస్తుతం బ్రాండెడ్ బ్రెడ్, బ్రెడ్ ఉత్పత్తులపై 5–18 శాతం మేర జీఎస్టీ అమల్లో ఉండగా ఇది తొలగిపోనుంది. పరాటాపై 18 శాతం, చపాతీ, యూహెచ్‌టీ పాలపై 5 శాతం రేటును ఎత్తివేయనున్నారు. నిత్యావసరాలైన టూత్‌పేస్ట్, టూత్ బ్రష్‌లు, టాల్కమ్ పౌడర్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్, బటర్, నెయ్యి, మాంసం, బిస్కెట్లతో పాటు షుగర్ కన్ఫెక్షనరీ, జామ్, ఫ్రూట్ జెల్లీలు, డ్రై నట్స్, ఐస్‌క్రీమ్, పండ్ల రసాలు, కార్న్‌ఫ్లెక్స్ తదితర ఉత్పత్తులపై 18 శాతం జీఎస్టీ 5 శాతానికి తగ్గిపోనుంది. ఇక వంటింటి వస్తువులు, గొడుగులు, సైకిళ్లు, వెదురు ఫర్నీచర్ వస్తువులు, ఫీడింగ్ బాటిళ్లు, టూత్ పౌడర్‌పై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి దిగిరానుంది. ఇంటి నిర్మాణంలోకి వినియోగించే సిమెంట్‌పైనా పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది. 350 సీసీ ఇంజన్ సామర్థ్యం వరకు ఉన్న ద్విచక్ర మోటారు వాహనాలు, ఏసీలు, డిష్వాషర్లు, టీవీలు (32 అంగుళాలకు పైన) తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువులపైనా ధరల భారం 28 శాతం నుంచి 18 శాతానికి దిగిరానుంది. ప1,200 సీసీ, 4,000 ఎంఎం పొడవు మించని పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ వాహనాలు, 1,500 సీసీ వరకు ఉన్న డీజిల్ వాహనాలపైనా పన్ను రేటు 18 శాతానికి తగ్గనుంది. 1,200 సీసీ నుంచి 4,000 ఎంఎం కంటే పొడవైన మోటారు వాహనాలు, 350సీసీకి పైన ద్విచక్ర వాహనాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు (వ్యక్తిగత వినియోగానికి), రేసింగ్కార్లు, క్యాసినోలు/గ్యాంబ్లింగ్/గుర్రపు పందేలు/లాటరీలపై 40 శాతం పన్ను రేటు అమలవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఎప్పటి మాదిరే 5 శాతం పన్ను కొనసాగనుంది. పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతానికి 28 శాతం సిగరెట్లు, గుట్కాలు, పాన్ మసాలా, జర్దా తదితర పొగాకు ఉత్పత్తులపైనా 40 శాతం పన్ను రేటును ప్రతిపాదించారు. అయినప్పటికీ ప్రస్తుతానికి వీటిపై 28 శాతం జీఎస్టీ, దీనిపై కాంపన్సేషన్ సెస్సును కొనసాగించనున్నారు. రాష్ట్రాలకు ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు తీసుకున్న రుణాలను తిరిగి పూర్తిగా చెల్లించేంత వరకు ఇది కొనసాగుతుందని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఆ తర్వాత వీటిపైనా 40 శాతం పన్ను రేటు అమలు కానుంది. ఇది ఎప్పటి నుంచి అన్నది జీఎస్టీ మండలి తర్వాత నిర్ణయిస్తుంది. పౌరుల జీవనం మెరుగుపడుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పన్ను తగ్గింపులు, జీఎస్టీ సంస్కరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు సామాన్యులకు, రైతులు, ఎంఎస్‌ంఎఈలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు ప్రయోజనం కలిగిస్తాయి. ఈ విస్తృత స్థాయి సంస్కరణలు పౌరుల జీవనాన్ని మెరుగుపరుస్తాయి. వ్యాపార నిర్వహణ అన్నది, ముఖ్యంగా చిన్న వర్తకులు, వ్యాపారులకు సులభతరం అవుతుంది’’ – ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రధాని మోదీ స్పందన -
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పండగ బొనాంజా ప్రకటించింది. జీఎస్టీ రేట్లు తగ్గింపునకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 12, 28 శాతం శ్లాబులు రద్దు చేయాలని నిర్ణయించింది. 5, 18 శ్లాబులను మాత్రమే కేంద్రం కొనసాగించనుంది. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమలు కానున్నాయి. లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను విధించింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీ రద్దు చేసింది.సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇకపై రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయని ఆమె పేర్కొన్నారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్‌పై 12 శాతం జీఎస్టీ తొలగించగా.. సిమెంట్‌పై టాక్స్ 28 నుంచి 18 శాతానికి కుదించాం. క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగించినట్లు నిర్మల పేర్కొన్నారు.సామాన్యులు వాడే వస్తువులపై జీఎస్టీ తగ్గించామని, రైతులు, సామాన్యులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. వ్యవసాయ, వైద్య రంగాలకు ఊరట కలిగించే నిర్ణయాలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.‘‘ఈజ్ ఆఫ్ లివింగ్ కోసమే న్యూ జనరేషన్ రిఫార్మ్స్. ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలకు పిలుపునిచ్చారు. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని సంస్కరణలు తెచ్చాం. కొత్త సంస్కరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ ఉపయోగించే వస్తువులన్నీ ఐదు శాతం పన్ను పరిధిలోకి తెచ్చాం. పాలు, రోటి, బ్రెడ్‌పై ఎలాంటి పన్ను లేదు. ఏసీ, టీవీ, డిష్ వాషర్లు, చిన్నకారులపై పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించాం’’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.👉అన్నీ టీవీలపై 18 శాతం జీఎస్టీ👉వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు👉చాలా ఎరువులపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గింపు👉చేనేత, మార్బుల్, గ్రానైట్‌పై 5 శాతం జీఎస్టీ👉33 ఔషధాలపై జీఎస్టీ 12 నుంచి సున్నాకి తగ్గింపు👉350 సీసీ కంటే తక్కువ వాహనాలపై 18 శాతం జీఎస్టీ👉350 సీసీ దాటిన వాహనాలపై 40 శాతం పన్ను👉కార్పొనేటెడ్ కూల్‌డ్రింక్స్, జ్యూస్లపై 40 శాతం జీఎస్టీ👉పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ -
అక్టోబర్ 9 నుంచి బడ్జెట్ కసరత్తు ప్రారంభం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ 2026–27 బడ్జెట్ రూపకల్పన కసరత్తును అక్టోబర్ 9 నుంచి ప్రారంభించనుంది. ఒకవైపు అమెరికా 50 శాతం టారిఫ్ రేటును అమలు చేస్తుండడం, అంతర్జాతీయ వాణిజ్య ధోరణుల్లో మార్పుల నేపథ్యంలో తీసుకురానున్న ఈ బడ్జెట్లో కేంద్రం ఏవైనా కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తుందేమో చూడాల్సి ఉంది. ముఖ్యంగా దేశీ డిమాండ్‌కు మరింత ఊతమివ్వడం, ఉపాధి కల్పనను విస్తృతం చేయడం ద్వారా జీడీపీ వృద్ధి రేటును 8 శాతానికి పెంచాల్సిన ఆవశ్యకత కేంద్రం ముందుంది.ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శి అధ్యక్షతన బడ్జెట్ ముందస్తు సమావేశాలు అక్టోబర్ 9 నుంచి మొదలవుతాయంటూ ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ సర్క్యులర్‌లో పేర్కొంది. సమావేశాలు ముగిసిన అనంతరం 2026–27 బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖ ఖరారు చేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను 2026 ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
జీఎస్టీ కీలక భేటీ నేటి నుంచి
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ రెండు రోజుల సమావేశం బుధవారం ప్రారంభం కానుంది. జీఎస్టీలో ఇప్పుడున్న 5, 12, 18 28 శాతం శ్లాబుల స్థానంలో 5, 18 శాతం శ్లాబులను కొనసాగించి, మిగిలిన వాటిని ఎత్తేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. 12, 28 శాతం శ్లాబుల్లో ఉన్న వాటిని 5, 18 శాతం శ్లాబుల్లోకి సర్దుబాటు చేయనున్నారు. సిగరెట్, గుట్కాలు, విలాసవంతమైన కొన్ని వస్తువులపై మాత్రం 40 శాతం ప్రత్యేక పన్ను రేటును అమలు చేయాలన్నది ప్రతిపాదన. దీనికి జీఎస్టీ మంత్రుల బృందం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేయగా.. జీఎస్టీ మండలి దీనిపై నిర్ణయం తీసుకోనుంది.3, 4వ తేదీల్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన (ఈవీలు) కొనుగోలును ప్రోత్సహించేందుకు వీలుగా వాటిని 5 శాతం రేటు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శ్లాబుల తగ్గింపుతో చాలా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. దీన్ని విపక్ష పాలిత రాష్ట్రాలు ఆహ్వానిస్తూనే.. ఆదాయ నష్టం ఏర్పడితే కేంద్రం భర్తీ చేయాలని కోరుతుండడం గమనార్హం. 2017 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచి్చంది. అప్పట్లో జీఎస్టీలోకి మారడం కారణంగా రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు వీలుగా కాంపెన్సేషన్ సెస్సు (1–290 శాతం మధ్య)ను విలాసవంత, హానికారక వస్తువులపై అమలు చేస్తున్నారు. దీని గడువు 2026 మార్చితో ముగిసిపోనుంది. ఆ తర్వాత కొనసాగించకూడదన్నది కేంద్రం ఉద్దేశమని తెలుస్తోంది.ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహంఎలక్ట్రిక్ వాహనాలపై (రూ.10 లక్షల వరకు) 18 శాతం జీఎస్టీకి మంత్రుల బృందం సానుకూలంగా ఉంది. కానీ, మరింత మంది ఈవీలను కొనుగోలు చేసేందుకు వీలుగా 5 శాతం రేటుకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెయ్యి, నట్స్, తాగు నీరు (20 లీటర్ల క్యాన్లు), నమ్కీన్, కొన్ని రకాల పాదరక్షలు, దుస్తులు, మందులు, వైద్య పరికరాలను 12 శాతం నుంచి 5 శాతం రేటు కిందకు మార్చే అవకాశం ఉంది. పెన్సిళ్లు, సైకిళ్లు, గొడుగులను సైతం తక్కువ రేటు శ్లాబులోకి తీసుకురానున్నారు. కొన్ని రకాల టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, కొన్ని రకాల వాహనాలను 28% నుంచి 18% రేటులోకి తీసు కురానున్నట్టు తెలుస్తోంది. -
ఓడిపోయే వ్యక్తిని ఎలా నిలబెడతారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయేలో ఉన్న తాము ప్రతిపక్ష పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఎలా మద్దతిస్తామని, ఓడిపోతామని తెలిసి కూడా ఇండియా కూటమి వాళ్లు తెలుగువాడు అంటూ అభ్యర్థిని పెట్టడం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తాము సపోర్ట్ చేస్తామని ఆశించడం కూడా కరెక్ట్ కాదంటూ ఇండియా కూటమిని విమర్శించారు. ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు శుక్రవారం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర సదన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీయే భాగస్వామిగా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయనకు తెలిపారు. అనంతరం అక్కడున్న మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది.. ‘సి.పి.రాధాకృష్ణన్‌ను ఎన్డీయే అభ్యర్థిగా మేమంతా కలిసే నిర్ణయించాం. ఆయన దేశంలో గరి్వంచదగ్గ నేత. దేశానికి, ఆ కుర్చీకి వన్నె తెస్తారు’.. అని చెప్పారు. టీడీపీ మద్దతు ఇస్తుందా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. ‘గెలిచే అవకాశం లేకపోయినా తెలుగువాడు అంటూ అభ్యర్థిని పెట్టిన ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది. రాష్ట్రంలో మేం, కేంద్రంలో ఎన్డీయే ఉన్నప్పుడు మేం వాళ్లకే కదా మద్దతు తెలిపేది’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరో రూ.5 వేల కోట్లు ఇవ్వండి.. మరోవైపు.. చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా రూ.5 వేల కోట్లు అవసరమని ఆమెకు తెలిపారు. ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (సాస్కి–స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) కింద ఆ నిధులను అందించాలంటూ వినతిపత్రాన్ని అందచేశారు. అలాగే, 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం.. రూ.250 కోట్ల విడుదలకు ఉత్తర్వులివ్వాలని కూడా కోరారు. ఇక 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరియాతోనూ ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. -
జీఎస్టీ మంత్రుల బృందం భేటీ రేపే
న్యూఢిల్లీ: జీఎస్టీలో శ్లాబుల తగ్గింపుపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం 20న చర్చించనుంది. ఈ బృందంలో భాగం కాకపోయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ సమావేశానికి హాజరు కానుండడం గమనార్హం. 5 శాతం, 18 శాతం శ్లాబులతో కూడిన కొత్త నమూనాను కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే మంత్రుల బృందం ముందుంచింది. పొగాకు తదితర కొన్నింటిపై 40 శాతం పన్ను ప్రతిపాదించింది. దీనిపై ఢిల్లీలో ఈ నెల 20, 21 తేదీల్లో జీఎస్టీ మంత్రుల బృందం (జీవోఎం) చర్చించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘జీవోఎంలో కేంద్రం భాగం కానప్పటికీ.. ఆర్థిక మంత్రి పాల్గొనడం, ప్రసంగించడం అన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన, ఉద్దేశ్యాలను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సాయపడుతుంది’’అని ఆ వర్గాలు వెల్లడించాయి. విహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆరుగురు సభ్యుల జీవోఎంకు కనీ్వనర్‌గా వ్యవహరిస్తున్నారు.కొత్త రేట్లను దిపావళికి ముందే అమల్లోకి తేవాలన్నది కేంద్రం ఉద్దేశంగా ఉంది. జీఎస్టీ రేట్లలో మార్పుతో ఆదాయం తగ్గుతుందన్న ఆందోళనలను కేంద్రం తొలగించే ప్రయత్నం చేసింది. ఆదాయంలో రాష్ట్రాలతో పాటు కేంద్రానికి సమాన వాటా ఉంటుందన్న విషయాన్ని అధికార వర్గాలు గుర్తు చేశాయి. కొత్త ప్రతిపాదనలతో నిరీ్ణత కాలంలో వినియోగం పెరిగి, అధిక ఆదాయానికి దారితీస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇక ప్రతిపాదిత రెండంచెల పన్ను శ్లాబులతో కూడిన కొత్త జీఎస్టీ విధానంలో మెజారిటీ ఆదాయం 18 శాతం నుంచే ఉంటుందని తెలిపాయి. ప్రస్తుతం బంగారంపై 3శాతం, ఇతర వస్తు సేవలపై 5, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. ఆహార వస్తువులు కొన్నింటిని పన్ను నుంచి మినహాయించగా, కొన్ని 5 శాతం రేటు పరిధిలో ఉన్నాయి. లగ్జరీ, సిన్ గూడ్స్ (హానికారక)పై 40 శాతం రేటు అమలవుతోంది. -
ఇక జీఎస్టీలో రెండే శ్లాబులు!
న్యూఢిల్లీ: సామాన్యులకు వస్తు సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు వీలుగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో రెండు రేట్ల విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. స్టాండర్డ్ (ప్రామాణిక), మెరిట్ (యోగ్యత) కింద వీటిని వర్గీకరిస్తూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్‌కు నివేదించింది. వీటిపై అధ్యయనం అనంతరం జీఎస్టీ కౌన్సిల్ ముందు ప్యానెల్ తన సిఫారసులు ఉంచనుంది. దాదాపు అన్ని రకాల వస్తు, సేవలు రెండు రేట్ల పరిధిలోనే ఉంటాయి. విలాస, హాని కారక వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక రేటు అమలు కానుంది. దీంతో నిత్యావసరాలు, వాహనాలు సహా ఎన్నో రకాల వస్తు, సేవల రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త విధానాన్ని అమలు చేయాలన్న సంకల్పాన్ని ఆర్థిక శాఖ వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో జీఎస్టీ చట్టాన్ని సంస్కరించనున్నట్టు ప్రకటించారు. పన్నుల భారం గణనీయంగా తగ్గుతుందంటూ, దీన్ని దీపావళి కానుకగా అభివర్ణించారు. రోజువారీ వినియోగ వస్తువుల రేట్లు చౌకగా మారనున్నట్టు చెప్పారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ప్రధాని ప్రసంగం తర్వాత ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీలోనే ఎన్నో పన్నులు.. ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో 5, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. కొన్నింటిని జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించగా, విలాస వస్తువులు, సిగరెట్లు వంటి హానికారక (సిన్‌గూడ్స్) వస్తువులపై 28 శాతం రేటుకు అదనంగా కాంపెన్సేషన్ సెస్ (రాష్ట్రాల కోసం ఉద్దేశించిన పరిహార పన్ను) అమలవుతోంది. 5% పన్ను పరిధిలో 21 శాతం వస్తువులు ఉన్నాయి. 12% పన్ను రేటు కింద 19 శాతం.. 18% పన్ను పరిధిలో 44% వస్తు సేవలు ఉన్నాయి. 12% శ్లాబును ఎత్తివేసి ఇందులో ఉన్న వస్తు, సేవలను 5, 18 శాతం రేట్ల పరిధిలోకి మార్చొచ్చని తెలుస్తోంది. 12 శాతం రేటు పరిధిలోని 99 శాతం వస్తువులు 5 శాతం పరిధిలోకి వెళ్లనున్నట్టు.. 28 శాతం పరిధిలోని 90 శాతం వస్తు సేవలు 18 శాతం రేటు పరిధిలోకి వెళ్లనున్నట్టు సమాచారం. పొగాకు ఉత్పత్తులు, ఆన్లైన్ గేమింగ్ తదితర కొన్ని 40 శాతం పన్ను పరిధిలో ఉంటాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, టెక్స్టైల్స్, ఫెర్టిలైజర్స్, పునరుత్పాదక ఇంధనాలు, హస్తకళలు, వ్యవసాయం, ఆరోగ్యం, బీమా తదితర రంగాలకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా బంగారంపై 3 శాతం ప్రత్యేక రేటు అమలవుతోంది. దీన్ని అలాగే కొనసాగిస్తారా? లేక 5 శాతం రేటు పరిధిలోకి తెస్తారా? అన్న దానిపై ఇప్పటికి స్పష్టత లేదు. రేట్ల తగ్గింపు కారణంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గినట్టయితే దీన్ని ఎలా భర్తీ చేస్తారో చూడాలి. అలాగే, విలాసవంత, హానికారక వస్తువులపై 28 శాతం పన్నుకు అదనంగా అమలు చేస్తున్న కాంపెన్సేషన్ సెస్సు గడువు 2026 మార్చి 31తో ముగియనుంది. ఈ రూపంలో వచ్చే ఆదాయం ఆ తర్వాత తగ్గనుంది. అయితే, దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే, రేట్ల తగ్గింపుతో వినియోగం పెరిగి, అదనపు ఆదాయం సమకూరుతుందన్నది ఆర్థిక శాఖ అంచనా. 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచి్చన జీఎస్టీ విధానంలో తొలిసారి పెద్ద ఎత్తున మార్పు చోటుచేసుకోనుంది. జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, దీన్ని సరైన సమయంలో సరైన చర్యగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్‌లో కీలక భేటీ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ వచ్చే నెలలోనే సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే జీవిత, ఆరోగ్య బీమాలపై పన్ను తగ్గింపు సహా జీఎస్టీలో రేట్ల క్రమబదీ్ధకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పన్నుల తగ్గింపు వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంచనా వేస్తోంది. గుర్తింపు పరమైన వివాదాలను తొలగిస్తుందని, కొన్ని రంగాలకు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిచేస్తుందని.. రేట్ల పరమైన స్థిరత్వం ఏర్పడి వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుందని భావిస్తోంది. రాష్ట్రాల విస్తృత ఏకాభిప్రాయంతో తదుపరి తరం సంస్కరణలను అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ‘‘జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి భేటీలో మంత్రుల బృందం సిఫారసులపై చర్చిస్తుంది. సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. దీంతో ఆశించిన ప్రయోజనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సాకారమవుతాయి’’అని పేర్కొంది. -
కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం: అమల్లోకి ఎప్పుడంటే?
ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025కు తాజాగా ఆమోదం లభించింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సుల ఆధారంగా ఇందులో మార్పులు చేశారు.సుమారు నాలుగు నెలల పాటు తీవ్రంగా సమీక్షించిన తర్వాత, కమిటీ 285 కంటే ఎక్కువ సిఫార్సులతో 4,500 పేజీలకు పైగా నివేదికను రూపొందించింది. ఈ సూచనల ఉద్దేశ్యం చట్టం భాషను సరళీకృతం చేయడం, నిబంధనలలో స్పష్టత తీసుకురావడం & పన్ను చెల్లింపుదారులకు సమ్మతిని సులభతరం చేయడం. ఇప్పుడు ప్రభుత్వం ఈ మార్పులను కలుపుకొని కొత్త ముసాయిదాను సమర్పించింది.ప్రస్తుతమున్న 1961 చట్టాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు, రాష్ట్రపతి ఆమోదం కోరే ముందు రాజ్యసభకు వెళుతుంది. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత, కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది.పాత vs కొత్త బిల్లు మధ్య తేడాలుపాత ఆదాయపు పన్ను చట్టం, 1961.. దశాబ్దాలుగా అమలులో ఉంది. అయితే అందులోని భాష, నిర్మాణం వంటివన్నీ సామాన్యులకు కొంత గందరగోళంగా ఉన్నాయి. దీనిని పూర్తిగా మార్చాలనే ఉద్దేశ్యంతో కొత్త బిల్లును తీసుకువచ్చారు.ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త బిల్లులో.. అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.ఇకపై మునుపటి సంవత్సరం & అసెస్మెంట్ సంవత్సరం వంటి పదాలకు బదులు "పన్ను సంవత్సరం" అనే పదం వాడుకలోకి వస్తుంది.2025 కొత్త పన్ను బిల్లులో ఇంతకు ముందు ఉన్న శ్లాబులు, రేట్లు అలాగే ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, ఆదాయపన్ను శ్లాబులలో కూడా ఎలాంటి మార్పు లేదు.కొత్త బిల్లులో, సంక్లిష్టమైన చట్టపరమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎంత పన్ను చెల్లించాలో.. ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.ఇదీ చదవండి: ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు: స్పందించిన ఆర్బీఐ గవర్నర్ -
ప్రమాణాలను పెంచండి, విశ్వాసాన్ని గెలవండి
న్యూఢిల్లీ: విధానాలను సకాలంలో అమలు చేయడం ద్వారా కొత్త ప్రమాణాలను సృష్టించాలని.. పన్ను చెల్లింపుదారుల విశ్వాసాన్ని చూరగొనాలని ఆదాయపన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆరు నెలల్లోనే కొత్త ఆదాయపన్ను చట్టం ముసాయిదాను రూపొందించడం పట్ల అధికారులను అభినందించారు. ‘‘మంచి విధానాలు ఉండడంతోనే సరిపో దు. సకాలంలో వాటిని అమ లు చేయడమే కీలకం. ఇటీవలి కాలంలో మీరు ఎంతో గొప్ప గా పనిచేశారు. ఈ ప్రమాణాలను మరింత పెంచాల్సిన సమయం వచి్చంది’’అని 166వ ఆదాయపన్ను శాఖ దినోత్సవం సందర్భగా పేర్కొన్నారు. -
ఎకానమీకి జీసీసీల దన్ను
న్యూఢిల్లీ: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి గణనీయంగా తోడ్పడనున్నాయి. 2030 నాటికి వీటితో ఎకానమీకి 200 బిలియన్ డాలర్ల మేర ప్రయోజనం చేకూరనుంది. అలాగే మరిన్ని ఉద్యోగాల కల్పనకు కూడా ఇవి తోడ్పడనున్నాయి. సీఐఐ–జీసీసీ బిజినెస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. 2024లో సగటున వారానికొక జీసీసీ చొప్పున ఏర్పాటైందని వివరించారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో 50 శాతం సంస్థలు భారత్‌లో తమ సెంటర్లను నెలకొల్పాయని పేర్కొన్నారు. గత అయిదేళ్లుగా పరిశ్రమ ఏటా 11 శాతం చొప్పున వృద్ధి చెందిందన్నారు. వీటిలో దేశీయంగా సుమారు 21.6 లక్షల మంది ప్రొఫెషనల్స్ పని చేస్తుండగా 2030 నాటికి ఈ సంఖ్య 28 లక్షలకు చేరనుందని మంత్రి చెప్పారు. భారత జీసీసీ రంగం స్థూలంగా 68 బిలియన్ డాలర్ల విలువను (జీవీఏ) ఎకానమీకి జోడించిందని, 2030 నాటికి ఇది 150–200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపారు. వ్యయాలపరంగా అమెరికా, బ్రిటన్, ఆ్రస్టేలియాతో పోలిస్తే మన దగ్గర నిపుణుల సేవలు దాదాపు 30–50 శాతం తక్కువకే లభిస్తున్నాయని పేర్కొన్నారు. పాలసీలను క్రమబద్దీకరించాలి.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) భారత్ హబ్‌గా ఎదగాలంటే జాతీయ స్థాయిలో వాటికి సంబంధించిన పాలసీలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అనురాధ ఠాకూర్ తెలిపారు. జీసీసీలు అత్యధికంగా ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలాంటి రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, వాటిని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాల్సి ఉంటుందని వివరించారు. చాలా రాష్ట్రాల్లో నిపుణుల లభ్యత పుష్కలంగా ఉందని, పెద్ద ఎత్తున జీసీసీలు ఏర్పాటైతే తక్కువ వ్యయాలతోనే సేవలందించడంలో అంతర్జాతీయంగా పోటీపడే వీలుంటుందని వివరించారు. భారత్‌లో సుమారు 1,800 జీసీసీలు ఉన్నాయి. బహుళ జాతి సంస్థలు (ఎంఎన్సీ) తమ వ్యాపార లావాదేవీల నిర్వహణ కోసం వీటిని ఏర్పాటు చేశాయి. స్టార్టప్ వ్యవస్థ కూడా వీటి విస్తరణకు దోహదపడింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ జీసీసీల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసే విధానాన్ని రూపొందించడంపై కేంత్రం దృష్టి పెడుతోంది. -
జీఎస్టీ చిక్కుముళ్లు వీడేనా?
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై ఎన్నో ఏళ్లుగా పట్టిన మంకుపట్టు సడలించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఊరట కల్పించేందుకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో కొన్ని మార్పులు తేవడానికి సమాయత్తం అయింది. ప్రస్తుతం 12% శ్లాబులో ఉన్న నిత్యావసర వస్తువులపై పూర్తిగా పన్నును తొలగించడం లేదా చాలా వస్తువులను 5% పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తు న్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలఖరులో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రజల వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకుంటున్నట్లు అర్థం అవుతున్నది. వస్తువుల ధరలు తగ్గితే విక్రయాలు పెరగడం వల్ల ఉత్పత్తి రంగం కళకళలాడే అవ కాశం ఉంది. గత కొన్నేళ్లుగా జీఎస్టీకి సంబంధించి ఎవరేమి మాట్లా డినా సమాధానం ఇవ్వకుండా మిన్నకుండిపోయిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దేశంలో వినిమయ సంస్కృతిని మరింత పెంచడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతున్నారు. పరో క్షంగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి నిత్యావసర వస్తువులపై విధిస్తున్న జీఎస్టీని హేతుబద్ధీకరిస్తున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది.సరళతరం కాకపోగా చిక్కులు8 ఏళ్ల క్రితం ‘ఒకే దేశం ఒకే పన్ను’ అన్నది లక్ష్యంగా, చక్కని సరళతరమైన పన్ను (గుడ్ అండ్ సింపుల్ టాక్స్)గా చెప్పబడిన ‘జీఎస్టీ’ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) క్రమంగా తన అర్థాన్ని మార్చుకొంది. 2017 జూలై 1న ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీఎస్టీ చిన్న, సన్నకారు వ్యాపారుల సమస్యలను తీర్చకపోగా వారికి అనేక చిక్కుముళ్లను తెచ్చి పెట్టింది. నిజానికి, గత 8 ఏళ్లుగా జీఎస్టీపై జరిగినంత చర్చ, వాదోపవాదాలు మరే అంశం మీదా జరగలేదు. జీఎస్టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది. అయితే, జీఎస్టీ అమలు కారణంగానే పన్ను ఎగవేతలు తగ్గాయనీ, ‘పన్ను ఉగ్రవాదం’ సమసిపోయిందనీ చెప్పడం అర్ధ సత్యమే. జీఎస్టీ వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పలు వర్గాల వారు గగ్గోలు పెడుతున్నారు. పన్ను రేట్లు, వివిధ శ్లాబులలోకి వచ్చే వస్తువులు, సేవల విషయంలో కేంద్రం, రాష్ట్రాల నడుమ ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడం గమనార్హం. ముఖ్యంగా, రాష్ట్రాలకు అతిపెద్ద ఆదాయ వనరులుగా ఉన్న పెట్రోల్, డీజిల్, మద్యం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడాన్ని మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి 55 సమావేశాలు జరిపినప్పటికీ జీఎస్టీ మండలి భేటీలలో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదు.జీఎస్టీ చిక్కుళ్లలో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రధానమైనది. 5, 12, 18, 28 శాతాలుగా పన్ను రేట్లు ఉన్నాయి. 1,400కు పైబడిన వస్తువులు, 500 రకాల సేవలను ఈ నాలుగు శ్లాబులలో సర్దుబాటు చేశారు. భారీ కసరత్తు అనంతరం రేట్లను ఖరారు చేశామని చెప్పారు గానీ అందులో హేతుబద్ధత, మానవత్వం కనుమరుగయ్యాయన్న విమర్శల్ని సాక్షాత్తూ బీజేపీ నేతలే చేస్తున్నారు. ఉదాహరణకు జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18% జీఎస్టీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన సహచర మంత్రి నిర్మలా సీతారామన్ కు బహిరంగ లేఖ సంధించడం కలకలం రేపింది. సామాన్యులకు అవసరమైన జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై ఇంత మొత్తం జీఎస్టీ వేయడం వల్ల... వారు జీవిత, ఆరోగ్య రక్షణకు దూరం అవుతారని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలపై 5% జీఎస్టీ విధించినా కొంతవరకు అర్థం ఉందిగానీ... ఏకంగా 18% పన్ను వేయడం అన్యాయమని పాలసీదారుల అసోసియేషన్ సైతం కేంద్రానికి విన్న వించినప్పటికీ సానుకూల స్పందన రావడం లేదు.నిత్యావసరాలపై ఇంతా?ఇక, శ్లాబుల విషయంలో స్పష్టత లోపించడం వల్ల చెల్లింపు దారులకు, వివిధ ప్రభుత్వ విభాగాలకు మధ్య వివాదాలు తలెత్తి చివ రకు అవి న్యాయస్థానాలకు చేరుతున్నాయి. అలాగే, కోవిడ్ ప్రబలిన 2020, 2021 సంవత్సరాలలో రాష్ట్రాలకు అందించిన ఆర్థిక సహ కారాన్ని తిరిగి రాబట్టుకొనేందుకు కేంద్రం ‘సెస్సు’ విధించి ప్రజలపై అదనపు భారాన్ని మోపింది. దీన్ని ఉపసంహరించు కోవాలన్న అభ్యర్థనను పెడచెవిన పెట్టింది.ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులపై, ప్రాణాలు నిలబెట్టే ఔషధాలపై 5% జీఎస్టీ మాత్రమే వేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో భిన్నంగా వ్యవహరించారు. వెన్న, నెయ్యి, పాలు వంటి పాల ఉత్పత్తులపై, ప్యాకింగ్ చేసిన కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలపై 18% జీఎస్టీ విధించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. చివరకు పెన్నులపైన కూడా జీఎస్టీ విధిస్తున్నారు. నిత్యావసర వస్తువులను మినహాయించి విలాస వస్తువుల పైననే పన్ను వేస్తామని చెప్పిన దానికీ, ఆచరణలో చేస్తున్న దానికీ పొంతన ఉండటం లేదు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలపై 35 శాతం జీఎస్టీ విధించాలంటూ జీఎస్టీ రేట్ల హేతు బద్ధీకరణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం జీఎస్టీ మండలికి ఓ నివేదిక అందించింది. పన్నులు పెంచితే ఆరోగ్య హానికర ఉత్పత్తుల వాడకాన్ని ప్రజలు మానేస్తారా అన్నది చర్చనీయాంశం. అదే నిజ మైతే మద్యం మీద కూడా అధికంగా పన్నులు వేయాల్సి ఉంటుంది.ఎంఎస్ఎంఇలకు శరాఘాతంజీఎస్టీ అమలులో స్పష్టత, హేతుబద్ధత లోపించడం వల్ల దెబ్బ తిన్న వాటిల్లో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగం ఒకటి. దేశీయ తయారీ రంగంలో దాదాపు 70% మేర ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తున్న ఎంఎస్ఎంఇ రంగం జీఎస్టీ కారణంగా కుదేలయిందన్నది చేదు వాస్తవం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చాక... అవి చాలావరకు మూతబడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్ను వేయడం వల్ల... దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఆధారపడిన సూక్ష్మ, మధ్య తరహా పరిశ్ర మలకు తీరని నష్టం కలిగింది. వాటి సప్లయ్ చెయిన్ తెగిపోయిందని ఆ రంగంపై ఏళ్లుగా జీవనం సాగిస్తున్నవారు మొత్తుకొంటున్నారు. ఒకవైపు వస్తుసేవలను అంతిమంగా వినియోగించుకొనే వారే పన్ను చెల్లించాలని చెబుతూ, మరోవైపు బహుళ పన్నులు వేస్తున్న పరిస్థితి కొన్ని రంగాల్లో ఉంది. వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్క రించుకోవడానికి జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను అందుబాటులోకి తెచ్చిన మాట నిజమే గానీ... చిన్న వ్యాపారులు ఎంతమంది దానిని ఆశ్రయించగలరు? స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఆయా ఉత్పత్తులపై పన్నులు విధించే హక్కు గతంలో రాష్ట్రాలకు ఉండేది. ప్రజలకు జవాబుదారీతనం ఎక్కువగా వహించేది రాష్ట్రాలే. కానీ, రాష్ట్రాలకు తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే అవకాశం జీఎస్టీ వచ్చాక తగ్గిపోయింది. జీఎస్టీ వసూళ్లల్లో కనబడుతున్న వృద్ధిని చూసి మురిసిపోవడమే తప్ప... ఎదురవుతున్న ఇబ్బందుల్ని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించలేకపోవడం వైఫల్యంగానే పరిగణించాలి. పుట్టుకతోనే లోపాలు ఉన్న బిడ్డగా జీఎస్టీని కొందరు అభివర్ణించారు. మరికొందరు జీఎస్టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. వీటి మాటెలా ఉన్నా, అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతున్నదా, లేదా అన్నదే కొలమానం. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి -
National President: బీజేపీకి లేడీ బాస్?


