
కొత్త జీఎస్టీ సవరణల్లో భాగంగా 350కు పైగా వస్తువుల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకున్నామని, దీనివల్ల 140 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ తగ్గింపు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. చెన్నై ఆళ్వార్‌పేటలోని మ్యూజిక్ అకాడమీలో ఆదివారం ‘జీఎస్టీ సంస్కరణలు – రైజింగ్ ఇండియా కోసం పన్ను సంస్కరణలు’ అనే అంశంపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దీపావళికి ముందు జీఎస్టీ తగ్గింపు వల్ల వస్తువుల కొనుగోళ్లు మరింత వేగం పుంజుకుంటాయన్నారు. నిత్యావసర వస్తువులకు జీఎస్టీని తగ్గించడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు మరింత లాభం చేకూరుతుందన్నారు. జీఎస్టీ పన్ను సంస్కరణల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి సంస్థ ఈ తగ్గింపును ప్రజల్లో తీసుకెళ్తుందన్న నమ్మకం ఉందన్నారు.
ఇదీ చదవండి: సెస్‌ల లక్ష్యం నీరుగారుతోందా?