Live Updates
Budget 2026 Updates: కేంద్ర బడ్జెట్ 2026-27 లైవ్ అప్‌డేట్స్
బడ్జెట్‌లో పెరిగేవి.. తగ్గేవి..
- పెరిగేవి.. విదేశీ మద్యం, లగ్జరీ వాచ్‌లు
- తగ్గేవి.. క్యాన్సర్ డ్రగ్స్, డయాబెటిక్ మెడిసిన్, ఈవీ బ్యాటరీలు, సోలాల్ ప్యానల్స్, విదేశీ విద్య, చెప్పులు, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలు
వివిధ రంగాల వారీగా కేటాయింపులు
- రవాణా: రూ. 5,98,520 కోట్లు
- రక్షణ: రూ. 5,94,585 కోట్లు
- గ్రామీణాభివృద్ధి: రూ. 2,73,108 కోట్లు
- హోం వ్యవహారాలు: రూ. 2,55,234 కోట్లు
- వ్యవసాయం & అనుబంధ రంగాలు: రూ. 1,62,671 కోట్లు
- విద్య: రూ. 1,39,289 కోట్లు
- ఇంధనం: రూ. 1,09,029 కోట్లు
- ఆరోగ్యం: రూ. 1,04,599 కోట్లు
- పట్టణాభివృద్ధి: రూ. 85,522 కోట్లు
- ఐటీ అండ్ టెలికాం: రూ. 74,560 కోట్లు
- వాణిజ్యం & పరిశ్రమలు: రూ. 70,296 కోట్లు
- సాంఘిక సంక్షేమం: రూ. 62,362 కోట్లు
- శాస్త్ర సాంకేతిక విభాగాలు: రూ. 55,756 కోట్లు
- పన్ను పరిపాలన: రూ. 45,500 కోట్లు
- విదేశీ వ్యవహారాలు: రూ. 22,119 కోట్లు
- ఆర్థిక శాఖ: రూ. 20,649 కోట్లు
- ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి: రూ. 6,812
బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపం
- రెవెన్యూ వసూళ్లు రూ.35,33,150 కోట్లు
- పన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లు
- పన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లు
- మూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లు
- రుణాల రికవరీ రూ.38,397 కోట్లు
- ఇతర వసూళ్లు రూ.80,000 కోట్లు
- అప్పులు, ఇతర వసూళ్లు రూ.16,95,768 కోట్లు
- మొత్తం ఆదాయం రూ.53,47,315 కోట్లు
- మొత్తం వ్యయం రూ.53,47,315 కోట్లు
- రెవెన్యూ ఖాతా రూ.41,25,494 కోట్లు
- వడ్డీ చెల్లింపులు రూ.14,03,972 కోట్లు
- మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,92,702 కోట్లు
- మూలధన ఖాతా రూ.12,21,821 కోట్లు
- వాస్తవ మూలధన వ్యయం రూ.17,14,523 కోట్లు
- రెవెన్యూ లోటు రూ.5,92,344 కోట్లు
- నికర రెవెన్యూ లోటు రూ.99,642 కోట్లు
- ద్రవ్య లోటు రూ.16,95,768 కోట్లు
- ప్రాథమిక లోటు రూ.2,91,796 కోట్లు

రూపాయి పోక..
- పెన్షన్లు 2 పైసలు
- వడ్డీ చెల్లింపులు 20 పైసలు
- కేంద్ర పథకాలు 17 పైసలు
- ప్రధాన సబ్సిడీలు 6 పైసలు
- డిఫెన్స్ 11 పైసలు
- రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 22 పైసలు
- ఫైనాన్స్ కమిషన్‌కు చెల్లింపులు 7 పైసలు
- కేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలు
- ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఖర్చులు 7 పైసలు
రూపాయి రాక...
- ఇన్‌కమ్ ట్యాక్స్ 21 పైసలు
- ఎక్సైజ్ డ్యూటీ 6 పైసలు
- అప్పులు, ఆస్తులు 24 పైసలు
- పన్నేతర ఆదాయం 10 పైసలు
- మూలధన రశీదులు 2 పైసలు
- కస్టమ్స్ ఆదాయం 4 పైసలు
- కార్పొరేషన్ ట్యాక్స్ 18 పైసలు
- జీఎస్టీ, ఇతర పన్నులు 15 పైసలు
రూ.53 లక్షల కోట్ల బడ్జెట్
- రూ. 53,47,315 కోట్ల బడ్జెట్
- 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం బడ్జెట్ రూ.53,47,315 కోట్లు
- మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.35,33,150 కోట్లు
- మూలధన వసూళ్లలో రూ.18,14,165 కోట్లు
- బడ్జెట్ ప్రసంగం 1 గంట 30 నిముషాలు
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ (12:29 PM)
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ (12:29 PM)
- 1100 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్
- 350 పాయింట్లకుపైగా నష్టాల్లో నిఫ్టీ

ట్యాక్స్ స్లాబ్‌లు (కొత్త రెజైమ్)
- ₹0 – ₹4 లక్షలు → నిల్
- ₹4 – ₹8 లక్షలు → 5%
- ₹8 – ₹12 లక్షలు → 10%
- ₹12 – ₹16 లక్షలు → 15%
- ₹16 – ₹20 లక్షలు → 20%
- ₹20 – ₹24 లక్షలు → 25%
- ₹24 లక్షలు పైబడి → 30%

- విదేశాల్లోని భారతీయులకు శుభవార్త
- స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపు
- మెడికల్ టూరిజంకు ప్రొత్సాకాలు
- క్లౌడ్ సెంటర్లకు ప్రొత్సాకాలు
- త్వరలో అందుబాటులోకి సరళమైన ఐటీ రిటర్న్స్ ఫైలింగ్
ట్యాక్స్ నిబంధనల సడలింపు
- ట్యాక్స్ నిబంధనల సడలింపు
- ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ చట్టం
- టీసీఎస్ 5 నుంచి 2 శాతానికి తగ్గింపు
- ఆదాయపన్ను చెల్లింపు గడువు మార్చు 31వరకు
- చిన్నతరహా ఆదాయపన్ను చెల్లింపుదారులకు 6 నెలల ఊరట
- మోటార్ యాక్సిడెంట్ చెల్లింపులపై పన్ను సడలింపు
- విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్ టైమ్ స్కీమ్
- జులై 31వరకు అందుబాటులో ITR1, ITR2
మెడికల్ టూరిజానికి ప్రోత్సాహం
- ప్రైవేట్ రంగంతో కలిసి ఐదు రీజినల్ మెడికల్ హబ్‌ల ఏర్పాటు
- మెడికల్ హబ్‌ల ద్వారా ఉద్యోగ కల్పన
- దేశవ్యాప్తంగా మూడు ఆల్ ఇండియా ఆయుర్వేద కాలేజీల ఏర్పాటు

ప్రతి జిల్లాలో ఒక గల్స్ హాస్టల్
- ప్రతి జిల్లాలో ఒక గల్స్ హాస్టల్
- భారత్ విస్తార్ ఏఐ టూల్
- దివ్యాంగ్ జన్ యోజన
కార్గో అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
- వచ్చే ఐదేళ్లలో కొత్తగా 20 జలమార్గాలు
- ఒడిశాలో నేషనల్ వాటర్‌వే కారిడార్
- కొత్తగా కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్
ఆత్మనిర్భర్ భారత్‌కు రూ.2 వేల కోట్లు
- విలువైన ఖనిజాల తవ్వకాల కోసం కొత్త స్కీమ్
- కేరళ, తమిళనాడు, ఒడిశా, ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్
- బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు
- మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్‌ల నిర్మాణం
- ప్రస్తుతమున్న NIPERs ఆధునీకరణ
- దేశంలో 2 హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు
- కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు
- దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు
- సెమీకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు
- జౌళి రంగానికి కేంద్ర బడ్జెట్‌లో చేయూత
- మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం
- సెమీ కండక్టర్ మిషన్ 2.O ప్రారంభం
- త్వరలో నేషనల్ ఫైబర్ స్కీమ్ ప్రారంభం
- టెక్స్‌టైల్ రంగం అభివృద్ధికి కొత్త పథకం
- దేశంలో కొత్త మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు
- ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళల ప్రోత్సాహానికి పథకం
- అత్యంత నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి పథకం
- 200 పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునీకరణకు చేయూత
- ఆత్మనిర్భర్ భారత్‌కు రూ.2 వేల కోట్లు
- SME రంగానికి రూ.10 వేల కోట్లు
- మైక్రో సెక్టార్‌కు రూ.2 వేల కోట్లు

హైస్పీడ్ రైల్ కారిడార్లు
- ముంబై-పూణే
- పూణే-హైదరాబాద్
- హైదరాబాద్-చెన్నై
- ఢిల్లీ-వారణాసి
- వారణాసి-సిలిగురి
- హైదరాబాద్-బెంగళూరు
- చెన్నై-బెంగళూరు
ఇది యూనిక్ బడ్జెట్: సీతారామన్
- ఆత్మనిర్భర భారత్ వల్లే 7 శాతం గ్రోత్
- ఉపాధి కల్పనకు పెద్దపీట
- ఆరు రంగాల్లో విస్తృత చొరవ
- టెక్స్‌టైల్ రంగానికి ప్రాధాన్యత
- కార్గో అభివృద్ధికి ప్రత్యేక చొరవ
- కంటైనర్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ ప్రారంభం
- కటైనర్ల ఉత్పత్తికి రూ.10 వేలకోట్లు
మూడు కర్తవ్యాలు
- సమ్మిళిత ఆర్ధిక వృద్ధి
- ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం
- సబ్ కా సాత్.. సబ్ కా వికాస్
- తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్
- ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు
- వికసిత్ భారత్ దిశగా అడుగులు
- ప్రజల ఆశలను అందుకోవడమే లక్ష్యం
- గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతున్నాం
- ప్రధాని ఆలోచనలతో ఎన్నో కొత్త సంస్కరణలు

బడ్జెట్ వేళ.. బంగారం ధరలు పతనం
మల్టీ కామొడిటీ ఎక్స్ఛేంజీ ఫ్యూచర్స్ సూచీలో 8.7 శాతం మేర బంగారం ధరలు పడిపోయాయి.

వికసిత్ భారత్ లక్ష్యం
వికసిత్ ఔర్ ఆత్మనిర్భర్ భారత్ కా బడ్జెట్: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఇది ఒక చారిత్రాత్మక బడ్జెట్:కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చే దిశగా మరో అడుగు: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
మహిళా సాధికారత ప్రాధాన్యత: బీహార్ మంత్రి దిలీప్ జైస్వాల్
ప్రతి రంగంపై దృష్టి పెట్టాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అసాధారణ బడ్జెట్: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న
పార్లమెంటుకు నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ & ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, వారి బృందంతో కలిసి పార్లమెంటుకు చేరుకున్నారు.
#WATCH | #UnionBudget2026 | Union Finance Minister Nirmala Sitharaman and MoS Finance Pankaj Chaudhary, along with their team, arrive at the Parliament. pic.twitter.com/UBv1ZhfaoE
— ANI (@ANI) February 1, 2026
రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

#WATCH | Delhi | Union Finance Minister Nirmala Sitharaman, along with her team, calls on President Droupadi Murmu before presenting her ninth consecutive Union Budget pic.twitter.com/96H5JV5obv
— ANI (@ANI) February 1, 2026
‘డిజిటల్ బహీ-ఖాతా’తో రాష్ట్రపతి భవన్‌కు సీతారామన్
కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ‘డిజిటల్ బహీ-ఖాతా’తో రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన ఆర్థిక మంత్రి సీతారామన్.
VIDEO | Union Finance Minister Nirmala Sitharaman (@nsitharaman) leaves Ministry of Finance with the digital tablet, containing the Budget document, enclosed in a traditional red 'bahi-khata' style pouch. #Budget2026WithPTI #UnionBudgetWithPTI
(Full video available on PTI… pic.twitter.com/qKh9kq49Ja— Press Trust of India (@PTI_News) February 1, 2026
బడ్జెట్ టీమ్‌తో కేంద్రమంత్రి, సహాయ మంత్రి
కేంద్ర బడ్జెట్ 2026-27 నేపథ్యంలో తమ బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌదరి.
#WATCH | Delhi: Union Finance Minister Nirmala Sitharaman, along with her team, with the Budget tablet outside the Ministry of Finance.
She will present the #UnionBudget2026 today at around 11 AM in Lok Sabha. pic.twitter.com/x5oPMFlWbD— ANI (@ANI) February 1, 2026
కర్తవ్య భవన్‌కు నిర్మలా సీతారామన్
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కర్తవ్య భవన్‌కు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
Finance Minister Nirmala Sitharaman arrives at Kartavya Bhawan ahead of Union Budget
Read @ANI story | https://t.co/qxI7zwXcfb#NirmalaSitharaman #UnionBudget #KartavyaBhawan pic.twitter.com/ca8XihWkul— ANI Digital (@ani_digital) February 1, 2026
రూ.54.1 లక్షల కోట్ల బడ్జెట్?
2027 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.54.1 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Govt likely to present Rs 54.1 lakh crore budget for FY27, growth of 7.9% YoY: Report
Read @ANI story | https://t.co/GntJR5IQrv#unionbudget #budget2026 #financialyear pic.twitter.com/io6IoixZMe— ANI Digital (@ani_digital) February 1, 2026
ఇది మంచి బడ్జెట్
'ఇది చాలా మంచి బడ్జెట్ అవుతుందని నాకు ఎంతో నమ్మకం ఉంది'.. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు.

వీటికి అధిక ప్రాధాన్యం!
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ.. రక్షణ, మౌలిక సదుపాయాలు, మూలధనం, విద్యుత్ మొదలైన వాటి వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
కేంద్ర బడ్జెట్ - ప్రసంగ సమయం
2019 బడ్జెట్: 140 నిమిషాలు (2 గంటల 20 నిమిషాలు)
2020 బడ్జెట్: 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు - అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం)
2021 బడ్జెట్: 100 నిమిషాలు (1 గంట 40 నిమిషాలు)
2022 బడ్జెట్: 91 నిమిషాలు (1 గంట 31 నిమిషాలు)
2023 బడ్జెట్: 87 నిమిషాలు (1 గంట 27 నిమిషాలు)
2024 ఫిబ్రవరి బడ్జెట్: 56 నిమిషాలు
2024 జులై బడ్జెట్: 85 నిమిషాలు (1 గంట 25 నిమిషాలు)
2025 బడ్జెట్: 74 నిమిషాలు (1 గంట 14 నిమిషాలు)
నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు.


