
ఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి సంభవించిన నష్టంపై ఆర్థిక మంత్రికి నిర్మలా సీతారామన్‌కు నివేదిక అందజేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు ఆర్థిక సహాయం అందించాలని నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్.

ఇక సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్‌లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఓం బిర్లాతో సమావేశమైన వారిలో సీఎం రేవంత్‌తో పాటు ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, కె.రఘువీర్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్‌లు ఉన్నారు.
