తీవ్ర లైంగిక ఆరోపణలు తమ్మా, స్త్రీ 2, మ్యూజిక్ డైరెక్టర్ సచిన్ సంఘ్వీ అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సంగీత దర్శకుడు, సచిన్ సంఘ్వి (Sachin Sanghvi) పై లైంగిక ఆరోపణలు సంచలనం రేపాయి. మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని నమ్మిం,ఇ వివాహం హామీ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
సచిన్-జిగర్ జంటలోని సంగీత దర్శకుడు, తమ్మా, స్త్రీ 2, భేదియా , జరా హట్కే, జరా బచ్కే వంటి చిత్రాలకు హిట్ పాటలతో పాపులర్ అయిన సంఘ్విని లైంగిక ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అయితే అనంతరం బెయిల్‌పై విడుదలైనారు.
తన 20 ఏళ్ల వయస్సులో, ఫిబ్రవరి 2024లో సచిన్ సంఘ్వితో పరిచయం ఏర్పడిందని, అతను ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పంపాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనమ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని, వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత ఆమెను తన స్టూడియోకు పిలిపించి, పెళ్లి ప్రపోజ్ చేశాడని, తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసు అధికారి తెలిపారు.
చదవండి: వైద్యురాలిపై పోలీసుల అఘాయిత్యం, అరచేతిలో సూసైడ్ నోట్ కలకలం
ఇది ఇలా ఉంటే ఈ కేసులో సచిన్ సంఘ్వి తరపున వాదిస్తున్న న్యాయవాది ఆదిత్య మిథే తన క్లయింట్‌పై ఉన్న అన్ని ఆరోపణలను ఖండించారు. సంఘ్వీ అరెస్ట్ చట్టవిరుద్ధం అన్నారు. ఈ విషయంపై సచిన్ ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అతని అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @soulfulsachin ఇన్‌యాక్టివ్‌గా ఉంది. అటు జిగర్ కూడా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
కాగా రష్మిక మందన్న , ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించి , దీపావళికి విడుదలైన థమ్మాకి సచిన్ అండ్ జిగర్ సంగీతం అందించారు. గత ఏడాది స్త్రీ 2 కోసం ఈ ద్వయం స్వర పర్చిన చేసిన "ఆజ్ కీ రాత్" బాగా హిట్‌అయిన సంగతి తెలిసిందే.


