అనంతపురం జిల్లాకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి డా. ఎన్ రఘువీరారెడ్డి ఈ దీపావళిని అందరికంటే భిన్నంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట అందర్నీ ఆకట్టు కుంటోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సహా కీలక బాధ్యతలు నిర్వర్తించిన డా. నీలకంఠం రఘువీరారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ, ప్రకృతిలో మమేకమై, వ్యవసాయాన్ని చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపు తున్నారు. ఆయన ఫోటోలు బాగా వైరలయ్యాయి. రఘువీరారెడ్డి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటారు. తరచూ అనేక వీడియోలను పోస్ట్ చేస్తూ, పలువురికి ప్రేరణగా నిలుస్తూ ఉంటారు. అంతేకాదు తనముద్దుల మనవరాలితో ఆనందంగా గడుపుతున్న విశేషాలను గతంలోనూ పంచుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా మనవరాలితో చిన్నపిల్లాడిలా సంతోషంగా గడిపిన ఒక వీడియోను షేర్ చేశారు. దీపాల వెలుగులు, స్వీట్లతోపాటు మనవరాలితో సరదాగా ఆర్మ్ రెజ్లింగ్ మ్యాచ్‌తో ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నాను అని పోస్ట్ చేశారు.
Celebrated Diwali with smiles, sweets, lights and a friendly Arm wrestling match with my granddaughter! 💪✨ pic.twitter.com/DegpdBQ6Oq
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) October 22, 2025
దీంతో చాలామంది అభిమానులు ఫిదా అవుతున్నారు. అదిరింది సార్...సర్ చిన్న పాప సార్ నొప్పి పుడుతుంది విజయాన్ని తనకే ఇచ్చేయండి సార్...మమ్మల్ని అందరినీ గెలుపు వైపు నడిపించినట్టుగానే.. పాపను కూడా గెలిపించండి అని కమెంట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మాకు రాజకీయాల్లో నచ్చిన వ్యక్తి మీరే.. మళ్లీ రాజకీయాల్లోకి రావాలి అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.


