breaking news
Arm Wrestling
-
మనవరాలితో పోటీ : సీనియర్ నేత దివాలీ సెలబ్రేషన్స్
అనంతపురం జిల్లాకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి డా. ఎన్ రఘువీరారెడ్డి ఈ దీపావళిని అందరికంటే భిన్నంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట అందర్నీ ఆకట్టు కుంటోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సహా కీలక బాధ్యతలు నిర్వర్తించిన డా. నీలకంఠం రఘువీరారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ, ప్రకృతిలో మమేకమై, వ్యవసాయాన్ని చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపు తున్నారు. ఆయన ఫోటోలు బాగా వైరలయ్యాయి. రఘువీరారెడ్డి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటారు. తరచూ అనేక వీడియోలను పోస్ట్ చేస్తూ, పలువురికి ప్రేరణగా నిలుస్తూ ఉంటారు. అంతేకాదు తనముద్దుల మనవరాలితో ఆనందంగా గడుపుతున్న విశేషాలను గతంలోనూ పంచుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా మనవరాలితో చిన్నపిల్లాడిలా సంతోషంగా గడిపిన ఒక వీడియోను షేర్ చేశారు. దీపాల వెలుగులు, స్వీట్లతోపాటు మనవరాలితో సరదాగా ఆర్మ్ రెజ్లింగ్ మ్యాచ్‌తో ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నాను అని పోస్ట్ చేశారు.Celebrated Diwali with smiles, sweets, lights and a friendly Arm wrestling match with my granddaughter! 💪✨ pic.twitter.com/DegpdBQ6Oq— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) October 22, 2025దీంతో చాలామంది అభిమానులు ఫిదా అవుతున్నారు. అదిరింది సార్...సర్ చిన్న పాప సార్ నొప్పి పుడుతుంది విజయాన్ని తనకే ఇచ్చేయండి సార్...మమ్మల్ని అందరినీ గెలుపు వైపు నడిపించినట్టుగానే.. పాపను కూడా గెలిపించండి అని కమెంట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మాకు రాజకీయాల్లో నచ్చిన వ్యక్తి మీరే.. మళ్లీ రాజకీయాల్లోకి రావాలి అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. -
బైక్ వీరులు
హార్లీ డేవిడ్ సన్ రైడర్స్ సౌత్‌జోన్ మూడో ర్యాలీ జాయ్‌ఫుల్‌గా సాగింది. ఎయిర్‌పోర్టులోని హోటల్ నోవాటెల్‌లో శుక్రవారం జరిగిన ఈవెంట్‌కు దేశంలోని 13 నగరాలకు చెందిన హార్లీ డేవిడ్సన్ బైక్ ఓనర్స్ హాజరయ్యారు. ఆయా నగరాల నుంచి 600 మంది బైక్‌లపై ఇక్కడకు చేరుకున్నారు. వారు వెంట తీసుకొచ్చిన కస్టమైజ్డ్ బైక్‌లు అందర్నీ ఆకట్టుకున్నాయి. వారికి కాంపిటీషన్స్ కూడా నిర్వహించారు. మరో పోటీ.. ఆర్మ్ రెజ్లింగ్ అదరహో అనిపించింది. -
ఒక చెయ్యే చాలు..!
విచిత్రం షిట్లే ఒక చేత్తో కొడితే గోడలు కూడా బద్దలయిపోతాయ్.. ఒక్క పట్టు పట్టాడంటే ఆర్మ్ రెజ్లింగ్‌లో మహామహులే చిత్తయిపోతారు. మరో చేయి మాత్రం బక్కగా, పీలగా కనిపిస్తుంది. మరి ఒకే మనిషిలో ఇంత తేడా ఏమిటి అని ఆశ్చర్యపోతారెవరైనా. జర్మనీకి చెందిన ఇతడి పూర్తి పేరు మథియాస్ షిట్లే. ఒక ప్రొఫెషనల్ ఆర్మ్ రెజ్లర్. అతను ఒంటి చేత్తో ఎంతోమంది పోటీదారులను మట్టిగరిపించి క్లబ్‌స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక సార్లు విజేతగా నిలిచాడు. విశేషం ఏమిటంటే బాడీబిల్డర్‌కు ఉన్నట్టుగా కండలు తిరిగి ఉన్న ఇతడి కుడి చేయి అసహజంగా పెరిగింది. ఆర్మ్ రెజ్లింగ్ కోసం చేసిన వ్యాయామంతో కుడిచేయి కండలు తిరిగింది. ఎడమ చేయి మాత్రం ఇతడి సహజరూపానికి తగ్గట్టుగా ఉంది. ఇతడు తొలిసారి 16వ ఏట రెజ్లింగ్ పోటీలో పాల్గొన్నాడట. సత్తా ఏమిటో స్వయంగా గుర్తెరిగాక, అక్కడి నుంచి చెలరేగిపోయాడు. వరుసగా జాతీయ స్థాయి పోటీలతోపాటు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటూ 14 చాంపియన్‌షిప్‌లను సొంతం చేసుకొన్నాడు. చేతికుస్తీ పోటీల్లో ఎంతోమంది చాంపియన్లు ఉన్నా... ఈ కుడి చేతివాటం షిట్లే మాత్రం స్పెషలే!


