అదొక బిజీ బ్యాంకు. నిత్యం కస్టమర్ల వెయింటింగ్‌తో.. సిబ్బంది పిచ్చాపాటి కబుర్లతో నడుస్తూ ఉంటుంది. అలాంటి బ్యాంకుకు అనుకోని అతిథి వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడ్డారు. ప్రాణభయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. కొందరు టేబుల్స్, బీరువాలు.. కనిపించినదానిపైకల్లా పైకి ఎక్కి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు.
సమాచారం అందుకున్న అధికారులు.. అతిజాగ్రత్తగా ఆ అతిథిని బయటకు పంపించేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలో దాటియా థారెట్ పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఓ పాము చొరబడింది. కానీ, ఎప్పుడు జరిగిందనే స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Snake in Punjab National Bank (PNB) Branch in Tharet, Datia near Gwalior, Madhya Pradesh. Work disrupted, staff in Panic!! @pnbindia pic.twitter.com/8wpiC1yHRQ
— Hellobanker (@Hellobanker_in) November 29, 2025


