వ్యూస్ కోసం కక్కుర్తి పడొద్దు.. సజ్జనార్ వార్నింగ్ | VC Sajjanar Slams Fake News On Traffic Fine Waivers, Warns Action Against Misleading Social Media Posts | Sakshi
Sakshi News home page

వ్యూస్ కోసం కక్కుర్తి పడొద్దు.. సజ్జనార్ వార్నింగ్

Mar 1 2026 5:19 PM | Updated on Mar 1 2026 6:30 PM

 Action will be taken against fake propaganda on social media sajjanar

సాక్షి హైదరాబాద్‌: సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారని హైదరా బాద్ సీపీ VC సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా  ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్‌ఖాతాలో సజ్జనార్ పోస్ట్ చేశారు.

చలాన్ల రాయితీ తప్పంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పోలీస్ శాఖ ఇదివరకూ అధికారికంగా ఎటువంటి రాయితీలను ప్రకటించలేదని తెలిపారు.కనుక ప్రజలు దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మకండి.. ఇతరులకు షేర్ చేయకండి అని సజ్జనార్ సూచించారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం కొంతమంది వ్యక్తులు ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ సజ్జనార్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement