వామ్మో..తృటిలో తప్పించుకున్నాడు, లేదంటే! | Uttar Pradesh watch Cyclist narrowly escapes death as speeding bus rams into him | Sakshi
Sakshi News home page

వామ్మో..తృటిలో తప్పించుకున్నాడు, లేదంటే!

Nov 25 2025 6:18 PM | Updated on Nov 25 2025 7:18 PM

Uttar Pradesh watch Cyclist narrowly escapes death as speeding bus rams into him

UP cyclist miraculous escape  ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాలో జరిగిన ఒకరోడ్డు ప్రమాద ఘటన నెట్టింట  వైరల్‌గా మారింది.  ప్రైవేట్ బస్సు అదుపు తప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో   అక్కడే నిలబడి ఉన్న సైక్లిస్ట్ ఒకరు  తృటిలోప్రాణా పాయం నుంచి  తప్పించుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం  జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో  రికార్డయ్యాయి.

ఎటావా నుండి మెయిన్‌పురి వైపు వెళ్తున్న బస్సు, అదుపు తప్పి మదర్ డెయిరీ ప్లాంట్ ప్రధాన  గేటును బలంగా  ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో దాదాపు డజను మంది ప్రయాణికులు గాయపడ్డారు , బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే అప్పుడే కొన్ని అడుగుల దూరం నుంచి వచ్చిన సైక్లిస్ట్, చివరి క్షణంలో తనవైపు దూసుకొస్తున్న బస్సును గుర్తించి చాకచక్యంగా పక్కకు తప్పుకున్నాడు. దీంతో అతడు దాదాపు చావు నుంచి తప్పించుకున్నాడు.  ఈ భూమ్మిద  నూకలు మిగిలి ఉండటం అంటే ఇదేనేమో అంటూ  అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.

చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్‌ : వైరల్‌ స్ర్కీన్‌ షాట్స్‌, ఎవరీ మేరీ డికోస్టా

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బస్సు ముందు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో,  బస్సు డ్రైవర్‌ను కారును ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలో, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో  బస్సు నేరుగా మదర్ డైరీ గేటులోకి దూసుకెళ్లింది. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో దాదాపు డజను మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు , పోలీసులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి, గాయపడిన వారిని చికిత్స కోసం సైఫాయి మెడికల్ యూనివర్సిటీకి తరలించారు. అధికారులు బస్సును స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిర్ల[node:field_tags]క్ష్యం , అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి. బస్సు డ్రైవర్‌ను ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement