రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మరో అతిపెద్ద లొంగుబాటు జరిగింది. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట 63 మంది మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోహన్ కడ్డీతో పాటు 18 మంది మహిళా మావోయిస్టులు లొంగిపోయిన వారిలో ఉన్నారు. వారిపై రూ.1.17కోట్ల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘లోన్ వర్రాటు’ పునరావాస కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్నారు. మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
2025లో దేశవ్యాప్తంగా మావోయిస్టుల లొంగిపోయిన సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. గత ఐదేళ్లలతో పోలిస్తే.. ఇదే రికార్డు స్థాయి కూడా. మావోయిస్టు పార్టీ అంతం లక్ష్యంగా.. కేంద్రం చాలెంజింగ్‌గా తీసుకుని చేపట్టిన ఆపరేషన్ కగార్ కూడా లొంగుబాటుకు ఓ ప్రధాన కారణం అని తెలిసిందే.


