తమిళనాడు ఊటీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మనవాడ సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 32మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం వివరాలు తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదంలో గాయపడిన వారికి అక్కడే స్థానికంగా ఉన్న పలాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఊదగై మెడికల్ కాలేజ్‌కి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


