కర్నూలు సమీపంలోని జాతీయ రహదారి NH-44 పై జరిగిన భయానక బస్సు అగ్నిప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక చర్యలు ప్రారంభించింది. ఈ ఘటనలో 19 మంది అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, రహదారి భద్రతా అమలు లోపాలు, వాహన ఫిట్‌నెస్ తనిఖీల నిర్లక్ష్యం, రక్షణ చర్యల ఆలస్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ తమిళనాడు తెలుగు యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కెతిరెడ్డి జగదీశ్వర రెడ్డి గత ఏడాది అక్టోబరు10వ తేదీన NHRCకి ఫిర్యాదు సమర్పించారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన మానవ హక్కుల కమిషన్ 30-01-2026న దీనిని గంభీర మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి కింది అధికారులకు నోటీసులు జారీ చేసింది. రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, భారత ప్రభుత్వం
రవాణా కమిషనర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంసంబంధిత శాఖలు రెండు వారాల్లోగా చర్యల నివేదిక (Action Taken Report) సమర్పించాలని ఆదేశించింది.ఈ చర్యలు బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా సంస్కరణలకు దారితీస్తాయని రెడ్డి తెలిపారు.


