అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదంపై డీజీసీఏ చర్యలు | DGCA Grounds VSRs Learjets After Ajit Pawar Plane Crash | Sakshi
Sakshi News home page

అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదంపై డీజీసీఏ చర్యలు

Feb 24 2026 9:49 PM | Updated on Feb 25 2026 9:16 AM

DGCA Grounds VSRs Learjets After Ajit Pawar Plane Crash

న్యూఢిల్లీ: అజిత్‌ పవార్‌ విమానం ప్రమాదంపై  డీజీసీఏ చర్యలు చేపట్టింది. వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌కు చెందిన 4 విమానాలపై నిషేధించింది. స్పెషల్‌ ఆడిట్‌ ఆధారంగా డీజీసీఏ చర్యలు చేపట్టింది.

గత నెల చివర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌  విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పుణె జిల్లా లోని పవార్‌ స్వస్థలమైన బారామతిలో బుధవారం ఉదయం విమానాశ్రయంలో దిగేందుకు కొద్ది క్షణాల ముందు రన్‌వేకు కేవలం 100 అడుగుల దూరంలో ఈ దారుణం జరిగింది.

రన్‌వే కన్పించకపోవడంతో మరో రౌండ్‌ చుట్టి తిరిగి వచ్చే క్రమంలో విమానం అదుపు తప్పింది. క్షణాల వ్యవధిలోనే శరవేగంగా కింద పడిపోయింది. నేలను ఢీకొట్టగానే మంటలు చెలరేగి పేలిపోయింది. ప్రమాద తీవ్రత ధాటికి రెండు ముక్కలైంది. దాంతో పవార్‌తో పాటు విమానంలోని మరో నలుగురు కూడా అక్కడికక్కడే మరణించారు.

Advertisement
 
Advertisement
Advertisement