ముంబై మేయర్‌ పీఠం.. ఫడ్నవీస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | CM Devendra Fadnavis Interesting Comments On Mumbai Mayor seat | Sakshi
Sakshi News home page

ముంబై మేయర్‌ పీఠం.. ఫడ్నవీస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Jan 8 2026 3:27 PM | Updated on Jan 8 2026 3:32 PM

CM Devendra Fadnavis Interesting Comments On Mumbai Mayor seat

ముంబై: మహారాష్ట్రలో మున్సిపల్‌ ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముంబై మేయర్‌ స్థానం కోసం అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి నుంచే మేయర్‌ వస్తారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మేయర్‌ ఎంపిక విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఫడ్నవీస్‌ మాట్లాడుతూ..దేశం ముందు అనే భావజాలాన్ని బీజేపీ అనుసరిస్తుంది. ముంబై మేయర్ సీటు మరాఠీ హిందువులకు రిజర్వ్ చేయబడింది. చెన్నైలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే అక్కడి ప్రజలు సహజంగానే మేయర్ తమిళుడు కావాలని చెబుతారు. అదేవిధంగా ముంబైలో కూడా మేయర్ మరాఠీ వ్యక్తే అవుతారు. మహాయతి కూటమి నుంచే ముంబై మేయర్ వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను హిందువునని.. మరాఠీ వ్యక్తిగా గర్విస్తున్నానని.. మరాఠీల్లో ఎలాంటి వివక్ష లేదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారంతా ముంబై వాసులేనని పేర్కొన్నారు. ఒక్క బంగ్లాదేశీయుడిని కూడా ఇక్కడ నివసించడానికి అంగీకరించబోమని తేల్చి చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అయితే, అంతకముందు మహారాష్ట్రకు చెందిన ఎం​ఐఎం నాయకుడు వారిస్ పఠాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ముంబై మేయర్‌ పీఠం ఎంఐఎం పార్టీదేనని అన్నారు. ముంబై మేయర్‌గా ముస్లిం వ్యక్తే ఉంటారని వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్‌ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై ట్రాఫిక్‌ విషయమై ఫడ్నవీస్‌ స్పందించారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్‌ మాట్లాడుతూ.. ఢిల్లీ ట్రాఫిక్ కంటే ‌ముంబై ట్రాఫిక్ చాలా బెటర్‌. ఇక్కడ ఎవరూ లైన్లను బ్రేక్ చేయరు. ముంబై ప్రజలు చాలా క్రమశిక్షణతో ఉంటారని.. ట్రాఫిక్ నియమాలు చాలా ఓపికగా పాటిస్తారని పేర్కొన్నారు. ఢిల్లీలో రోడ్లపై కార్లు నలిగిపోవడం, కొన్ని సార్లు పక్కకు నెట్టేస్తారని.. అలాంటి పరిస్థితి ముంబైలో ఎక్కడా కనిపించదన్నారు. సబర్బన్ రైల్వే నుంచి మెట్రో వరకు అన్ని వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు. మొత్తం ప్రయాణాన్ని ఒకే యాప్‌లో ప్లాన్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఒకే టికెట్‌తో ఎవరైనా ఏదైనా ప్రజా రవాణాను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ముంబైలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జనవరి 16న విడుదల కానున్నాయి. ఎన్నికల కోసం థాక్రే సోదరులు బరిలోకి దిగగా… మహాయతి కూటమి బరిలో ఉంది. రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మేయర్‌ స్థానం ఎవరిదో అనే ఆసక్తి నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement