కూటమి సర్కార్‌కు షాకిచ్చిన సోము వీర్రాజు | BJP MLC Somu Veerraju Political Counter To CBN Govt | Sakshi
Sakshi News home page

కూటమి సర్కార్‌కు షాకిచ్చిన సోము వీర్రాజు

Feb 25 2026 1:13 PM | Updated on Feb 25 2026 1:43 PM

BJP MLC Somu Veerraju Political Counter To CBN Govt

సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బిగ్‌ షాకిచ్చారు. లంక గ్రామాల్లో కూటమి అక్రమ మట్టి తవ్వకాల భాగోతాన్ని శాసన మండలి వేదికగా.. సోము వీర్రాజు బయటపెట్టారు. దీంతో, కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

ఏపీ శాసన మండలిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ..‘లంక పరీవాహక ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వేస్తున్నారు. చొప్పెళ్ల, జొన్నాడ, మూలస్థానం ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ అక్రమంగా మట్టి తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లు, జేసీబీలు పెట్టి 35 అడుగుల లోతు తవ్వేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాల వల్ల రైతుల జీవనాధారం, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. తక్షణమే మట్టి తవ్వకాలను అరికట్టాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్‌ చేశారు. దీంతో, కూటమి ప్రభుత్వానికి బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది. 

Advertisement
 
Advertisement
Advertisement