ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసిన స్టార్‌ హీరో.. ప్రోమో రిలీజ్‌ | Actor Mohanlal interview Kerala CM Pinarayi Vijayan, Promo Goes Viral | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసిన స్టార్‌ హీరో.. ప్రోమో రిలీజ్‌

Feb 25 2026 1:07 PM | Updated on Feb 25 2026 1:47 PM

Actor Mohanlal interview Kerala CM Pinarayi Vijayan, Promo Goes Viral

సాధారణంగా సినీ తారలను, రాజకీయ నాయకులను జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తుంటారు. కానీ కేరళలో ఓ అరుదైన ఇంటర్వ్యూ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ ఇంటర్వ్యూ చేశాడు. దీనికి సంబంధించిన 'ప్రోమో' తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన 'క్లిఫ్ హౌజ్' ఈ ప్రత్యేక ఇంటర్వ్యూకి వేదికైంది. సాధారణంగా గంభీరంగా కనిపించే ముఖ్యమంత్రి, మోహన్ లాల్ అడిగిన ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.ఈ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, ప్రభుత్వ పాలన వంటి అంశాలపై ముఖ్యమంత్రి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

మోహన్ లాల్ ఒక ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కూడా ఇదే తరహాలో ఇంటర్వ్యూ చేసి మెప్పించారు. ఇప్పుడు పినరయి విజయన్‌తో ఆయన చేసిన సంభాషణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఇంటర్వ్యూ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఇది ప్రభుత్వ పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) ప్రయత్నాల్లో భాగమేనని విపక్షాలు ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఒక నటుడిగా కాకుండా, ఒక సామాన్య పౌరుడిగా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కలిగే అనుభూతి ప్రత్యేకం’ అని ఈ సందర్భంగా మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement