ఇకపై రూ. 1000 కోట్లు అక్కర్లేదు.. రాజమౌళితో పోలుస్తూ ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్‌ | Ram Gopal Varma Tweet On AI Tool Seedance 2.O, Says It Brutal Murder Film Industry | Sakshi
Sakshi News home page

ఇక 'స్టార్స్' అక్కర్లేదు..ఒక్క ప్రాంప్ట్ చాలు : ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్‌

Feb 25 2026 12:27 PM | Updated on Feb 25 2026 1:12 PM

Ram Gopal Varma Tweet On AI Tool Seedance 2.O, Says It Brutal Murder Film Industry

రామ్‌గోపాల్‌ వర్మ.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ . తాజాగా ఆయన 'సీడెన్స్ 2.0'( Seedance 2.0) అనే ఏఐ(AI) టూల్ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా రంగాన్ని ఏఐ ఏ విధంగా 'ఖూనీ' చేయబోతోందో, అదే సమయంలో సామాన్యుడికి ఏ విధంగా  ముక్తి  ప్రసాదించబోతోందో ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు.

టెక్నాలజీ మారుతున్న కొద్దీ సినిమా మేకింగ్ విధానం మారుతుందని అందరికీ తెలుసు, కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఏకంగా సినిమా ఇండస్ట్రీ మరణం గురించి జోస్యం చెప్పారు. 'సీడెన్స్ 2.0' వంటి అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్ రాకతో, కోట్లాది రూపాయల బడ్జెట్లు, వేలమంది టెక్నీషియన్లతో కూడిన ప్రస్తుత సినిమా ఎకోసిస్టమ్ 'బ్రూటల్ మర్డర్' కాబోతోందని ఆయన ట్వీట్‌ చేశాడు.

అత్యంత ఖరీదైన సినిమాలు తీసి, అత్యంత విజయవంతమై సినిమాలు తీయడం వల్ల రాజమౌళి నెంబర్‌ వన్‌ డైరెక్టర్‌ అయ్యాడు. రూ. 1000 కోట్లు కాదు అంతకంటే ఎక్కువ రాబట్టగలడనే ట్రాక్‌ రికార్డు ఆయనకు ఉంది. ఇదంతా ఆయనకు ఉన్న అసమానమైన క్రియేటివ్ ఊహాశక్తి వల్లే సాధ్యం అయింది. కానీ ఇప్పుడు 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో, ఎంతమంది రాజమౌళిలు లేదా ఆయన కంటే మెరుగైనవాళ్లు చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండొచ్చు? క్రియేటివ్ విజన్ ఉన్నవాళ్లు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి యాక్సెస్ లేనివాళ్లు, డబ్బులు లేనివాళ్లు... వాళ్లకు అవకాశం తలుపు మూసేసి, కీలు కొందరి దగ్గరే ఉంది. 

కానీ సీడెన్స్‌ 2.O ఆ తలుపులను తన్ని పారేసింది. ఇక టాలెంట్ ఉంటే చాలు, అవకాశం కోసం ముంబై రానక్కర్లేదు. ఇది కేవలం వాళ్ల డిస్క్రిప్టివ్ ప్రాంప్ట్‌లు తీసుకొని, సినిమాటిక్‌గా, మల్టీ-షాట్‌లతో, సౌండ్ డిజైన్‌తో, వందల కోట్ల ఖర్చుతో, నెలలు పట్టే సీన్‌లను క్రియేట్ చేస్తుంది. ఇకపై నటులు, కెమెరామెన్లు, ఎడిటర్లు, ఫైట్ మాస్టర్లు, లైట్ బాయ్స్.. ఇలా భారీ సైన్యం అవసరం లేకుండానే థియేట్రికల్ క్వాలిటీ సినిమాలు వస్తాయి.

స్టార్ ఇష్యూస్ లేవు . బడ్జెట్ గురించి ప్రొడ్యూసర్లు భయపడాల్సిన అవసరం లేదు  ."పోస్ట్‌లో ఫిక్స్ చేద్దాం" అనే పని లేదు. ఒక షాట్ కోసం 300 మంది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒకరు. ఒక ప్రాంప్ట్. ఒక మైండ్. అడ్వాన్స్‌డ్ AIలు ఫుల్ లెంగ్త్ థియేట్రికల్ క్వాలిటీ సినిమాలు తయారు చేయగలిగినప్పుడు... యూనియన్లు, కోట్ల ఓవర్‌హెడ్స్, "మాకే సినిమాలు తీయడం తెలుసు" అనే అహంకారం ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ మరణిస్తుంది. నెమ్మదిగా కాదు. శాంతియుతంగా కాదు. బ్రూటల్‌గా మర్డర్ అవుతుంది. 

కానీ దాని హార్ట్‌లో... ఇది సినిమాకు నిజమైన లిబరేషన్. డైనోసార్లు 100 ఏళ్లు రాజ్యం చేశాయి. ఇప్పుడు ఆస్టరాయిడ్ వచ్చేసింది. దాని పేరు AI. కొత్త ఎరా‌కు స్వాగతం. ఇక్కడ టాలెంట్ మాత్రమే ముఖ్యం, యాక్సెస్ కాదు. అదే చంపేస్తుంది. అదే రక్షిస్తుంది. ఇక వెనక్కి తిరిగి రానిది. కాబట్టి ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మరణమా? లేక ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క అల్టిమేట్ డెమోక్రటైజేషనా?’ అని ఆర్జీవీ ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement