విషాదం.. 37 ఏళ్ల యువ నటుడు మృతి! | Actor Mayank Pawar Dies At 37 | Sakshi
Sakshi News home page

ఏడుసార్లు మిస్టర్ ఇండియా, నటుడు మయాంక్ పవార్ కన్నుమూత

Feb 25 2026 8:34 AM | Updated on Feb 25 2026 9:10 AM

Actor Mayank Pawar Dies At 37

ఫిట్‌నెస్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు, బాడీ బిల్డర్ మయాంక్ పవార్ (37) అకాల మరణం సినీ, క్రీడా రంగాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన, ఈ నెల 23న తుదిశ్వాస విడిచారు. అయితే, ఈ విషాద వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మయాంక్ పవార్ కేవలం నటుడిగానే కాకుండా, బాడీ బిల్డింగ్ రంగంలోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. ఏడుసార్లు మిస్టర్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుని రికార్డు సృష్టించారు.ప్రముఖ రియాలిటీ షో 'MTV Splitsvilla' సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొని యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. 

ఇటీవలే తన 37వ పుట్టినరోజును జరుపుకున్న మయాంక్, ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. "ఒక గొప్ప ఫిట్‌నెస్ ఐకాన్‌ను కోల్పోయాం" అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మోడల్‌గా, నటుడిగా ఎదుగుతున్న తరుణంలోనే ఈ విషాదం జరగడం దురదృష్టకరం.

Advertisement
 
Advertisement
Advertisement