ఆ ఒక్క మాటతో మటన్‌ బిర్యానీ తినడం ఆపి, వాంతులు చేసుకున్నా : అనుపమ | Anupama Parameswaran Recalls Traumatic Incident From Shooting Of Karthikeya 2 | Sakshi
Sakshi News home page

ఆడుకున్న మేకపిల్లతో బిర్యానీ.. వాంతులు చేసుకున్న అనుపమ!

Feb 24 2026 2:40 PM | Updated on Feb 24 2026 2:59 PM

Anupama Parameswaran Recalls Traumatic Incident From Shooting Of Karthikeya 2

గ్లామర్ డాల్‌గా మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న నటి అనుపమ పరమేశ్వరన్. నిరంతరం షూటింగులతో బిజీగా ఉండే ఈ మలయాళ కుట్టి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జీవితాన్ని మలుపు తిప్పిన చేదు జ్ఞాపకాన్ని పంచుకుంది. ఆమె ఆహారపు అలవాట్లనే మార్చేసి, ఆమెను కొన్నాళ్ల పాటు శాకాహారిగా మార్చిన ఆ ‘మటన్ బిర్యానీ’ ఉదంతం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

అసలేం జరిగింది?
బ్లాక్ బస్టర్ హిట్ 'కార్తికేయ-2' షూటింగ్ సమయంలో సెట్‌లోకి ఓ చిన్న మేకపిల్ల వచ్చిదంట. ఆ సమయంలో అక్కడే ఉన్న అనుపమ..దానితో కాసేపు ఆడుకొని, వదిలిపెట్టేసిందట. కట్‌ చేస్తే.. అదే రోజు మధ్యాహ్నం లంచ్‌ చేస్తుంటే.. అసిస్టెంట్ వచ్చి నవ్వుతూ  ‘మేడం.. మీరు తింటున్నది పొద్దున్నే మీరు ఎంతో ప్రేమగా ఆడుకున్న ఆ మేకపిల్లతో తయారు చేసిన బిర్యానీయే’ అన్నారట. ‘ఆ మాట విన్న వెంటనే ఆమె గొంతులో ముద్ద దిగలేదు.ప్లేటు పక్కన పడేశా. వాంతులు కూడా చేసుకున్నా. ఆ రోజు నుంచి మటన్‌ తినడమే మానేశా. చాలా రోజుల పాటు మటన్‌ విషయం వస్తే.. ఆ మేకపిల్ల గుర్తుకు వచ్చేది. ఈ మధ్యే మళ్లీ తినడం స్టార్ట్‌ చేశా’ అని ఓ ఇంటర్వ్యూలో అనుపమ చెప్పుకొచ్చింది. 

అనుపమ కెరీర్‌ విషయానికొస్తే..గత ఏడాది తెలుగులో ‘కిష్కింధపురి’, ‘పరదా’తో పాటు, మలయాళం, హిందీలో కలిసి మొత్తం ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం.ఆర్జే షాన్ దర్శకత్వంతో ఓ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌ చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement