గల్ల పట్టుకొని కొట్టుకున్న రాజమౌళి, మహేశ్‌.. ఏఐ వీడియో వైరల్‌ | RGV Shares AI Video Of Fight Between Mahesh Babu And Rajamouli, Says Cinema Is Dead, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

గల్ల పట్టుకొని కొట్టుకున్న రాజమౌళి, మహేశ్‌.. ఏఐ వీడియోని షేర్‌ చేసిన ఆర్జీవీ

Feb 24 2026 1:42 PM | Updated on Feb 24 2026 1:55 PM

RGV Shares AI VIdeo Of Fighting Between Mahesh Babu, Rajamouli, Says Cinema Is Dead

సాంకేతికత ఎంత ఎదిగితే అంత ముప్పు కూడా ఉంటుందనే మాట నిజమనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న దృశ్యాలు అసలు-నకిలీల మధ్య తేడాను చెరిపేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే.. అవి నిజమా కాదా అనేది కూడా కనిపెట్టలేకపోతున్నాం. అలాంటి ఓ ఫన్నీ ఏఐ వీడియోని ఎక్స్‌లో షేర్‌ చేశాడు ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ. అందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఒకరినొకరు గల్ల పట్టుకొని కొట్టుకుంటున్నారు.

ఏఐతో క్రియేట్‌ చేసిన ఈ వీడియోని ఎక్స్‌లో షేర్‌ చేస్తూ.. ‘సినిమా చనిపోయింది’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. ఈ వీడియోలో మహేష్ బాబు, రాజమౌళి అత్యంత సహజంగా గొడవ పడుతుండటం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘ఏఐతో ఏదైనా సాధ్యమే’, ‘బహుశా పాస్‌పోర్ట్ విషయంలోనే(వారణాసి షూటింగ్‌ మొదలైనప్పుడు మహేశ్‌ పాస్‌పోర్ట్‌ లాక్‌ చేసినట్లుగా జక్కన్న ఓ పోస్ట్‌ పెట్టాడు) ఈ గొడవ జరుగుతుందేమో’, ‘వారణాసి ప్రచారం సమయంలో కచ్చితంగా ఈ వీడియోను ప్లే చేస్తా’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమది ఇలాంటి వీడియోల వల్ల సెలబ్రిటీల ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వారణాసి విషయానికొస్తే.. ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. మహేశ్‌బాబుకి జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమరన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు .వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement