టాలీవుడ్ నటుడు నాని పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. రీసెంట్‌గా ఓజీతో ప్రేక్షకులను పలకరించిన దర్శకుడు సుజీత్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి బ్లడీ రోమియో అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి ఒక వీడియోను విడుదల చేశారు. వీడు నంబర్ వన్ చెఫ్ కాదు.. గ్యాంగ్‌స్టర్ అంటూ నాని పాత్రకు ఎలివేషన్ ఇచ్చారు. తన తొలి సినిమా ‘రన్ రాజా రన్’ స్టైల్‌లో ఈ మూవీ ఉంటుందని ఆయన గతంలో చెప్పిన విషయం తెలిసిందే. నిహారిక ఎంటర్టైన్మెంట్, యూనిమస్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

‘ది ప్యారడైజ్’ సినిమా పూర్తికాగానే బ్లడీ రోమియో సినిమా పట్టాలెక్కనుంది. ఇది తన మార్క్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో సుజీత్ చెప్పారు. డార్క్ హ్యూమర్‌తో సరికొత్తగా ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా క్లిష్టతరంగా ఉండనుందంటూనే సాంకేతికంగా మరోస్ధాయికి చేరుకుంటుందన్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా యూరప్‌లో చిత్రీకరణ చేసుకోనుందని క్లారిటీ ఇచ్చారు.


