మణిరత్నం దర్శకత్వంలో సాయి పల్లవి.. హీరో ఎవరో తెలుసా? | Sai Pallavi And Vijay Sethupathi Will Be work with mani ratnam | Sakshi
Sakshi News home page

మణిరత్నం దర్శకత్వంలో సాయి పల్లవి.. హీరో ఎవరో తెలుసా?

Feb 24 2026 7:27 AM | Updated on Feb 24 2026 9:05 AM

Sai Pallavi And Vijay Sethupathi Will Be work with mani ratnam

తాజాగా కోలీవుడ్‌లో ఓ రేర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం గురించి పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. అదే మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, నటి సాయిపల్లవి జంటగా నటించబోతున్నారన్నది. ఇటీవల థగ్‌లైఫ్‌ చిత్రంతో అపజయాన్ని పొందిన మణిరత్నం తాజాగా ఒక ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. కాగా ఇందులో నటుడు ధ్రువ్‌ విక్రమ్, రుక్మిణి వసంత్‌ నటించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటుడు విజయ్‌సేతుపతి, నటి సాయిపల్లవి నటించనున్నట్లు తెలిసింది. 

ఈ చిత్రాన్ని మణిరత్నంకు చెందిన మెడ్రాస్‌ టాకీస్, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. దీనికి ఏఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందించనున్నుట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం నటుడు విజయ్‌సేతుపతి మార్కెట్‌ నావల్‌ అనే చిత్రంలోనూ, నటి సాయిపల్లవి రామాయణ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత వీరిద్దరూ మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్దం అవుతారని సమాచారం. కాగా నటి సాయిపల్లవి ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న విసయం తెలిసిందే.  ఈమె తమిళంలో ధనుష్‌కు జంటగా ఒక చిత్రంలో నటించనున్నారు. 

అదే విధంగా తెలుగులోనూ కొత్త చిత్రాల్లో నటించే అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇక నటుడు విజయ్‌సేతుపతి చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. అలాంటిది త్వరలో మణిరత్నం దర్శకత్వంలో ఈ క్రేజీ జంట నటించబోవడం విశేషమే అవుతుంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందోన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement