అలా నటించటం తప్పేమీ కాదు : కాజల్‌ | Kajal Aggarwal Says Glamour Also One Of Part In Acting | Sakshi
Sakshi News home page

అలా నటించటం తప్పేమీ కాదు : కాజల్‌

Feb 25 2026 7:31 AM | Updated on Feb 25 2026 9:41 AM

Kajal Aggarwal Says Glamour Also One Of Part In Acting

సీనియర్‌ హీరోయిన్లు తమ ఉనికిని చాటుకోవడానికి చాలా పాట్లు పడుతున్నారనే చెప్పాలి. ఇంతకుముందు వరకు భారతీయ సినిమాలో అగ్ర కథానాయకులుగా రాణించిన కొందరు హీరోయిన్లు పెళ్లై పిల్లలు కలిగినా సినిమాలను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇంకా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో తమ అందాలకు మెరుగులు దిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అందమైన ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ ప్రచారంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో కాజల్‌ అగర్వాల్‌ ఒకరు. 

తెలుగు తమిళం హిందీ భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ మధ్య పెళ్లి కూడా చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయ్యారు. అయినప్పటికీ నటనకు దూరం కావడానికి ఇష్టపడడం లేదు. దీంతో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. అందులో భాగంగా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అందాలను ప్రదర్శించే విధంగా సిద్ధమై వస్తున్నారు.

తనను చూసి సీనియర్‌ నటి అని ఎవరు భావించరాదని ఉద్దేశంతో జూనియర్‌ నటీమణులకు పోటీగా పొట్టి దుస్తుల్లో మెరిసిపోతున్నారు. అంతేకాకుండా ఈ భామ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గ్లామర్‌ అనేది నటనలో ఒక భాగమేనని అన్నారు. అలా నటించటం తప్పేమీ కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా వివాహం అనేది నటిమణుల పయనానికి అడ్డు కాదని అన్నారు.  ఈమె వ్యాఖ్యలు తన సహ నటీమణులను ఆలోచనల్లో పడేస్తుందంటూ  నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

  

Advertisement
 
Advertisement
Advertisement