తమిళనాడులోని ఒక చిన్న పట్టణానికి చెందిన శెన్బాకి దక్షిణ కొరియాకు వెళ్లాలన్నది పెద్ద కల. ఆ కల నిజమవుతున్న ప్రయాణాన్ని చూపించే ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం మార్చి 12న నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ‘స్క్విడ్ గేమ్’ ఫేమ్ దక్షిణ కొరియా నటుడుపార్క్ హ్యే–జిన్,నో హో–జిన్ ఈ సినిమాలోని ప్రధానపాత్రల్లో నటించారు. ఆర్‌ఏ కార్తీక్ దర్శకత్వంలో రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.
ఈ చిత్రవిశేషాల గురించి ప్రియాంక చెబుతూ– ‘‘మేడ్ ఇన్ కొరియా’ కథ విన్నప్పుడే శెన్బాపాత్రతో నాకు బలమైన అనుబంధం ఏర్పడింది. ఇంత అద్భుతమైనపాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘కొరియన్, తమిళ సంస్కృతుల మధ్య ఉన్న చారిత్రక అనుబంధాలు నాకు ఎంతో ఆసక్తిని కలిగించాయి. ఆ స్ఫూర్తితోనే ఈ కథ తయారు చేశాను. మనసుల్ని హత్తుకునే స్లైస్ ఆఫ్ లైఫ్ చిత్రం ఇది.
భాషల్ని దాటి ప్రపంచ సంస్కృతులను కలుపుతున్న కథలను ప్రోత్సహించిన నెట్‌ఫ్లిక్స్‌కు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు ఆర్‌ఏ కార్తీక్. ‘‘దక్షిణాది కథలపై మా దృష్టిని బలోపేతం చేస్తూ, స్థానిక సంస్కృతిలోపాతుకుపోయిన కథలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్.


