ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇతర భాషల చిత్రాలు కూడా స్ట్రీమింగ్‌లోకి వస్తుంటాయి. అలా గతవారం ఓటీటీలోకి వచ్చిన తమిళ బోల్డ్ మూవీ 'హాట్‌స్పాట్ 2 మచ్'. ఏకంగా ఆరు ఓటీటీల్లో ఒకేసారి అందుబాటులోకి వచ్చింది. అయితే అన్నింటిలోనూ ఒరిజివల్ వెర్షన్ మాత్రమే రిలీజైంది. తాజాగా ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కోసం డబ్బింగ్ రూపంలోనూ తీసుకురానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!)
2024లో తొలి పార్ట్ రిలీజ్ కాగా ఈ ఏడాది థియేటర్లలో సీక్వెల్ రిలీజ్ చేశారు. ప్రియాభవనీ శంకర్ లీడ్ రోల్ చేసింది. మొత్తంగా మూడు బోల్డ్ స్టోరీలని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ వార్స్, డ్రస్సింగ్ సెన్స్, నిజమైన ప్రేమ అనే కాన్సెప్ట్స్‌ని షాకిచ్చే స్టైల్లో ప్రెజెంట్ చేశారు. తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు శుక్రవారం(ఫిబ్రవరి 27) నుంచి ఆహా ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
'హాట్‌స్పాట్ 2' విషయానికొస్తే.. శిల్ప(ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ఓ నిర్మాత దగ్గరకు స్టోరీ నెరేషన్ ఇవ్వడానికి వస్తుంది. మూడు కథలు చెబుతుంది. వీటిలో మొదటిది హీరోలని పిచ్చిగా అభిమానించే ఓ ఇద్దరు కుర్రాళ్ల గురించి కాగా.. రెండోది డ్రస్సింగ్ సెన్స్ గురించి.. మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. అసలు శిల్ప ఎవరు? ఈ నిర్మాత దగ్గరకే ఎందుకొచ్చింది? ఈ స్టోరీలు చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి? అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)
Three bold stories.
One aspiring director.
And a hidden agenda you won’t see coming. 👀#Hotspot2Telugu premieres from Feb 27 on aha. pic.twitter.com/znsJyTJLse— ahavideoin (@ahavideoIN) February 24, 2026


