విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి! | Vijay Devarakonda And Rashmika Wedding In Two Traditions | Sakshi
Sakshi News home page

Vijay Rashmika Wedding: రెండు సంప్రదాయ పద్ధతుల్లో రష్మిక-విజయ్ పెళ్లి!

Feb 24 2026 5:42 PM | Updated on Feb 25 2026 10:49 AM

Vijay Devarakonda And Rashmika Wedding In Two Traditions

టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లికి రెడీ అయిపోయారు. రెండు రోజుల క్రితమే అధికారికంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా మంగళవారం నుంచి పెళ్లి సందడి మొదలైపోయింది. ఇదలా ఉండగానే పెళ్లి జరగబోయే సంప్రదాయ పద్ధతులు, పెళ్లి జరిగే చోటు, అతిథుల లిస్ట్, మెనూ అని చెప్పి సోషల్ మీడియాలో చాలానే విషయాలు వైరల్ అయిపోతున్నాయి.

(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)

కలిసి రెండు సినిమాలు చేసిన విజయ్-రష్మిక.. చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. కాకపోతే ఎప్పుడూ బయటకు చెప్పలేదు. తమ పెళ్లిని గ్రాండ్‌గానే ప్లాన్ చేసుకున్నప్పటికీ.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఇప్పుడు ఒక్కటి కాబోతున్నారు. ఉదయ్‌పుర్‌లోని ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న 'ద మెమొంటోస్' అనే లగ్జరీ హోటల్‌లో ఈ శుభకార్యం జరగనుంది. ఈ వివాహానికి విరోష్(VIROSH) అని పేరు కూడా పెట్టారు.

ఇకపోతే మంగళవారం(ఫిబ్రవరి 24) సాయంత్రం సంగీత్ జరగనుంది. బుధవారం(ఫిబ్రవరి 25) ఉదయం హల్దీ.. సాయంత్రం మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. గురువారం(ఫిబ్రవరి 26) ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది. ఇదే రోజు సాయంత్రం కొడవ స్టైల్‌లో మరోసారి విజయ్-రష్మిక వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. శుక్రవారం నాడు అంతా కలిసి తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

అలానే ఈ పెళ్లికి కేవలం 100 మంది లోపే హాజరు కానున్నారని, అతిథుల కోసం తెలుగు సంప్రదాయ ఆహారంతో పాటు జపనీస్ వంటకాలు కూడా మెనూలో ఉండనున్నాయని తెలుస్తోంది. వివాహం ఫొటోలు బయటకు రాకుండా ఉండేందుకు 'నో-ఫోన్' కాన్సెప్ట్ కూడా అమలు చేయనున్నట్లు టాక్.

(ఇదీ చదవండి: విజయ్‌ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్‌ గ్యాప్‌ ఎంతంటే?)

Advertisement
 
Advertisement
Advertisement