breaking news
Kodava
-
పాపం.. ఏదో నోరు జారింది.. రష్మికను వదిలేయండి: నటి
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) బాక్సాఫీస్ క్వీన్‌గా మారిపోయింది. తను ఏ సినిమా పట్టుకున్నా అది బ్లాక్‌బస్టరే అవుతోంది. ఇటీవల వచ్చిన కుబేర మూవీ కూడా ఈజీగా వంద కోట్లు దాటేసింది. కర్ణాటకలోని కూర్గ్లాంటి చిన్న పట్టణం నుంచి వచ్చిన ఆమె నేడు దేశంలోనే టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా పేరు సంపాదించింది.నేనే మొదటి నటి..అయితే అప్పుడప్పుడూ ఆమె నోరు జారి విమర్శలపాలవుతూ ఉంటుంది. ఆ మధ్య రష్మిక.. కూర్గ్ జిల్లాలోని కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైక నటిని అని తన గురించి తాను గొప్పగా చెప్పుకుంది. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఎందుకంటే తనకన్నా ముందు పలువురు నటీనటులు కూర్గ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు.నోరు జారింది.. వదిలేయండికొడవ జాతికి చెందిన హర్షిక పూనాచ (Harshika Poonacha) వారిలో ఒకరు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. రష్మిక పొరపాటున నోరు జారి ఉంటుంది. తనను క్షమించేయండి. కానీ బాలీవుడ్లో అడుగుపెట్టిన మొదటి కొడవ నటి తనే అన్నది మాత్రం నిజం కాదు. కొడవ జాతికి చెందిన గుల్షన్ దేవయ్య చాలా ఏళ్లుగా బాలీవుడ్లో నటుడిగా పని చేస్తున్నాడు. అయితే టాలీవుడ్లో, బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న రష్మికను చూసి మా కొడవ జాతి అంతా సంతోషిస్తున్నాం. కిందకు లాగకండితన సక్సెస్, ఫేమ్ చూస్తుంటే సంతోషంగా ఉంది. స్త్రీలు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మా తెగలో చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రస్తుతం రష్మిక మంచి స్థానంలో ఉంది. తనను కిందకు లాగకండి. వీలైతే మరింత ప్రోత్సహించండి అని పేర్కొంది. హర్షిక పూనాచ.. తెలుగులో ఏడుకొండలవాడా వెంకటరమణా అందరూ బాగుండాలి, అప్పుడలా ఇప్పుడిలా సినిమాలు చేసింది. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో నటిగా రాణిస్తోంది.చదవండి: సుడిగాలి సుధీర్‌పై కోపం? అనిల్ రావిపూడి ఏమన్నారంటే? -
కొడవ’కు స్వయం ప్రతిపత్తి కల్పించండి
సాక్షి, బెంగళూరు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో కర్ణాటకలోని కొడుగు ప్రాంతాన్ని సైతం స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ మేరకు కొడవ నేషనల్ కౌన్సిల్(సీఎన్సీ) ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎన్.యూ.నాచప్ప కొడవ మాట్లాడుతూ... కొడుగు ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి గల ‘కొడవ ల్యాండ్’ గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ ప్రాంత వాసులకు ఒక ప్రత్యేక వస్త్రధారణ, సంస్కృతి, సంప్రదాయం ఉన్నాయని, వాటిని రక్షించుకోవడానికే తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. భాషా, సంస్కృతిల పరంగా కొడగును అత్యంత వెనకబడిన ప్రాంతంగా గుర్తించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 340,342 ల ప్రకారం కొడగు ప్రాంతాన్ని స్వయంప్రతిపత్తి గల ‘కొడవ ల్యాండ్’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాక ప్రస్తుతం కొడవ వర్గానికి చెందిన ప్రజల సంఖ్య లక్షా యాభైవేలు మాత్రమేనని అందువల్ల తమను కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 331ప్రకారం ఆంగ్లో ఇండియన్లకు ఇచ్చినట్లుగా రాజకీయాల్లో రిజర్వేషన్‌ను కల్పించాలని, ఇందుకు సంబంధించిన బిల్లును కూడా ఇదే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కోరారు. ఈ డిమాండ్లన్నింటి పరిష్కారం కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఈనెల 15న కొడగులో ధర్నా నిర్వహించనున్నామని వెల్లడించారు. అనంతరం ఈనెల 18న నగరంలోని టౌన్‌హాల్ ఎదుట ధర్నాను నిర్వహిస్తామని, అంతేకాక నవంబర్ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కొడవ వర్గానికి చెందిన ఐదు వేల మందితో భారీ ర్యాలీని సైతం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.