పాపం.. ఏదో నోరు జారింది.. రష్మికను వదిలేయండి: నటి | Harshika Poonacha: Don't Pull Down Rashmika Mandanna, Lets Encourage | Sakshi
Sakshi News home page

రష్మికను కిందకు లాగకండి.. పాపం క్షమించేద్దాం.. టాలీవుడ్‌ నటి

Jul 5 2025 6:30 PM | Updated on Jul 5 2025 6:45 PM

Harshika Poonacha: Don't Pull Down Rashmika Mandanna, Lets Encourage

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna) బాక్సాఫీస్‌ క్వీన్‌గా మారిపోయింది. తను ఏ సినిమా పట్టుకున్నా అది బ్లాక్‌బస్టరే అవుతోంది. ఇటీవల వచ్చిన కుబేర మూవీ కూడా ఈజీగా వంద కోట్లు దాటేసింది. కర్ణాటకలోని కూర్గ్‌లాంటి చిన్న పట్టణం నుంచి వచ్చిన ఆమె నేడు దేశంలోనే టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరిగా పేరు సంపాదించింది.

నేనే మొదటి నటి..
అయితే అప్పుడప్పుడూ ఆమె నోరు జారి విమర్శలపాలవుతూ ఉంటుంది. ఆ మధ్య రష్మిక.. కూర్గ్‌ జిల్లాలోని కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైక నటిని అని తన గురించి తాను గొప్పగా చెప్పుకుంది. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఎందుకంటే తనకన్నా ముందు పలువురు నటీనటులు కూర్గ్‌ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు.

నోరు జారింది.. వదిలేయండి
కొడవ జాతికి చెందిన హర్షిక పూనాచ (Harshika Poonacha) వారిలో ఒకరు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. రష్మిక పొరపాటున నోరు జారి ఉంటుంది. తనను క్షమించేయండి. కానీ బాలీవుడ్‌లో అడుగుపెట్టిన మొదటి కొడవ నటి తనే అన్నది మాత్రం నిజం కాదు. కొడవ జాతికి చెందిన గుల్షన్‌ దేవయ్య చాలా ఏళ్లుగా బాలీవుడ్‌లో నటుడిగా పని చేస్తున్నాడు. అయితే టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్న రష్మికను చూసి మా కొడవ జాతి అంతా సంతోషిస్తున్నాం. 

కిందకు లాగకండి
తన సక్సెస్‌, ఫేమ్‌ చూస్తుంటే సంతోషంగా ఉంది. స్త్రీలు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మా తెగలో చాలా ఎంకరేజ్‌ చేస్తారు. ప్రస్తుతం రష్మిక మంచి స్థానంలో ఉంది. తనను కిందకు లాగకండి. వీలైతే మరింత ప్రోత్సహించండి అని పేర్కొంది. హర్షిక పూనాచ.. తెలుగులో ఏడుకొండలవాడా వెంకటరమణా అందరూ బాగుండాలి, అప్పుడలా ఇప్పుడిలా సినిమాలు చేసింది. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో నటిగా రాణిస్తోంది.

చదవండి: సుడిగాలి సుధీర్‌పై కోపం? అనిల్‌ రావిపూడి ఏమన్నారంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement