హీరో విజయ్‌ను అన్‌ఫాలో కొట్టిన కుమారుడు! | Is Jason Sanjay Unfollows Father Vijay Amid Divorce With Sangeetha, Read Story For More Details | Sakshi
Sakshi News home page

విజయ్‌ దంపతుల విడాకులు.. కొడుకు దూరం పెట్టాడా?

Mar 1 2026 1:58 PM | Updated on Mar 1 2026 4:29 PM

Is Jason Sanjay Unfollow Vijay amid father Divorce with Sangeetha

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నుంచి విడాకులకు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించింది. ఓ నటితో విజయ్‌కు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే విడిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిసిందే! దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

విజయ్‌ను అన్‌ఫాలో కొట్టిన జేసన్‌
ఇదే సమయంలో నెటిజన్లు ఓ విషయాన్ని గుర్తించారు. విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌.. తన తండ్రిని దూరం పెట్టినట్లు గమనించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దళపతిని అన్‌ఫాలో కొట్టాడంటున్నారు. అయితే జేసన్‌.. తన తల్లి విడాకులకు దరఖాస్తు చేశాకే తండ్రిని అన్‌ఫాలో చేశాడని కొందరు అంటుంటే.. అంతకుముందు నుంచే అతడు తండ్రిని ఫాలో అవట్లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

పెళ్లి - విడాకులు
ఏదేమైనా జేసన్‌.. ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా విజయ్‌- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్‌పై ఏప్రిల్‌ 20న విచారణ జరగనుంది. ఆరోజు విజయ్‌ న్యాయస్థానం ఎదుట హాజరు కానున్నాడు.

చదవండి: ఓటీటీలో విత్‌ లవ్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Advertisement
 
Advertisement
Advertisement