breaking news
Jason
-
ఇంటి పేరు మార్చుకున్న విజయ్ వారసుడు
నటుడు, తమిళ వెట్రి కళగం(టీవీకే) అధినేత కుమారుడు జాసన్ సంజయ్ తన తండ్రి ఇంటి పేరు తొలగించుకున్నాడు. ఇప్పుడు ఈ అంశం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి విజయ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ ఇటీవల చెంగలపట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు పిల్లలకు జీవన భృతి చెల్లించేలా విజయ్ను ఆదేశించాలని కోరారు. కాగా విజయ్, సంగీత దంపతులకు జాసన్ సంజయ్, దివ్యషా పిల్లలు ఉన్నారనే విషయం తెలిసిందే.జాసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సిగ్మా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ చిత్రం టైటిల్ కార్డులో తన తండ్రి విజయ్ ఇన్షియల్( ఇంటి పేరు)ను తొలగించడంతో పాటూ తన తల్లి పేరు సంగీత ఇన్షియల్ వచ్చే విధంగా ఎస్‌ను చేర్చుకున్నారు. ఇంతకు ముందే తన ఇన్ స్ట్రాగామ్‌లో తండ్రి విజయ్ ఫాలోవర్స్ నుంచి వైదొలిగారు. ఇప్పుడీ ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
హీరో విజయ్ను అన్‌ఫాలో కొట్టిన కుమారుడు!
తమిళ స్టార్ హీరో విజయ్ నుంచి విడాకులకు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించింది. ఓ నటితో విజయ్‌కు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే విడిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిసిందే! దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.విజయ్ను అన్‌ఫాలో కొట్టిన జేసన్ఇదే సమయంలో నెటిజన్లు ఓ విషయాన్ని గుర్తించారు. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్.. తన తండ్రిని దూరం పెట్టినట్లు గమనించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దళపతిని అన్‌ఫాలో కొట్టాడంటున్నారు. అయితే జేసన్.. తన తల్లి విడాకులకు దరఖాస్తు చేశాకే తండ్రిని అన్‌ఫాలో చేశాడని కొందరు అంటుంటే.. అంతకుముందు నుంచే అతడు తండ్రిని ఫాలో అవట్లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.పెళ్లి - విడాకులుఏదేమైనా జేసన్.. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా విజయ్- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ జరగనుంది. ఆరోజు విజయ్ న్యాయస్థానం ఎదుట హాజరు కానున్నాడు.చదవండి: ఓటీటీలో విత్ లవ్.. రిలీజ్ ఎప్పుడంటే? -
IPL కోసం ఇంగ్లాండ్ కాంట్రాక్ట్ వదులుకున్న KKR స్టార్ బ్యాటర్
-
థియేటర్ నుంచి ఆస్కార్‌కు.. ఈ పాప్‌కార్న్ గయ్ మామూలోడు కాదు..
సోషల్ మీడియా దేన్నయినా సాధ్యం చేస్తోంది. చిన్న చిన్న పనులు చేసుకునేవారు కూడా తమ నైపుణ్యాలతో ఓవర్‌నైట్‌లో స్టార్లు అయిపోతున్నారు. ఊహించని రీతిలో గొప్ప అవకాశాలు అందుకుంటున్నారు. ఇదీ చదవండి: Oscar Awards: ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి! కానీ.. సరిగ్గా ఇలాగే సినిమా థియేటర్లో పాప్‌కార్న్ అమ్ముకునే జాసన్ గ్రోస్‌బోల్ అనే యువకుడు ఆస్కార్ వేడుకలో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు జరుగుతున్న ఆస్కార్ వేడుకలో అతిథులకు పాప్‌కార్న్ సర్వ్ చేస్తున్నాడు. టెక్సాస్‌లోని కార్పస్ క్రిస్టీలోని సెంచరీ 16 థియేటర్లో పనిచేస్తున్న గ్రోస్‌బోల్ పాప్‌కార్న్ సర్వ్ చేయడంలో వైవిధ్యాన్ని ప్రదర్శించి టిక్‌టాక్‌లో ఫేమస్ అయ్యాడు. ఆస్కార్ వేడుకలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్‌కు తన స్నేహితుడొకరు గ్రోస్‌బోల్ గురించి చెప్పడంలో రెండు నెలల క్రితం తన చానల్లో లైవ్ నిర్వహించినప్పుడు అతన్ని లైవ్‌లోకి తీసుకున్నారు. అతని పాప్‌కార్న్ సర్వింగ్ నైపుణ్యాలకు అబ్బురపడిన కిమ్మెల్ అతన్ని డాల్బీ థియేటర్లో జరుగనున్న ఆస్కార్ వేడుకలో పాప్‌కార్న్ అందించేందుకు ఆహ్వానించారు. -
ఫీల్డ్‌లో క్రికెటర్ల కొట్లాట
-
పెరటి తోట కోసం న్యాయపోరాటం!
సాధాణంగా పెరటి తోట ఇంటి వెనుక భాగంలో ఉంటుంది. ఇంటి ముందు భాగంలో కిచెన్ గార్డెన్ ఉండడం అమెరికాలో శిక్షార్హమైన నేరం! ఇంటిపంటల ప్రేమికులు ఇంటి ముందు గార్డెన్ కన్నా కిచెన్ గార్డెన్ ఉంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఇంటి ముందున్న తమ సొంత స్థలంలో సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు పెంచుకునే హక్కు కోసం కోర్టులకెక్కుతున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండో నగరానికి చెందిన జాసన్, జెన్నిఫర్ హెల్వెన్స్టన్ దంపతులు ఇటువంటి కేసులో ఇటీవలే విజయకేతనం ఎగురవేశారు. 17 ఏళ్లుగా తమ ఇంటి ముందున్న కిచెన్ గార్డెన్‌ను తొలగించమని స్థానిక అధికారులు గత ఏడాది ఆదేశించడంతో వీరు కోర్టుకెళ్లారు. ‘విత్తు నాటండి.. చట్టం మార్చండి’ నినాదంతో పాట్రియాట్ గార్డెన్స్ సంస్థ సారధ్యంలో 6 వేల మంది స్థానికులు ఈ జంటకు బాసటగా నిలిచి విజయం సాధించడం విశేషం.


