విజయ్ గెలిచాక అన్‌ఫాలో చేశాడా?.. అసలు నిజమేంటి? | Vijay son Jason Sanjay unfollow him after poll win | Sakshi
Sakshi News home page

Vijay: తండ్రిని అన్‌ఫాలో చేసిన వారసుడు.. అసలు నిజమేంటి?

May 6 2026 2:52 PM | Updated on May 6 2026 3:03 PM

Vijay son Jason Sanjay unfollow him after poll win

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దళపతిపై పడింది. ఈ ఎలక్షన్స్‌లో అత్యధిక సీట్లు సాధించాడు. పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే  ఏకంగా 108 స్థానాలు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు గట్టి షాకిచ్చిన టీవీకే అధినేత విజయ్‌ సీఎం పీఠ ఎక్కనున్నారు. ఈ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే విజయ్ ఫ్యామిలీ గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఎన్నికల ముందే ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకొచ్చింది. విజయ్ గెలుపుతో  జేసన్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడా లేదా అనే దానిపై నెట్టింట చర్చ నడుస్తోంది.

ఈ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  జేసన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రస్తుతం 38 మందిని ఫాలో అవుతున్నారు.  ఇటీవల కొంతమంది నెటిజన్స్ జేసన్ విజయ్‌ను అన్‌ఫాలో చేశాడని చెబుతున్నారు. అయితే మరికొందరేమో అతను మొదటి నుంచే విజయ్‌ను ఫాలో అవ్వలేదని అంటున్నారు. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నికల ముందే ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కాగా విజయ్‌- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్‌పై జూన్‌లో విచారణ జరగనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement