
మ్యాజిక్ షోలు చేసుకునే స్థాయి నుంచి కమెడియన్‌గా, యాంకర్‌గా, హీరోగా ఎదిగాడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). యాంకర్ రష్మీతో లవ్ ట్రాక్‌తో మరింత పాపులర్ అయ్యాడు. మొదట్లో సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసిన సుధీర్ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్, గాలోడు, కాలింగ్ సహస్ర, వాంటెడ్ పండుగాడ్ వంటి చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం G.O.A.T. మూవీ చేస్తున్నాడు.
సుధీర్‌పై మితిమీరిన రోస్టింగ్
మరోవైపు టీవీ షోలలో యాంకర్‌గానూ పని చేస్తున్నాడు. అయితే బుల్లితెరపై ఆయన్ను విపరీతంగా రోస్ట్ చేస్తుంటారు. షో ఏదైనా సుధీర్‌ను ఆడుకోవడం మాత్రం గ్యారెంటీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కొన్నిసార్లు నటుడిపై మితిమీరిన పంచ్‌లు వేస్తుండటం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. అంతేకాదు, సుధీర్ కూడా తనపై వేసే పంచ్‌లకు హర్టవడా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
అందరూ ఆడుకునేవారే
డ్రామా జూనియర్స్‌లో పిల్లల నుంచి జడ్జి అనిల్ రావిపూడి (Anil Ravipudi) వరకు అందరూ సుధీర్‌ను ఆడుకునేవారే! అనిల్ రావిపూడి.. గతంలో కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ షోలోనూ సుధీర్‌ను రోస్ట్ చేసేవాడు. దీంతో ఈ డైరెక్టర్‌కు తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. సుధీర్‌పై ఎందుకంత కోపం? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. సుధీర్‌ను పంచులతో ఫ్రై చేస్తుంటే నాకు జాలేస్తుంటుంది. పాపం, అతడు హీరోగా కూడా సినిమాలు చేశాడు.. ఆయన్ని అంతలా ఫ్రై చేయాలా? అని అడిగితే సుధీర్‌ను రోస్ట్ చేయడమే కాన్సెప్ట్ అనేవారు.
అందుకే తప్పడం లేదు
షో నిర్వాహకులే అలా అన్నాక మేమేం చేస్తాం. మాకు ఇష్టం లేకపోయినా సుధీర్‌ను ఏదో ఒకటి అనాల్సి వస్తుంది. ఎందుకంటే సుధీర్‌ను ఫ్రై చేస్తేనే జనం నవ్వుతారు, చప్పట్లు కొడతారని చెప్పారు. ప్రేక్షకులు అదంతా ఎంజాయ్ చేస్తున్నారని తెలిశాక మేమూ ఇంకాస్త ఎక్కువ రోస్ట్ చేస్తున్నాం. సుధీర్ చాలా స్పోర్టివ్. ఎలాంటి జోకులు వేసినా ఫీలవ్వడు. కొన్ని పంచులు వేయడానికి నేను మొహమాటపడితే కూడా.. ఏం పర్లేదు సర్, జనాలు నవ్వడమే కావాలి.. మీరు ఫ్లోలో వెళ్లిపోండి అని చెప్తాడు.
నేనే కట్ చేస్తుంటా..
అయినా సరే, కొన్నిసార్లు నేనే తటపటాయిస్తుంటాను. కొన్ని పంచులు ఓవర్ అయిపోతుందన్నప్పుడు వాటిని కట్ చేస్తుంటాను. సరదా కోసమే తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఎవరినీ ఏదీ అనుకోము అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. మనల్ని నవ్వించడం కోసం సుధీర్ అడిగి మరీ తిట్టించుకుంటాడా? అని అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
చదవండి: ప్రభాస్ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్ వెంకట్ ఫ్యామిలీ