ప్రభాస్‌ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్‌ వెంకట్‌ ఫ్యామిలీ | Fish Venkat Family Gives Clarity On Prabhas Help | Sakshi
Sakshi News home page

Fact Check: ప్రభాస్‌ పేరిట మోసం.. ఆపదలో ఉన్నవారితో ఆటలా?

Jul 5 2025 2:52 PM | Updated on Jul 5 2025 4:36 PM

Fish Venkat Family Gives Clarity On Prabhas Help

టాలీవుడ్‌లో విలన్‌గా, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్‌ వెంకట్‌ (Fish Venkat) చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. బోడుప్పల్‌లోని ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నాడు. చాలా ఏళ్ల క్రితమే వెంకట్‌ రెండు కిడ్నీలు చెడిపోయాయి. అప్పటినుంచి డయాలసిస్‌ చేయించుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారడంతో కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్చాలని వైద్యులు చెప్తున్నారు.

ప్రభాస్‌ టీమ్‌ ఫోన్‌ కాల్‌
అందుకోసం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. దీంతో అతడి భార్య, కూతురు సాయం కోసం అర్థిస్తూ మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో నటుడి పరిస్థితి తెలుసుకున్న హీరో ప్రభాస్‌ (Prabhas).. ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారని ప్రచారం జరిగింది. కిడ్నీ దాత ఉంటే ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేసుకోమని, అందుకు అవసరమైన డబ్బు ఇస్తామని ప్రభాస్‌ టీమ్‌ ఫోన్‌ చేశారని ఫిష్‌ వెంకట్‌ కూతురు స్రవంతి మీడియాతో చెప్పింది.

ఇల్లు అమ్మేసినా సరిపోదు
కట్‌ చేస్తే అదంతా ఫేక్‌ కాల్‌ అని తెలుస్తోంది. ఆపదలో ఉన్నవారికి ప్రభాస్‌ పేరు చెప్పి లేనిపోని ఆశలు కల్పించి మరింత దుఃఖంలోకి నెట్టేశారని తెలుస్తోంది. ఈ విషయం గురించి నటుడి భార్య మాట్లాడుతూ.. ప్రభాస్‌ అసిస్టెంట్‌ అని చెప్పి మాకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చిన మాట వాస్తవమే.. కావాల్సినంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు మేము ఫోన్‌ చేస్తే కలవడం లేదు. ప్రభాస్‌ నిజంగా డబ్బు ఇస్తే ఇచ్చామనే చెప్తాం. కానీ ఆయన మాకు ఏ సాయం చేయలేదు. ఇదంతా ఫేక్‌ న్యూస్‌. హీరోలు సాయం చేస్తే బాగుండు. మా ఇల్లు అమ్మి ఆపరేషన్‌ చేద్దామన్నా ఆ డబ్బు దేనికీ సరిపోదు అని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రభాస్‌ పేరిట మోసం!
నటుడి కూతురు స్రవంతి సైతం స్పందిస్తూ.. ప్రభాస్‌ పీఏ అంటూ ఐదురోజుల కిందట నాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీకు సాయం కావాలంటే చెప్పండి, తప్పకుండా చేస్తామని మాటిచ్చాడు. నేను మా నాన్న పరిస్థితిని వివరించాను. అందుకాయన.. ప్రభాస్‌ సర్‌ షూటింగ్‌లో ఉన్నాడు.. కాసేపయ్యాక తిరిగి కాల్‌ చేస్తానన్నాడు. నేను నిజమేనని నమ్మాను. 

సినిమా
కానీ, రెండురోజుల నుంచి ఎన్నిసార్లు కాల్‌ చేసినా లిఫ్ట్‌ చేయడం లేదు. మాకు ప్రభాస్‌ వైపు నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు అని క్లారిటీ ఇచ్చింది. కాగా ఫిష్‌ వెంకట్‌.. బలుపు, ఒక లైలా కోసం, అత్తారింటికి దారేది, గబ్బర్‌ సింగ్‌, దరువు, అదుర్స్‌, దిల్‌, సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌, ఈడో రకం, ఆడో రకం, గద్దలకొండ గణేశ్‌, ఖైదీ నెం.150 ఇలా అనేక సినిమాలు చేశాడు.

చదవండి: 'హరి హర వీరమల్లు' రికార్డ్‌ వ్యూస్‌.. అంతా ఫేక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement