breaking news
Fish Venkat
-
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
బాలీవుడ్ నటుడు సోను సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ విషాద సమయంలో వారికి ఆర్థికసాయం అందించారు. తనవంతు సాయంగా లక్షన్నర రూపాయలు ఫిష్ వెంకట్ కుటుంబానికి అందించారు. అంతే కాకుండా సోనూ సూద్ కూడా వ్యక్తిగతంగా ఫిష్ వెంకట్ భార్య, కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవల కిడ్నీల సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఫిష్ వెంకట్ కోలుకోలేక మృతి చెందారు. ఫిష్ వెంకట్ పరిస్థితి గురించి తెలుసుకున్న కొందరు ఆయన వైద్యం కోసం ఆర్థికసాయం అందించారు. అయినప్పటికీ సరైన సమయంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగకపోవడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ పలు టాలీవుడ్ చిత్రాల్లో మెప్పించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, శివం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కమెడియన్‌గా మాత్రమే కాదు విలన్ పాత్రల్లోనూ అభిమానులను మెప్పించారు. ఫిష్ వెంకట్ చివరిసారిగా కాఫీ విత్ ఎ కిల్లర్‌లో కనిపించాడు. -
'ఫిష్ వెంకట్'కు ఎందుకు సాయం చేయాలి: నట్టి కుమార్
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. అయితే, ఆయన మరణం తర్వాత సినీ పరిశ్రమపై విమర్శలు వచ్చాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సాయం కోసం ఆయన కుటుంబం అభ్యర్తించారు. కానీ, పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించలేదని నెటిజన్లు తప్పుబట్టారు. మరణించినా కూడా ఆ కుటుంబానికి సానుభూతి కూడా తెలపలేదని విమర్శించారు. ఒక ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు, సాంకేతిక నిపుణుడు చనిపోతేనే ఇండస్ట్రీ మొత్తం తరలి వస్తుంది. కానీ, చిన్న నటులు మరణిస్తే కనీసం సాయం, స్పందన కూడా పరిశ్రమ నుంచి కనపించలేదని విమర్శలు వచ్చాయి. ఇదే అంశంపై తాజాగా నిర్మాత నట్టి కుమార్ స్పందించారు.ఫిష్ వెంకట్ మరణం గురించి నిర్మాత నట్టి కుమార్ ఇలా చెప్పారు. ' కొంత కాలంగా ఆయన సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. పరిశ్రమతో సత్ససంబంధాలు కొనసాగిస్తున్న వారు మరణిస్తే ఈ సెలబ్రిటీలు అక్కడ కనిపిస్తారు. సినిమా అంటేనే ఒక బిజీ ప్రపంచం.. ఎవరి పనిలో వారు ఉంటారు. ఇక్కడ ఎవరు మరణించారు..? అని తెలుసుకునేంత టైమ్ ఎవరికీ ఉండదు. నేను చెబుతున్న మాటలు ఫిష్ వెంకట్ ఫ్యామిలీతో పాటు ప్రేక్షకులకు కూడా బాధ ఉండొచ్చు. రేపు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చినా అంతే.. సినిమా పరిశ్రమలో కొన్ని సామాజిక వర్గాలు, ఫిలిం ఛాంబర్‌తో నిత్యం టచ్‌లో ఉన్నవారికి ఏదైనా జరిగితే వారి సన్నిహితులు తప్పకుండా వెళ్తారు. గబ్బర్‌సింగ్ గ్యాంగ్‌తో ఫిష్ వెంకట్ టచ్‌లో ఉంటారు. కాబట్టి, వారు ఆయనతో కనిపిస్తున్నారు. మిగిలిన వారు ఎవరూ అయ్యోపాపం అని కూడా అనరు. వెంకట్‌ను ఎవరూ పలకరించలేదని చాలామందికి బాధ ఉండొచ్చు. మొదట ఆయన అసోషియేషన్ మెంబర్ కాదు. సభ్యత్వం కూడా తీసుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో సాయం చేస్తారని ఎవరూ ఆశించకండి.. ఎవరి జాగ్రత్తలో వారు ఉండాల్సిందే. వాళ్ళు వీళ్ళు సాయం చేస్తారని ఎదురుచూడకండి. రోజుకు రూ. 3వేల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి నుంచి రూ. 30 వేలు తీసుకునే రేంజ్‌కు కూడా వెంకట్ చేరుకున్నాడు. మన దగ్గరకు డబ్బు వచ్చినప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇక్కడ ఎవరూ సాయం చేస్తామని ముందుకు రారు. ఈ విషయంలో ఒకరిని తప్పుబట్టడం ఎందుకు..? లేనివాడికి ప్రాణం మీద ప్రేమ, ఉన్నవాడికి డబ్బు మీద ప్రేమ. కాబట్టి దీనిని మనం అర్థం చేసుకోవాలి. మాట సాయం చేయగలరేమో కానీ, ఆర్ధిక సాయాలు అందరూ చేయరు.' అని నట్టి కుమార్ అన్నారు. -
రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జూలై 18న) రాత్రి కన్నుమూశారు. కిడ్నీ మార్పిడి చేస్తే నాన్న బతికేవాడని అతడి కూతురు భావోద్వేగానికి లోనైంది. అలాగే హీరో రామ్‌చరణ్.. లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారన్న అసత్య ప్రచారం వల్ల తమ కుటుంబానికి ఎవరూ సాయం చేయలేదని వాపోయింది. నాన్న మరణించాక తమను పరామర్శించేందుకు గబ్బర్ సింగ్ టీమ్ తప్ప సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాలేరని పేర్కొంది.కిడ్నీతో పాటు కాలేయం కూడా..వెంకట్ కూతురు ఇంకా ఏమందంటే.. నాన్నకు మొన్నటివరకు కిడ్నీ సమస్య ఉందని మాత్రమే వైద్యులు చెప్పారు. నిన్న అన్ని టెస్టులు చేస్తే కాలేయం కూడా పాడైపోయిందన్నారు. ఇన్ఫెక్షన్ పెరుగుతోందని చెప్పారు. బతకడం కష్టమన్నారు. నిన్న సాయంత్రం ఆరింటి వరకు కూడా నాన్న బాగానే ఉన్నారు. అయితే 80% కోమాలో ఉన్నారని డాక్టర్స్ చెప్పారు. రాత్రి సడన్‌గా బీపీ పడిపోయింది, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రి 9.25 గంటలకు నాన్న చనిపోయాడు.ఒక్క రూపాయి అందలేదునాన్నను ఆస్పత్రిలో చేర్పించినప్పుడే ఎవరైనా ఆర్థిక సాయం చేసుంటే ఆయన కచ్చితంగా బతికేవాడు. డబ్బు లేకపోవడం వల్లే నాన్నను కోల్పోయాం. ఇండస్ట్రీ నుంచి హీరో విశ్వక్ సేన్, జెట్టి ఫేమ్ కృష్ణ మానినేని సాయం చేశారు. హీరో రామ్‌చరణ్‌కు చెందిన క్లీంకార ఫౌండేషన్ నుంచి రూ.25 వేల సాయం అందింది. అయితే రామ్‌చరణ్ మా నాన్నను మంచి ఆస్పత్రిలో చేర్పించాడు, ఆర్థిక సాయం చేశాడంటూ పుకార్లు లేపారు. దీనివల్ల ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా విరాళం రాలేదు. నాన్నకు అంత సీరియస్‌గా ఉంటే గబ్బర్ సింగ్ టీమ్ తప్ప ఎవరూ చూడటానికి రాలేదు. డబ్బు సాయం చేసుంటే నాన్న ఈరోజు బతికి ఉండేవాడు అని చెప్పుకొచ్చింది.చదవండి: హీరోయిన్ ఫామ్‌హౌస్‌లో దొంగతనం.. సీసీటీవీలు ధ్వంసం! -
మృత్యువుతో పోరాడి కన్నుమూసిన ఫిష్ వెంకట్
-
నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
-
టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ఫిష్ వెంకట్ కన్నుమూత
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్(53) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితమే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిష్ వెంకట్ చికిత్సకు ఆర్థికసాయం అందించారు.తెలుగులో పలు చిత్రాల్లో ఫిష్ వెంకట్ నటించారు. తెలుగు సినిమాల్లో విలన్ అంటే కొందరు గుర్తొస్తారు.. అలాంటి వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోలెడన్ని మూవీస్ చేశారు. ఎన్టీఆర్ 'ఆది' మూవీలో తొడకొట్టు చిన్నా అనే డైలాగ్‌తో తెగ పాపులర్ అయ్యారు. కాగా.. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేశ్ కాగా.. ముషీరాబాద్ మార్కెట్లో చేపలు వ్యాపారం చేయడంతో ఫిష్ వెంకట్‌గా తెచ్చుకున్నారు. తెలుగులో 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. -
ఫిష్ వెంకట్‌కు సాయం చేసిన మరో హీరో..
సినీ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో కచ్చితంగా ఒక కిడ్నీ అయినా మార్చాలని వైద్యులు చెప్తున్నారు. ఇందుకోసం రూ.50 లక్షలు అవసరమవుతాయన్నారు. అంత డబ్బు చెల్లించే ఆర్థిక స్థోమత తమకు లేదని వెంకట్ కుటుంబ సభ్యులు వాపోయారు. దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ మీడియా ముందుకు వచ్చారు.విశ్వక్ సాయంఈ క్రమంలో హీరో ప్రభాస్ పేరు చెప్పి కొందరు ఆకతాయిలు వారికి సాయం చేస్తామని మాటిచ్చారు. తీరా అది ఫేక్ కాల్ అని తెలియడంతో వెంకట్ ఫ్యామిలీ మరోసారి సాయం కోసం అర్థించింది. నటుడి అనారోగ్యం గురించి తెలుసుకున్న హీరో విశ్వక్ సేన్ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసి మంచి మనసు చాటుకున్నాడు.ముందుకొచ్చిన మరో హీరోతాజాగా మరో హీరో.. వెంకట్ పరిస్థితి చూసి చలించిపోయాడు. జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కృష్ణ మానినేని ఆధ్వర్యంలో, ఆయన స్థాపించిన సేవా సంస్థ 100 Dreams Foundation ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. వెంకట్ కూతురు స్రవంతికి ఆమేర డబ్బు అందించాడు.అవయవదానం..ఈ సందర్భంగా కృష్ణ మానినేని మాట్లాడుతూ.. 100 Dreams Foundationలో ఒక కార్యక్రమం అయిన పునరపి (అవయవ దానం అవగాహన కార్యక్రమం) మా ఆశయం మాత్రమే కాదు.. అవసరంలో ఉన్నవారికి జీవితం ఇవ్వాలన్న సంకల్పం. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక్క నిర్ణయం – ఒక జీవితాన్నే మార్చేస్తుంది" అని తెలిపాడు.చదవండి: ప్రముఖ నటి షోలో చనిపోయేందుకు ట్రై చేసింది: బిగ్‌బాస్ టీమ్ -
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని, దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ ఆయన సతీమణి సువర్ణతో పాటు కుమార్తె స్రవంతి వేడుకున్నారు. దీంతో తాజాగా నటుడు విశ్వక్షేన్ స్పందించి సాయం అందించారు. ఆయన పంపిన బ్యాంక్ చెక్‌ను ఫిష్ వెంకట్‌కు అందించారు. అందుకు సంబంధించిన వీడియోను షోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.సుమారు నాలుగేళ్లగా తన రెండు కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్ ద్వారా వెంకట్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాణాలతో బయటపడాలంటే సుమారు రూ. 50 లక్షలు అవసరం అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ పెద్దలతో పాటు దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని ఆమె కోరారు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ సాయం చేశారు. రూ. 2 లక్షల బ్యాంక్ చెక్‌ను తన టీమ్ ద్వారా ఆయన పంపారు. అందుకు ఫిష్ వెంకట్‌తో పాటు ఆయన కుమార్తె స్రవంతి కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రభాస్ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్ వెంకట్ ఫ్యామిలీ
టాలీవుడ్లో విలన్‌గా, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ (Fish Venkat) చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. బోడుప్పల్‌లోని ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నాడు. చాలా ఏళ్ల క్రితమే వెంకట్ రెండు కిడ్నీలు చెడిపోయాయి. అప్పటినుంచి డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారడంతో కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్చాలని వైద్యులు చెప్తున్నారు.ప్రభాస్ టీమ్ ఫోన్ కాల్అందుకోసం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. దీంతో అతడి భార్య, కూతురు సాయం కోసం అర్థిస్తూ మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో నటుడి పరిస్థితి తెలుసుకున్న హీరో ప్రభాస్ (Prabhas).. ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారని ప్రచారం జరిగింది. కిడ్నీ దాత ఉంటే ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేసుకోమని, అందుకు అవసరమైన డబ్బు ఇస్తామని ప్రభాస్ టీమ్ ఫోన్ చేశారని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి మీడియాతో చెప్పింది.ఇల్లు అమ్మేసినా సరిపోదుకట్ చేస్తే అదంతా ఫేక్ కాల్ అని తెలుస్తోంది. ఆపదలో ఉన్నవారికి ప్రభాస్ పేరు చెప్పి లేనిపోని ఆశలు కల్పించి మరింత దుఃఖంలోకి నెట్టేశారని తెలుస్తోంది. ఈ విషయం గురించి నటుడి భార్య మాట్లాడుతూ.. ప్రభాస్ అసిస్టెంట్ అని చెప్పి మాకు ఓ ఫోన్ కాల్ వచ్చిన మాట వాస్తవమే.. కావాల్సినంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు మేము ఫోన్ చేస్తే కలవడం లేదు. ప్రభాస్ నిజంగా డబ్బు ఇస్తే ఇచ్చామనే చెప్తాం. కానీ ఆయన మాకు ఏ సాయం చేయలేదు. ఇదంతా ఫేక్ న్యూస్. హీరోలు సాయం చేస్తే బాగుండు. మా ఇల్లు అమ్మి ఆపరేషన్ చేద్దామన్నా ఆ డబ్బు దేనికీ సరిపోదు అని ఆవేదన వ్యక్తం చేసింది.ప్రభాస్ పేరిట మోసం!నటుడి కూతురు స్రవంతి సైతం స్పందిస్తూ.. ప్రభాస్ పీఏ అంటూ ఐదురోజుల కిందట నాకు ఫోన్ కాల్ వచ్చింది. మీకు సాయం కావాలంటే చెప్పండి, తప్పకుండా చేస్తామని మాటిచ్చాడు. నేను మా నాన్న పరిస్థితిని వివరించాను. అందుకాయన.. ప్రభాస్ సర్ షూటింగ్లో ఉన్నాడు.. కాసేపయ్యాక తిరిగి కాల్ చేస్తానన్నాడు. నేను నిజమేనని నమ్మాను. సినిమాకానీ, రెండురోజుల నుంచి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మాకు ప్రభాస్ వైపు నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు అని క్లారిటీ ఇచ్చింది. కాగా ఫిష్ వెంకట్.. బలుపు, ఒక లైలా కోసం, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, దరువు, అదుర్స్, దిల్, సూపర్‌స్టార్ కిడ్నాప్, ఈడో రకం, ఆడో రకం, గద్దలకొండ గణేశ్, ఖైదీ నెం.150 ఇలా అనేక సినిమాలు చేశాడు.ప్రభాస్ పీఏ అని ఒకరు ఫేక్ కాల్ చేశారుమా నాన్న ఫిష్ వెంకట్ గురించి వివరాలు తెలుసుకొని సాయం చేస్తా అన్నారు కానీ, ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సాయం అందలేదుతమకు వచ్చిన నెంబర్‌కు కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫిష్ వెంకట్ కూతురుఇలా ఫేక్ కాల్స్‌తో… https://t.co/DEv0J843Ks pic.twitter.com/0sxOU9TpF3— Telugu Scribe (@TeluguScribe) July 5, 2025చదవండి: 'హరి హర వీరమల్లు' రికార్డ్ వ్యూస్.. అంతా ఫేక్! -
సాయం కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఫిష్ వెంకట్ కూతురు.. 'ప్రభాస్' టీమ్ నుంచి కాల్
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. కొద్దిరోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో వెంకట్ చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో తన కూతురు స్రవంతి మీడియాతో మాట్లాడింది. చాలా ఏళ్ల క్రితమే తన తండ్రి రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని స్రవంతి చెప్పింది. సుమారు నాలుగేళ్ల నుంచి డయాలసిస్ ద్వారా తన తండ్రి ప్రాణాలను కాపాడుకుంటూ వస్తున్నట్లు ఆమె తెలిపింది. అయితే, ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారిందని, ఆపరేషన్ చేసి కనీసం ఒక కిడ్నీ అయినా మార్చాల్సిన పరిస్థితి ఉందని స్రవంతి చెప్పింది. అందుకు రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరింది. తన తండ్రి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడం వల్ల ఆందోళనగా ఉందని ఆపరేషన్ కోసం కావాల్సినంత డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి కన్నీళ్లు పెట్టుకుంది. దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ ఆమె కోరింది. అయితే, తాజాగా ఆమె మీడియాతో మరోసారి మాట్లాడుతూ.. హీరో ప్రభాస్ (Prabhas) టీమ్ నుంచి కాల్ వచ్చినట్లు తెలిపింది. ఆయన అసిస్టెంట్ కాల్ చేసి 'కిడ్నీ ఇచ్చే డోనర్ (దాత) ఉంటే ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం' అని హామీ ఇచ్చారని మీడియాతో ఆమె తెలిపింది.తన తండ్రి రక్తం గ్రూపుతో మ్యాచ్ అయ్యే దాతలు ఎవరైనా ఉన్నారేమోనని ఎదురుచూస్తున్నట్లు ఆమె ఇలా చెప్పారు. 'నా రక్తం గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్స్ తిరష్కరించారు. నాన్న తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. కానీ, ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో డాక్టర్స్ వద్దన్నారు. దాతలు ఎవరైనా ఉన్నారేమోనని పలు డోనర్ సంస్థలను సంప్రదిస్తున్నాం' అని ఆమె పేర్కొంది. ఫిష్ వెంకట్ చాలా సినిమాల్లో నటించారు. ఆది, గబ్బర్ సింగ్, నాయక్, బన్ని, దిల్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు వంటి చిత్రాల్లో ఆయన మెప్పించారు. -
మరింత క్షీణించిన ఫిష్ వెంకట్ ఆరోగ్యం.. కన్నీటి పర్యంతమవుతోన్న భార్య!
ఈ రోజుల్లో ఎప్పుడు.. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. విధి రాతకు ఇక్కడ ఎవరు అతీతులం కాదేమో. ఎవరి జీవితంలో ఎప్పుడెలా తలకిందులవుతుందో ఊహించలేం. అలాంటి పరిస్థితి రాకూడదని మనం అనుకుంటాం. కానీ ప్రస్తుతం మనందరిని వెండితెరపై నవ్వించినా ఫిష్ వెంకట్ పరిస్థితి చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకతప్పదు. గతంలోనే కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినా కూడా ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.గత కొద్ది నెలలుగా బాగానే ఉన్నా ఫిష్ వెంకట్ మరోసారి ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. కిడ్నీల ఫెయిల్యూర్‌తో తొమ్మిది నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్న ఆయన.. మళ్లీ ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. ఎవరినీ గుర్తు పట్టేలేనంతగా ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫిష్ వెంకట్ ఫ్యామిలీ.. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. మళ్లీ ఆయన ఆరోగ్యం మొదటికి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్‌కు డయాలసిస్ చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో డయాలసిస్‌తో పాటు ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా అవసరమని వైద్యులు అంటున్నారు. గతంలో చికిత్సకు డబ్బుల్లేక గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాల్లో విలన్ అంటే కొందరు గుర్తొస్తారు.. అలాంటి వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోలెడన్ని మూవీస్ చేశారు. ఎన్టీఆర్ 'ఆది' మూవీలో తొడకొట్టు చిన్నా అనే డైలాగ్‌తో తెగ పాపులర్ అయ్యారు. టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ చేసిన ఈ నటుడు.. ప్రస్తుతం ఫిష్ వెంకట్ దయనీయ స్థితిలో ఉన్నాడు. దాతలు ఎవరైనా సరే సాయం చేస్తే కోలుకునే అవకాశముందని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కాగా.. నాలుగేళ్ల క్రితమే ఆయనకు బీపీ, షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో ఆపరేషన్ చేశారు. -
దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్.. రెండు కిడ్నీలు ఫెయిల్
గత కొన్నాళ్లలో తెలుగు సినిమాల్లో విలన్ అంటే కొందరు గుర్తొస్తారు. అలాంటి వాడే ఫిష్ వెంకట్. మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోలెడన్ని మూవీస్ చేశారు. ఎన్టీఆర్ 'ఆది' మూవీలో తొడకొట్టు చిన్నా అనే డైలాగ్‌తో తెగ పాపులర్ అయ్యారు. టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ చేసిన ఈ నటుడు.. ఇప్పుడు దయనీయ స్థితిలో ఉన్నాడు. దాతలు ఎవరైనా సరే సాయం చేస్తే ఆరోగ్యాన్ని కాస్త బాగుచేసుకుందామని చూస్తున్నాడు.ఓ యూట్యూబ్ ఛానెల్ రీసెంట్గా ఫిష్ వెంకట్‌ని అతడి ఇంటికెళ్లి మరీ ఇంటర్వ్యూ చేసింది. అసలు ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు? ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాల్ని అడిగి తెలుసుకుంది. అలా సదరు నటుడి దయనీయ పరిస్థితి బయటపడింది. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తోందని, ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేసుకుంటున్నానని చెప్పాడు.(ఇదీ చదవండి: Bigg Boss 8: మొదటి వారం నామినేషన్లో ఉన్నది వీళ్లే!)'ఓ రోజు ఆయాసం బాగా వచ్చేసరికి ఆస్పత్రికి వెళ్లాను. వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత డయాలసిస్ అవసరమని డాక్టర్లు చెప్పారు. అదేంటో మాకు తెలీదు. దాంతో నిమ్స్‌లో జాయిన్ అయ్యాను. అక్కడే ఏడాదిన్నరగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కాలికి చిన్న దెబ్బ తగిలింది. మరోవైపు బీపీ, షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఆపరేషన్ చేశారు. ఇదంతా నాలుగేళ్ల క్రితం మాట''అప్పటి నుంచి నా పరిస్థితి పూర్తిగా ఇలా అయిపోయింది. రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యం ఎన్ని సినిమా ఛాన్సులు వచ్చినా.. వెళ్లలేకపోతున్నాను. ఖర్చులకు డబ్బులు కూడా ఉండటం లేదు. దీంతో గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నాను' అని ఫిష్ వెంకట్ చెప్పుకొచ్చాడు. ఇతడి దీనస్థితి చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. ఎవరైనా సాయం చేస్తే బాగుండు అని కామెంట్లు చేస్తున్నారు.(ఇదీ చదవండి: మరో స్టార్ హీరోపై లైంగిక ఆరోపణలు.. కేసు పెట్టిన నటి) -
నాకు సోషల్ మీడియా అకౌంట్లు లేవు
-
‘తప్పుడు ట్వీట్లు చేసి మోసం చేయకండి’
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు ఫిష్ వెంకట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. తన పేరుతో తప్పుడు ట్వీట్లు చేసిన వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవు. ట్వీట్ చేయటం కూడా నాకు రావు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తప్పుడు ట్వీట్లు చేసి ఎవరినీ మోసం చేయకండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. తనకు సీఎం జగన్ అంటే ఎంతో అభిమానం అన్న వెంకట్, ‘నేను కేవలం నటుడ్ని మాత్రమే, అనవసరంగా నన్ను వివాదాల్లోకి లాగకండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన సినీ నటుడు
సాక్షి, విశాఖపట్నం: జన క్షేమమే తన క్షేమమంటూ జననేత వేస్తోన్న ప్రతి అడుగూ కష్టాల కడలిని ఎదురీదుతున్న ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. రేపటి ఆశలకు ఊపిరులూదుతోంది. కష్టాలతో కాలం గడుపుతున్న ప్రజలకు నేనున్నానంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. సినీ రంగానికి చెందిన పలువురు నటులు వైఎస్ జగన్‌ను కలిసి ఇదివరకే మద్దతు ప్రకటించారు. తాజాగా సినీ నటుడు ఫిష్ వెంకట్.. వైఎస్ జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 265వ రోజు మంగళవారం ఉదయం వైఎస్ జగన్.. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మార్గమధ్యలో వెంకట్ వైఎస్ జగన్‌ను కలిసి మద్దతు తెలిపి.. కొంత దూరం అడుగులో అడుగేశారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు. -
వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న సినీ నటుడు వెంకట్
-
మల్లన్నను దర్శించుకున్న సినీ నటుడు
కొమురవెల్లి(సిద్ధిపేట జిల్లా): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామికి సినిమా నటుడు ఫిష్ వెంకట్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. పలు సినిమాల్లో విలన్ అసిస్టెంట్ పాత్రలు పోషించి తన కామెడీతో అలరించిన ఫిష్ వెంకట్ మాట్లాడుతూ కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి తనకు ఇష్టదైవమని, ప్రతి ఏటా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటానని అన్నారు. ఇక, స్థానిక ప్రజలు, చిరువ్యాపారులు సినిమా నటుడు ఫిష్ వెంకటేశ్‌తో కలిసి సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు. -
ఇండస్ట్రీకి వస్తానంటే... వద్దనే చెబుతాను!
సంభాషణం చాలా సినిమాల్లో విలన్ గ్యాంగులో రౌడీగా కనిపిస్తాడతను. కానీ ముఖం అమాయకత్వానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటుంది. చేసే పనులూ, మాట్లాడే మాటలూ అమాయకంగానే ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి. రౌడీ పాత్రలో కామెడీని పండించే ఆ నటుడి పేరు... ‘ఫిష్’ వెంకట్. ‘గబ్బర్‌సింగ్’లో ‘క్షందమామ రావే’ అంటూ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన వెంకట్ చెప్పిన విశేషాలివి... ఆంధ్ర, తెలంగాణ సెగను కొందరు పరిశ్రమకు కూడా తగిలిస్తున్నారు. నాకది నచ్చడం లేదు. నేను తెలంగాణవాడినే. అయినా కూడా ఆంధ్రవాళ్లమీద నాకే అయిష్టమూ లేదు. ఇక్కడ పరిశ్రమను నెలకొల్పింది, నిలబెట్టింది, నాలాంటి వాళ్లందరికీ అవకాశాలూ కల్పించిందీ వాళ్లే. వాళ్లు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు పరిశ్రమ రెండు ముక్కలవ్వాల్సిన అవసరమూ లేదు. ఆ ఆలోచనే నాకు బాధ కలిగిస్తుంది. విభేదాలు లేకుండా ఎప్పటిలా అందరం కలిసి ఒకేచోట, ఒక్కటిగా ఉండి పని చేసుకోవాలన్నదే నా కోరిక. మిమ్మల్ని ‘ఫిష్’ వెంకట్ అని ఎందుకంటారు? మేం బెస్తవాళ్లం. చేపల వ్యాపారం చేసేవాళ్లం. అందుకే అందరూ అలా పిలుస్తుంటారు. మరి ‘ఫిష్’ను వదిలి ‘ఫిల్మ్’ని ఎందుకు నమ్ముకున్నారు? మేం ముషీరాబాద్‌లో ఉండేవాళ్లం. 1980లో శ్రీహరిగారి కుటుంబం హైదరాబాద్ వచ్చి బాలానగర్‌లో స్థిరపడింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన సినిమాల్లోకి వెళ్లాక తన షూటింగులకు వెళ్లేవాడిని. ఆయనే నన్ను సినిమాల్లోకి రమ్మన్నారు. నేను రానన్నా బలవంతపెట్టి ‘ఒరేయ్ తమ్ముడు’లో నటింపజేశారు. బ్రేక్ ఎప్పుడు వచ్చింది? ‘ఆది’ సినిమాతో. నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది శ్రీహరన్న అయితే... నిలదొక్కుకునేలా చేసింది వీవీ వినాయక్‌గారు. ఆయన నాకు గాడ్‌ఫాదర్. ఆది, బన్ని సినిమాల్లో మంచి పాత్రలిచ్చి నేనెవరో అందరికీ తెలిసేలా చేశారు. ఎన్ని జన్మలెత్తినా ఈ ఇద్దరి రుణం నేను తీర్చుకోలేను. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తున్నారు. బోర్ కొట్టడం లేదా? ఫిష్ వెంకట్ ఎలాంటి పాత్రలకు సూటవుతాడో, ఏం చేస్తే బాగుంటాడో రచయితలకి, దర్శకులకి తెలుసు. వారి నమ్మకమే నాకు బలం. నేను చిన్నతనం నుంచీ చాలా కష్టాలు పడ్డాను. ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నాకు లభించిన పాత్రలే. అందుకే ఏ పాత్రనయినా చేస్తాను. రెమ్యునరేషన్ కూడా ఇంత కావాలి అని అడగను. ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. మిమ్మల్ని రౌడీ పాత్రల్లో చూసి మీ వాళ్లేమంటారు? నేను రౌడీ గ్యాంగ్‌లో ఉన్నా చేసేది కామెడీయే కదా. వాళ్ల మధ్య ఉండి వాళ్లమీదే సెటైర్లు వేస్తుంటాను. అది చూసి నా భార్యలు, పిల్లలు నవ్వుతుంటారు. మీరు భార్యలు అనే అన్నారా? అవునండీ... మీరు విన్నది నిజమే. నాకు ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పాపకి పెళ్లి చేసేశాం. పెదబాబు యాదేష్ ‘వీడు తేడా’, ‘ప్రేమ ఒక మైకం’, ‘డి ఫర్ దోపిడీ’ చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు. రెండో బాబు సాయి పదో తరగతి చదువుతున్నాడు. తనని హీరోని చేయాలని నా కోరిక. మూడోవాడు ఇంకా చిన్నోడే. వాడి గురించి ఆలోచించడానికి చాలా టైముంది. వాళ్లనీ మీ దారిలోనే నడిపిస్తున్నారా? అవును. కానీ బయటివాళ్లెవరు ఇండస్ట్రీకి వస్తానన్నా వద్దంటాను. ఎందుకని? ఇక్కడ రోజూ రెండు వందల మంది వేషాల కోసం క్యూలో నిలబడతారు. ఓ పది మందికి మాత్రమే పని దొరుకుతుంది. మిగతా నూట తొంభై మందీ వెనుదిరగాల్సిందే. పని దొరికినా కంటిన్యుయస్‌గా ఉండదు. కొన్నాళ్లు ఖాళీగా ఉండాలి. వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రం. ఎలా బతుకుతారు? సినిమాల మీద ఆసక్తితో కండలు, జుట్లు పెంచుకుని వచ్చినంత మాత్రాన ఇక్కడ పిలిచి అవకాశాలెవరూ ఇచ్చేయరు. అదేదో నెలకు మూడు నాలుగు వేలు వచ్చే ఉద్యోగం చేసినా కుటుంబాన్ని పోషించుకోవచ్చు. మీరిలా మాట్లాడ్డం ఆశ్చర్యంగా ఉంది... ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. అందరికీ నాకు దొరికినట్టు ఓ శ్రీహరి, ఓ వినాయక్ దొరకరు. అవకాశాలు దొరికేలోపు యేళ్లకేళ్లు గడిచిపోతాయి. ఇండస్ట్రీ పట్ల అసంతృప్తి ఉన్నట్టుందే? లేదు. నన్ను నిలబెట్టింది, బతికిస్తోంది ఈ పరిశ్రమే. కాకపోతే అందరికీ అంత అదృష్టం దక్కదు. అందుకే దీనిమీదే ఆశలు పెంచుకుని జీవితాన్ని పాడు చేసుకోవద్దంటున్నాను. కావాలంటే ఏదైనా పని చేసుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నించాలి. ఈ పరిశ్రమ గొప్పది. ఇక్కడ ఎంతమందికైనా చోటుంటుంది. కాకపోతే ఆ చోటు సంపాదించుకోవడం కాస్త కష్టం. అందరికీ నా అంత అదృష్టం ఉండదుగా! - సమీర నేలపూడి -
రంగమేదైనా పట్టుదల అవసరం
సినీనటుడు ఫిష్ వెంకట్ కాజీపేట : పని చేయాలనే తపన, సాధించాలనే పట్టుదలతో కార్యాచరణలోకి దిగితే ఏ రంగంలోనైనా రాణించవచ్చని సినీ హాస్యనటుడు మంగిళిపల్లి(ఫిష్) వెంకట్ అన్నారు. అత్యాధునిక వసతులతో కాజీపేటలో ప్రారంభమైన మిరాకిల్ సిజర్స్ బ్యూటీపార్లర్ వంద రోజుల వేడుకలను శనివారం వెంకట్ ప్రారంభించారు. పార్లర్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా అందుబాటులో ఉన్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుంటూ యువత ముందుకుసాగాలన్నారు. పేద కుటుంబంలో పుట్టిన హరికృష్ణ..మిత్రుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారంతో జావేద్ హబీబ్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ తీసుకుని కాజీపేటలో బ్యూటీపార్లర్ స్థాపించడం అభినందనీయమన్నారు. కులవృత్తులు కనుమరుగవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు మరింతగా రాయితీలు ఇచ్చి యువతను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి సంరక్షించే బాధ్యత చేపట్టాలని కోరారు. అనంతరం ఫిష్ వెంకట్‌ను మిరాకిల్ సిజర్స్ సంస్థ డెరైక్టర్ కొత్తపల్లి హరికృష్ణ శాలువ, మెమొంటోతో సత్కరించారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలకంటి శ్రీనివాస్, ఆర్.లక్ష్మణ్ సుధాకర్, కొండా అశోక్ యాదవ్, ఎస్పీ ప్రభాకర్, కొత్తపల్లి సదానందం, శివకృష్ణ, వెంకటకృష్ణ, భద్రయ్యగౌడ్ పాల్గొన్నారు. ‘ఆది’ సినిమాతోనే గుర్తింపు - ఫిష్ వెంకట్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ సినిమాతో సినీ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు వచ్చిందని హాస్యనటుడు ఫిష్ వెంకట్ అన్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం కాజీపేట వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఒరేయ్.. తమ్ముడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాను ఇప్పటి వరకు 90 సినిమాల్లో నటించానని చెప్పారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో గంగపుత్ర కుటుంబంలో పుట్టిపెరిగిన తాను మూడో తరగతి వరకే చదువుకున్నానని తెలిపారు. సినిమాల్లో చాలామంది వెంకట్లు ఉండడంతో తనను సులభంగా గుర్తుపెట్టుకునేందుకు ఫిష్ వెంకట్‌గా పిలిచేవారని, తర్వాత అదే పేరు స్థిరపడిపోయిందన్నారు. తనతో విలక్షణమైన పాత్రలు చేయిస్తూ ప్రోత్సహిస్తున్న దర్శకుడు వీవీ వినాయక్ తనకు గాడ్‌ఫాదర్ అన్నారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన మిత్రుడు దివంగత శ్రీహరిని ఏనాడూ మర్చిపోలేనన్నారు. హీరోగా చేసేందుకు రెండు సినిమాలు ఒప్పుకున్నానని, ఈ ఏడాదే అవి ప్రారంభం కావొచ్చని వెల్లడించారు. సినీ ప్రపంచం పైకి బాగానే కనిపిస్తుందని కానీ అందులోనూ బోలెడన్ని బాధలుంటాయని వెంకట్ తెలిపారు. తనకు బాగా నచ్చిన ప్రాంతం వరంగల్ అని, ఇక్కడ తనకు ఎందరో మిత్రులు ఉన్నారని చెప్పే వెంకట్ తను నటించిన నాలుగు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.