
సోనూసూద్ పేరు చెప్పగానే అప్పట్లో విలన్ పాత్రలు గుర్తొచ్చేవి. ఎందుకంటే దక్షిణాది సినిమాల్లో చాలావరకు నెగిటివ్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ ఈయనపై అందరికీ ఉన్న అభిప్రాయాన్ని చాలా మార్చేసింది. ఎందుకంటే రోజువారీ కూలీల దగ్గర నుంచి చాలామందికి సాయం చేశారు. ఆర్థికంగానూ ఆదుకున్నారు. అప్పటినుంచి సందర్భంగా వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరికి సాయపడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఉదయం లేవగానే మొటిమలపై ఉమ్మి రాసుకుంటా: తమన్నా)
గత కొన్నేళ్లుగా సోనూసూద్ తెలుగులో సినిమాలు చేయనప్పటికీ.. తనతో పాటు అప్పట్లో పలు చిత్రాల్లో నటించిన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. సోమవారం ఉదయం ఈ నటుడు.. హైదరాబాద్‌లోని వెంకట్ ఇంటికి వచ్చి ఆయన భార్య, కూతురితో పాటు మాట్లాడారు. అన్ని విధాల ఈ కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చారు. ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి మాట్లాడుతూ సోనూసూద్ నిజమైన రియల్ హీరో అని చెప్పింది.
'సోనూసూద్ సర్ చేస్తున్న సాయానికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నాన్నతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. మా కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చారు. నాన్న అంత్యక్రియలు, దశ దినకర్మకు రూ.1.50 లక్షలు ఇచ్చారు. అందుకే అంత బాగా చేశాం. నిర్మాణంలో ఉన్న మా ఇల్లు చూసి, అది పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన చేస్తున్న సాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం' అని షిఫ్ వెంకట్ కూతురు చెప్పింది.
(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. 34 ఏళ్లకే చనిపోయిన హీరో)