
గత కొన్నేళ్లలో మరణాలు ఆశ్చర్యకర రీతిలో ఉంటున్నాయి. చిన్న వయసులోనే చాలామంది తుదిశ్వాస విడుస్తున్నారు. ఇప్పుడు ఓ యంగ్ హీరో కూడా జాండీస్‌తో బాధపడుతూ కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇంతకీ ఏమైంది?
(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో మరో విషాదం.. కమెడియన్ కన్నుమూత)
కన్నడ ఇండస్ట్రీలో అనెకల్ బాలరాజు నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన వారసుడు సంతోష్ బాలరాజు. 2009లో 'కెంప' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అనంతరం గణప, బర్కెలీ, సత్య, కరియా 2 తదితర సినిమాలు చేశాడు. గత కొన్నేళ్ల నుంచి మాత్రం సంతోష్.. నటుడిగా కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అసలు విషయానికొస్తే కాలేయం, మూత్రపిండాల్లో సమస్యల కారణంగా గత నెలలో జాండీస్ బారిన పడ్డాడు. దీంతో ఐసీయూలో చికిత్స అందిస్తూ వచ్చారు.
తాజాగా మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. సంతోష్ కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు ప్రయత్నాలు చేసినా సరే ప్రాణాలు కాపాడలేకపోయారు. బెంగళురూలోని కుమారస్వామి లేఔట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 9:30 గంటలకు కన్నుమూశారు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. 2022లో సంతోష్ తండ్రి బాలరాజు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.
(ఇదీ చదవండి: ఉదయం లేవగానే మొటిమలపై ఉమ్మి రాసుకుంటా: తమన్నా)