
ఇండస్ట్రీలో మర విషాదం. కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు, ఫిష్ వెంకట్ తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు మరోసారి విషాదం నెలకొంది. తమిళ ప్రముఖ నటుడు, కమెడియన్ మదన్ బాబ్(71) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈయన.. శనివారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలోనే మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)
మదన్ బాబ్ అసలు పేరు ఎస్.కృష్ణమూర్తి. ముఖంలో డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలా టీవీ ఇండస్ట్రీలోకి తొలుత వచ్చారు. విచిత్రమైన హావభావాలు చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న కమెడియన్ పాత్రలు దక్కించుకున్నారు. కొన్నాళ్లకు స్టార్ హీరోల చిత్రాల్లోనూ నటించారు. ఆరు, జెమిని (విక్రమ్), రన్, జోడీ, మిస్టర్ రోమియో, తెనాలి, ఫ్రెండ్స్, రెడ్ తదితర చిత్రాల్లో మదన్ నటించారు. తెలుగులో పవన్ కల్యాణ్ 'బంగారం' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. మదన్ కు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
(ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్ రిలీజ్)