
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్ ఎట్టకేలకు రిలీజైంది. ఇప్పటికే పాటలు మంచి క్రేజ్ తెచ్చుకోగా.. ఇప్పుడొచ్చిన ట్రైలర్, ఉన్న హైప్‌ని మరింత పెంచేలా ఉంది. రజనీ మాస్ షాట్స్, అనిరుధ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. లోకేశ్ కనగరాజ్ ఈసారి మరింత మాస్ మూవీతో రాబోతున్నాడని ఓ క్లారిటీ వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)
ఈ సినిమా అంతా వాచీల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. ఇందులో రజినీకి విలన్‌గా నాగార్జున నటించారు. వీళ్లతో పాటు ఆమిర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి)