మైకేల్ జాక్సన్‌గా మేనల్లుడు.. బయోపిక్‌ ట్రైలర్‌ | Michael Jackson biopic movie trailer | Sakshi
Sakshi News home page

మైకేల్ జాక్సన్‌గా మేనల్లుడు.. బయోపిక్‌ ట్రైలర్‌

Feb 3 2026 10:24 AM | Updated on Feb 3 2026 10:33 AM

Michael Jackson biopic movie trailer

మైకేల్ జాక్సన్‌ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజు'గా పిలుచుకున్నారు.  ప్రపంచ ప్రఖ్యాత సూపర్‌స్టార్‌లలో ఆయన ముందు వరుసలో ఉంటారు. కానీ, జాక్సన్ లెగసీని ఆయన కుటుంబం నుంచి ఎవరూ కొనసాగించలేదు. అయితే, మైకేల్ జాక్సన్‌ బయోపిక్‌ను ప్రపంచానికి చూపించాలని ఆయన మేనల్లుడు జాఫర్‌ ముందుకొచ్చారు. తాజాగా ఆ మూవీ నుంచి ట్రైలర్‌ను  విడుదల చేశారు.

మైకేల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు  ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీలో మైకేల్ జాక్సన్‌గా ఆయన మేనల్లుడు జాఫర్‌ కనిపించనున్నారు.  ఆయన మరణించిన 16 ఏళ్ల తర్వాత ఈ మూవీ రానుంది. మైకేల్‌ బాల్య నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన ప్రయాణాన్ని ఈ మూవీలో చూపించనున్నారు.  ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.  ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌ రూ. 10 వేల కోట్లు రాబట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు 400 కోట్లకు పైగానే ఫ్యాన్స్‌ ఉన్నారని అంచనా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement