'ధురంధర్‌-2' టీజర్‌ ప్రకటన వచ్చేసింది | Dhurandhar 2 Teaser Release Date Locked | Sakshi
Sakshi News home page

'ధురంధర్‌-2' టీజర్‌ ప్రకటన వచ్చేసింది

Feb 3 2026 9:01 AM | Updated on Feb 3 2026 9:10 AM

Dhurandhar 2 Teaser Release Date Locked

బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్  భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, థియేటర్‌ వర్షన్‌ ఒక భాషలో మాత్రమే విడుదలై దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ధురంధర్ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 1100 కోట్ల మేరకు రాబట్టింది. సినిమాకు మంచి ఆదరణ రావడంతో పార్ట్‌-2పై  దర్శకుడు ఆదిత్యధర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో నేడు (ఫిబ్రవరి 3)న టీజర్‌ను విడుదల చేయనున్నారు.  

ధురంధర్‌ సీక్వెల్ కోసం పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులు  ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12:12 గంటలకు టీజర్‌ విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  ధురంధర్ 2 మూవీ మ్యూజిక్‌ సంగీత హక్కులను సారెగామా నుండి టి-సిరీస్‌కు మార్చారు. ఇది ఈ మూవీ ఫ్రాంచైజీకి గణనీయమైన క్రేజ్‌ను తెచ్చింది. 

ఈ మూవీ ఆడియో హక్కుల కోసం భూషణ్ కుమార్  భారీ ఆఫర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని సమాచారం. ధురంధర్‌-2 టీజర్ ప్రకటన కూడా టి-సిరీస్ నుండి రావడం విశేషం. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌తో పాటు  ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తిరిగి రానున్నారు.   మార్చి 19, 2026న ఒకేసారి పాన్-ఇండియా రేంజ్‌లో ఈ మూవీ విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement