నిఖిల్ సిద్ధార్థ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ కథానాయికగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్ ‘ది ఇండియా హౌస్’ ద్వారా తెలుగులోకి అడుగుపెడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
‘‘ధురంధర్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, ఆర్టికల్ 370’ చిత్రాలతో పాపులర్ అయిన శాశ్వత్ సచ్‌దేవ్ మా సినిమా ద్వారా టాలీవుడ్‌లో
ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఐదు ఆకట్టుకునే పాటలను కంపోజ్ చేశారాయన. 1905 నాటి రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ‘ది ఇండియా హౌస్’ విప్లవం, ప్రేమ, త్యాగం.. వంటి భావోద్వేగాలో అద్భుతంగా ఉండబోతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: మయాంక్ సింఘానియా, కెమెరా: కేకే సెంథిల్ కుమార్.


