ధనుష్, సాయిపల్లవి జోడీ రిపీట్ అవుతోంది. ధనుష్ హీరోగా ‘అమరన్ ’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ‘డీ 55’(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కనుంది. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీలో ఓ హీరోయిన్ గా శ్రీలీల నటించనున్న విషయం తెలిసిందే.
మరో హీరోయిన్ గా సాయిపల్లవి నటించనున్నట్లుగా సోమవారం ప్రకటించారు మేకర్స్. గతంలో ‘మారి 2’ (2018) చిత్రంలో ధనుష్, సాయిపల్లవి జోడీగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలోని ‘రౌడీ బేబీ...’ సాంగ్ కూడా అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది.
అలాగే ‘అమరన్ ’ వంటి హిట్ మూవీ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియ సామితో సాయిపల్లవి చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారట ధనుష్ అండ్ టీమ్. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్.


