
హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఇతడి మేనకోడలు ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ వేడుక జరగ్గా.. కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. విశాల్ కూడా వచ్చాడు. ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఈ పెళ్లి సంగతేంటి?
(ఇదీ చదవండి: తెలుగు సినిమాలకు జాతీయ అవార్డ్స్.. బన్నీ ఆనందం)
విశాల్ తెలుగు మూలాలున్న కుర్రాడే. కానీ తండ్రి తమిళనాడులో స్థిరపడటంతో ఆ ఇండస్ట్రీలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ రీసెంట్ టైంలో ఇతడి నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏంరాలేదు. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా విశాల్‌ని బాగా ఇబ్బంది పెట్టాయి. వీటన్నింటి నుంచి ఈ మధ్యే కోలుకున్న విశాల్.. పూర్తి ఆరోగ్యంగా పలుమార్లు కనిపించాడు. అలానే తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు.
తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తున్న నటి ధన్సికని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్నాళ్ల ముందు విశాల్ బయటపెట్టాడు. అయితే ఈ శుభకార్యం ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆ సంగతి అలా పక్కనబెడితే ఇప్పుడు తన మేనకోడలు వివాహ వేడుకలో విశాల్ పాల్గొన్నాడు. ఈమె ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే నూతన వధూవరుల్ని విశాల్ ఆశీర్వదించాడు.
(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమా తొలి పాట రిలీజ్)