సంక్రాంతి 2027.. సీనియర్ హీరోల పోటీ? | Chiranjeevi, Venkatesh, Balayya, Nagarjuna movies in Sankranthi 2027 | Sakshi
Sakshi News home page

సంక్రాంతి 2027.. సీనియర్ హీరోల పోటీ?

Feb 1 2026 11:07 PM | Updated on Feb 2 2026 5:47 AM

Chiranjeevi, Venkatesh, Balayya, Nagarjuna movies in Sankranthi 2027

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ఘన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. మార్చిలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ, విడుదలను నేరుగా 2027 సంక్రాంతికి లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పవర్‌ఫుల్‌ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి సరసన ప్రియమణి భార్య పాత్రలో నటించనున్నారు. కూతురి పాత్రకు కీర్తి సురేష్‌ను పరిశీలిస్తున్నారు. కానీ మరో ఆప్షన్ కూడా పరిశీలనలో ఉంది. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉండటంతో షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.  

జనవరిలో మన శంకర వరప్రసాద్ విడుదల కాగా, జూలైలో విశ్వంభర థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాల మధ్య కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు. 2027 సంక్రాంతికి బరిలో దింపాలని చూస్తున్నారు. అయితే అదే సంక్రాంతికి వెంకటేష్, అనిల్ రావిపుడి కాంబినేషన్ సినిమా ఉంది. బాలయ్య చిత్రం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక నాగార్జున కూడా రంగంలోకి దిగితే 2027 సంక్రాంతి సీనియర్ల సంక్రాంతి అయిపోతుంది. ప్రస్తుతాకి ఇవన్నీ అధికారికంగా ప్రకటించలేదు కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం సీనియర్ల మద్య పోటీ ఉండే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement