చలో జార్జియా | Mahesh Babu Varanasi Next Schedule in georgia | Sakshi
Sakshi News home page

చలో జార్జియా

Feb 2 2026 12:38 AM | Updated on Feb 2 2026 12:38 AM

Mahesh Babu Varanasi Next Schedule in georgia

హీరో మహేశ్‌బాబు జార్జియా వెళ్లనున్నారట. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్, ప్రకాశ్‌రాజ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు–ప్రియాంకా చోప్రా పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కాగా, ‘వారణాసి’ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ జార్జియాలో మొదలు కానుందని సమాచారం. అక్కడ షూటింగ్‌ చేసేందుకు సంబంధించిన కార్యాచరణను ఆల్రెడీ ప్రారంభించారట రాజమౌళి. అలాగే ఓ కీలక షెడ్యూల్‌ను అంటార్టికాలోనూ ప్లాన్‌ చేశారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. ఒకవేళ అంటార్టికా లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిగితే, అక్కడి క్లిష్టమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకునే తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ సినిమా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 7న రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement