
రీసెంట్‌గా పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికిలపడింది. దీంతో అభిమానులు ఈ మూవీ గురించి మర్చిపోవడం మొదలుపెట్టారు. ఈ సెప్టెంబరు చివర్లో రిలీజయ్యే 'ఓజీ' కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సినిమా నుంచి 'ఫైర్ స్ట్రోమ్' అంటూ సాగే తొలి లిరికల్ గీతాన్ని రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ‘కింగ్డమ్’ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?)
పాట గురించి రిలీజ్ ముందు వరకు హైప్ ఎక్కువగానే ఇచ్చారు గానీ తమన్ ఇదివరకే కంపోజ్ చేసిన పాటల్లానే బాగుంది. కాకపోతే మరీ సూపర్‌గా అయితే అనిపించలేదు. అదే టైంలో లిరిక్స్‌ని మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. ప్రస్తుతానికైతే అభిమానులకు నచ్చినట్లే కనిపిస్తోంది. రానురాను పాట అలవాటు అవుతుందేమో చూడాలి.
'ఓజీ' సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేసింది. సుజీత్ దర్శకుడు కాగా.. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సెప్టెంబరు 25న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. అదే రోజున బాలకృష్ణ 'అఖండ 2' రిలీజ్ కూడా ఉంది. మరి ఇద్దరు పోటీకి దిగుతారా? లేదంటే ఎవరైనా తప్పుకొంటారా అనేది చూడాలి?
(చదవండి: 'మహావతార్ నరసింహ' ఆల్‌టైమ్ రికార్డ్ .. కలెక్షన్స్ ఎంతంటే?)