‘కింగ్డమ్‌’ బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌.. రెండో రోజు ఎంతంటే? | Kingdom Movie Box Office Collection Day 2 Details | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘కింగ్డమ్‌’.. రెండు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

Aug 2 2025 1:57 PM | Updated on Aug 2 2025 3:14 PM

Kingdom Movie Box Office Collection Day 2 Details

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్బాక్సాఫీస్వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. గౌతమ్తిన్ననూరి దర్శకత్వం వహించిన చిత్రం జులై 31 ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. దీంతో తొలి రోజు రూ. 39 కోట్ల గ్రాస్వసూళ్లను రాబట్టింది. ఇక రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్లోకి చేసింది. సినిమాకు హిట్టాక్రావడంతో రెండో రూ. 14 కోట్ల వసూళ్లు వచ్చాయి

(చదవండి: అర్జున్‌రెడ్డికి నా రెమ్యునరేషన్‌ అంతే.. అదే ఎక్కువ!: విజయ్‌ దేవరకొండ)

మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్ల గ్రాస్వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్అధికారికంగా ప్రకటించారు. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. 

(చదవండి: 'మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌' ఆల్‌టైమ్‌ రికార్డ్‌ .. కలెక్షన్స్‌ ఎంతంటే?)

నైజాంలో రూ. 1.85 కోట్లు, సీడెడ్లో రూ. 79 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 48 లక్షలు, గుంటూరులో రూ.21 లక్షలు, కృష్ణాలో రూ. 21 లక్షలు, ఈస్ట్లో రూ. 26, వెస్ట్గోదావరిలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షల షేర్వసూళ్లను సాధించింది. మొత్తంగా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 14.03 కోట్ల షేర్వసూళ్లను రాబట్టింది. సినిమాకు మంచి టాక్రావడంతో వీకెండ్లో కలెక్షన్స్భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement