అర్జున్‌రెడ్డి పారితోషికం.. అప్పుడు నాకదే ఎక్కువ: విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda Reveals Arjun Reddy Movie Remuneration | Sakshi
Sakshi News home page

అర్జున్‌రెడ్డికి నా రెమ్యునరేషన్‌ అంతే.. అదే ఎక్కువ!: విజయ్‌ దేవరకొండ

Aug 2 2025 1:03 PM | Updated on Aug 2 2025 1:15 PM

Vijay Devarakonda Reveals Arjun Reddy Movie Remuneration

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) అనగానే చాలామందికి గుర్తొచ్చేది అర్జున్‌ రెడ్డి సినిమానే! పెళ్లిచూపులు సినిమాతో హీరోగా క్రేజ్‌ వచ్చినప్పటికీ 2017లో వచ్చిన అర్జున్‌ రెడ్డి చిత్రం (Arjun Reddy Movie)తో దమ్మున్న హీరో అని నిరూపించుకున్నాడు. దాదాపు రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విధ్వంసమే సృష్టించింది. ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతోనే విజయ్‌ రేంజ్‌ మారింది. 

కింగ్డమ్‌కు తొలిరోజు భారీ కెలెక్షన్స్‌
ఈ మధ్య ఫ్లాపులే ఎక్కువగా పలకరిస్తుండటంతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసిమీదున్నాడు విజయ్‌. ఈ క్రమంలోనే కింగ్డమ్‌ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జూలై 31న రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. తొలిరోజు ఈ చిత్రం ఏకంగా రూ.39 కోట్లు రాబట్టింది.

అప్పుడదే ఎక్కువ
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ.. కింగ్డమ్‌కు వస్తున్న రెస్పాన్స్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. తనకు పేరు తెచ్చిపెట్టిన అర్జున్‌ రెడ్డి సినిమాను గుర్తు చేసుకుంటూ.. అప్పుడు తన రెమ్యునరేషన్‌ రూ.5 లక్షలని, ఆ సమయంలో అదే తనకు పెద్ద అమౌంట్‌ అన్నాడు. ఇప్పుడు రిలీజైన కింగ్డమ్‌కు మంచి కలెక్షన్స్‌ వస్తుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

చదవండి: బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement