ఆ విషయంలో మేము పాస్‌ అయ్యాం : నాగవంశీ | Producer Suryadevara Naga Vamsi Says We Have Pass First Big Test With Kingdom | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో మేము పాస్‌ అయ్యాం : నాగవంశీ

Jul 30 2025 5:19 PM | Updated on Jul 30 2025 6:02 PM

Producer Suryadevara Naga Vamsi Says We Have Pass First Big Test With Kingdom

ఈమధ్య కాలంలో సినిమాలకు ఓపెనింగ్స్ రాబట్టడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆ పరంగా చూస్తే మేము(కింగ్డమ్‌) పాస్ అయ్యాం. బుకింగ్స్ బాగున్నాయి. మంచి వసూళ్లతో సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానుఅన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. విజయ్దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రంకింగ్డమ్‌’. గౌతమ్తిన్ననూరి దర్శకత్వం వహించిన చిత్రంలో సత్యదేవ్కీలక పాత్ర పోషించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం నెల 31 ప్రేక్షకుల ముందుకు రానుంది. నేపథ్యంలో చిత్రబృందం తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

  సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ.. ‘ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కాదు. గౌతమ్ తిన్ననూరి శైలి ఎమోషన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. ఈ సినిమా కోసం సెట్స్ వేయలేదు. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. మా టీమ్ పడిన కష్టం మీకు తెర మీద కనిపిస్తుంది." అన్నారు.

 విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘జెర్సీ' సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి 'కింగ్‌డమ్' ఇది. ఈ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. చరిత్రలో ఏ యుద్ధం చూసుకున్నా.. కుటుంబం కోసమో, పుట్టిన నేల కోసమో, ప్రేమ కోసమో ఉంటుంది. ఈ యుద్ధం కూడా అలాంటిదే. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు 'కింగ్‌డమ్' ప్రపంచంలోకి వెళ్తారు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి అనుభూతిని ఇస్తుంది." అన్నారు.విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నానుఅని భాగ్యశ్రీ బోర్సే అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement